Dreamers
-
అమెరికాలో వారి కలలు కల్లలేనా!?
ప్రణీత, జెఫ్రీన్, రోషన్ లాంటి పరిస్థితిని అమెరికాలో 2.50 లక్షల మంది ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది భారతీయు లే. వీరంతా చిన్నవయసులో తమ కుటుంబ సభ్యులతో కలిసి చట్టబద్ధంగానే అమెరికాకు చేరుకున్నారు. కానీ, అమెరికాలోనే శాశ్వతంగా ఉండే అవకాశం మాత్రం లేదు. వీసాలను మార్చుకోకపోతే 21 ఏళ్లు దాటగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి. వీరిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని పిలుస్తున్నారు. ఇలాంటి వారికి అమెరికాలో ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచాలని అధికార డెమొక్రటిక్ పార్టీ భా విస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ మాత్రం అంగీకరించడం లేదు. బయటకు పంపించాల్సిందేనని పట్టుబడుతోంది. సెనేట్‌లో రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎందుకీ సమస్య? లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి డిపెండెంట్‌గా అమెరికాకు వచ్చినవారు 21 ఏళ్ల వయసు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుంది. ఆ తర్వాత వీసా మార్చుకోకపోతే బయటకు వెళ్లిపోవాల్సిందే. తల్లిదండ్రులకు/ కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస హోదా) లభిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. డిపెండెంట్లు కూడా అమెరికాలో నివసించేందుకు అవకాశం ఉంది. కానీ, గ్రీన్‌కార్డు లభించడానికి ఇప్పుడు 15 ఏళ్లకుపైగా సమయం పడుతోంది. ఈలోగా డిపెండెంట్లకు 21 ఏళ్ల వయసు దాటేస్తోంది. దాంతో వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోంది. ప్రతిభావంతులను వదులుకుంటారా? డిపెండెంట్లను బయటకు పంపించడాన్ని డెమొక్రటిక్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో జని్మంచకపోయినా ఇక్కడే పెరిగి, పెద్ద చదువులు చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తున్న ప్రతిభావంతులను వదులుకోవడం తెలివైన పని కాదని అంటున్నారు. దేశ అభివృద్ధికి వారి సేవలు అవసరమని చెబుతున్నారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను మరో దేశం కోసం ధారపోయడం ఏమిటని వాదిస్తున్నారు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు అమెరికాలో నివసించే, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచే బైపారి్టషన్ అమెరికాస్ చి్రల్డన్స్ యాక్ట్ పెండింగ్‌లో ఉంది. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలోగా తమకు చట్టబద్ధమైన నివాస హోదా కలి్పంచాలని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కోరుతున్నారు. → ఇండియాలో జని్మంచిన ప్రణీత 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచి్చంది. క్లౌడ్ ఇంజనీరింగ్ చదివింది. శాశ్వత నివాస హోదా లేకపోవడంతో 15 ఏళ్లకుపైగా డిపెండెంట్‌గా నివసిస్తోంది. అమెరికాలో ఉండాలంటే తరచుగా వీసాలు మార్చుకోవాల్సి వస్తోంది.→ జెఫ్రీనా 2005లో ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి హెచ్4(డిపెండెంట్) వీసాపై అమెరికా వెళ్లింది. 2010లో ఆమె కుటుంబం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. అదెప్పుడొస్తుందో తెలియదు. జెఫ్రీనాకు 21 ఏళ్లు దాటడంతో ఇండియాకు వెళ్లిపోవాలి.→ రోషన్ పదేళ్ల వయసులో తల్లి, సోదరుడితో కలిసి హెచ్4 వీసాపై అమెరికా వచ్చాడు. 16 ఏళ్లు అక్కడే చదువుకున్నాడు. సెమీకండక్టర్ల తయారీ కంపెనీలో చేరాడు. అమెరికాను తన సొంత దేశంగానే ఇన్నాళ్లూ భావించాడు. కానీ, అక్కడి ప్రభుత్వం అతన్ని గత నెలల్లో ఇండియాకు బలవంతంగా తిరిగి పంపించివేసింది. -
న్యూయార్క్‌లో డ్రీమర్స్‌కు ఓటు హక్కు
న్యూయార్క్: అమెరికా పౌరసత్వం లేకపోయినప్పటికీ న్యూయార్క్ నగరం డ్రీమర్స్‌కి ఓటు వేసే హక్కు కల్పించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి దేశానికి వచ్చి ఇక్కడే పెరిగిన వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 8 లక్షలకు పైగా యువత ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డ్రీమర్స్ ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ న్యూయార్క్ నగర కౌన్సిల్ నెల రోజుల క్రితమే ఒక బిల్లును ఆమోదించింది. మేయర్ దానిపై ఆమోద ముద్ర వేయడంతో ఆదివారం నుంచి అది చట్టరూపం దాల్చింది. అయితే ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దేశ పౌరసత్వం లేని వారికి ఓటు హక్కు కల్పించిన తొలి అతి పెద్ద నగరంగా న్యూయార్క్ రికార్డు సృష్టించింది. పౌరులు కాని వారు ఇప్పటికీ అధ్యక్ష, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. -
గ్రీన్‌కార్డుకు ఇక సూపర్ ఫీ!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఊరట లభించనుంది. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ రూపొందించిన రీకన్సిలియోషన్ బిల్లులో వివరాల ప్రకారం... గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సూపర్ ఫీ చెల్లించడానికి ముందుకు వస్తే గ్రీన్కార్డుని అప్పటికప్పుడే పొందవచ్చు. అదే విధంగా లీగల్ డ్రీమర్స్ (తల్లిదండ్రుల హెచ్–1బీ వీసాతో చిన్నారులుగా దేశానికి వచ్చి 21 ఏళ్లు నిండిన వారు) ఈ సప్లిమెంటరీ ఫీజు కడితే వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం లభిస్తుంది. త్వరలోనే ఈ బిల్లు కాంగ్రెస్ ముందుకు రానుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల్ని ప్రతీ ఏడాది అమెరికా 1.40 లక్షలు మంజూరు చేస్తుంది. దీంట్లో ఏ ఒక్క దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్‌కార్డులు మంజూరు చేయకూడదనే పరిమితి ఉంది. భారతీయులు అధిక సంఖ్యలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తూ ఉండడంతో ఈ కోటా వల్ల దరఖాస్తుదారులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. కాటో ఇనిస్టిట్యూట్‌కు చెందిన వలస విధాన నిపుణుడు డేవిడ్ బెయిర్ అధ్యయనం ప్రకారం ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య ఏప్రిల్ 2020 నాటికి 7.41 లక్షలుగా ఉంది. వీరందరికీ కార్డు రావాలంటే 84 ఏళ్లు వేచి చూడాలని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫీ చెల్లిస్తే గ్రీన్‌కార్డు రావడం అన్నది సువర్ణావకాశమని బెయిర్ అన్నారు. 5 వేల డాలర్లు చెల్లించే వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తే అంతకు మించినది ఏముంటుందని పేర్కొన్నారు. ఇక అత్యవసర రంగాలైన ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయంతో పాటుగా రవాణా, ఐటీకి చెందిన కంపెనీల్లో పని చేసేవారికి వారి యాజమాన్యం స్పాన్సర్ చేయకపోయినా.. 5 వేల డాలర్లు చెల్లించి గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా బైడెన్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ఈ పని చేస్తూ ఉందని న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ డి మెహతా అన్నారు. బడ్జెట్ రీ కన్సిలేషన్ బిల్లులో భాగంగా దీనిని చేర్చడంతో కాంగ్రెస్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని మెహతా ధీమాగా చెప్పారు. బిల్లులో ఏముందంటే.. ► ఉద్యోగ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు ప్రయార్టీ తేదీ కంటే ఇంకా రెండేళ్లు ఎక్కువ గా నిరీక్షించాల్సి వచి్చనప్పుడు 5 వేలడాలర్ల సూపర్ ఫీ చెల్లిస్తే అప్పటికప్పుడు వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు. ► కుటుంబ ఆధారిత వలసదారులు, అమెరికా పౌరులెవరైనా స్పాన్సర్ చేస్తే గ్రీన్‌కార్డు రావాల్సిన సమయంలో కంటే రెండేళ్లు ఎక్కువ నిరీక్షించిన తర్వాత సప్లిమెంట్ ఫీజు కింద 2,500 డాలర్లు చెల్లించాలి. ► వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశాల పరిమితి కోటా ఎత్తేయడం, హెచ్–1బీ వీసా వార్షిక కోటా పెంచడం వంటి వాటికి ఈ బిల్లులో చోటు దక్కలేదు. -
డ్రీమర్ల కల తీర్చనున్న అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల ‘పౌరసత్వం’ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని వైట్‌హౌస్ ప్రకటించింది. భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా అమెరికా శాశ్వత నివాస ధ్రువీకరణ ‘గ్రీన్ కార్డు’ కోసం ఎదురుచూస్తున్నారు. వీరు గ్రీన్‌కార్డుల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుండటంతో వారి పిల్లల వయసు 21 దాటుతోంది. అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రీమర్లు 21ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు. 21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్ హోదా పోతుంది. అమెరికా పౌరసత్వ కల వీరందరికీ అలాగే ఉండిపోయింది. ‘ఇంప్రూవ్ ది డ్రీమ్’ గణాంకాల ప్రకారం రెండు లక్షల మంది డ్రీమర్లు ఉన్నారని, అందులో అధికశాతం మంది భారతీయులేనని సమాచారం. వీరి పౌరసత్వ కల నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా వలస విధానంలో సంస్కరణలు తేవాల్సిన తరుణం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు సెనేట్‌కు పంపారు. పాత చట్టానికి సవరణలు, వాడని వీసాలను స్వాధీనం చేసుకోవడం, చాన్నాళ్లు వేచి ఉండే పద్ధతికి స్వస్తి పలకడం, ‘ఒక్కో దేశానికి గరిష్ట పరిమితిలోనే అనుమతులు’.. ఇలా అనేక కుటుంబ ఆధారిత వలస విధానంలో సంస్కరణలు ఆ బిల్లులో ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. డ్రీమర్లు అమెరికాలో పనిచేసుకునేందుకు, చట్టం అనుమతించిన వయసు పరిమితిని దాటినా వారికి రక్షణ కల్పించే అంశాలూ ఈ బిల్లులో ఉన్నాయని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కూడా అయిన జెన్‌సాకీ చెప్పారు. -
డీమర్స్ కోసం యూఎస్ కాంగ్రెస్‌లో బిల్లు
వాషింగ్టన్: దేశంలో చాన్నాళ్లుగా నాన్ ఇమిగ్రంట్ వీసాపై ఉన్నవారితో పాటు డిపెండెంట్స్‌గా అమెరికా వచ్చిన పిల్లలకు(డాక్యుమెంటెడ్ డ్రీమర్స్) శాశ్వత నివాస సదుపాయం కల్పించే దిశగా ముందడుగు పడింది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పలువురు భారతీయ పిల్లలు, యువతకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రంట్ వీసాదారుల పిల్లలు, 21 ఏళ్ల వయస్సు దాటితే, స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికాలో ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సంఖ్య దాదాపు 2 లక్షలు ఉంటుంది. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. -
వలస విధానంపై ట్రంప్‌కి చుక్కెదురు
వాషింగ్టన్: వలసదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా హయాం నాటి వలస విధానాలను పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చిన చిన్నారులకి రక్షణ కల్పించడానికి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలకు అమెరికా కోర్టు అప్పట్లో అడ్డుకట్ట వేసింది. మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్ గరాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని స్పష్టం చేశారు. 2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ విధానం ద్వారా చిన్నతనంలోనే అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చిన వారికి రక్షణ కలగనుంది. చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వారికి రక్షణ కల్పించి, వారికి ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి నికోలస్ పేర్కొన్నారు. 2019 నాటి సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) నివేదిక ప్రకారం భారత్ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. 2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది. అదే సంవత్సరం భారత్ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది. -
గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా
వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, దాదాపు 7 లక్షల మంది డ్రీమర్లకు(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వచ్చినవారు) మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్ నుంచి శనివారం(స్థానిక కాలమానం) ప్రజలు, రాజకీయ నేతలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ‘వాషింగ్టన్‌లోని రెండు పక్షాలు(రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) ఓ అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంది. దేశంలోని 7,00,000 మంది డ్రీమర్లకు మరో మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా(టీపీఎస్) కల్పిస్తాం. స్వదేశాల్లో హింస, అంతర్యుద్ధం కారణంగా అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది విదేశీయులకు టీపీఎస్‌ను మూడేళ్ల పాటు పొడిగిస్తాం. ఇందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ కోసం 5.7 బిలియన్ డాలర్లు(రూ.40,615 కోట్లు) ఇవ్వాలని ట్రంప్ కోరుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడి ప్రతిపాదన ఆచరణసాధ్యం కాదని డెమొక్రటిక్ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేయడాన్ని ట్రంప్ గర్వంగా భావిస్తున్నారనీ, దీనిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
డీఏసీఏపై మరో ఆలోచన లేదు: ట్రంప్
పామ్ బీచ్: అమెరికాలో స్వాప్నికుల (డ్రీమర్ల)కు సంబంధించిన డీఏసీఏపై మరో ఆలోచన లేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్పష్టం చేశారు. డీఏసీఏ కార్యక్రమాన్ని ట్రంప్ ఇప్పటికే రద్దు చేయడం తెలిసిందే. చిన్నతనంలో తల్లిదండ్రులతోపాటు అక్రమంగా అమెరికా వచ్చి స్థిరపడిపోయిన అనేక మంది స్వాప్నికులకు అమెరికాలో నివసించేందుకు మాజీ అధ్యక్షుడు ఒబామా అనుమతులిస్తూ గతంలో డీఏసీఏ పథకాన్ని తీసుకొచ్చారు. ‘డీఏసీఏ కింద స్వాప్నికులకు ఇస్తున్న ప్రయోజనాల కోసం వారు వస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ వారెవరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. డీఏసీఏను ట్రంప్ రద్దు చేసినా, ఆ పథకాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌కు ఆరు నెలల సమయమిచ్చారు. అయితే డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం లేక అది ఇంకా సాధ్యపడలేదు. -
‘డ్రీమర్ల’కు సెనెట్ నో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆ దేశ ఎగువసభ సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కి పౌరసత్వం కల్పించేందుకు ట్రంప్ మద్దతిచ్చిన బిల్లును 60–39 ఓట్లతో శుక్రవారం సెనెట్ తిరస్కరించింది. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించినందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి, భద్రతా ఏర్పాట్లకు రూ.16.08 లక్షల కోట్లు(25 బిలియన్ డాలర్లు) కేటాయించాలని ట్రంప్ డెమొక్రాట్లతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలోకి కుటుంబ ఆధారిత వలసలతో పాటు దేశాలవారీగా చేపట్టే లాటరీ వీసా పద్ధతి రద్దయ్యేది. తద్వారా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరేది. అమెరికాలో వలసలపై సెనెట ర్లు షుమర్–రౌండ్స్–కొలిన్స్ ప్రతిపాదిం చిన మరో బిల్లును ఎగువ సభ 54–45 మెజారిటీతో తిరస్కరించింది. డ్రీమర్ల బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో ఒప్పందం కుదరకుంటే మార్చి 5 తర్వాత 18 లక్షల మందిని బలవంతంగా విదేశాలకు పంపిస్తారేమోనన్న భయాలు నెలకొన్నాయి. సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందేందుకు 60 ఓట్లు రావడం తప్పనిసరి. -
వారు డ్రీమర్లు కాదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలోకి చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు ప్రవేశించి అక్కడే అక్రమంగా ఉండిపోయిన స్వాప్నికుల (డ్రీమర్స్)ను అలా పిలవకూడదని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. వారు డ్రీమర్స్ కాదని, తన పార్టీ సభ్యులు ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘కొందరు వారిని డ్రీమర్లుగా పిలుస్తారు. వారు డ్రీమర్లు కాదు. మన సొంత డ్రీమర్లు మనకు ఉన్నారు’ అని పశ్చిమ వర్జీనియాలో ఓ సమావేశంలో అన్నారు. -
డ్రీమర్లకు ట్రంప్ ఊరట
వాషింగ్టన్: దాదాపు 7 లక్షల మంది స్వాప్నికుల్ని(డ్రీమర్లు) అమెరికా నుంచి పంపించేందుకు కంకణం కట్టుకున్న అధ్యక్షుడు ట్రంప్ మెత్తపడ్డారు. 10, 12 ఏళ్లలో డ్రీమర్లకు అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. చిన్న వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన వీరిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ డ్రీమర్లుగా పిలుస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో వేలాది మంది భారతీయులకూ లబ్ధి చేకూరనుంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వీరి కోసం 2001లో పరస్పర అంగీకారంతో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ‘డ్రీమ్’ బిల్లును రూపొందించారు. కొన్ని నిబంధనలకు కట్టుబడి డ్రీమర్లకు పౌరసత్వం కల్పించడం దీని ఉద్దేశం. ఆ బిల్లు ఇంతవరకూ అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందలేదు. ఆందోళన అవసరం లేదు: ట్రంప్ ‘డ్రీమర్ల అంశంలో మార్పులకు సిద్ధంగా ఉన్నాం. 10, 12 ఏళ్లలో ఇది జరగవచ్చు’ అని ట్రంప్ చెప్పారు. వలసదారుల శ్రమకు ఇది ప్రోత్సాహకంగా ఆయన అభివర్ణించారు. ‘ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారికి చెప్పండి’ అని డ్రీమర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ అంశంపై వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఇంతవరకూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మించాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్.. దాని నిర్మాణానికి డెమొక్రాట్లు మద్దతివ్వకపోతే డ్రీమర్ల అంశంలో తాము మద్దతివ్వమని హెచ్చరించారు. ఆ గోడ పూర్తయితే అమెరికా పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. సోమవారంలోగా వలసదారుల విధివిధానాలు ఖరారు డ్రీమర్స్ భవితవ్యంపై ద్రవ్య వినిమయ బిల్లులో ఎలాంటి హామీ ఇవ్వకపోడంతో.. అమెరికా మూడు రోజుల పాటు స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై చట్టం తెచ్చేందుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరడంతో షట్డౌన్కు తెరపడింది. అయితే ఫిబ్రవరి 8 వరకే నిధుల ఖర్చుకు కాంగ్రెస్ అనుమతించిన నేపథ్యంలో.. ఆ లోగా ట్రంప్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ షట్డౌన్కు సిద్ధమని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతకరించుకుంది. స్వాప్నికులంటే.. బాల్యంలో తల్లిదండ్రులతోపాటు అమెరికాలో చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన వారినే స్వాప్నికులంటారు. వారిని దేశం నుంచి బలవంతంగా బయటకు పంపకుండా ప్రతి రెండేళ్లకు పనిచేయడానికి వర్క్ పర్మిట్‌తోపాటు నివసించేందుకు ‘డాకా’(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) సౌకర్యాన్ని కల్పించారు. స్వాప్నికుల్లో అత్యధికశాతం దక్షిణ, మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చినవారే.. డాకా కింద 5,500 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం కింద లబ్ధిపొందే భారతీయ సంతతి ప్రజలు 17 వేల మంది ఉన్నారని అంచనా. -
అమెరికాలో 8 లక్షలమంది ప్రమాదం నుంచి గట్టెక్కేనా!
న్యూయార్క్ : చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతోపాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చట్టాన్నితీసుకురావాలనే యోచనపై అమెరికా సెనేట్‌లో వాడివేడి చర్చ జరిగింది. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్ల భవితవ్యంపై ఈ చర్చలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుమారు 8లక్షలమంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను రద్దు చేస్తూ డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది. ఇందులో దాదాపు ఏడువేలమంది భారతీయ అమెరికన్ యువకులు కూడా బాధితులుగా ఉన్నారు. దీనిపైనే తాజాగా సెనేట్‌లో చర్చించారు. చర్చలో వివరాలు పరిశీలిస్తే.. అసలు దేశంలో డ్రీమర్స్ ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తే సాధరణంగా అనుకునేదానికంటే భిన్నంగా దాదాపు 3.6మిలియన్లు ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతం వీరి జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి. అయితే, వీరిలో ప్రత్యేకంగా ఒబామా హయాంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ వుడ్ అరైవల్ (డీఏసీఏ) చట్టం కింద తీసుకొచ్చిన 8లక్షలమంది యువకుల భవిష్యత్తు ఏమిటనే ఆలోచనే ఎక్కువగా అక్కడి వారి మెదళ్లను తొలుస్తోంది. అందుకు కారణం ఆ చట్టం సెప్టెంబర్‌లో ముగిసిపోయింది. దీంతో వీరిగురించే ప్రస్తుతం ట్రంప్‌తో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకు ఏంటి డ్రీమర్స్ చట్టం..! చిన్నతనంలోనే సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికా వచ్చిన విదేశీ మైనర్ల అభివృద్ధి, వారికి పరిహారం, విద్యాభ్యాసానికి అవకాశం కల్పించడంవంటి అంశాలతో రూపొందించినదే డ్రీమర్స్ చట్టం. దీనికి అర్హులు కావాలంటే వారు కొన్ని నియమాలను పాటించాలి. అమెరికాలోనే చదువుకోవాలి దరఖాస్తు చేసుకోనే సమయంలో వయసు 30 ఏళ్లకు మించకూడదు కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోనే నివాసం ఉండాలి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. వలసదారుల నియమాలను అతిక్రమించరాదు. 2001లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇంతవరకూ ఆమోదం పొందలేదు. ఈ బిల్లు చట్టంగా మారి ఉంటే వీరందరికి రక్షణ లభించేది. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ వుడ్ అరైవల్) అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు రక్షణ కల్పించడం కోసం 2012లో ఒబామా తీసుకువచ్చిన తాత్కలిక చట్టమే డీపీసీఏ. ఈ తాత్కాలిక చట్టం ప్రకారం డ్రీమర్స్ అర్హత సాధించాలంటే.. 16 సంవత్సరాల వయసులోపు అమెరికా వచ్చి ఉండాలి 2012 జూన్ 15 నాటికి ఐదు సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఉండాలి 2012 జూన్ 15 నాటికి వారి వయస్సు 31 సంవత్సరాలు మించరాదు. ఈ నిబంధనల ప్రకారం ఒబామా హయాంలో 8లక్షల మంది డ్రీమర్స్ అర్హత సాధించారు. వీరికి ఒబామా ప్రభుత్వం రెండేళ్లపాటు వర్క్ పర్మిట్ కల్పించింది. దీనిని పొడగించేందుకు అవకాశం కూడా కల్పించారు. ట్రంప్ ప్రభుత్వం ఏం చేసింది? అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వం 2017, సెప్టెంబర్‌లో ఈ తాత్కాలిక చట్టాన్ని పూర్తిగా రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై ట్రంప్ సంతకం కూడా చేశారు. అయితే, ఒక ఆరు నెలల మాత్రమే గడువు ఇచ్చిన ట్రంప్ సర్కార్ గడువు దాటిని తర్వాత కూడా అక్కడే ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ అరెస్టు చేస్తోంది. వారిని బలవంతంగా దేశం నుంచి పంపించివేస్తున్నారు. అరెస్టులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పేందుకు ఇటీవల జనవరి 15న (2018) జార్జిగార్సియా అనే వ్యక్తిని బలవంతంగా దేశం నుంచి పంపించివేయడమే నిదర్శనం. ఎవరేమంటున్నారంటే .. వీరంతా అక్రమ వలసదారులే. వర్క్ పర్మిట్ వచ్చినంత మాత్రన వారికి పూర్తి హక్కులు ఉన్నట్లు కాదు - రిపబ్లికన్స్ ఇన్ని మిలియన్ల డ్రీమర్స్‌ను బహిష్కరించడం అనైతికం, ఈ దేశ అభివృద్ధిలో వారి కృషి మరవలేనిది - అలీ నూరాని (నేషనల్ ఇమ్మిగ్రేంట్స్ ఫోరమ్ ప్రో ఇమ్మిగ్రేంట్ ఎక్సిక్యూటీవ్ డైరెక్టర్ ) ఈ 8లక్షల మందికి మాత్రం ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే సరిపోతుంది - మార్క్ కిర్కోరియాన్ (సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టాటస్ ఎక్సిక్యూటీవ్ డైరెక్టర్) నాటి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిమిత సంఖ్యలో డ్రీమర్స్‌కు రక్షణ కల్పించారు. కానీ ఇప్పుడు ఈ అంశంలో మొత్తం కాంగ్రెస్ పాలుపంచుకుంది. కాబట్టి సరైన చట్టం తీసుకొచ్చి అర్హులైన వారందరికి భద్రత కల్పించవచ్చు - సెసిలియా మునోజ్ (ఒబామా హయాంలో దేశీయ విధాన డైరెక్టర్) -
డ్రీమర్లకు సపోర్టుగా టెక్ దిగ్గజాలు
వాషింగ్టన్: చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లి స్థిరపడిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డ్రీమర్ల కోసం ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన డీఏసీఏ కార్యక్రమాన్ని ట్రంప్ రద్దు చేయడంతో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వాషింగ్టన్లో ఓ దావా దాఖలైంది. దీనికి పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది. వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన అన్ని కంపెనీలు ఈ దావాకు మద్దతిస్తున్నాయి. 15 సంప్రదాయ ప్రజాస్వామ్య రాష్ట్రాలు, కొలంబియా జిల్లాకు చెందిన అటార్నీస్ జనరల్ ఈ దావాను దాఖలు చేశారు. చాలామంది డ్రీమర్లు.. 16 ఏళ్ల కంటే చిన్నవయసులోనే దేశానికి వచ్చారని, తమ కంపెనీల కోసం పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రీమర్లపైనే ఆధారపడి వాషింగ్టన్‌లోని చాలా కంపెనీలు పనిచేస్తున్నాయని, వారి వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయని ఫిర్యాదులో చెప్పారు. తమ రాష్ట్రాల్లోని అతిపెద్ద కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ వంటి కంపెనీల్లో, డ్రీమర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్‌గా, రిటైల్, సేల్స్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఏసీఏ రద్దుతో ఒకవేళ ఉద్యోగులు తమ స్టేటస్‌ను కోల్పోతే, చాలా బాధను భరించాల్సి ఉంటుందని అమెజాన్ ఆందోళన వ్యక్తంచేసింది. మైక్రోసాఫ్ట్‌లో 39 మంది డ్రీమర్లు ఉన్నారని, డీఏసీఏను రద్దు చేయడం దేశమొత్తానికి అతిపెద్ద ఎదురుదెబ్బ అని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు, చీఫ్ లీగల్ ఆఫీసర్ బ్రాడ్ స్మిత్ చెప్పారు. డీఏసీఏ రద్దుపై వ్యాపారవేత్తలు మండిపడుతున్నారు. 8 లక్షల మంది డ్రీమర్లు, తమ కంపెనీలకు, తమ ఆర్థికవ్యవస్థకు ఎంతో ముఖ్యమని చెప్పారు. 100కు పైగా టెక్ కంపెనీలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన దావాకు మద్దతు పలుకుతున్నాయి. -
ట్రంప్ ఉత్తర్వులను కొట్టేయాలి
డీఏసీఏపై ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన 15 రాష్ట్రాలు వాషింగ్టన్: డీఏసీఏ (బాల్యంలో అక్రమంగా వచ్చిన వారిపై చర్యల వాయిదా) కార్యక్రమాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడుట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతోపాటు 15 రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో కేసు వేశాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అక్రమంగా అమెరికా వచ్చి, అనుమతులు లేకుండా అక్కడ నివసిస్తున్న యువతను స్వాప్నికులు (డ్రీమర్లు) అని పిలుస్తారు. వీరు అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు అనుమతులిస్తూ ఒబామా హయాంలో డీఏసీఏ కార్యక్రమాన్ని తీసుకురాగా ట్రంప్ రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగబద్ధం కాదనీ, ఉత్తర్వులను కొట్టేయాలని రాష్ట్రాలు కోర్టును కోరాయి. మెక్సికన్లు, లాటిన్లు తదితరులపై వ్యక్తిగత ద్వేషంతోనే ట్రంప్ డీఏసీఏను రద్దు చేశారన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, మసాచుసెట్స్, కనటికట్, డెలావర్, హవాయ్, ఇల్లినాయిస్ తదితర రాష్ట్రాలు కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ నిర్ణయం అమానవీయం.. ట్రంప్ నిర్ణయం అమానవీయమైనదనీ, అధ్యక్షుడికి వ్యతిరేకంగా తాము పోరాడతామని అమెరికా చట్ట సభల్లో సభ్యులైన భారత సంతతి నేతలు చెప్పారు. డీఏసీఏ పథకం రద్దు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని సెనేటర్ కమాలా హ్యారిస్ అన్నారు. 8 లక్షల మంది స్వాప్నికుల భవిష్యత్తును ట్రంప్ నాశనం చేస్తున్నారని మరో నాయకురాలు ప్రమీలా జయపాల్ విమర్శించారు. స్వాప్నికుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ చర్యలు ప్రారంభించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ సభ్యులు రాజా క్రిష్ణమూర్తి, అమీ బెరా, రోహిత్ ఖన్నా తదితరులు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. -
