వారి పర్యటనకు 9000 మంది పోలీసుల పహారా | Modi-Abe summit: 9,000 cops to keep vigil in Ahmedabad on Wednesday | Sakshi
Sakshi News home page

వారి పర్యటనకు 9000 మంది పోలీసుల పహారా

Published Tue, Sep 12 2017 8:31 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

వారి పర్యటనకు 9000 మంది పోలీసుల పహారా - Sakshi

వారి పర్యటనకు 9000 మంది పోలీసుల పహారా

ప్రదాని నరేం‍ద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే రెండు రోజుల పర్యటన కోసం అహ్మదాబాద్‌ నగరంలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో 9000 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

సాక్షి,అహ్మదాబాద్‌: ప్రదాని నరేం‍ద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే రెండు రోజుల పర్యటన కోసం అహ్మదాబాద్‌ నగరంలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో 9000 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఇరువురు నేతలు ఇండో-జపాన్‌ వార్షిక సదస్సు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.మోదీ, షింజే అబే సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 
 
భద్రతా ఏర్పాట్ల కోసం నగరంలోని పోలీస్‌ సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల నుంచీ పోలీసులను రప్పించినట్టు డీసీపీ బలరామ్‌ మీనా చెప్పారు. రాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్‌ స్క్వాడ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను రప్పించామని, ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందాన్ని పంపాలని కూడా కేంద్ర హోంశాఖను కోరామని తెలిపారు. బుధవారం మోదీ, అబే పాల్గొనే రోడ్‌షోకు సంబంధించి రిహార్సల్స్‌ నిర్వహించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement