21 నుంచి మరోవిడత దోస్త్‌ కౌన్సెలింగ్‌ | Another phase of Dost Counseling from September 21 | Sakshi
Sakshi News home page

21 నుంచి మరోవిడత దోస్త్‌ కౌన్సెలింగ్‌

Published Sun, Sep 17 2023 1:27 AM | Last Updated on Sun, Sep 17 2023 1:27 AM

Another phase of Dost Counseling from September 21 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దోస్త్‌ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు.

ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్‌ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement