spot admission
-
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లకు తగ్గిన స్పందన
పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి సోమవారం నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. స్పాట్ అడ్మిషన్లలో సీటు పొందినవారికి ఎటువంటి ఫీజు రాయితీ ఇవ్వనందున చాలా మంది ఆసక్తి చూపలేకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెటలర్జీలో 25, సివిల్‌లో 8 సీట్లు మిగిలిపోగా ఎలక్ట్రికల్‌లో సోమవారం ఒక సీటు ఖాళీ అయ్యింది. మొత్తం 34 సీట్ల కోసం 50 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో కౌన్సెలింగ్ సమయానికి 36 మంది మిగిలారు. మిగతావారు ఇప్పటికే ఇతర కాలేజీల్లో చేరి చదువుతూ స్పాట్ అడ్మిషన్‌కు వచ్చారు. వీరు ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపలేకపోయారు. దీంతో వీరి దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మొత్తం 24 సీట్లు భర్తీ అయ్యాయి. మెటలర్జీ విభాగంలో 10 సీట్లు మిగిలిపోయాయని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డి.ఫణీంద్రప్రసాద్ చెప్పారు. ఎలక్ట్రికల్ బ్రాంచిలో చేరిన విద్యార్థికి ట్రిపుల్ ఐటీ సీటు రావడంతో ఖాళీ అయ్యింది. దీన్ని సోమవారం భర్తీ చేశారు. నలుగురు విద్యార్థులు పాలిసెట్ రాయకుండా నేరుగా పదో తరగతి అర్హతతోనే మెటలర్జీలో చేరారు. కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో.. కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్న 19 సీట్లలో ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్‌లో 14, ఆయిల్ టెక్నాలజీలో 5 సీట్లు భర్తీ చేశారు. ఇక్కడ చేరినవారందరూ పాలిసెట్ ర్యాంకుల పొందినవారే కావడం విశేషం. ఎస్టీ అభ్యర్థి ఒక్కరు మాత్రమే పదో తరగతి ద్వారా సీటు పొంది ఆయిల్ టెక్నాలజీలో కోర్సులో చేరాడు. ఇక్కడ 27 మంది రిజిస్ట్రేషను చేసుకోగా 21 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు చెప్పారు. -
పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
సీతంపేట: ఈ విద్యా సంవత్సరానికి గాను స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ బీఎస్ఆర్ నాయుడు తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి ్ట్టఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతో రూ.4400 ఫీజు తీసుకుని ఈనెల 25న పాలిటెక్నిక్ కళాశాలకు రావాలన్నారు. స్పాట్ అడ్మిషన్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదన్నారు. -
ఓయూ దూరవిద్య బీఈడీలో 86 సీట్లు మిగులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా వర్సిటీ దూరవిద్య బీఈడీ (డిస్టెన్స్ మోడ్) కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత ఇంకా 86 సీట్లు మిగిలి నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్ తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన ఆసక్తి గల ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నాలుగు రోజుల్లో మిగిలిన సీట్లలో చేరవచ్చన్నారు. పూర్తి వివరాలకు 9440567567 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.