arrangements Completed
-
Rajasthan elections 2023: రాజస్తాన్ ఎన్నికలకు సర్వం సిద్ధం
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీ్మత్సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ భరత్పూర్ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్రీ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఎం, ఆర్ఎలీ్ప, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పారీ్టలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. బరిలో ఉద్ధండులు.. పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేతలు వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్, సతీష్ పూర్ణియా, ఎంపీలు దివ్యా కుమారి, రాజ్యవర్దన్ రాథోడ్, బాబా బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీనా తదితరులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గహ్లోత్, సచిన్ పైలట్ సయోధ్య! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల సంగతి తెలిసందే. తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ఎన్నికల వేళ గహ్లోత్ ప్రయత్నించారు. సచిన్ పైలట్ ప్రజలను ఓట్లు అభ్యరి్థస్తున్న వీడియోను గహ్లోత్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తద్వారా ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చేందుకు ప్రయతి్నంచారు. -
చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్
సూళ్లూరుపేట: చందమామ గురించి తెలుసుకోవడానికి గత 60 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా 1958 నుంచి చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తోంది. 1969లో అపోలో రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించింది. రష్యా, జపాన్, చైనా, ఇజ్రాయెల్, జర్మనీ, భారత్ తదితర దేశాలు చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాయి. భారత్ 2008లో చంద్రుడి మీదికి చంద్రయాన్–1 పేరుతో ఆర్బిటార్‌ను ప్రయోగించింది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రుడిపై రెండు ప్రయోగాలు చేసిన భారత్ మూడో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. సైంటిస్టులు ఏర్పాట్లను దాదాపు పూర్తిచేశారు. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల వల్ల ఆర్బిటార్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చంద్రయాన్–3లో మూడింటినీ ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 అక్టోబర్ 22న చేపట్టిన చంద్రయాన్–1 ప్రయోగం విజయవంతమైంది. 2019 జూలై 15న చంద్రయాన్–2కు శ్రీకారం చుట్టింది. ఆర్బిటార్ ద్వారా ల్యాండర్, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. ప్రయోగమంతా సక్సెస్ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి. దాంతో ఆ ప్రయోగం పాక్షిక విజయం మాత్రమే సాధించింది. దాదాపు నాలుగు సంవత్సరాలు తరువాత చంద్రయాన్–3 పేరుతో మూడోసారి ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14వ తేదీన ఈ ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్–3లో ప్రపొల్షన్ మాడ్యూల్లో రెండు పేలోడ్స్, ల్యాండర్లో 4 పేలోడ్స్, రోవర్లో రెండు పేలోడ్స్, అమెరికాకు చెందిన ఒక పేలోడ్‌ను అమర్చి పంపించనున్నారు. రూ.1,600 కోట్ల వ్యయం ► చంద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రయోగాలకు సుమారు రూ.1,600 కోట్లు వ్యయం చేస్తున్నారు. ► చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం ప్రారంభమయ్యే అవకాశం వుంది. ► చంద్రయాన్–1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు. ► చంద్రయాన్–2 ప్రాజెక్టును రూ.425 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పదేళ్లు సమయం పట్టడంతో ఖర్చు అదనంగా రూ.173 కోట్లు పెరిగింది. అంటే చంద్రయాన్–2కు రూ.598 కోట్లు వ్యయం చేశారు. ► చంద్రయాన్–3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు. -
నేడే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభివర్ణించిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖు లు హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దేశ ప్రజలంతా ఒక్కటై, చేతులు కలపిన తీరు అసలు సిసలైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అధీనం మఠం పెద్దలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో అధీనం మఠం పెద్దలతో సమావేశమయ్యారు. వారు ఆయనకు ఆశీస్సులు అందించారు. సెంగోల్తోపాటు కొన్ని బహుమతులు అందజేశారు. అనంతరం మోదీ వారిని సత్కరించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి అధీనం మఠం పెద్దలు, ప్రతినిధులు తమిళనాడు నుంచి శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతి శకంలో భారత జాతీయవాదానికి తమిళనాడు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు ప్రజల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంగోల్‌కు గౌరవం దక్కాల్సి ఉండగా, దాన్నొక ‘వాకింగ్ స్టిక్’గా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్లో మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఆనంద్ భవన్ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. దేశ మహోన్నత సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టిస్తుండడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు. హాజరయ్యే పార్టీలు, ఉభయ సభల్లో వాటి ఎంపీల సంఖ్య ఎన్డీయే పార్టీలు 1. బీజేపీ (394) 2. శివసేన (15) 3. నేషనలిస్టు పీపుల్స్ పార్టీ – మేఘాలయా(2) 4. నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(1) 5. సిక్కిం క్రాంతికారీ మోర్చా(1) 6. జననాయక్ జనతా పార్టీ 7. ఏఐఏడీఎంకే(5) 8. ఐఎంకేఎంకే 9. ఏజేఎస్‌యూ(1) 10. ఆర్పీఐ–అథవాలే(1) 11. మిజో నేషనల్ ఫ్రంట్(2) 12. తమిళ మానిల కాంగ్రెస్(1) 13. ఐటీఎఫ్‌టీ–త్రిపుర 14. బోడో పీపుల్స్ పార్టీ 15. పీఎంకే(1) 16. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 17. ఆప్నా దళ్(2) 18. అస్సాం గణపరిషత్ (1) నాన్–ఎన్డీయే పార్టీలు 1. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (31) 2. తెలుగుదేశం పార్టీ(4) 3. లోక్ జనశక్తి పార్టీ– రామ్ విలాస్ పాశ్వాన్(1) 4. బిజూ జనతాదళ్(21) 5. బీఎస్పీ(10) గైర్హాజరయ్యే పార్టీలు 1. కాంగ్రెస్ (81) 2. డీఎంకే (34) 3. శివసేన–యూబీటీ(7) 4. ఆమ్ ఆద్మీ పార్టీ (11) 5. సమాజ్‌వాదీ పార్టీ (6) 6. సీపీఐ (4) 7. జేఎంఎం (2) 8. కేరళ కాంగ్రెస్–మణి(2) 9. విడుదలై చిరుతైగళ్ కట్చీ(1) 10. రాష్ట్రీయ లోక్‌దళ్ (1) 11. తృణమూల్ కాంగ్రెస్ (35) 12. జేడీ–యూ (21) 13. ఎన్సీపీ (9) 14. సీపీఎం (8) 15. ఆర్జేడీ (6) 16. ఐయూఎంఎల్ (4) 17. నేషనల్ కాన్ఫరెన్స్ (3) 18. ఆర్ఎస్పీ (1) 19. ఎండీఎంకే (1) 20. ఎంఐఎం (2) -
మేడారానికి భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క–సారలమ్మ జాతరకు తెలంగాణ పోలీసుశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ వనమహోత్సవం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలవనున్న నేపథ్యంలో భద్రతాపరంగా పలు ప్రణాళికలు రూపొందించింది. భద్రత, రవాణా, పార్కింగ్, వాహనాల మళ్లింపు, సీసీకెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్‌జామ్‌ల నివారణకు అవలంబించాల్సిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసింది. వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి మేడారానికి వచ్చే వారంతా కాటారం రహదారిని రాకపోకలకు వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్‌తోపాటు, హైదరాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేభక్తులంతా ములుగు మీదుగా పస్రా, అక్కడ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి మీదుగా వరంగల్ వైపునకు రావాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాల్లోనూ వన్‌వే విధానం సాగుతుంది. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినా క్లియర్ చేయడానికి ప్రత్యేక బైకులపై పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. జాతర ముగిసేవరకు ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రైవేటు వాహనాలు, ఇసుక లారీలు, ట్రాక్టర్లను వేరేవైపు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. వరంగల్ మీదుగా మేడారం చేరుకునే భక్తులు జాకారం –జంగాలపల్లి గ్రామాల మధ్య కొలువైన ఘట్టమ్మ తల్లి వద్ద ఆగుతారు. ఇక్కడ భక్తులు, వాహనాల రద్దీ నియంత్రణకు సైతం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం చేరుకున్న అన్ని వాహనాలకు ‘ఊరటం’వద్ద విశాల మైదానంలో వేలాది వాహనాల పార్కింగ్‌కు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జాతర జరగనుంది. రక్షణ ఇలా: గతంలో ములుగు నుంచి మేడారం వరకు రహదారి వెంట 10 కి.మీ.లకు ఒక పోలీస్ చెక్‌పోస్టు పెట్టగా.. ఈసారి 4 కి.మీ.లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకోనున్నారు. దాదాపు 380 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. సమ్మక్క–సారక్క గద్దెలను దర్శించుకునే మార్గాల సంఖ్యను నాలుగుకు పెంచాలని యోచిస్తున్నారు. మేడారం జాతరకు ప్రధానిని ఆహ్వానిస్తాం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను ఆహా ్వనించనున్నట్టు బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. -
మత సామరస్యానికి ప్రతీక ‘రంజాన్’
బాన్సువాడ/కామారెడ్డి టౌన్: 29 రోజుల ఉపవాసాలు ముగిశాయి. ఇక పండుగే మిగిలింది. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ రంజాన్. రంజాన్ మాసం మంగళవారం నాటితో ముగియగా, షవ్వాల్ మాసంలోని మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్–ఉల్–ఫితర్. మంగళవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో బుధవారం రంజాన్ పండుగను జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. ఈ పండుగ ఉమ్మడి జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈద్–ఉల్–ఫితర్ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోని ఈద్గా‹లలో ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖుర్ ఆన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేçయడం ద్వా రా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రో ధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అదుపు లో ఉంటాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను ఆచరించిన విధితమే. ఉదయాన్నే అన్న పానాదులను సేవించడాన్ని సహరి అంటా రు. తిరిగి సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనాన్ని సేవించడాన్ని ఇఫ్తార్ అంటారు. ఈద్–ఉల్–ఫితర్ అంటే.. నెల రోజులపాటు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్ మాసపు మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్–ఉల్–ఫితర్. ఈ రోజు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలను ధరించి, ఇతర్ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్గాహ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ‘ఈద్–ముబారక్’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. రంజాన్ పండగ రోజు షీర్ ఖుర్మా అనే తీపి వంటకం అందరినీ నోరూరిస్తుంది. వాతావరణమంతా దైవ విశ్వాసం, దైవ భీతి, దైవ విధేయతా భావాలతో, ఉన్నత నైతిక పోకడలతో, సత్క్రియా, సదాచారాలతో అలరారుతుంది. ఈ వాతావరణంలో చెడు అన్నది అణగిపోతుంది. మంచి అన్నది పెరుగుతుంది. సజ్జనులు సత్కార్యాల్లో సహకరించుకొంటారు. ధనికులు, పేదలు అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దిన చర్యను పాటిస్తారు. తామంతా ఒకే భావన, ప్రేమాభిమానాలు, సమైక్యతా సామరస్యాలు నెలకొల్పడంలో ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పండుగ తర్వాత మరో 6 రోజులపాటు షవ్వాల్ దీక్షలను పాటిస్తారు. జకాత్: ఇస్లాం నిర్దేశించిన సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి ఇంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపారం కోసం నిర్దేశించబడి ఉన్న సరుకులు, చివరకి తమ వద్ద ఉన్న పశువుల వెల కట్టి అందులో నుంచి 2.5శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు సైతం ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేదే జకాత్, ఫిత్రాల ముఖ్య ఉద్దేశం. అనేక విషయాలు అవగతం: రంజాన్‌తో అనేక విషయాలు అవగమవుతాయి. మనో నిగ్రహం అలవడుతుంది. ఆకలి, దప్పుల విలువ తెలుస్తుంది. దాన గుణం అలవడుతుంది. చెడు అలవాట్లు, కోరికలు దహించబడుతాయి. ప్రేమ, అభిమానం, క్రమశిక్షణ, రుజువర్తన, కర్తవ్య పారాయరణత, సర్వ మానవ సౌబ్రాతత్వం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. సృష్టికర్త, సహృదయంతో మానవాళికి రంజాన్ మాసం అందించారు. ఈ మాసంలో ఒక సత్కార్యం చేస్తే ఇతర మాసాల్లో లభించే పుణ్య ఫలం కంటే అత్యధికంగా లభిస్తుంది. ప్రతి రోజు రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేస్తారు. దివ్య ఖుర్ ఆన్‌ను రోజుకు 20 రకాతుల చొప్పున తరావీ నమాజులో 27 రోజులపాటు హాఫీజ్లు పఠిస్తారు. రంజాన్‌లో రాత్రి పూట ఇషా నమాజ్ అనంతరం తరావీ నమాజ్ జరుగుతుంది. ఇలా 27 రోజులు తరావీ నమాజ్ జరిపిన తర్వాత షబ్–ఎ–ఖదర్ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. 30 రోజులపాటు ఉపవాస దీక్ష పాటించలేని వారు 27 రోజుల తర్వాత వచ్చే షబ్–ఎ–ఖదర్ రాత్రి నుంచి ఈద్–ఉల్–ఫితర్ వరకు మూడు రోజులపాటు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇహ లోకంలో ఆచరించే ఇటువంటి కఠో ర దీక్షలు మనల్ని పరలోకంలో రక్షణగా ఉండి కా పాడుతాయని ముస్లింల ప్రగా«ఢ విశ్వాసం. రంజా న్ నెలలో ఉపవాసాలతో, దాన ధర్మాలతో గడిపిన వారి ప్రార్థనలను అల్లాహ్ ఆలకిస్తాడని, వారి పాపాలు పరిహారమై అగ్ని సంస్కారం పొందిన బంగారం మాదిరి వారి మోము దివ్య కాంతిలో వెలుగొందుతుందని ముస్లింలు విశ్వసిస్తారు. ఫిత్రాదానం: షవ్వాల్ నెల మొదటి తేదీ ఈద్–ఉల్–ఫితర్ çపండుగనాడు నమాజ్ ప్రార్థనకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగను ఈద్–ఉల్–ఫిత్ర్ అని పేరు వచ్చింది. షరియత్ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాల పరిహారార్థం చేసేదే ఫిత్రా దానం. సమాజంలోని నిరుపేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు కూడా ఇతరులతో పాటు పండుగల్లో మంచి వస్త్రాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుంది. పావు తక్కువ రెండు సేర్ల గోదుమల తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లిం దానం చేయాలి. -
మొక్కల పండుగకు సన్నద్ధం
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం పథకం ఐదో విడతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మొక్కల పెంపకం చేపడుతున్న అధికారులు లక్ష్యాన్ని చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 1.23 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 215 నర్సరీల్లో వీటి పెంపకం చేపడుతున్నారు. అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపాధిహామీ, అటవీ శాఖ ద్వారా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో హరితహారంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కోడ్ ముగియగానే తేదీని ఖరారు చేసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. 1.23 కోట్ల మొక్కలు లక్ష్యం.. గతేడాది కంటే ఈసారి హరితహారం మొక్కల లక్ష్యాన్ని పెంచారు. ఈసారి ఉపాధిహామీ పథకం ద్వారా 83 లక్షలు, అటవీశాఖ ద్వారా 40 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించారు. ఈ మేరకు ఇప్పటికే ఈజీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 215 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో సుమారు 20 వేల నుంచి లక్ష వరకు మొక్కలను సిద్ధం చేశారు. మరో 20 రోజుల్లో మొక్కలు అందుబాటులోకి రానున్నాయి. ఇక అటవీశాఖ సైతం హరితహారానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేసింది. అటవీజాతి మొక్కలతో పాటు పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని అటవీజాతి మొక్కలను అధిక మొత్తంలో సిద్ధం చేస్తోంది. రహదారుల వెంట ఎక్కువగా నాటేలా ప్రణాళికలు చేశారు. రెండో వారంలో కమిటీలు.. హరితహారం ఐదో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. అయితే జూన్ మొదటి లేదా రెండో వారంలో కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కమిటీలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. దాంతో పాటు గ్రామాల్లోనూ పంచాయతీలవారీగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయంతో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపట్టనున్నారు. సింగరేణి యాజమాన్యం సైతం ప్రతిఏట తనవంతు బాధ్యతగా హరితహారంలో పాలుపంచుకుంటూ విరివిగా మొక్కలు నాటుతోంది. గత సంవత్సరం సుమారు 6లక్షల మొక్కలు నాటగా ఈసారి ఆ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సంరక్షిస్తేనే మనుగడ.. మొక్కలను నాటడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని సంరక్షించడంలో లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షల్లో మొక్కలు నాటుతున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్నాయి. మొక్కల సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో నాటిన కొద్ది రోజులకే మొక్కలు చనిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కేవలం మొక్కలను నాటడంతో తమ పనై పోయిందని అధికారులతో పాటు ప్రజలు భావిస్తుండటంతో పథకం లక్ష్యాన్ని చేరడం లేదన్నది నిజం. నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే పచ్చదనం వెల్లివిరుస్తుంది. ప్రతిఒక్కరూ మొక్కల సంరక్షణను తమ వంతు బాధ్యతగా చేపట్టాల్సిన అవసరముంది. అధికారులు సైతం మొక్కల సంరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
బల్దియాలో ఎన్నికల కోలాహలం
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో చివరి స్టాండింగ్ కమిటీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక పూర్తయితే నెల రోజులే పదవీకాలం ఉంటుంది. యేడాదికోసారి జరిగే స్టాండింగ్ కమిటీకి తీవ్ర పోటీ ఉండేది. పాలకవర్గం గడువు జూలై 2తో ముగియనుండడంతో చివరిసారిగా స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన సభ్యులు నెలరోజులు తమ పదవిలో ఉంటారు. నెల రోజుల పదవి కోసం సైతం బల్దియాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నెల 29న స్టాండింగ్ కమిటీ నియామకం కోసం ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేశారు. గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాలపరిమితి ఈ నెల 22తో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 23న, మండలి ఎన్నికల ఫలితాలు 27 వెలువడనుండడంతో బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలను 29న నిర్వహించనున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహుల్లో సందడి కనిపించింది. పాలకవర్గం ఏర్పడ్డ రెండేళ్ల తర్వాత 2016 మే 23న మొదటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగగా, 2017 మే 23న రెండవ కమిటీకి, 2018 మే 23న మూడవ కమిటీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం నాల్గవ(చివరి) కమిటీ కోసం పోటీ మొదలైంది. ఏకగ్రీవానికే ప్రయత్నం..? నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో చాలామంది ఆసక్తి చూపడం లేదు. కొంతమంది స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉండాలనే పట్టుదలతో ఉన్నారు. ఈసారి చివరి అవకాశం కావడంతో ఆశావహులు కమిటీలో చోటు కోసం గట్టిపట్టు పట్టే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీలో తీవ్ర పోటీ ఉండడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. 2018లో జరిగిన స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలిపి వారి బలానికి మించిన ఓట్లు సాధించారు. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో 41 మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్ ఐదుగురు, బీజేపీ ఇద్దరు, ఎంఐఎంకు ఇద్దరు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి, రెండవ, మూడవ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కొనసాగిన 15 మంది మినహాయిస్తే... దాదాపుగా అందరు కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మేయర్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లు నిర్ణయించిన వారికే స్టాండింగ్ కమిటీలో చోటు దక్కనుంది. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక పూర్తి చేసే ప్రయత్నం జరుగుతోంది. షెడ్యూల్ ఇదీ... 16 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ 23న పరిశీలన, అర్హత ఉన్న నామినేషన్ల ప్రకటన 24 నుంచి 26వ ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన 29న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నిర్వహణ, సాయంత్రం 4 గంటలకు ఓట్లు లెక్కించి విజేతల ప్రకటన ఐదుగురికి అవకాశం... స్టాండింగ్ కమిటీ ఎన్నికలను జీవో 59 ప్రకారం నిర్వహిస్తారు. 50 డివిజన్లకు కలిపి 10 డివిజన్లకు ఒక సభ్యుని చొప్పున ఐదుగురు సభ్యలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు కార్పొరేటర్లు ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎ క్కువ ఓట్లు వచ్చిన వారు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఓటింగ్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే జరగనుంది. ఎన్నిక నామమాత్రమే..! అధికార టీఆర్ఎస్ పార్టీ బలం 41కి చేరుకోవడంతో ఎన్నిక ఏకపక్షంగానే ఉంటుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 10 మంది కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం ఐదుగురు కార్పొరేటర్లకే పరిమితమైంది. బీజేపీకి 2, ఎంఐఎంకు 2 సీట్లు ఉన్నాయి. నెల రోజుల గడువు ఉన్నా సరే చివరి అవకాశంగా వచ్చిన ఈ ఎన్నికల్లో స్థానం దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఆశావహులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. గతంలో స్టాండింగ్‌లో అవకాశం దక్కని వారు చివరి స్టాండింగ్ కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలంటూ కార్పొరేటర్లు ఎవరికి వారు ఎమ్మెల్యే, మేయర్ల వద్ద ప్రయత్నం చేస్తున్నారు. -
‘తొలి పోరు’కు సిద్ధం..
చుంచుపల్లి: తొలి విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 71 ఎంపీటీసీలు, 7 జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల ప్రక్రియ 24వ తేదీన ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణకు జిల్లా అధికారులు ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న వాటి పరిష్కారం ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. నామినేషన్ దాఖలు సందర్భంగా జెడ్పీటీసీ స్థానం జనరల్ అయితే రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీలకు జనరల్ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత ఎన్నికల కోసం 443 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,190 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తొలి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు మే 6న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. బూర్గంపాడు మండలానికి చెందిన 11 ఎంపీటీసీ స్థానాలకు పదవీ కాలం మరో ఏడాది పాటు ఉన్నందున వాటికి ఎన్నికలు నిర్వహించరు. ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక ఉంటుంది. 2,12,755 మంది ఓటర్లు... జిల్లాలోని అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లో ఎన్నికల ప్రక్రియకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 7 మండలాల పరిధిలో 2,12,755 మంది ఓట్లు వేయనున్నారు. అశ్వాపురం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 31,022 మంది, చర్లలో 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 30,625 మంది, దుమ్ముగూడెంలో 13 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 32,707 మంది, బూర్గంపాడు జెడ్పీటీసీ పరిధిలో 28,632 మంది, టేకులపల్లిలోని 14 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 37,548 మంది, పాల్వంచలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 26,323 మంది, ములకలపల్లిలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 25,898 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత 7 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. జిల్లా పరిధిలో 220 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలుండగా వాటిలో బూర్గంపాడులోని 11 ఎంపీటీసీలకు ప్రస్తుతం ఎన్నికలు జరగవు. తొలి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. అశ్వాపురం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించారు. చర్ల ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. దుమ్ముగూడెం ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. బూర్గంపాడులో కేవలం జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే జరగనుండగా జనరల్ మహిళకు కేటాయించారు. పాల్వంచలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు రిజర్వు చేశారు. ములకలపల్లిలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు ఖరారు చేశారు. టేకులపల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక బరిలో నిలబడే జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షలు ప్రచారం నిమిత్తం ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం పరిమితి విధించింది. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 7 మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు ఆయా మండల కేంద్రాలలోనే స్వీకరిస్తారు. నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలలో పూర్తి విషయాలను పొందుపరచాలి. – డి.పురుషోత్తం, డిప్యూటీ సీఈఓ, ఎన్నికల లైజన్ అధికారి -
పరిషత్తు.. కసరత్తు
సాక్షి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెరలేచింది. ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పార్టీల నాయకులు ప్రణాళికలు రూపొందించుకునే పనిలోపడ్డారు. దూకుడుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో సోమవారం సమావేశంకాగా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టింది. టార్గెట్ చైర్మన్ అసెంబ్లీ, సర్పంచ్ విజయాలతో దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం తమదేనంటున్న గులాబీ శ్రేణులు అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారం కూడా టీఆర్ఎస్ చేతిలో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయనే భావనతో టీఆర్ఎస్ పెద్దలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని ఇప్పటికే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు. అందులోభాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లా ప్రజాపరిషత్‌లు, 66 మండల పరిషత్‌లను కైవ సం చేసుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిషత్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తరలివెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ప్ర జాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లను కైవసం చేసుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులుగా సమర్థవంతులను ఎంపిక చేసుకోవాలన్నారు. అలాగే ఇటీవ ల ఉమ్మడి జిల్లాలో ఓటమి చెందిన ఏకైక పార్టీ అ భ్యర్థి కోవ లక్ష్మికి జెడ్పీ చైర్పర్సన్ అవకాశం క ల్పించారు. ఆసిఫాబాద్ టీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్స న్ అభ్యర్థిగా కోవ లక్ష్మి పేరును కేసీఆర్ ప్రకటిం చారు. అలాగే పరిషత్ ఎన్నికల బాధ్యతలు పార్టీ నేతలకు అప్పగించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం జెడ్పీ స్థానాలు గెలవాలని తేల్చిచెప్పారు. పోరుకు కాంగ్రెసై అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లోనైనా ఉనికి చాటుకోవా లని ఉబలాటపడుతోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ.. అదే ఊపుతో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను దక్కించుకోవాలని యోచిస్తోంది. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మండలాల వారిగా పార్టీ నాయకులు, క్యాడర్‌తో మంతనాలు జరుపుతున్నారు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల పేర్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీనితోపాటు కాంగ్రెస్ పార్టీకి వీలైనన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే మండలాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ, పార్టీ క్యాడర్‌ను స్థానిక పోరుకు సమాయత్తం చేసే పనిలో కాంగ్రెస్ నేతలున్నారు. పార్టీ గుర్తులతో జరిగే పరిషత్ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడానికి టీఆర్ఎస్, పునరుత్తేజం పొందడానికి కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. -
యంత్రాంగం సిద్ధం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 11వ తేదీన జరిగే పోలింగ్‌కు సంబంధించి సిబ్బంది కేటాయింపు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత వంటి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. పోలింగ్ నిర్వహణకు ఇబ్బంది కలగకుండా తీసుకునే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాలెట్ బాక్సులు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. అలాగే పోలింగ్ తీరును పరిశీలించేందుకు మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రాఫర్ల కేటాయింపులన్నీ కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి సిబ్బంది కేటాయింపు తదితర పనులన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి తరలించనున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సెయింట్ జోసఫ్ పాఠశాల, విజ య ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందించనున్నారు. అలాగే పాలేరుకు సంబంధించి మొహమ్మదీయ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ నుంచి, మధిర నియోజకవర్గానికి మధిరలోని టీవీఎం ప్రభుత్వ హైస్కూల్ నుంచి, వైరాకు ఏఎంసీ గోడౌన్ నుంచి, సత్తుపల్లి నియోజకవర్గానికి జ్యోతి నిలయం హైస్కూల్ నుంచి, కొత్తగూడెంకు రామచంద్ర డిగ్రీ కళాశాల నుంచి, అశ్వారావుపేట నియోజకవర్గానికి కళాశాల నుంచి సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేయనున్నారు. సర్వం సమాయత్తం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,13,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 7,39,525 మం ది పురుషులు, 7,73503 మంది మహిళలు ఉండ గా.. 66 మంది ఇతరులు ఉన్నారు. వారంతా ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,798 పోలింగ్ కేంద్రాలను, ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల కోసం ప్రత్యేక షామియానాలు, మంచినీటి వసతి కల్పించనున్నారు. అలాగే 4,340 బ్యాలెట్ యూనిట్లు, 2,143 కంట్రోల్ యూనిట్లు, 2,266 వీవీ ప్యాట్లను ఈ ఎన్నికలకు వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 7,930 మంది సిబ్బందిని నియమించారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్య క్రమం దాదాపు పూర్తి కావొచ్చింది. 14,82,042 ఓటరు స్లిప్‌లను ఇప్పటికే ఆయా ఓటర్లకు అందజేశారు. ఇక వికలాంగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1,112 వీల్చైర్లను పోలింగ్ స్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచారు. ఎన్నికల కోసం 267 మంది మైక్రో అబ్జర్వర్లను వినియోగిస్తున్నారు. 461 కేం ద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 960 కేంద్రాల్లో ఆఫ్ లైన్ రికార్డింగ్ చేయనున్నారు. అలాగే 287 మంది వీడి యోగ్రాఫర్లనునియమించారు. ఇకఎన్నికల కోసం 265 బస్సులు అవసరం ఉండగా.. మొత్తం 304 బస్సులు, 134 జీపులు, కార్లు సిద్ధంగా ఉంచారు. భద్రత కట్టుదిట్టం.. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గుర్తించిన సమస్మాత్మక కేంద్రాల్లో పోలీస్ భద్రతను పెంచారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 171 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ పోలింగ్ సమయంలో పలు చర్యలు చేపట్టనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలటరీ దళాలతోపాటు పోలీస్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. -
‘టీచర్ ఎమ్మెల్సీ’కి సర్వం సిద్ధం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘నల్లగొండ–ఖమ్మం– వరంగల్ ’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థానానికి 2013లో ఎన్నిక జరగగా, ఇక్కడినుంచి పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్టీయూ) నుంచి పూల రవీందర్ విజయం సాధించారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈలోగానే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం ఈ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు కలిసి ఉన్న ఈ నియోజకవర్గంలో 20,585 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 13,478, మహిళా ఓటర్లు 7,107 మంది ఉన్నారు. ఈ ఎన్నిక కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవాలని గత ఏడాది అక్టోబరు1వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా, నవంబరు 6వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అప్పటికి కేవలం 18వేల పైచిలుకు దరఖాస్తులు మాత్రమే అందడంతో ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. మంగళవారమే తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. మరోవైపు ఈ ఎన్నికల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 181 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 20,585 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెలఖారులోగా, లేదంటే మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు గడిచిన నెల రోజులకుపైగానే ఎమ్మెల్సీ ఎన్నికపై ఉపాధ్యాయ సంఘాలు దృష్టి సారించాయి. ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న పీఆర్టీయూ ఈసారి తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది. 2013నాటి ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పీఆర్టీయూ తరఫున పూల రవీందర్ గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసారి కూడా యూనియన్నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటింప చేసుకుని, టీఆర్ఎస్ అధినాయకత్వం మద్దతును పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి యూటీఎఫ్ సిద్ధమవుతోంది. ఆ సంఘం తమ అభ్యర్ధిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డిని ప్రకటించింది. వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన రిటైర్డ్ డీఈఓ చంద్రమోహన్, జనగామకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య స్వతంత్రంగా పోటీచేయనున్నారు. ఎస్టీయూ టీఎఫ్ నేతలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పీఆర్టీయూలో గుంపుల లొల్లి ! రెండో సారి కూడా బరిలోకి దిగాలని భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు యూనియన్‌లో అంతర్గతంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. ఆ యూనియన్‌లో జరుగుతున్న పరిణామాలు పూల రవీందర్‌కు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన కోమటిరెడ్డి నర్సింహారెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయన తన ప్రచారం కూడా మొదలు పెట్టారు. యూనియన్ను వీడిన ఆయన ఇదివరకే తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్)లో చేరారు. ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిచారు. ఫలితంగా జిల్లా ఓట్లలో కచ్చితంగా చీలిక వస్తుందన్న ఆందోళన పీఆర్టీయూ నేతల్లో లేకపోలేదు. సంఘంలో రాష్ట్రస్థాయి నాయకత్వంలో వచ్చిన అభిప్రాయ బేధాలు, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన సొంత జిల్లా వరంగల్‌లో కూడా ఓట్లు చీలే ముప్పు ఏర్పడింది. మరోవైపు ఈ సంఘం నుంచి అభ్యర్థిగా ఇంకా ఎవరి పేరు ఖరారు కాకపోవడం, ఒక వేళ సిట్టింగ్ ఎమ్మెల్సీకి పీఆర్టీయూ నాయకత్వం టికెట్ ఖరారు చేసినా.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటించాల్సి ఉండడం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ టికెట్‌కు పీఆర్టీయూలో పోటీ ఎక్కువగానే ఉందని, దీనికితోడు రెబల్స్ బెడద సంఘం ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
సర్వం సిద్ధం
చుంచుపల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన వార్డు సభ్యుల్లో సగం మంది అందుబాటులో ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో వార్డు సభ్యులు హాజరు కాకుంటే ఉప సర్పంచ్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఎన్నికలు జరిగే అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, చుంచుపల్లి మండలాలకు అధికార యంత్రాంగం, పోలింగ్, పోలీస్ సిబ్బంది గురువారం మధ్యాహ్నానికే ఆయా కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీసు బందోబస్తుతో పాటు, పలు పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండో విడతలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 122 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1294 వార్డులకు గాను ఐదింటికి నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 289 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1000 వార్డులకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికలు జరిగే 122 పంచాయతీలకు 343 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1000 వార్డులకు మొత్తం 2,668 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిబ్బంది, సామగ్రి తరలింపునకు 100 బస్సులు... రెండో విడత ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని తరలించేందుకు 100 బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో 75 పెద్ద బస్సులు, 25 మినీ బస్సులు ఉన్నాయి. శుక్రవారం ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి ఈ బస్సుల్లోనే సిబ్బంది, సామగ్రిని గమ్యస్థానాలకు చేరుస్తారు. కాగా, రెండో విడత ఎన్నికల విధులకు 3,423 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఆర్వోలు 43 మంది, ఆర్వో– 1, 43 మంది, ఏఆర్వోలు 156, పీవోలు 1,423, ఓపిఓలు 1,657 మంది ఉన్నారు. వీరితో పాటు రూట్ ఆఫీసర్లు 77 మంది, జోనల్ ఆఫీసర్లను 25 మందిని కేటాయించారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం 4లక్షల బ్యాలెట్ పత్రాలు, 1,455 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్ రెండో విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. రెండో విడత ఎన్నికలకు పోలింగ్ సామగ్రిని తరలించే సింగరేణి పాఠశాల కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 7 మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయా మండలాల అధికారులకు సూచించారు. తొలి విడత ఎన్నికల సమయంలో అక్కడక్కడా కొంతమంది సిబ్బంది ఇబ్బంది పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులకు భోజనాలతో పాటు ఇతర సౌకర్యాలను స్థానిక మండల అధికారులు ముందుగానే సమకూర్చాలని ఆదేశించారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలను విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జేసీ వెంకటేశ్వర్లు, డీపీఓ ఆశాలత, ఎన్నికల విభాగం అధికారులు ముత్యాల పులిరాజు, కోటయ్య, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, చుంచుపల్లి తహసీల్దార్ నాగుబాయి ఉన్నారు. -
నేడే పోలింగ్
కొండమల్లేపల్లి(దేవరకొండ) : దేవరకొండ డివిజన్లో నేడు జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఆలోపు లైన్లో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కొద్దిసేపు విరామం తర్వాత లెక్కింపు చేపడుతారు. డివిజన్ పరిధిలోని పది మండలాల్లోని 252 గ్రామపంచాయతీలు, 1919 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ పరిధిలోని మొత్తం 304 గ్రామపంచాయతీలకు గాను 52 పంచాయతీలు, 2572 వార్డులకు గాను 650 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 252 గ్రామపంచాయతీలు 1919 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ స్టేషన్లకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ(డిస్ట్రిబ్యూషన్ సెంటర్) నుంచి బ్యాలెట్ బాక్స్‌లు, సిరా, స్వస్తిక్ స్టాంపులతో పాటు ఎన్నికల సామగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన వాహనాల్లో ఆయా పంచాయతీలకు ఆదివారం బయల్దేరి వెళ్లారు. దేవరకొండ డివిజన్ పరిధిలో 106 రూట్లను ఏర్పాటు చేయడంతో పాటు 2174 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందుకు గాను స్టేజ్–1, స్టేజ్–2, పీఓ, ఏపీఓలతో పాటు పాటు సుమారుగా 5వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు ఆర్డీఓ లింగ్యానాయక్ తెలిపారు. డీఆర్సీ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు డివిజన్ పరిధిలోని పది మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డిలు వేర్వేరుగా పరిశీలించారు. చింతపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లోని డీఆర్సీ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు చిరంజీవులు పరిశీలించి ఎన్నికలు సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పీఏపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. దేవరకొండ డీఆర్సీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ బందోబస్తు మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఒక అడిషనల్ ఎస్పీ, 8మంది డీఎస్పీలు, సీఐలు–28మంది, ఎస్ఐలు–75మందితో పాటు 13 ప్లాటూన్ల ప్రత్యేక బలగాలను కేటాయించారు. మొత్తంగా సుమారు 2600 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. డివిజన్ పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామపంచాయతీలను గుర్తించి వెబ్ కాస్టింగ్, ప్రత్యేక పోలీసులను మోహరించనున్నారు. డివిజన్ పరిధిలో 73 సమస్యాత్మక, 29 అతి సమస్యాత్మక గ్రామాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేసి దేవరకొండలోని డీఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. దీంతో నిరంతర పర్యవేక్షణ ఉండనుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో 10 మంది వరకు పోలీసుల చేత నిఘా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు 105 రూట్లలో మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి ఎక్కడ గొడవలు జరిగినా 10 నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అటు పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మద్యం షాపుల బంద్ పంచాయతీ ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లో మద్యం షాపులు బంద్ చేయించారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మద్యం షాపులు తెరవరు. ప్రధానంగా గతంలో దేవరకొండ డివిజన్లో చందంపేట, డిండి, తదితర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా గొడవలు చోటు చేసుకున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించేందుకువెబ్ కాస్టింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దేవరకొండ డీఆర్సీ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకెళ్తున్న సిబ్బంది, విధులకు వెళ్తున్న పోలీసులు -
తొలిపోరుకు సర్వంసిద్ధం
తొలివిడత పంచాయతీ సమరానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. మొదటి విడతగా ఐదు మండలాలు కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని 93 గ్రామాలు, 728వార్డులకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2556 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ : చొప్పదండి మండలంలోని 15 గ్రామపంచాయతీలు, గంగాధర మండలంలో 33, కరీంనగర్‌రూరల్ మండలంలో 17, కొత్తపల్లి మండలంలోని 8, రామడుగు మండలంలోని 21 గ్రామపంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. మొదటి విడత ఎన్నికల నిర్వహణకు 928 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడంతోపాటు అవసరమయ్యే సామగ్రిని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్‌పేపర్లను సిబ్బందికి అందించారు. జిల్లావ్యాప్తంగా 146 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 113 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలతో ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు. ఎన్నికల విధుల్లో 922 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1236 మంది ఇతర సిబ్బందిని నియమించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఎన్నికల నిర్వహణకు 13 జోన్లు, 40 రూట్లను ఏర్పాటు చేసి ఒక్కో అధికారిని నియమించారు. అదనంగా చెక్‌పోస్టులు, ఫ్లైయింగ్ స్క్యాడ్‌లను నియమించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో కలెక్టర్‌తోపాటు పంచాయతీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు భారతిలక్పతినాయక్ ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే కరీంనగర్, కొత్తపల్లి మండలాల ఎన్నికల సామగ్రిని సిబ్బందికి ఆదివారం మధ్యాహ్నం నుంచే అందజేశారు. రేకుర్తి లయోలా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు భారతి లక్పతినాయక్ సందర్శించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ పేపర్, వెబ్‌క్యాస్టింగ్ సామగ్రిని పరిశీలించారు. ఆమెవెంట జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ మనోజ్‌కుమార్, కరీంనగర్ మండల ప్రజాఅభివృద్ధి అధికారి పవన్, విస్తరణ అధికారి జగన్మోహన్రెడ్డి, తదితరులు ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అందజేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించాం. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. – డీపీవో మనోజ్‌కుమార్ -
సర్వం సిద్ధం..
సాక్షి, వరంగల్ రూరల్: పంచాయతీ పోరు తొలిదశ ప్రారంభమైంది. రెండో రోజు నామినేషన్ల స్వీకరణ సైతం పూర్తయింది. ఎన్నికల అధికారులు పంచాయతీలు, వార్డులు వారీగా ఎన్నికల సామగ్రిని సైతం సిద్ధం చేశారు. క్లస్టర్ల వారీగా బ్యాలెట్ పత్రాలను సైతం ముద్రించారు. మూడు దశల్లోనూ ఎలాంటి అవకతవకలు రాకుండా జిల్లా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో 4, 66, 077 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 401 గ్రామ పంచాయతీలు, 3544 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి విడతలో జరగనున్న గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ సైతం సాగుతోంది. తొలివిడతలో నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో 145 గ్రామ పంచాయతీలు, 1264 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ నేటి (9వతేదీతో)ముగియనుంది. ఈ నెల 21న తొలి విడత పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 10.20 లక్షల బ్యాలెట్ పేపర్లు.. జిల్లాలో మూడు విడతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 10,20,200 బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. సర్పంచ్‌కు 5,02,200, వార్డు మెంబర్‌కు 5,18, 000లు బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు రెండు గుర్తులు, నోటాతో కూడిన బ్యాలెట్ పేపర్ నుంచి ముద్రించారు. సర్పంచ్ ఎన్నికల్లో 9 గుర్తులు, నోటాతో కూడిన బ్యాలెట్ పేపర్ల వరకు, వార్డు మెంబర్లకు ఏడు గుర్తులు, నోటాతో కూడిన బ్యాలెట్ వరకు ముద్రించి అందుబాటులో ఉంచారు. 4335 బ్యాలెట్ బాక్సులు రెడీ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 4335 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. వాస్తవానికి జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న 401 గ్రామ పంచాయతీల పరిధిలోని 3544 వార్డులకు గాను వార్డుకొక బ్యాలెట్ బాక్స్ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా మరో 390 బ్యాలెట్ బాక్సులు రిజర్వ్‌లో ఉంచారు. 1,558 వార్డులో 100 మంది లోపు ఓటర్లు జిల్లాలో 4,66,077 మంది పంచాయతీ ఓటర్లుండగా అందులో 100 మంది ఓటర్లలోపు 1558 వార్డులున్నాయి. 101 నుంచి 400 వరకు ఓటర్లు ఉన్న వార్డులు 1980 వార్డులున్నాయి. 401 నుంచి పైన ఓటర్లు ఉన్న వార్డులు 16 మాత్రమే ఉన్నాయి. వార్డుల్లో తక్కువగా ఓటర్లు ఉండడంతో ప్రతి ఓటు పోటీలో నిలబడిన అభ్యర్థికి కీలకం కానుంది. దీంతో ఓటర్లకు డిమాండ్ పెరగనుంది. -
కసరత్తు పూర్తి
పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. పంచాయతీ, వార్డుల రిజర్వేషన్లు శనివారం ప్రకటించనున్నారు. రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం పంచాయతీ రిజర్వేషన్లపై కసరత్తు చేస్తోంది. కలెక్టర్ ధర్మారెడ్డి శుక్రవారం ఉదయం డీపీఓ, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీ, వార్డు రిజర్వేషన్ల కోటాను ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన మండల యూనిట్‌గా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీలవారీగా ఖరారు చేసిన రిజర్వేషన్ల కోటాను మండలాలవారీగా కలెక్టర్ ముగ్గురు ఆర్డీఓలకు అందజేశారు. సాక్షి, మెదక్ : మండల కోటాను అందుకున్న ఆర్డీఓలు శుక్రవారం మధ్యాహ్నం వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 469 పంచాయతీల్లో 4086 వార్డులు ఉన్నాయి. మెదక్ ఆర్డీఓ వీరబ్రహ్మచారి డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలతో సమావేశమై వార్డుల రిజర్వేషన్లను చేపట్టారు. రిజర్వేషన్ కోటాను అనుసరించి వార్డు రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే 2011 జనాభా ఆధారంగా మెదక్ డివిజన్ పరి«ధిలోని పది మండలాల్లో ఉన్న 231 పంచాయతీల సర్పంచ్ల రిజర్వేషన్లను పూర్తి చేశారు. రాత్రి 9 గంటల వరకు సర్పంచ్ల రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగింది. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని 140 పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓ వెంకటేశ్వర్లు చేపట్టారు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు రిజర్వేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. తూప్రాన్‌డివిజన్ పరిధిలోని 98 పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను ఆర్డీఓ శ్యాం ప్రకాశ్ పర్యవేక్షణలో అధికారులు చేపట్టారు. వార్డు, పంచాయతీ రిజర్వేషన్లు పూర్తి చేసిన వెంటనే మండలాల వారిగా వివరాలను ఆర్డీఓలు కలెక్టర్‌కు అందజేశారు. అలాగే ఎంపీడీఓలు రిజర్వేషన్ జాబితాలను డీపీఓలకు పంపారు. ఆర్డీఓల నుంచి వచ్చిన రిజర్వేషన్ల జాబితాను కలెక్టర్ ధర్మారెడ్డి శనివారం పరిశీలించనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్డీఓలు రిజర్వేషన్లు చేపట్టింది, లేనిదీ పరిశీలించి ఆ తర్వాత రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించనున్నారు. రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఆసక్తి ఉన్న నాయకులు రిజర్వేషన్ల వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్లపై కొంత మందినాయకులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
‘పంచాయతీ’కి రెడీ
