security arrangements
-
రాష్ట్రపతి భవన్‌కు పెళ్లి కళ
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే కానుక మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పూనమ్‌గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న అవ్నీశ్ కుమార్‌తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం పూనమ్ అవ్నీశ్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది. చారిత్రక కట్టడం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. -
బంగ్లాదేశ్‌లో నేడు ఎన్నికలు
ఢాకా: పొరుగు దేశం బంగ్లాదేశ్ నేడు జరిగే సాధారణ ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ ఎన్నికలను బహిష్కరించాలంటూ 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 436 మంది స్వతంత్రులు సహా 27 రాజకీయ పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు 42 వేల పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. భారత్‌కు చెందిన ముగ్గురు సహా వంద మందికి పైగా విదేశీ పరిశీలకులు పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలిస్తారు. ఈ నెల 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. అవామీ లీగ్ చీఫ్ అయిన ప్రధాన మంత్రి షేక్ హసీనా వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియా అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్నారు. ఆ పార్టీ ఈ ఆదివారం జరిగే ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీఎన్పీ కార్యకర్తలు నాలుగు పోలింగ్ బూత్‌లపై బాంబు దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఢాకాలో రైలుకు దుండగులు నిప్పుపెట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. -
Rajasthan elections 2023: రాజస్తాన్ ఎన్నికలకు సర్వం సిద్ధం
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీ్మత్సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ భరత్పూర్ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్రీ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఎం, ఆర్ఎలీ్ప, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పారీ్టలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. బరిలో ఉద్ధండులు.. పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేతలు వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్, సతీష్ పూర్ణియా, ఎంపీలు దివ్యా కుమారి, రాజ్యవర్దన్ రాథోడ్, బాబా బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీనా తదితరులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గహ్లోత్, సచిన్ పైలట్ సయోధ్య! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల సంగతి తెలిసందే. తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ఎన్నికల వేళ గహ్లోత్ ప్రయత్నించారు. సచిన్ పైలట్ ప్రజలను ఓట్లు అభ్యరి్థస్తున్న వీడియోను గహ్లోత్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తద్వారా ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చేందుకు ప్రయతి్నంచారు. -
ప్రపంచ స్థాయి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9, 10వ తేదీల్లో జరుగనున్న శిఖరాగ్ర సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కలి్పస్తారని కేంద్రం వెల్లడించింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సహా, విదేశీ నేతలకు సంబంధించిన భద్రత కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండోలను నియమించారు. వీరికి అదనంగా పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సైతం భద్రతా చర్యల్లో పాలుపంచుకోనున్నాయి. అదనంగా, ప్రపంచ నాయకుల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళాలకు అప్పగించారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ), చైనా భద్రతా శాఖ (ఎంఎస్ఎస్), యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎంఐ–6, ఇతర విదేశీ గూఢచార సంస్థలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. రాఫెల్‌లు.. హెలికాప్టర్లు.. యాంటీ డ్రోన్లు దేశాధినేతల భద్రతా వ్యవస్థలో బాగంగా గగనతల దాడులను సైతం సమర్థంగా ఎదుర్కొనేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీఎస్), ఇతర ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఎన్ఎస్జీ కమెండోలు, ఐఏఎఫ్ సిబ్బందిని తరలించేలా హెలికాప్టర్లను మోహరించింది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్ రక్షణ కోసం ఇప్పటికే పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్–గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న విమానం, క్వాడ్కాప్టర్లు నిర్వహణను నిషేధించారు. -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
నిరసనలు, ముట్టడి ఇకపై కష్టమే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లకు ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలను అడ్డుకునేందుకేనా..? ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి కలెక్టరేట్‌ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత జనవరి 5న మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. -
6వ అంతస్తులోకి నో ఎంట్రీ !
