సోనూసూద్.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో.. తన సినిమాల కంటే చేసిన సేవలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా మారిన మంచి మనసున్న మహారాజు. లాక్‌డౌన్ కాలంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. కష్టం వచ్చిందని సోనూసూద్ దృష్టికి తీసుకొస్తే చాలు.. తనకు చేతనైనంత సాయం చేస్తుంటారు. నేటికి తన సేవలను కొనసాగిస్తున్నాడు.
తాజాగా జార్ఖండ్‌లోనిని ఓ విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ బాలుడు తన ప్రభుత్వ పాఠశాల దుస్థితిని వివరిస్తూ రిపోర్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. సర్ఫరాజ్ అనే విద్యార్థి అచ్చం రిపోర్టర్‌లా నటిస్తూ పాఠశాల అంతా తిరుగుతూ తరగతి గదిలో అధ్వానమైన పరిస్థితులు, సరైన టాయిలెట్స్ లేకపోవడాన్ని రిపోర్టింగ్ చేశాడు. దీన్నంతటినీ మరో స్నేహితుడు వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ బాలుడి నైపుణ్యాలను ప్రశంసించారు.
शायद आपने ऐसा पत्रकार नहीं देखा हो ये विडीओ है झारखंड की जहां एक छोटा बच्चा जर्नालिस्ट बन कर अपने स्कूल के बदहाली को एक्ष्पोस करता है बच्चे का नाम सरफराज है और विडीओ ज़िला गोड्डा से है। 1/2@zoo_bear @AshrafFem @khanumarfa @khan_zafarul @meerfaisal01 @alishan_jafri @IamYasmeeny pic.twitter.com/14Uw53iIRn
— Mohammad Sunasara (@MdSunasara5) August 4, 2022
అయితే ఈ వీడియోపై తాజాగా సోనూసూద్ స్పందించాడు. బాలుడి వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘సర్ఫరాజ్.. ఇకపై నువ్వు కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొత్త పాఠశాల, హాస్టల్ తమ కోసం ఎదురుచూస్తున్నాయి’ అని తెలిపారు. ఇక సోనూసూద్ గొప్ప మనసును నెటిజన్లు మరోసారి కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment