
నేడు జిల్లాలో చంద్రబాబు పర్యటన
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్‌కి సమాచారం చేరింది. అయితే చంద్రబాబు ఏ మండల్లాలో పర్యటన చేస్తారు, ఎంతకు చేరుకుంటారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.