సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు
పలాస: ఈనెల 10న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనుండడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పలాస ప్రభుత్వ జూని యర్ కళాశాల క్రీడా మైదానంలో జన్మభూమి గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏఎస్ ఖాన్, ఇతర అధికారులు పరి శీలించారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ గ్రౌండ్‌లో హెలీప్యాడ్ ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్‌లో వచ్చిన చంద్రబాబు కాశీబుగ్గ కేటీ రోడ్డు మీదుగా రోడ్డు మార్గంలో పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతారు. మొగిలిపాడు బ్రిడ్జి వద్ద వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.దేవప్రసాద్, ఐటీడీఏ పీవో ఎన్.సత్యనారాయణ, మెప్మా పీడీ ఎం.సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకాధికారి జె.మోహన్‌రావు, జిల్లా రవాణ శాఖాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఈవో ఎస్.అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
లోపాలుండకూడదు
ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో అధికారులు నిర్వహించాల్సిన విధివిధానాల గూర్చి వివరించారు. స్టాల్స్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ శాఖల వారీగా వేర్వేరుగా ఉండాలన్నారు. ఉదయం 6 గం టలకే అధికారులందరు అక్కడకు హాజ రుకావాలని, వారి వారి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.రామిరెడ్డి మాట్లాడుతూ జనధనయోజన పథకం గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎస్‌వో ఆనంద్‌కుమార్, డీఎంహెచ్‌వో ఆర్.గీతాంజలి, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారిణి ఎం.సునీల పాల్గొన్నారు.
సారవకోటలో ఏర్పాట్ల పరిశీలన
సారవకోట రూరల్(జలుమూరు): మండలంలోని చల్లవానిపేటలో ఈ నెల 10న జన్మభూమి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానుండడంతో మంగళవారం కలెక్టర్ గౌర్ ఉప్పల్ స్థల పరిశీలన చేశారు. తిలారు రైల్వే గేటు సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు, చల్లవానిపేట గ్రామంలోని శివాలయం సమీపంలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సమావేశ నిర్వహణ, వాహనాలు నిలిపేందుకు, ఇతర వసతులను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా 11 స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. తిలారు నుంచి చల్లవానిపేట గ్రామానికి మధ్యలో రాణ సమీపంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ తనుజారాణి, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, డీపీఆర్‌వో రమేష్, ఆత్మా పీడీ రామారావు, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, స్ధానిక ఎంపీడీఓ వాసుదేవరావు, తహశీల్దార్ ఉమామహేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.