సాక్షి, హైదరాబాద్: మరో 17 రోజుల్లో కొత్త సచివాలయ భవనం ప్రారంభంకానుంది. 8 అంతస్తులున్న ఈ భవనంలోని ఆరో అంతస్తు మినహా మిగిలినవాటిలోకి సందర్శకులను పరిమితంగా అనుమతించనున్నారు. ఈ చాంబర్లో ముఖ్యమంత్రి కొలువుదీరనున్న దృష్ట్యా అధికారులు భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనసముదాయంలో 300 సీసీ టీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీసీటీవీలతోపాటు ఇతర భద్రతాచర్యల పర్యవేక్షణకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ సందర్శకులకు కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ప్రత్యేకంగా గుర్తింపుకార్డులను జారీ చేసి, వారి కదలికలను కనిపెట్టాలని సూచించారు. సీఎం చాంబర్ ఉండే 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తుల్లో సందర్శకులను పరిమితంగా అనుమతించాలని నిర్ణయించారు. కొత్త సచివాలయంలో భద్రతా ఏర్పాట్లతోపాటు ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ–రేసింగ్ ఏర్పాట్లపై మంగళవారం ఆమె డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 5 నుంచి రోడ్ల మూసివేత! ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ–రేస్ జరగనున్న నేపథ్యంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ బ్రిడ్జీ, మింట్ కాంపౌండ్ నుంచి ఐ–మాక్స్ వరకు రోడ్లను ఫిబ్రవరి 5 నుంచి మూసివేయాలని సమీక్షలో నిర్ణయించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై నగరవాసులకు అవగాహన కల్పించాలని సీఎస్ ఆదేశించారు. ఫార్ములా ఈ–రేస్ సందర్భంగా సచివాలయ పనులకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉన్నతస్థాయి సమీక్షలోని నిర్ణయాలు ►ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న కొత్త సచివాలయానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి. ►పోలీస్, రోడ్లు, భవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఐటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ►3 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 మంది సిటీ పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి. ►సిటీ ట్రాఫిక్ విభాగం నుంచి 22 మంది ట్రాఫిక్ అధికారుల కేటాయింపు ►భద్రతలో భాగంగా బ్యాగేజ్, వెహికిల్, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలి. ►మొత్తం 28 ఎకరాల్లో 9.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో 560 కార్లు, 900పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు సదుపాయం ►సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు ►34 సిబ్బందితో రెండు ఫైరింజన్ల ఏర్పాటు. సచివాలయ భవనంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, ►దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ►ఇప్పటికే జలమండలి ద్వారా నీటి సరఫరాకు చర్యలు. సీవరేజ్ పనుల పురోగతి. -
Noida twin towers: కట్టేందుకు మూడేళ్లు... కూల్చేందుకు...తొమ్మిదే సెకన్లు
మూడేళ్ల పాటు నిర్మించిన ఆకాశ హర్మ్యాలవి. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం కానున్నాయి. నోయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకూ ఈ ట్విన్ టవర్స్‌ను ఎలా కూలుస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆగస్టు 28. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ జంట భవనాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తులున్న ఈ భవనాలను ఆగస్టు 21నే కూల్చేయాల్సి ఉన్నా భద్రతా ఏర్పాట్లకు అధికారులు గడువు కోరడంతో 28కి వాయిదా పడింది. ఏం జరిగింది? నోయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. దాంతో ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు ఈ నెలలో తుది గడువు ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లు ఇలా ? ► ఇంత ఎత్తైన భవనాల కూల్చివేత వల్ల పరిసర ప్రాంతాలకు, ఇతర నివాసాలకు నష్టం లేకుండా చూడటం సవాలుగా మారింది. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు చేపట్టారు. ► ట్విన్ టవర్స్ సమీపంలోనిఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీస్‌లో నివసిస్తున్న 5 వేల మందిని ఆగస్టు 28న ఖాళీ చేయిస్తున్నారు. ఉదయం 7.30కి ఇళ్లు వీడి, సాయంత్రం ఎడిఫస్ కంపెనీ చెప్పాకే తిరిగి రావాలి. ► వారికి చెందిన 1200 వాహనాలను కూడా తరలిస్తున్నారు. ► టవర్స్ సమీపంలోని నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకల్ని మధ్యాహ్నం 2.15 నుంచి 2.45వరకు నిలిపివేస్తారు. ► జంట భవనాలున్న ప్రాంతంలోకి ఆగస్టు 28 రోజంతా ప్రజలు, వాహనాలు, జంతువులు ఎవరినీ రానివ్వరు. ► చుట్టుపక్కల భవనాల్లోకి ధూళి, సిమెంట్ ముక్కలు పోకుండా మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. ► పేల్చివేతతో చుట్టుపక్కల భవనాలకు నష్టం జరగకుండా జంట భవనాల చుట్టూ కందకం తవ్వారు. అదనపు భద్రత కోసం మధ్యలో అతి పెద్ద కంటైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది! ► అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇలా కూలుస్తారు... ► కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30కు కంట్రోల్డ్ ఇంప్లోజన్ టెక్నిక్ సాయంతో కూల్చివేత జరుగుతుంది. ► రెండు భవనాలూ తొమ్మిది సెకండ్లలో పేక మేడలా నేలకొరుగుతాయి. దీన్ని ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ► 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. ► కూల్చివేతకు 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► సియాన్ టవర్‌లో పేలుడు పదార్థాలు నింపడం పూర్తయింది. ఎపెక్స్నూ పూర్తి కావచ్చింది. ► హర్యానాలోని పల్వాల్లో పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నుంచి పేలుడు పదార్థాలు తెప్పిస్తున్నారు. ► కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. ► కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా. వీటి తొలగింపుకే కనీసం మూణ్నెల్లు పడుతుంది. వీటి డంపింగ్‌కు సూపర్‌టెక్ కంపెనీ 5 హెక్టార్లు కేటాయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్లో భద్రత లేదంటూ... కివీస్ పర్యటన రద్దు!
రావల్పిండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ పెద్ద జట్టు మా దేశ పర్యటనకు వచి్చందన్న ఆనందం ఆవిరైంది. న్యూజిలాండ్ ఇంకాసేపట్లో తొలి వన్డే కోసం బరిలోకి దిగాల్సివుండగా... మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ ఉలిక్కిపడింది. ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. అసలేం జరిగింది? శుక్రవారం మ్యాచ్ కోసం ఇరు జట్లు బస చేసిన హోటల్ నుంచి స్టేడియానికి చేరాల్సివుంది. ఆటగాళ్లేమో గదుల నుంచి బయటికి రావడం లేదు. వారి కోసం బస్సులు ఎదురుచూస్తున్నాయి. న్యూజిలాండ్ వర్గాల నుంచి ఒక ప్రకటన మాత్రం బయటికి వచి్చంది. ‘ఈ పర్యటన ఇక ఏమాత్రం ముందుకు సాగదు. మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆడటం సాధ్యపడదు. ఈ నిర్ణయం పీసీబీకి మింగుడుపడదని మాకు తెలుసు. ఘనమైన ఆతిథ్య ఏర్పాట్లు ఎన్నో చేశారు. అయితే మా ఆటగాళ్ల భద్రత దృష్ట్యానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ డేవిడ్ వైట్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో పీసీబీ వర్గాలకు ఊపిరి ఆగినంత పనైంది. వెంటనే దిగ్గజ కెపె్టన్ అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. కివీస్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఫోన్ చేశారు. ఆటగాళ్ల భద్రతకు హామీ ఇచ్చారు. కానీ ఆమె ఆటగాళ్లను పాక్‌లో ఉంచేందుకు ససేమిరా అని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కివీస్ మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్ కోసం పాక్ పర్యటనకు ఈ నెల 11న ఇక్కడికి వచి్చంది. ఆతిథ్య, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వెలిబుచ్చింది. ఇంతలోనే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మూడు రోజుల క్రితమే పీసీబీ చీఫ్ పదవి చేపట్టిన రమీజ్ రాజా న్యూజిలాండ్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ పేషీలోనే తేల్చుకుంటామని ట్విట్టర్లో ప్రకటించారు. మేమూ సమీక్షిస్తాం: ఈసీబీ వచ్చే నెల పాక్ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని చెప్పింది. ‘ఒకట్రెండు రోజుల్లో చర్చించుకొని టూర్ ప్రణాళికను వెల్లడిస్తాం’ అని ఈసీబీ తెలిపింది. వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇంగ్లండ్ రావలి్పండి వేదికగా రెండు టి20లు ఆడేందుకు వెళ్లాల్సివుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఆసీస్ కూడా పాక్‌లో పర్యటించాల్సివుంది. కానీ అనిశి్చత పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. -
'ట్రంప్ పర్యటనంటే ఆ మాత్రం ఉండాలి మరి'
సాక్షి, అహ్మదాబాద్: వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న నేపథ్యంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఈ నెల 24 రోడ్ షోలో పాల్గొన్న అనంతరం.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు. ఆ తరువాత అహ్మదాబాద్‌లోని మొతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంను ట్రంప్–మోదీలు ఇద్దరూ కలిసి ఆవిష్కరిస్తారు. ఇందుకోసం అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. 10,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించనున్నారు. సిబ్బంది మొత్తం 25 మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది ఇన్స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని డీసీపీ విజయ్ పటేల్ వెల్లడించారు. ఈ భద్రతే కాకుండా వీటికి అదనంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు చెందిన భద్రతా దళాలు కూడా విధులు నిర్వహించనున్నాయి. చదవండి: భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ అధ్యక్షుడికి అదిరిపోయే ఆహ్వానం -
బలగాల రక్షణలో ప్రశాంతంగా...
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. అయోధ్య విషయంలో గతంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డ్రోన్ల ద్వారా, సీసీ ఫుటేజీల ద్వారా ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజిత్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్‌లతో సమావేశమై పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సుప్రీంకోర్టు వద్ద.. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించే వాహనాలను, వ్యక్తులను బారికేడ్లతో అడ్డుకొని, క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాకే లోపలికి పంపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సహా ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తుల నివాసాల వద్ద కూడా బలగాలను మోహరించారు. రామ జన్మభూమి అయోధ్యలో... అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరించి పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షించింది. రాష్ట్రంలో మొత్తం 112 ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసి జిల్లాలను జోన్ల లెక్కన విభజించి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పరిశీలించారు. 31 జిల్లాల్లోని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయోధ్య భూమి ప్రాంతంలో సంచరించే వారిని తనిఖీ చేశారు. దేశ రాజధానిలో.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా పలు నిబంధనలను విధించనున్నట్లు పోలీసులు శనివారం ఉదయమే ప్రకటించారు. కోర్టు తీర్పును స్వాగతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసత్య వార్తలు ప్రచారం చేసినందుకుగానూ నోయిడాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత ఢిల్లీ, జామా మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్థిక రాజధాని ముంబైలో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు 40 వేల మంది పోలీసులు గస్తీ కాశారు. శనివారం ఉదయం 11 నుంచి 24 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలను మూసేశారు. -
నేటితో ముగియనున్న కుంభమేళా..
ప్రయాగరాజ్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కుంభమేళాకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో సోమవారం చివరి రోజు మహాశివరాత్రి కావడంతో దాదాపు 400 మంది కేంద్ర పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. కుంభమేళాలో ఈ ఒక్కరోజు 60 లక్షల నుంచి కోటి మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు. భారీస్ధాయిలో వచ్చే యాత్రికుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా మేజిస్ర్టేట్ విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. పొరుగు జిల్లాలైన కౌశంబి, ప్రతాప్‌గఢ్, ఫతేపూర్ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా నేటితో ముగియనుంది. ప్రయాగరాజ్‌లో కుంభమేళా ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకు మహాకుంభమేళాను యాత్రికులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. -
నేడు తెరుచుకోనున్న ‘శబరిమల’
శబరిమల: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో పూజల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమ యింది. భారీగా పోలీసులను మోహరిం చడంతోపాటు ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది. మొత్తం 2,300 మంది పోలీసులను మోహరించింది. ఈ చర్యలపై పండాలం రాచ కుటుంబం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆలయం వద్ద విధి నిర్వహణ నిమిత్తం యువ మహిళా జర్నలిస్టులను పంపవద్దని ‘శబరిమల కర్మ సమితి’ మీడియా సంస్థలను కోరింది. నేటి సాయంత్రం 5 గంటలకు.. ట్రావెన్కోర్ చిట్టచివరి రాజు తిరునాళ్ బలరామ వర్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే శ్రీ చిత్ర అట్ట తిరునాళ్ పూజల కోసం నేటి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తాంత్రి కందారు రాజీవరు, ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రిలు ఆలయ ద్వారాలను తెరిచి, శ్రీకోవిల్‌లో దీపాలు వెలిగిస్తారు. మంగళవారం తిరునాళ్ పూజల అనంతరం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. మండల పూజల కోసం తిరిగి ఈ నెల 17న ఆలయాన్ని తెరిచి మూడు నెలలపాటు దర్శనం కోసం అనుమతిస్తారు. విధి నిర్వహణలో భాగంగా ఆలయం వద్దకు రుతుక్రమం వయసున్న మహిళా జర్నలిస్టుల ను పంపొద్దని వీహెచ్‌పీ, హిందూ ఐక్యవేదిక తదితర సంస్థలతో కూడిన ‘శబరిమల కర్మ సమితి’ మీడియా నిర్వాహకులను కోరింది. 50 ఏళ్ల లోపు మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించిన పక్షంలో పరిస్థితి చేయిదా టిపోతుందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియా సంస్థల ఎడిటర్లకు లేఖలు పంపింది. పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. -
పోలీస్ సిబ్బందిని వెనక్కి పంపిన రేవంత్
కొడంగల్: తన భద్రత కోసం జిల్లా ఎస్పీ పం పించిన పోలీసు సిబ్బం దిని రేవంత్‌రెడ్డి శనివారం వెనక్కి పంపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిం చాల్సి ఉండగా, జిల్లా పోలీసులను పంపించడంపై రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పారు. అధికార పార్టీ ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. -
శబరిమలలో భారీ భద్రత
నీలక్కల్ : శబరిమల ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని నిరసనకారులు అడ్డుకుంటున్న క్రమంలో ఆలయ ప్రవేశ ద్వారం ఉన్న నీలక్కల్ పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. పంబా బేస్ క్యాంప్ సమీపం నుంచే నిరసనకారులు 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి రాకుండా అడ్డగిస్తున్నారు. నీలక్కల్, పంబా బేస్ క్యాంప్‌ల వద్ద 200 మంది మహిళా పోలీసులతో సహా వేయి మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. సన్నిధానం వద్ద 500 పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి అన్ని వయసుల మహిళలతో భక్తులందరికీ శబరిమల ఆలయ పోర్టల్ మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది.మరోవైపు నీలక్కల్లో శబరిమల అచార్య సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనకారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాన్ని పోలీసులు తొలగించారు. భక్తులను శబరిమల వెళ్లకుండా ఎవరైనా అడ్డుకుంటే ఉపేక్షించేంది లేదని, కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు. పంబా వైపు వెళుతున్న వాహనాలను పరిశీలించి, మహిళా భక్తులను అడ్డుకుంటున్న నిరసనకారులపై తీవ్ర చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు దంపతులను నిరసనకారులు అడ్డుకోగా వారిని పోలీసులు సురక్షితంగా పంబకు చేర్చారు. కాగా టీవీ న్యూస్ ఛానెళ్ల ప్రతినిధులను సైతం నీలక్కల్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా నిరసనకారులు కోరారు. ఆ ప్రాంతంలో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించిన అనంతరం మీడియా ప్రతినిధులు తిరిగి తమ విధుల్లో నిమగ్నమయ్యారు. హిందూ సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని శివసేన హెచ్చరించింది. శబరిమల వెళ్లే భక్తులను అడ్డుకునేందుకు ఎవరినీ అనుమతించమని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. -
వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని రథ యాత్ర శనివారం పూరీలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తజన సందోహం నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలతో కూడిన రథాలు శ్రీ మందిరం నుంచి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి బయలుదేరాయి. పూరీ గజపతి మహారాజా దివ్య సింఘ్ దేవ్ రథాల్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి దేవతలకు మంగళ హారతి సమర్పించడంతో యాత్ర ప్రారంభమయింది. జగన్నాథుని నందిఘోష్ రథం సకాలంలో శనివారం సాయంత్రానికి గమ్యం చేరలేక పోయింది. గుండిచా మందిరానికి సమీపంలో ఆగిపోయింది. దీంతో ఇక్కడే రథంపై ఉన్న జగన్నాథునికి సేవాదులు నిర్వహిస్తారు. కాగా, రథయాత్ర సజావుగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో భారీగా సీసీ టీవీలను అమర్చారు. సుమారు 5,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఒడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. -
ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత
ఉప్పల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే అన్ని మ్యాచ్‌ల కోసం భారీ భద్రతను మోహరించామని చెప్పారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ పలు భద్రతా అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్ రావు పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ తలపడే 7 మ్యాచ్‌ల కోసం వివిధ విభాగాలకు చెందిన 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 250 మంది సెక్యూరిటీ వింగ్ పోలీసులు, 329 ట్రాఫిక్ సిబ్బంది, 1038 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటూన్ల ఆర్మ్డ్ ఫోర్స్, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సీసీఎస్ స్టాఫ్ పోలీసులు ఉన్నారు. పోలీస్ పహారాలో క్రికెట్ స్టేడియం శనివారం నుంచే స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు మహేశ్ భగవత్ తెలిపారు. పోలీస్ భద్రతతో పాటు 100 సీసీ కెమెరాలు, చెక్ పాయింట్లు, బాంబు స్క్వాడ్ బృందాలతో నిరంతరం పహారా కాస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీ య ఘటనలు ఏర్పడితే అప్పటికప్పుడు స్పం దించేలా అత్యవసర టీంలను ఏర్పాటు చేశామన్నారు. సంఘ విద్రోహ శక్తులపై గట్టి నిఘా వేసి ఉంచామని, అనుమానితులను ఎప్పటికప్పుడు విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టేడియంలో మహిళా రక్షణ కోసం షీ టీమ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. తినుబండారాలను అ ధిక ధరలకు విక్రయించే వ్యాపారస్తులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వెండర్ సూపర్వైజింగ్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్‌కు 3గంటల ముందు నుంచే అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు... ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరేట్స్, లైట ర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారా లు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పర్ఫ్యూమ్స్, సెల్‌ఫోన్ బ్యాటరీలను మైదానంలోకి అనుమతించరు. మొబైల్ ఫోన్‌కు అనుమతి ఉందని సీపీ తెలిపారు. ట్రాఫిక్ దారి మళ్లింపు... సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో అనుమతించరు. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ ఎన్ఎఫ్సీ బ్రిడ్జి మీదుగా చంగిచర్ల నుంచి వరంగల్ హైవేకు వెళ్లాలని సూచించారు. ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే బోడుప్పల్, చంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్... 1800 ఫోర్ వీలర్స్, 4400 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ అవకాశం కల్పించారు. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ ఉంటుంది. కారు పాస్ ఉన్నవారు రామంతపూర్ దారి గుండా గేట్‌నంబర్ 1, 2లకు వెళ్లాల్సి ఉంటుంది. పాస్ లేని వారు రామంతపూర్ రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులకు గేట్–3 గుండా లోపలికి వెళ్లే అవకాశాన్ని కల్పించారు. మెట్రోరైల్, ఆర్టీసీ ప్రత్యేక ట్రిప్పులు... ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజుల్లో ఆర్టీసీ, మెట్రో రైల్ ప్రయాణికుల కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు తమ సేవల్ని అందించనున్నాయని మహేశ్ భగవత్ తెలిపారు. ప్రైవేట్ వాహనాలు ప్రయాణీకులను నిలువునా దోచుకుంటున్నందున ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు. -
సదస్సు సక్సెస్‌కు సీనియర్ ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌తో పాటు హాజరయ్యే వేలాదిమంది ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీస్ ఉన్నతాధికారులను రంగంలోకి దించింది. ఈ మేరకు 9 మంది సీనియర్ ఐపీఎస్‌లతో పాటు ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత.. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ అనిల్‌కుమార్ మెట్రో రైలు ప్రారంభ వేడుకల భద్రత ఏర్పాట్లు పరిశీలించాలని డీజీపీ సూచించారు. అలాగే అమెరికన్ కాన్సులేట్ అధికారులతో సదస్సుకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ♦ సదస్సు జరిగే హెచ్ఐసీసీ పూర్తి బాధ్యతలను ఐజీ స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారు. బందోబస్తు, భద్రత, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం పర్యవేక్షించాలని సూచించారు. ♦ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు సదుపాయాలు, రవాణా తదితర వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డికి స్పష్టం చేశారు. ♦ వీఐపీల ట్రాఫిక్ రూట్లు, భద్రతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని గ్రేహౌండ్స్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. ♦ శంషాబాద్ ఎయిర్‌పోర్టు పర్యవేక్షకురాలిగా ఐజీ షికాగోయల్‌ను నియమించారు. ఇవాంకా ట్రంప్‌తో పాటు వచ్చే ప్రతినిధులు, ఇతర వీవీఐపీల వ్యవహారాలు పర్యవేక్షించి వారు బస ప్రాంతాలకు, సదస్సుకు చేరుకునేలా ఏర్పాట్లు చూసుకోవాలని పేర్కొన్నారు. ♦ ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ హాజరయ్యే ఫలక్‌నుమా విందు కార్యక్రమాలు, అక్కడి భద్రత వ్యవహారాలు పర్యవేక్షిస్తూ అక్కడే ఉండాలని ఐజీ టి.మురళీకృష్ణను ఆదేశించారు. ♦ గోల్కొండ కోట ఇన్చార్జిగా ఐజీ స్వాతిలక్రా వ్యవహరించనున్నారు. ఇవాంకా ట్రంప్‌తో పాటు సందర్శనకు వచ్చే ఇతర వీవీఐపీల భద్రత తదితర వ్యవహారాలు చూసుకోనున్నారు. ♦ సదస్సు జరిగే ప్రాంతం, సైబరాబాద్, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ కో–ఆర్డినేషన్ బాధ్యతలు చూసుకోవాలని డీసీపీ అవినాష్ మహంతి ఆదేశించారు. ♦ మియాపూర్ ప్రాంతాల్లో ప్రధాని పర్యటన, లోకల్ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీసీపీ ప్రకాశ్‌రెడ్డికి సూచించారు. ♦ హైదరాబాద్ కమిషనర్‌కు ఎస్పీ కోటిరెడ్డిని అటాచ్ చేశారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యల్లో పోలీస్ కమిషనర్‌కు సహకారం అందించడంతో పాటు భద్రత వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. ♦ సౌత్‌జోన్ భద్రత వ్యవహారాల్లో ఉన్నతాధికారులకు సహాయ సహకారాలు అందించేలా అందుబాటులో ఉండాలని డీసీపీ బాబురావును ఆదేశించారు. రేపు రిపోర్ట్ చేయాలి.. భద్రతా, ట్రాఫిక్ తదితర వ్యవహారాలు పర్యవేక్షించేందుకు నియమించిన అధికారులంతా శనివారం రిపోర్టు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల్లో స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని డీజీపీతో పాటు శాంతి భద్రతల అదనపు డీజీపీ, ఇద్దరు కమిషనర్లకు చేరవేయాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి సదస్సు విజయవంతానికి కృషిచేయాలని పేర్కొన్నారు. -
వారి పర్యటనకు 9000 మంది పోలీసుల పహారా
సాక్షి,అహ్మదాబాద్: ప్రదాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే రెండు రోజుల పర్యటన కోసం అహ్మదాబాద్ నగరంలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో 9000 మందికి పైగా పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఇరువురు నేతలు ఇండో-జపాన్ వార్షిక సదస్సు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.మోదీ, షింజే అబే సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. భద్రతా ఏర్పాట్ల కోసం నగరంలోని పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల నుంచీ పోలీసులను రప్పించినట్టు డీసీపీ బలరామ్ మీనా చెప్పారు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్‌కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను రప్పించామని, ఎన్ఎస్జీ కమాండోల బృందాన్ని పంపాలని కూడా కేంద్ర హోంశాఖను కోరామని తెలిపారు. బుధవారం మోదీ, అబే పాల్గొనే రోడ్‌షోకు సంబంధించి రిహార్సల్స్ నిర్వహించామని చెప్పారు. -
ఇంద్రకీలాద్రిపై భద్రతను పర్యవేక్షించిన సీపీ
విజయవాడ : మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించ వలసి వచ్చిందని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లను గౌతం సవాంగ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ రోజు అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. అందులోభాగంగా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ గౌతం సవాంగ్ వివరించారు. -
మేడారంలో 10 వేల మందితో భారీ భద్రత
వరంగల్: మేడారం సమ్మక్క సారక్క జాతరకు 10వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఆదివారం ఆయన జాతర జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అమ్మవారి గద్దెల చుట్టూ పర్యవేక్షించిన అనంతరం భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అనురాగ్‌శర్మ మాట్లాడుతూ...ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నామని తెలిపారు. డీజీపీ వెంట ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ అమరకిషోర్ తదితరులు ఉన్నారు. -
ముచ్చట ముగిసింది!
హంగూ ఆర్భాటాలతో సీఐఐ సదస్సు నిర్వహణ మూడు రోజులకు రూ.20 కోట్ల భారీ వ్యయం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం వచ్చే ఏడాదీ ఇక్కడే.. విశాఖపట్నం: మూడు రోజుల ముచ్చట ముగిసింది. వందల సంఖ్యలో ఒప్పందాలు.. లక్షల కోట్ల పెట్టుబడుల నిర్ణయాలు జరిగాయి.. వీటిలో ఎన్ని ఆచరణరూపం దాలుస్తాయన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా.. దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, మంత్రులు, అధికారులతో, ఇతర ప్రతినిధులతో మూడు రోజులపాటు కళకళలాడిన సాగరతీరంలోని సదస్సు ప్రాంగణం సదస్సు ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం బోసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సీఐఐతో కలిసి ఆర్బాటంగా నిర్వహించిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహణలో గత కొన్ని రోజులుగా తలమునకలైన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా విశాఖ జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 41 దేశాల నుంచి 350 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రులతో పాటు కొన్ని దేశాల మంత్రులు కూడా పాల్గొన్నారు. రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలాసీతారామన్, పీయూష్ గోయల్, రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ, గోద్రేజ్ చైర్మన్ ఆది గోద్రేజ్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కల్యాణి, ఫోర్బ్స్ డెరైక్టర్ నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ డీజీ చంద్రజీత్ బెనర్జీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రెండో రోజు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, జయంతి సిన్హా, సుజనాచౌదరి, బంగ్లాదేశ్ మంత్రి తోఫైల్ అహ్మద్, నేపాల్ మంత్రి దీపక్ బొహరా, మాలవి మంత్రి జోసెఫ్ మనమ్వెఖా, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ క్రిష్లేర్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీ, ఆదిత్య బిర్లా సీఈవో విశాక్ కుమార్, సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు సుమీత్ సురేష్‌రాయుడు చిట్టూరి తదితరులు పాల్గొన్నారు. మూడో రోజు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, అనంతకుమార్, ప్రకాష్ జవదేకర్, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు, ఏంపీ గల్లా జయదేవ్, ఐటీసీ ఈడీ నకుల్ ఆనంద్, ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ తదితరులు హాజరయ్యారు. ఎనిమిది ప్లీనరీలు, పలు సెషన్లు నిర్వహించారు. మొత్తం మూడు రోజుల్లో 328 ఎంఓయూలు కుదుర్చుకోగా, రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. మంచినీళ్లలా ఖర్చు..: సాగ రతీరానికి చేరువలోని హార్బర్ పార్కు వద్ద ఉన్న ఏపీఐఐసీ స్థలంలో నిర్వహించిన ఈ సదస్సుకు ప్రభుత్వం మంచినీళ్ల ప్రాయంగా నిధులు ఖర్చు చేసింది. సదస్సు ప్రాంగణంలో ప్లీనరీలు, సెషన్ల నిర్వహణకు, ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వీలుగా అత్యాధునిక షామియానాలు, స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతినిధులకు స్టార్‌హోటళ్లలో ఖరీదైన బస, విందు భోజనాలు ఏర్పాటు చేసింది. అత్యంత విలాసవంతమైన వందలాది కార్లను సమకూర్చింది. సుమారు రూ.20 కోట్లు వెచ్చించినట్టు అంచనా. ఈ మూడు రోజులూ విశాఖనే రాజధానిగా మలిచి ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు పాలన సాగించారు. ప్రాంగణంలో నాలుగు హాళ్లను ఏర్పాటు చేసి ఒకదాన్ని ముఖ్యమంత్రి సచివాలయంగా మార్చేశారు. సదస్సుకు వచ్చిన స్పందనను చూసి వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. -
రాజమండ్రిలో పటిష్ట భద్రతాచర్యలు
-
పుష్కరాల్లో బీ కేర్‌ఫుల్
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి రక్షణ, భద్రతపై అప్రమత్తంగా ఉండాలి భద్రాచలం, కాళేశ్వరంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించటంతో పాటు భద్రతా ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రక్షణ చర్యల విషయంలో ఆదమరిచి ఉండొద్దని, ఏ చిన్న పొరపాటూ జరగకుండా చూడాలని హెచ్చరించారు. భద్రాచలం, కాళేశ్వరం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఈ రెండు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. దీంతో వారిద్దరు మంగళవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. పుష్కర ఘాట్ల వద్ద క్యూలైన్లకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులు స్నానాల కోసం లోతు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్య స్నానాలు ఆచరించేలా చూడాలన్నారు. ఘాట్ల వద్ద, ఆలయాల ప్రాంగణాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల అధికారులు కాస్త ఎక్కువ శ్రమ తీసుకుని భక్తులకు సహకరించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా భద్రాచలంలో హెలికాప్టర్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు ఆరా తీసిన సీఎం ఏపీలో రాజమండ్రి పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పుష్కరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటికప్పుడు పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాలు ప్రారంభించిన అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, రెవెన్యూ కార్యదర్శి మీనా, డీఐజీ మల్లారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఏఏ ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చాక ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తుల దుర్మరణంపై దిగ్భ్రాంతి రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి మహా పుష్కరాలు సజావుగా జరిగేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థించారు. -
స్టేషన్లో భద్రత కట్టుదిట్టం
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: వేసవి ప్రయాణాల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలో స్టేషన్లోకి సైకో ప్రవేశించి ఏడేళ్ల బాలికను దారుణంగా హతమార్చడం, పలు ప్రాంతాల్లో రైళ్లలో మూకుమ్మడి దొంగతనాలు, బాంబు పేలుళ్లు వంటి ఘటనల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిత్యం లక్షన్నరకు పైగా ప్రయాణికులు, రెండు వందల రైళ్లు రాకపోకలు సాగించే స్టేషన్ నుంచి వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేరాలు జరగకముందే అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను పసిగట్టడం కోసం అదనపు సిబ్బందిని నియమించారు. ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్కు చెందిన సాయుధ సిబ్బంది రైల్వేస్టేషన్ అంతటా పహారా కాస్తున్నారు. స్టేషన్ లోపలా బయటా.. అన్ని ద్వారాల వద్దా సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లతో నిఘా పెట్టారు. పాతనేరస్తులు, చైన్ స్నాచర్లు, జేబు దొంగలను గుర్తించే పనిలోపడ్డారు. క్రాసింగ్‌ల వద్ద ట్రాక్ పోలీసింగ్.. రైల్వేలెవల్ క్రాసింగ్‌లు, ట్రాక్‌ల మలుపులు, రైళ్లు నెమ్మదిగా నడిచే ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో నేరగాళ్లు తిష్టవేసి రైలు నెమ్మదిగా నడుస్తున్న సమయాల్లో లోనికి ప్రవేశించడం లేదా రైళ్లలో నేరాలకు పాల్పడి బోగీ నుంచి దూకి పారిపోవడం వంటి కృత్యాలకు నేరగాళ్లు పాల్పడుతున్న నేపథ్యంలో వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నారు. రైలు ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండి తమకు సహకరించాలని రైల్వే పోలీసులు కోరుతున్నారు. రైలులో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వస్తువులు కనిపించినా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. -
మున్సిపల్ ఎన్నికలకు 3 వేల మంది సిబ్బంది
రేపల్లెరూరల్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. రేపల్లె సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1000 మంది సివిల్, 1000 మంది స్పెషల్పోలీస్లతో పాటు 1000 మంది హోంగార్డులతో భద్రత కల్పిస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 చెక్‌పోస్టుల్లో కోటి 45 లక్షల రూపాయలు, 31 కిలోల వెండి సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,023 మంది రౌడీషీటర్లలో ఇప్పటివరకు 803 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండవర్ చేశామన్నారు. ఎన్నికల్లో అల్లర్లు చేసే అవకాశం ఉన్నవారిని 15 వేల మంది (ట్రబుల్ మంగర్స్)ని గుర్తించి 11 వేల మందిని మండల మెజిస్ట్రేట్ సమక్షంలో బైండవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అతిక్రమించిన 39 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. 11 వాహనాలను ఎన్నికల నియమావళి అతిక్రమించినందున సీజ్ చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,485 లిక్కర్ బాటిల్స్‌ను, 180 లీటర్ల సారా సీజ్ చేసి 59 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తుపై సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో బాపట్ల, గుంటూరు డీఎస్పీలు జోసఫ్ రాజ్‌కుమార్, సత్యనారాయణ, రేపల్లె టౌన్, రూరల్ సీఐలు యు.నాగరాజు, పెంచల రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. -
‘రంగు’ పడుద్ది..!
సాక్షి, ముంబై: హోలీని పురస్కరించుకొని నగర పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పండుగరోజు మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. అలాగే హోలీ నేపథ్యంలో కాముడి దహనం కోసం ఎవరైనా చెట్లను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నత పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మామూలు రోజుల కంటే కూడా ముఖ్యంగా హోలీ రోజున మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో నగర పోలీసులు ఈ పండుగను పురస్కరించుకొని గట్టి బందోబస్తును నిర్వహించేందుకు నిర్ణయించారు. కొన్నేళ్లుగా హోలీ రోజున యువకులు దారిన పోయే మహిళలను అసభ్యకర పదజాలంలో వేధించడం సర్వసాధారణమైపోయింది. దీంతోపాటు రంగులు జల్లుకోవడం వల్ల కొందరు కంటిచూపు కోల్పోయిన సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మొఖంపై వాటర్ బెలూన్లను విసిరి వేసినప్పుడు గాయాలు కావడమేకాకుండా చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో హోలీ ఆడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా నగరవాసులకు సూచనలు ఇస్తున్నారు. ఈ ఏడాది హోలీ సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని నగర పోలీసు చీఫ్ రాకేష్ మారియా హెచ్చరించిన సంగతి తెలిసిందే. మారియా ఆదేశాల నేపథ్యంలో నగరవ్యాప్తంగా ప్రముఖ కూడళ్లలో నాకాబందీ, పెట్రోలింగ్ నిర్వహించనున్నామని ముంబై పోలీస్ అధికార ప్రతినిధి డీసీపీ మహేష్ పాటిల్ తెలిపారు. వీధుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా సహించవద్దని సూచనలు జారీ చేశారు. పండుగ సమయంలో ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు పాటిల్ తెలిపారు. అంతేకాకుండా ఒకవేళ మహిళలు అజాగ్రత్తగా భావిస్తే వెంటనే 100 లేదా 103ని సంప్రదించాల్సిందిగా కోరారు. బీఎంసీకి చెందిన ట్రీ అథారిటీ అనుమతి లేనిదే ఎవరైనా చెట్లను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. వీరికి రూ.వెయ్యి నుంచి ఐదు వేల వరకు జరిమానా లేదా ఏడు రోజుల పాటు జైలుశిక్ష విధించనున్నట్లు పాటిల్ స్పష్టం చేశారు. రైల్వేలో భద్రతా వారోత్సవాలు... మార్చి 12వ తేదీ నుంచి జీఆర్పీ ప్రయాణికుల భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తోంది. హోలీ సందర్భంగా రైళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మురికివాడల్లో చాలా మంది ఆకతాయిలు నడుస్తున్న రైళ్లపై రంగు నీళ్లు నింపిన బెలూన్లను విసురుతారు. దీంతో ప్రయాణికులకు గాయాలైన సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. దీంతో వీటిని అరికట్టడానికి రైల్వే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మురికివాడల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు, హోర్డింగ్‌లను కూడా ఏర్పాటు చేయనుంది. ఇలాంటి సంఘటనలు గతంలో ఎక్కువగా హార్బర్ లైన్లో జరగడంతో ఇక్కడ ప్రత్యేక నిఘా వహించనున్నారు. -
గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష
హైదరాబాద్: జంట నగరాల్లో గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్ సమీక్షీంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె మహంతి, డిజిపి దినేష్ రెడ్డి, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగరంలో శాంతిభద్రతలపై చర్చించారు. అంతకు ముందు సీఎస్‌తో దినేష్ రెడ్డి, ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈనెల 9న గణేష్ చతుర్థి సందర్భంగా తీసుకోవల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.