సాక్షి, అహ్మదాబాద్: వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న నేపథ్యంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఈ నెల 24 రోడ్ షోలో పాల్గొన్న అనంతరం.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు. ఆ తరువాత అహ్మదాబాద్‌లోని మొతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంను ట్రంప్–మోదీలు ఇద్దరూ కలిసి ఆవిష్కరిస్తారు.
ఇందుకోసం అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. 10,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించనున్నారు. సిబ్బంది మొత్తం 25 మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది ఇన్‌స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని డీసీపీ విజయ్ పటేల్ వెల్లడించారు. ఈ భద్రతే కాకుండా వీటికి అదనంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు చెందిన భద్రతా దళాలు కూడా విధులు నిర్వహించనున్నాయి.
చదవండి: భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ
అధ్యక్షుడికి అదిరిపోయే ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment