పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లకు తగ్గిన స్పందన
Published Mon, Jul 25 2016 9:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి సోమవారం నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. స్పాట్ అడ్మిషన్లలో సీటు పొందినవారికి ఎటువంటి ఫీజు రాయితీ ఇవ్వనందున చాలా మంది ఆసక్తి చూపలేకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెటలర్జీలో 25, సివిల్‌లో 8 సీట్లు మిగిలిపోగా ఎలక్ట్రికల్‌లో సోమవారం ఒక సీటు ఖాళీ అయ్యింది. మొత్తం 34 సీట్ల కోసం 50 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో కౌన్సెలింగ్ సమయానికి 36 మంది మిగిలారు. మిగతావారు ఇప్పటికే ఇతర కాలేజీల్లో చేరి చదువుతూ స్పాట్ అడ్మిషన్‌కు వచ్చారు. వీరు ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపలేకపోయారు. దీంతో వీరి దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మొత్తం 24 సీట్లు భర్తీ అయ్యాయి. మెటలర్జీ విభాగంలో 10 సీట్లు మిగిలిపోయాయని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డి.ఫణీంద్రప్రసాద్ చెప్పారు. ఎలక్ట్రికల్ బ్రాంచిలో చేరిన విద్యార్థికి ట్రిపుల్ ఐటీ సీటు రావడంతో ఖాళీ అయ్యింది. దీన్ని సోమవారం భర్తీ చేశారు. నలుగురు విద్యార్థులు పాలిసెట్ రాయకుండా నేరుగా పదో తరగతి అర్హతతోనే మెటలర్జీలో చేరారు.
కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో..
కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్న 19 సీట్లలో ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్‌లో 14, ఆయిల్ టెక్నాలజీలో 5 సీట్లు భర్తీ చేశారు. ఇక్కడ చేరినవారందరూ పాలిసెట్ ర్యాంకుల పొందినవారే కావడం విశేషం. ఎస్టీ అభ్యర్థి ఒక్కరు మాత్రమే పదో తరగతి ద్వారా సీటు పొంది ఆయిల్ టెక్నాలజీలో కోర్సులో చేరాడు. ఇక్కడ 27 మంది రిజిస్ట్రేషను చేసుకోగా 21 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు చెప్పారు.
Advertisement
Advertisement