ఇంటర్మీడియెట్‌లో ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చని సాంకేతిక విద్యాశాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చని సాంకేతిక విద్యాశాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని sbtet.telangana.gov.in, dtets.cgg.gov.in వెబ్‌సైట్‌ల నుంచి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
పాలిసెట్ వెరిఫికేషన్‌కు హాజరుకండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) స్కూళ్లలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి ప్రారంభం అయ్యే పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యా శాఖ తెలిపింది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు 1,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విద్యార్థుల ఫలితాలు ఈ నెల 27 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వారికి పదో తరగతి మోమోలు రాలేదు. దీంతో విద్యార్థులు మిగతా సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే జూన్ 1న సీట్ల కేటాయింపునకు ముందు పదో తరగతి మెమోలను అందజేస్తే సరిపోతుందని తెలిపారు.