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల నగారా త్వరలో మోగనుందా..? హైకోర్టు ఆదేశాల ప్రకారం వచ్చే జనవరి 10లోగా ఎన్నికల నిర్వహణ పూర్తి కానుందా.? ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు ఎన్నికల సంఘం వేగంగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైన ఎన్నికలకు సిద్ధమని పంచాయతీరాజ్ శాఖ ఇది వరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8లోగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జనవరిలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, బీసీ ఓటర్ల గణన, ఫొటో ఓటర్ల జాబితాను పూర్తి చేసి స్థానిక పోరుకు సిద్ధంగా ఉంచారు. రెండు రోజుల క్రితం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చిన యంత్రాంగం తాజాగా స్టేజ్–2 అధికారుల శిక్షణ కూడా పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా రెడీ అయింది. కాగా, రిజర్వేషన్లలో బీసీలకు 23.81 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం ఖరారు చేయాలని కలెక్టర్లకు, డీపీవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు సిద్ధం పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి. గత జూన్‌లో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామనడంతో కలెక్టరేట్లోని స్టోరేజ్ రూంలో ఉన్న బ్యాలెట్ బాక్సులను బయటకు తీసి దుమ్ముదులిపేశారు. మన జిల్లాలో సరిపడా బాక్సులు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి తెప్పించారు. వీటన్నింటీని ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో గల గోదాములో భద్రంగా దాచారు. అక్కడ బాక్సులకు రంగులు వేయడం, తుప్పు పట్టిన, రంధ్రాలు పడిన బాక్సులను రిపేరు చేసి సిద్ధం చేశారు. అయితే జిల్లాలో ప్రస్తుతం 6,636 బ్యాలెట్ బాక్సులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాల్లో కలిపి 467 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,822 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు ఒక్కో బాక్సు చొప్పున 3,822 బాక్సులు అవసరం అవుతాయి. సర్పంచ్ స్థానానికి ఒకటి చొప్పున మరో 467 బాక్సులు అవసరమనుకున్న సరిపడేంత సిద్ధంగా ఉంచారు. కాగా, ఇది వరకే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి అయింది. రెండు కలర్లో ఉన్న బ్యాలెట్ పేపర్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో గల స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. అధికారులకు శిక్షణ పూర్తి.. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 500 మంది (స్టేజ్–2) రిటర్నింగ్ అధికారులు నియామకం అయినట్లు పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, 465 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. స్టేజ్–2 అధికారులు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. ఒక్కో పంచాయతీకి ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు. కాగా, స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులు క్లస్టర్‌కు ఒకరు చొప్పున ఎన్నికల విధులు నిర్వర్తించగా, స్టేజ్–2 అధికారులు పంచాయతీకి ఒకరు లేదా ఇద్దరు చొప్పున బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే ఒక్కో క్లస్టర్‌కు తొమ్మిది లేదా 11 మంది రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. స్టేజ్–1 అధికారులకు ఇది వరకే శిక్షణ ఇవ్వగా, స్టేజ్–2 అధికారులకు శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా కొత్తగా నియామకమైన సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణకు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. శిక్షణలో ఎన్నికల విధులు, బాధ్యతలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా, నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఫలితాలు తేలే వరకు ఈ అధికారులు కీలకపాత్ర పోషించనున్నారు. -
చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
రణస్థలం/లావేరు/శ్రీకాకుళం క్రైం/శ్రీకాకు ళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రణస్థలం మండలంలోని పతివాడపాలెం, నెలివాడ, దేరసాం గ్రామా ల్లో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాం గం పూర్తి చేసింది. సభాస్థలి, హెలిప్యాడ్లను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏఎస్ ఖాన్, ఎచ్చె ర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావులు బుధవారం పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎప్పీ ఖాన్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. సీఎం చంద్రబాబు హెలికాప్టర్ దిగే ప్రదేశం పతివాడపాలెం నుంచి నెలివాడ, దేరసాం గ్రామాల్లో పర్యటించే రోడ్లను, ప్రదేశాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని డాక్స్క్యాడ్, బాంబుస్వాడ్లతో తని ఖీలు చేపట్టారు. నెలివాడలో జరిగే సభకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు జనాల తరలింపునకు సన్నాహాలు పూర్తిచేశారు. దేరసాంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న వీకేటీ ఫార్మా పరిశ్రమలోని ఏర్పాట్లు, పరిశ్రల యాజమాన్యులతో జరగనున్న సమావేశ ప్రాంగణాన్ని అధికారులు పరిశీలించారు. పోలీసులందరూ సీఎం బందోబస్తుకే.. సీఎం పర్యటనకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు ఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 150 మంది ఏస్సైలను నియమించారు. అలాగే, 260 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, వెయ్యిమంది పోలీస్ కానిస్టేబుళ్లు, 140 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, 550 మంది హోంగార్డులను నియమించారు. వీరితో పాటు 10 స్పెషల్‌పార్టీలు, రోప్‌పార్టీ, ఏఆర్ బెటాలియన్ కూడా సిద్ధం చేశారు. జనాల తరలింపునకు 150 ఆర్టీసీ బస్సులు రణస్థలం మండలం నెలివాడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జనాల తరలింపు కోసం జిల్లాలోని ఐదు ఆర్టీసీ డిపోల నుంచి 150 బస్సులను కేటాయించారు. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజే సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లనుంది. జిల్లాలో 480 ఆర్టీసీ బస్సులే ఉన్నాయి. వీటిలో 150 తగ్గిపోతే అధిక రూట్ల సర్వీసులను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలు, పాలకొండ, టెక్కలి, పలాస డిపోల పరిధిలో గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందే సూచనలు కనిపిం చడం లేదు. బస్సులు తరలింపుతో మరింత నష్టాల్లో పడే అవకాశం ఉందని ఆర్టీసీ యూని యన్ నాయకులే పెదవి విరుస్తున్నారు.