
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలోకి చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు ప్రవేశించి అక్కడే అక్రమంగా ఉండిపోయిన స్వాప్నికుల (డ్రీమర్స్)ను అలా పిలవకూడదని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. వారు డ్రీమర్స్ కాదని, తన పార్టీ సభ్యులు ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘కొందరు వారిని డ్రీమర్లుగా పిలుస్తారు. వారు డ్రీమర్లు కాదు. మన సొంత డ్రీమర్లు మనకు ఉన్నారు’ అని పశ్చిమ వర్జీనియాలో ఓ సమావేశంలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment