జంట నగరాల్లో గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్ సమీక్షీంచారు.
హైదరాబాద్: జంట నగరాల్లో గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్ సమీక్షీంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె మహంతి, డిజిపి దినేష్ రెడ్డి, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగరంలో శాంతిభద్రతలపై చర్చించారు. అంతకు ముందు సీఎస్తో దినేష్ రెడ్డి, ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈనెల 9న గణేష్ చతుర్థి సందర్భంగా తీసుకోవల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.