22 నుంచి పాలీసెట్ కౌన్సెలింగ్ | Counseling from 22 paliset | Sakshi
Sakshi News home page

22 నుంచి పాలీసెట్ కౌన్సెలింగ్

Published Thu, Jun 18 2015 2:20 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

Counseling from 22 paliset

బొమ్మూరు (రాజమండ్రి రూరల్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి పాలీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 22న ప్రారంభమవనుంది. ఈనెల 28 వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 24 నుంచి 29 వరకు  వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లను ఈనెల 30, జూలై ఒకటి తేదీల్లో మార్చుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటారుుస్తారు. జిల్లాలో బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్, కాకినాడలో ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
 
 ఎస్టీ విద్యార్ధులు ఆంధ్రా పాలిటెక్నిక్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, మాజీ సైనికోద్యోగుల పిల్లల సర్టిఫికెట్ పరిశీలనకు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రోసెసింగ్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200, బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.400 ఆయా కేంద్రాల్లో చెల్లించాలని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్  విలియం క్యారీ తెలిపారు.
 
 కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..
 సర్టిఫికెట్ల పరిశీలనప్పుడు విద్యార్థులు తమ ధ్రువపత్రాల రెండు సెట్ల జిరాక్స్ కాపీలను అందించాలి. ఇందులో పోలిసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్టు, ఎస్‌ఎస్‌పీ లేదా తత్సమాన అర్హతలకు సంబంధించిన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ (విద్యాసంస్థల్లో చదవని వారు), 2015 జనవరి ఒకటి తర్వాత జారీ అయిన ఇన్‌కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్సు కాపీలను అందించాలి. వికలాంగులు, ప్రత్యేక కేటగిరీల వారు ఆయా ధ్రువపత్రాలను సమర్పించాలి.
 
 సర్టిఫికెట్ల పరిశీలన తేదీ=    పరిగణించే ర్యాంకులు
 22.06.2015=    1 నుంచి 12,500
 23.06.2015=    12,501 - 25,000
 24.06.2015=    25,001 - 37,500
 25.06.2015=    37,501 - 50,000
 26.06.2015=    50,001 - 62,500
 27.06.2015=    62,501 - 75,000
 28.06.2015=    75,001 - చివరి ర్యాంకు వరకు
 వెబ్ ఆప్షన్ల నమోదు తేదీ=    పరిగణించే ర్యాంకులు
 24, 25.06.2015=    1 నుంచి 25,000
 26, 27.06.2015=    25,001 - 50,000
 28, 29.06.2015=    50,001 - చివరి వరకు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement