
ఇంద్రకీలాద్రిపై భద్రతను పర్యవేక్షించిన సీపీ
విజయవాడ : మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించ వలసి వచ్చిందని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లను గౌతం సవాంగ్ పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ రోజు అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. అందులోభాగంగా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ గౌతం సవాంగ్ వివరించారు.