Paliset
-
మనటీవీలో పాలీసెట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: పాలీసెట్ విద్యార్థుల కోసం మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు శిక్షణ తరగతులను ప్రసారం చేయనున్నామని మన టీవీ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 23 రోజుల పాటు పాలీసెట్ శిక్షణ తరగతుల ప్రసారాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రసారాలు మన టీవీ–1, మన టీవీ–2 చానళ్లతో పాటు మన టీవీ ఫేస్బుక్, వాట్సాప్, ట్వీట్టర్ ఖాతాల్లో కూడా అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లకు తగ్గిన స్పందన
పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి సోమవారం నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. స్పాట్ అడ్మిషన్లలో సీటు పొందినవారికి ఎటువంటి ఫీజు రాయితీ ఇవ్వనందున చాలా మంది ఆసక్తి చూపలేకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెటలర్జీలో 25, సివిల్‌లో 8 సీట్లు మిగిలిపోగా ఎలక్ట్రికల్‌లో సోమవారం ఒక సీటు ఖాళీ అయ్యింది. మొత్తం 34 సీట్ల కోసం 50 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో కౌన్సెలింగ్ సమయానికి 36 మంది మిగిలారు. మిగతావారు ఇప్పటికే ఇతర కాలేజీల్లో చేరి చదువుతూ స్పాట్ అడ్మిషన్‌కు వచ్చారు. వీరు ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపలేకపోయారు. దీంతో వీరి దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మొత్తం 24 సీట్లు భర్తీ అయ్యాయి. మెటలర్జీ విభాగంలో 10 సీట్లు మిగిలిపోయాయని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డి.ఫణీంద్రప్రసాద్ చెప్పారు. ఎలక్ట్రికల్ బ్రాంచిలో చేరిన విద్యార్థికి ట్రిపుల్ ఐటీ సీటు రావడంతో ఖాళీ అయ్యింది. దీన్ని సోమవారం భర్తీ చేశారు. నలుగురు విద్యార్థులు పాలిసెట్ రాయకుండా నేరుగా పదో తరగతి అర్హతతోనే మెటలర్జీలో చేరారు. కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో.. కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్న 19 సీట్లలో ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్‌లో 14, ఆయిల్ టెక్నాలజీలో 5 సీట్లు భర్తీ చేశారు. ఇక్కడ చేరినవారందరూ పాలిసెట్ ర్యాంకుల పొందినవారే కావడం విశేషం. ఎస్టీ అభ్యర్థి ఒక్కరు మాత్రమే పదో తరగతి ద్వారా సీటు పొంది ఆయిల్ టెక్నాలజీలో కోర్సులో చేరాడు. ఇక్కడ 27 మంది రిజిస్ట్రేషను చేసుకోగా 21 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు చెప్పారు. -
14,721 పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
- నోటిఫికేషన్ జారీ.. - ‘స్పాట్’లో చేరే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిపోయిన 14,721 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు పాలిసెట్ ప్రవేశాల కమిటీ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాలేజీల వారీగా ఖాళీల వివరాలను ఈనెల 14న పాలిసెట్ వెబ్సైట్లో (్టటఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ) వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొంది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు విద్యార్థులు 14 నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని, సంబంధిత విద్యా సంస్థల్లో 20వ తేదీన స్పాట్ అడ్మిషన్లను నిర్వహించాలని తెలిపింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 12న తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. స్పాట్ అడ్మిషన్లలో భాగంగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు. కాగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెల్లడి కాకముందే ప్రభుత్వ కౌన్సెలింగ్‌ను ముగించి, స్పాట్ అవకాశం ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారు స్పాట్లో పాలిటెక్నిక్‌లో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు 13 వరకు పెంపు... ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రవేశాల కమిటీ పొడిగించింది. అన్ని ర్యాంకుల వారిలో ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని వారు తాజాగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఆప్షన్లు ఇచ్చుకున్న వారు మార్పులు చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ వెల్లడించింది. అవసరమైతే 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు 16న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 68,186 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 65,297 మంది 32,33,074 వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేపు ఈసెట్ సీట్ల కేటాయింపు పాలిసెట్ చివరి దశ సీట్ల కేటాయింపును ఈనెల 12న ప్రకటించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 16,786 మందిలో 8,703 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు పేర్కొన్నారు. -
పాలిటెక్నిక్‌లలో 13 వేల సీట్లు ఖాళీ!
- ముగిసిన తొలిదశ కౌన్సెలింగ్ - జూలైలో రెండో దశ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో పాలిటెక్నిక్ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో కలిపి మొత్తం 50,632 సీట్లు ఉండగా... 37,467 మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే తమకు కేటాయింపు జరిగిన కాలేజీల్లో ప్రవేశం పొందారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 97.84 శాతం మంది అభ్యర్థులు రిపోర్టు చేయగా, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో చేరింది 66.53 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న రెండు ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో మాత్రం సీట్లు పొందిన వారంతా (100శాతం) చేరారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 13,165 సీట్లు ఖాళీగా మిగిలిపోనున్నాయని అధికార వర్గాల సమాచారం. పాలిసెట్-2016లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సాంకేతిక విద్యా మండలి గత నెల 20 నుంచి నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం 45,644 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అయితే కాలేజీలో చేరేందుకు చివరి రోజైన శనివారం నాటికి 37,467 మంది మాత్రమే ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. వచ్చే నెల రెండో వారంలో.. పాలిసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌ను జూలై రెండో వారంలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిసెట్‌లో ర్యాంకులు పొందిన కొందరు అభ్యర్థులు పదో తరగతిలో ఫెయిల్ కావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయినట్లు అంచనా. జూలై 10గా టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన ్నందున రెండో వారంలో రెండోదశ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో మిగిలిపోయిన సీట్లన్నీ రెండోదశలో భర్తీ అవుతాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఇక సాంకేతిక విద్యామండలి పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీలన్నింటిలో ఈ నెల 9 నుంచే తరగతులు ప్రారంభమైనట్లు కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. -
ముగిసిన పాలిసెట్ కౌన్సెలింగ్
► 8రోజుల్లో 3,353 మంది విద్యార్థుల ► ద్రువపత్రాల పరిశీలన ► 30వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ► 31న సవరణలు మమహబూబ్‌నగర్ విద్యావిభాగం/వనపర్తిటౌన్: రాష్ట్ర సాంకేతిక ఉన్నత విద్యామండలి నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 20నుంచి మహబూబ్‌నగర్, వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన పాలిసెట్ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. ఉదయం 9గంటల నుంచి ఐదు గంటలకు వరకు చివరి ర్యాంకు వరకు చేపట్టిన కౌన్సెలింగ్‌లో 75 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్‌లో 3,353మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీ రూ. 250, బీసీ, ఓసీలు రూ. 500 చెల్లించారు. ఎస్సీ, ఎస్టీల ధృవపత్రాలను సాంఘిక సంక్షేమ శాఖ అథికారులు పరిశీలించారు. ఇదివరకు నిర్వహించిన ర్యాంకు కౌన్సెలింగ్‌లో హాజరు కాని విద్యార్థులకు సైతం కౌన్సెలింగ్‌కు హాజరైయ్యారు. 30 వరకు వెబ్ ఆప్షన్లు కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో, కోర్సుల ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 30న ముగియనుంది. ఈ లోపు విద్యార్థులు తమ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉందని సాలిసెట్ కన్వీనర్ రవికాంత్‌రెడ్డి తెలిపారు. వెబ్ ఆప్షన్ల్లో మార్పులు, చేర్పులకు ఈ నెల 31న అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. -
ఒకేషనల్ అభ్యర్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చని సాంకేతిక విద్యాశాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని sbtet.telangana.gov.in, dtets.cgg.gov.in వెబ్సైట్ల నుంచి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. పాలిసెట్ వెరిఫికేషన్‌కు హాజరుకండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి ప్రారంభం అయ్యే పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యా శాఖ తెలిపింది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు 1,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విద్యార్థుల ఫలితాలు ఈ నెల 27 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వారికి పదో తరగతి మోమోలు రాలేదు. దీంతో విద్యార్థులు మిగతా సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే జూన్ 1న సీట్ల కేటాయింపునకు ముందు పదో తరగతి మెమోలను అందజేస్తే సరిపోతుందని తెలిపారు. -
నేడు పాలీసెట్
♦ యథావిధిగా పరీక్ష నిర్వహణకు సహకరిస్తామన్న యాజమాన్యాలు ♦ హాజరుకానున్న అభ్యర్థులు 1,27,951 మంది ♦ గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి ♦ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ♦ 10 రోజుల్లో ఫలితాలు.. మేలో కౌన్సెలింగ్.. జూన్ 9 నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా గురువారం (ఈనెల 21న) జరగనుంది. పరీక్ష నిర్వహణకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ముందుకు వచ్చాయని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. హైదరాబాద్ సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 54 వేల సీట్ల భర్తీకి పాలిసెట్‌ను నిర్వహిస్తున్నామని... 1,27,951 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ప్రైవేటు కాలేజీల్లో 209, ప్రభుత్వ కాలేజీల్లో 79 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష గురువారం ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని.. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష హాల్లోకి వెళ్లాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లవద్దని సూచించారు. పది రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రవేశాల జాప్యంతో 50% డ్రాపవుట్స్ ఏటా పాలిటెక్నిక్ ప్రవేశాలు ఆలస్యం అవుతుండటం వల్ల గ్రామీణ విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని... 40 శాతం నుంచి 50 శాతం వరకు డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్నారని ఎంవీ రెడ్డి వివరించారు. దీంతో ఈసారి పాలీసెట్‌ను అన్నింటికంటే ముందుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు తాత్కాలిక షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేశామని.. వచ్చే నెల చివరి రెండు వారాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 9వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని, ఆలోగా కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. చేర్యాల, సాగర్‌లలో కొత్త కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో చేర్యాల, నాగార్జునసాగర్‌లలో రెండు కొత్త కాలేజీలను ప్రారంభించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చిందని ఎంవీ రెడ్డి వెల్లడించారు. ఒక్కో కాలేజీలో రెండు బ్రాంచీల్లో కలిపి 240 చొప్పున సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక సికింద్రాబాద్, హుస్నాబాద్‌లలో భవన నిర్మాణాలు పూర్తి కానందున ఏఐసీటీఈ అనుమతి రాలేదన్నారు. -
ఏప్రిల్ 24న పాలిసెట్
♦ జూన్ 9 కల్లా విద్యా సంవత్సరం ప్రారంభం ♦ సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జరుగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం పాలిసెట్ కమిటీ సమావేశమై సమీక్షించింది. సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ప్రవేశాల కౌన్సెలింగ్ తదితర అంశాలపై చర్చించారు. గతేడాది దాదాపు 52 వేలకుపైగా పాలిటెక్నిక్ సీట్లకు లక్ష మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అంతకంటే ఎక్కువగా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. మొత్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ ప్రవేశాలను జూన్ 9లోగా పూర్తి చేయాలని.. ఆ రోజు నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పాలిసెట్ కమిటీని ఎంవీ రెడ్డి ఆదేశించారు. అలాగే ఈ సమావేశంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌లలో మార్పులు, ఇందుకు ఏర్పాటు చేసే కమిటీలో పరిశ్రమలకు ప్రాతినిధ్యం కల్పించడంపైనా చర్చించారు. అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు అవసరమయ్యే సబ్జెక్టులను ఉంచేసి... అంతగా అవసరం లేని సబ్జెక్టులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పదో తరగతి సిలబస్‌ను చూసి, అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇక పాలిటెక్నిక్‌లలో పాలిసెట్ ప్రాస్పెక్టస్, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వెబ్సైట్ తదితర సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్య జాయింట్ డెరైక్టర్ యూవీఎస్ఎన్ మూర్తి, ఎస్బీటీఈటీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
కౌన్సెలింగ్ ర్యాంక్‌ల వివరాలు = 25వ తేదీ: 9 గంటలకు 1వ ర్యాంక్ నుంచి 7,000 వరకు, మధ్యాహ్నం నుంచి 7,001 నుంచి 14,000 వరకు = 26వ తేదీ: ఉదయం 14,001 నుంచి 21,000 వరకు, మధ్యాహ్నం 21,001 నుంచి 28,000 వరకు = 27వ తేదీ: ఉదయం 28,001 నుంచి 35,000 వరకు, మధ్యాహ్నం 42,000 వరకు = 28వ తేదీ: ఉదయం 42,001 నుంచి 49,000 వరకు, మధ్యాహ్నం 49,001 నుంచి 56,000 వరకు = 29వ తేదీ: ఉదయం 56,001 నుంచి 63,000 వరకు, మధ్యాహ్నం 63,001 నుంచి చివరి ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. నంగునూరు/మెదక్ టౌన్: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ మెదక్ జిల్లాలో గురువారం నుంచి ఐదు రోజులపాటు జరుగుతుందని, ఇందుకోసం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్టీ, స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ అభ్యర్థులకు హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ అభ్యర్థులకు ర్యాంక్‌ల ఆధారంగా రాజగోపాల్‌పేటలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు హల్‌టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్సెస్సీ మెమో, టీసీ, 1 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, 2015 జనవరి 1 తర్వాత మీసేవ నుంచి పొందిన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలన్నారు. కౌన్సెలింగ్ అనంతరం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ 300, ఎస్టీలు రూ.150 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. కాగా, జిల్లాలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్టు కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వెబ్ ఆప్షన్ సదుపాయం పాలిసెట్ కౌన్సెలింగ్ పూర్తయిన అభ్యర్థులకు రాజగోపాల్‌పేటలో వెబ్ఆప్షన్ పెట్టుకొనే సదుపాయం కల్పించామని ప్రిన్సిపాల్ తెలిపారు. 28వ తేదీ నుంచి 29 వరకు 1వ ర్యాంక్ నుంచి 35,000 ర్యాంక్ వరకు, 30 నుంచి జూలై 1 వరకు 35,001 నుంచి చివరి ర్యాంక్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చాన్నారు. 2వ తేదీన ఆప్షన్ మార్చుకునే వారి కోసం సదుపాయం కల్పించామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలు, సందేహాలకు 7660009753, 9010222189 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
22 నుంచి పాలీసెట్ కౌన్సెలింగ్
బొమ్మూరు (రాజమండ్రి రూరల్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి పాలీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 22న ప్రారంభమవనుంది. ఈనెల 28 వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 24 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లను ఈనెల 30, జూలై ఒకటి తేదీల్లో మార్చుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటారుుస్తారు. జిల్లాలో బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్, కాకినాడలో ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది. ఎస్టీ విద్యార్ధులు ఆంధ్రా పాలిటెక్నిక్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. వికలాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్, మాజీ సైనికోద్యోగుల పిల్లల సర్టిఫికెట్ పరిశీలనకు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రోసెసింగ్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200, బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.400 ఆయా కేంద్రాల్లో చెల్లించాలని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ విలియం క్యారీ తెలిపారు. కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే.. సర్టిఫికెట్ల పరిశీలనప్పుడు విద్యార్థులు తమ ధ్రువపత్రాల రెండు సెట్ల జిరాక్స్ కాపీలను అందించాలి. ఇందులో పోలిసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్టు, ఎస్ఎస్పీ లేదా తత్సమాన అర్హతలకు సంబంధించిన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ (విద్యాసంస్థల్లో చదవని వారు), 2015 జనవరి ఒకటి తర్వాత జారీ అయిన ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్సు కాపీలను అందించాలి. వికలాంగులు, ప్రత్యేక కేటగిరీల వారు ఆయా ధ్రువపత్రాలను సమర్పించాలి. సర్టిఫికెట్ల పరిశీలన తేదీ= పరిగణించే ర్యాంకులు 22.06.2015= 1 నుంచి 12,500 23.06.2015= 12,501 - 25,000 24.06.2015= 25,001 - 37,500 25.06.2015= 37,501 - 50,000 26.06.2015= 50,001 - 62,500 27.06.2015= 62,501 - 75,000 28.06.2015= 75,001 - చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్ల నమోదు తేదీ= పరిగణించే ర్యాంకులు 24, 25.06.2015= 1 నుంచి 25,000 26, 27.06.2015= 25,001 - 50,000 28, 29.06.2015= 50,001 - చివరి వరకు -
నేడు పాలిసెట్
తొలిసారిగా ఓఎమ్మార్ షీట్ల వినియోగం జిల్లా పరిధిలో విద్యార్థులు 20,334 మంది నిమిషం ఆలస్యమైనాఅనుమతించరు విశాఖపట్నం , న్యూస్‌లైన్ : డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించనున్న పాలిసెట్-2014 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలో 20,334 మంది దీనికి హాజరవుతున్నారు. విశాఖలో 13,740 మంది, జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, భీమిలి కేంద్రాల్లో 6,594 మంది పరీక్ష రాయనున్నారు. తొలిసారిగా ఈ పరీక్షకు ఓఎమ్మార్ షీట్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హాల్ టికెట్లు అందజేశారు. హాల్ టికెట్లు అందని వారికి విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం, పాడేరుల్లోని పాలిటెక్నిక్ కళాశాలల కార్యాలయాల్లో డూప్లికేట్ హాల్ టికెట్లు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. వెబ్సైట్లో నేరుగా హాల్ టికెట్లు పొందడానికి అభ్యర్థులకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. బుక్‌లెట్‌లో పొందుపరిచిన నియమ, నిబంధనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలని పాలిసెట్ కో-ఆర్డినేటర్ కె.సంధ్యారాణి తెలిపారు. సెల్‌ఫోన్, కాలిక్యూలేటర్‌ను కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. -
‘పాలిసెట్’కు ఏర్పాట్లు పూర్తి
21న పరీక్ష నిర్వహణ నిమిషం ఆలస్యమైనా అనుమతించం విద్యార్థులకు పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్ ఉచిత సరఫరా రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ శ్యాంసుందర్‌రెడ్డి రామంతాపూర్, న్యూస్‌లైన్: పాలిటెక్నికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘పాలిసెట్’ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రామంతాపూర్ ప్రభుత్వ జేఎన్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కో ఆర్డినేటర్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పాలిసెట్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను తమ కళాశాల చేపట్టిందన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించరని తెలిపారు. పరీక్ష నిర్వహణకు రామంతాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, ఉప్పల్ పరిధిలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో మొత్తం 7,016 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. పరీక్షకు హాజరయ్యేవారికి పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్ ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను https://apceep.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షా కేంద్రాలు ఇవే.. హబ్సిగూడ: విజ్ఞాన్ జూనియర్ కాలేజీ, ఒమెగా డిగ్రీ కాలేజీ, ఒమెగా జూనియర్ కాలేజీ, నారాయణ జూనియర్ కాలే జీ, సిల్వర్ జూబ్లీ జూనియర్ కాలేజీ, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, ఐఐసీటీ జహీర్ మెమోరియల్ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్ వీధి నంబర్-8 హబ్సిగూడ. రామంతాపూర్: క్రైస్ ది కింగ్ స్కూల్, మెగా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, క్రాంతి డిగ్రీ కాలేజీ, ప్రిన్స్‌స్టన్ డిగ్రీ కాలేజీ, జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రిన్స్‌స్టన్ పీజీ కాలేజీ. ఉప్పల్: లిటిల్ ఫ్లవర్ స్కూల్. ఓయూ క్యాంపస్: దుర్గాబాయి దేశ్‌ముఖ్ విద్యాపీఠం, ఏఎంఎస్ ఆర్ట్స్ సైన్స్ కాలేజీ.