West Virginia
-
గ్రహాంతరవాసులతో ఆ ఊరి వాళ్లకి సంబంధం ఏంటి? అడుగుపెట్టగానే..
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్‌ఫోన్స్ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్‌పై ఇక్కడ నిషేధం ఉండటంతో ఎవరూ స్మార్ట్‌ఫోన్స్, వైఫై వంటివేవీ ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఊళ్లు సెల్‌ఫోన్స్, వాటి సిగ్నల్ టవర్స్ ఎక్కడా కనిపించవు. గత యాభై ఏళ్లుగా ఇదే నిబంధన అమల్లో ఉంది. ఈ రూల్స్ పాటించేవాళ్లు ఊళ్లో ఉంటారు. అందుకు తగ్గట్లుగా ముందే రెంటల్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఊరు ఖాళీ చేయొచ్చు కానీ రూల్స్ మాత్రం మార్చరు. నో సిగ్నల్స్.. కారణమిదే 2010 గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 150 మంది కంటే తక్కువే.(ఆ తర్వాత అధికారులు డాటాను వెల్లడించలేదు) సోలార్ పవర్, పాడిపరిశ్రమే అక్కడి వారి జీవనాధారం. వారంతంలో పర్యాటకులు అక్కడికి వచ్చినా సెల్ఫోన్లు పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్‌బ్యాంక్ సిటీలోని ప్రజలు టెక్నాలజీకి దూరంగా ఉండటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియా టెలిస్కోప్ ఉంది. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పరిశోధనులు కొనసాగుతున్నాయి. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. అందుకే రేడియా టెలిస్కోప్కి ఎలాంటి డ్యామేజీ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అనుమతించరు.అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై ఇక్కడ నిషేధం ఉంది.మరి కమ్యూనికేషన్ ఎలా అంటారా?.. ఊరికి దూరంగా ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్‌లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. -
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న రిపోర్టర్‌కి యాక్సిడెంట్ : వైరల్ వీడియో
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న సమయంలో రిపోర్టర్‌కి యాక్సిడెంట్ అయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా టెలివిజన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్ట్ంగ్ అందిస్తున్న ఒక మహిళకి లైవ్‌లోనే యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన మహిళ టోరీ యోర్గీగా గుర్తించారు. అయితే ఆమె లైవ్ టెలీకాస్టింగ్‌లో రోపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో ఒక ఎస్యూవీ కారు ఆమెను వెనుక నుంచి ఢీ కొడుతుంది. అయితే ఆ లైవ్ న్యూస్‌లోనే ఆమె గట్టిగా అరవడం, ఆ తర్వాత సదరు ఆ వాహనదారుడితో మాట్లాడటం వినిపిస్తుంది. అయినప్పటికీ ఆమె మళ్లీ కాసేపటికి తేరుకుని తన రిపోర్టింగ్‌ని యథావిధిగా కొనసాగించడం విశేషం. ఈ మేరకు టీవీ యాంకర్ టిమ్ మీరు బాగానే ఉన్నారా! అని టోరీని ప్రశ్నిస్తాడు. దీంతో టోరీ తాను బాగానే ఉన్నా, కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెబుతుంది. అంతేకాదు టిమ్ కూడా తాను రిపొర్టర్ అదృశ్యమవ్వడమే చూశాను తప్ప ప్రమాదం ఎలా జరిగిందో గమనించలేదని చెప్పారు. లైవ్‌లో న్యూస్ అందిస్తుండగా జరిగిన తొలిప్రమాదం కదా అని యాంకర్ టిమ్ రిపోర్టర్ టోరీని అడిగాడు. దీంతో ఆమె ఇలాంటి ప్రమాదాలు చాలా ఎదుర్కొన్నాను కానీ తనకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. "We're good, Tim." pic.twitter.com/9kn2YElDLK — Timothy Burke (@bubbaprog) January 20, 2022 (చదవండి: ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా) -
వరల్డ్ టీమ్ టెన్నిస్‌లో వీనస్
వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ ప్రపంచ టీమ్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో పాల్గోనుంది. తొమ్మిది జట్లు తలపడే ఈ టోర్నీలో ఆమె బరిలోకి దిగడం ఇది 15వ సారి. తాజాగా ఆమె వాషింగ్టన్ కాజిల్స్ తరఫున పోటీపడనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్ వచ్చే నెల 12న ప్రారంభం కానుంది. సాధారణంగా దేశంలోని పలు నగరాల్లో ఈ పోటీలు జరిగేవి. అయితే ఈసారి కరోనా మహమ్మారి దృష్ట్యా ఒకే వేదికలో (వెస్ట్ వర్జీనియా) అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇది డబ్ల్యూటీఏ, ఏటీపీ పరిధిలోని టోర్నీ కాదు. కాబట్టి ఇక్కడి గెలుపోటములతో ఎలాంటి పాయింట్లు జతకావు. ర్యాంకింగ్ ప్రభావితం కాదు. ఔట్‌డోర్ కోర్టులో జరిగే పోటీలకు 500 మంది ప్రేక్షకుల్ని, ఇండోర్ కోర్టులో జరిగే పోటీలకు 250 మందిని అనుమతిస్తారు. వర్షం కురిస్తే మ్యాచ్‌ల్ని ఇండోర్ కోర్టుల్లో నిర్వహిస్తారు. ఫేస్ మాస్క్‌లుంటేనే ప్రేక్షకులకు ఎంట్రీ ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. గతవారం 40వ పడిలోకి ప్రవేశించిన వీనస్ 2011లో అరుదైన కీళ్ల వ్యాధితో బాధపడుతోంది. అప్పట్నుంచి అడపాదడపా కొన్ని ఎంపిక చేసిన టోర్నీల్లోనే ఆడుతోంది. ఈమె ఖాతాలో ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు ఉన్నాయి. సోదరి సెరెనాతో కలిసి 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలు కూడా గెలుచుకుంది. -
వారు డ్రీమర్లు కాదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలోకి చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు ప్రవేశించి అక్కడే అక్రమంగా ఉండిపోయిన స్వాప్నికుల (డ్రీమర్స్)ను అలా పిలవకూడదని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. వారు డ్రీమర్స్ కాదని, తన పార్టీ సభ్యులు ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘కొందరు వారిని డ్రీమర్లుగా పిలుస్తారు. వారు డ్రీమర్లు కాదు. మన సొంత డ్రీమర్లు మనకు ఉన్నారు’ అని పశ్చిమ వర్జీనియాలో ఓ సమావేశంలో అన్నారు. -
మిషెల్లీ ఒబామాను చింపాంజితో పోల్చి
అమెరికా ప్రస్తుత ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాను వెస్ట్ వర్జీనియాకు మేయర్ బెవర్లీ వాలింగ్స్ చింపాంజితో పోల్చారు. అమెరికాకు కొత్త ప్రథమ పౌరురాలు(మెలనియా ట్రంప్) వచ్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, ఇన్నాళ్లు ఆ స్ధానంలో ఓ చింపాంజి ఉండేదని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాలింగ్స్ పోస్టుతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్లు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రథమ పౌరురాలిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది. దీంతో ఆమెను మేయర్ పదవి నుంచి తప్పించాలనే ఒత్తిళ్లు పెరిగాయి. ఈ విషయం తెలుసుకున్న వాలింగ్స్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు క్లే టౌన్ కౌన్సిల్ కు లేఖ రాశారు. వాలింగ్స్ లేఖను పరిశీలించిన కౌన్సిల్ ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు పేర్కొంది. వైట్ హౌస్ మార్పుపై మాట్లాడానే తప్ప తన మనసులో మరే దురుద్దేశం లేదని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తాను తెలిసినవారందరికీ జాతి ద్వేషిని కాదని తెలుసని అన్నారు. మిషెల్లీపై చేసిన కామెంట్ కు క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో మరో పోస్టు కూడా చేశారు. -
అమెరికాలో భారీ పేలుడు
వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియా రాష్ల్రంలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు సోమవారం పట్టాలు తప్పడంతో పశ్చిమ వర్జీనియాలో ఈ పేలుడు జరిగింది. రైలులోని 100 కార్స్(ముడి చమురుతో ఉన్న బోగీలు)లో 30 పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో కనావా, ఫెయెటీ కౌంటీల్లో అత్యవసరస్థితి ప్రకటించారు. సంఘటనా స్థలానికి ఒక కిలోమీటరకు దూరం వరకు ఉన్న నివాసితులు ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఎన్ఎన్ తెలిపింది. రైలులోని ముడి చమురు కనావా నదిలో కలిసింది. కనావా, ఫెయెటీ కౌంటీ వాసులకు మంచినీరు అందించే ఈ నదిలో చమురు కలవడంతో తాగునీటి కొరత ఏర్పడే అవకాశముంది. దీంతో మంచినీటిని నిల్వచేసుకోవాలని పశ్చిమ వర్జీనియా గవర్నర్ ఎర్ల్ రే తొంబ్లిన్ విజ్ఞప్తి చేశారు.