జోధ్‌పూర్‌లో పోలింగ్ సామగ్రిని అందుకుంటున్న సిబ్బంది
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీ్మత్‌సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ భరత్‌పూర్ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్రీ్టయ లోక్‌దళ్(ఆర్‌ఎల్డీ)కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఎం, ఆర్‌ఎలీ్ప, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పారీ్టలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది.
బరిలో ఉద్ధండులు..
పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేతలు వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్, సతీష్ పూర్ణియా, ఎంపీలు దివ్యా కుమారి, రాజ్యవర్దన్ రాథోడ్, బాబా బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీనా తదితరులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
గహ్లోత్, సచిన్ పైలట్ సయోధ్య!
రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల సంగతి తెలిసందే. తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ఎన్నికల వేళ గహ్లోత్ ప్రయత్నించారు. సచిన్ పైలట్ ప్రజలను ఓట్లు అభ్యరి్థస్తున్న వీడియోను గహ్లోత్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తద్వారా ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చేందుకు ప్రయతి్నంచారు.
Comments
Please login to add a commentAdd a comment