చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
రణస్థలం/లావేరు/శ్రీకాకుళం క్రైం/శ్రీకాకు ళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రణస్థలం మండలంలోని పతివాడపాలెం, నెలివాడ, దేరసాం గ్రామా ల్లో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాం గం పూర్తి చేసింది. సభాస్థలి, హెలిప్యాడ్‌లను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏఎస్ ఖాన్, ఎచ్చె ర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావులు బుధవారం పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎప్పీ ఖాన్ పోలీసు సిబ్బందికి ఆదేశించారు. సీఎం చంద్రబాబు హెలికాప్టర్ దిగే ప్రదేశం పతివాడపాలెం నుంచి నెలివాడ, దేరసాం గ్రామాల్లో పర్యటించే రోడ్లను, ప్రదేశాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని డాక్‌స్క్యాడ్, బాంబుస్వాడ్‌లతో తని ఖీలు చేపట్టారు. నెలివాడలో జరిగే సభకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు జనాల తరలింపునకు సన్నాహాలు పూర్తిచేశారు. దేరసాంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న వీకేటీ ఫార్మా పరిశ్రమలోని ఏర్పాట్లు, పరిశ్రల యాజమాన్యులతో జరగనున్న సమావేశ ప్రాంగణాన్ని అధికారులు పరిశీలించారు.
పోలీసులందరూ సీఎం బందోబస్తుకే..
సీఎం పర్యటనకు జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు ఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 150 మంది ఏస్సైలను నియమించారు. అలాగే, 260 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, వెయ్యిమంది పోలీస్ కానిస్టేబుళ్లు, 140 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, 550 మంది హోంగార్డులను నియమించారు. వీరితో పాటు 10 స్పెషల్‌పార్టీలు, రోప్‌పార్టీ, ఏఆర్ బెటాలియన్ కూడా సిద్ధం చేశారు.
జనాల తరలింపునకు
150 ఆర్టీసీ బస్సులు
రణస్థలం మండలం నెలివాడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జనాల తరలింపు కోసం జిల్లాలోని ఐదు ఆర్టీసీ డిపోల నుంచి 150 బస్సులను కేటాయించారు. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజే సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లనుంది. జిల్లాలో 480 ఆర్టీసీ బస్సులే ఉన్నాయి. వీటిలో 150 తగ్గిపోతే అధిక రూట్ల సర్వీసులను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలు, పాలకొండ, టెక్కలి, పలాస డిపోల పరిధిలో గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందే సూచనలు కనిపిం చడం లేదు. బస్సులు తరలింపుతో మరింత నష్టాల్లో పడే అవకాశం ఉందని ఆర్టీసీ యూని యన్ నాయకులే పెదవి విరుస్తున్నారు.