ట్రంప్ నిర్ణయంపై భగ్గుమన్న గూగుల్, యాపిల్
హోస్టన్: వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా డ్రీమర్స్ వర్క్పర్మిట్లను రద్దు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తల్లితండ్రులతో కలిసి బాల్యంలోనే అమెరికాకు వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారిని అక్రమ వలసదారులుగా ట్రంప్ యంత్రాంగం గుర్తించిన క్రమంలో తమ ఉద్యోగులకు బాసటగా నిలవాలని యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. డీఏసీఏకు మద్దతుగా అమెరికా కాంగ్రెస చర్యలు చేపట్టాలని ఆయన ట్వీట్ చేశారు..ట్రంప్ యంత్రాంగం తీసుకున్ననిర్ణయాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో తమ ఉద్యోగుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారికి ఇమిగ్రేషన్ నిపుణుల సూచనలతో పాటు అవసరమైన సాయం అందిస్తామని కుక్ స్పష్టం చేశారు. తమ డ్రీమర్ల కోసం యాపిల్ పోరాడుతుందని కుక్ ట్వీట్ చేశారు. డ్రీమర్లు అమెరికాను, పౌర సమాజాన్ని పటిష్టం చేశారని, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాల కోసం తాము కట్టుబడిఉంటామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత అధ్యక్షుడు ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా తీసుకువచ్చిన డీఏసీఏకు అనుకూలంగా కాంగ్రెస్ మద్దతు కూడగట్టాలని పిలుపు ఇచ్చారు. -
అమెరికన్ డ్రీమర్స్‌పై ట్రంప్ కత్తి..
- బాల్యంలోనే అమెరికాకు వలసొచ్చిన వారిపై నిర్ణయం - వర్క్ పర్మిట్ల రద్దుపై మంగళవారం ప్రకటన చేయనున్న ప్రెసిడెంట్ - ప్రభావాన్ని ఎదుర్కొనేవాళ్లలో మనవాళ్లు ఏడువేల మంది సాక్షి, వాషింగ్టన్ : అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే అధికారిక పత్రాలు లేని ఏడు వేల మంది భారతీయ అమెరికన్ యువకులు సహా దాదాపు 8 లక్షల మంది వర్క్ పర్మిట్లు రద్దుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటన చేయనున్నారు. ఇతర దేశాల నుంచి తమ తల్లిదండ్రులతో పాటు వచ్చిన పిల్లలే ఈ యువకులు. వారిని అమెరికాలో డ్రీమర్లు(స్వాప్నికులు) అని పిలుస్తారు. ఇక్కడ జీవించడానికి, పనిచేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు లేకున్నా ఈ పిల్లలు అమెరికాలోనే చదువుకుని, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వారిలో అత్యధికశాతం పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో పుట్టారు. ఇండియా, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన ఇలాంటి యువకుల వాటా తొమ్మిది శాతానికి మించదని అంచనా. ఈ పిల్లల వల్ల స్థానిక అమెరికన్లకు హాని జరుగుతోందని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనేది ట్రంప్ మద్దతుదారుల ఆరోపణ. తల్లిదండ్రుల కారణంగా అమెరికా వచ్చిన ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృష్టిచేస్తున్న కారణంగా వారిపై దయ చూపాలేగాని, శిక్షించరాదనే అభిప్రాయంతో ఏకీభవించిన మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా 2012లో వెసులుబాటు కల్పించారు. దేశంలో పెరిగి ఉద్యోగాలు చేస్తున్న స్వాప్నికులను వారు పుట్టిన దేశాలకు పంపకుండా కాపాడడానికి 'బాల్యంలోనే వచ్చినవారిపై చర్యల వాయిదా'(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్-డాకా) అనే సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్15న ఒబామా ప్రకటించారు. అమెరికా ఫెడరల్ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి దాదాపు 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించారు. ఇలా అర్హత పొందిన యువతీయువకులు డాకా కింద ప్రతి రెండేళ్లకు తమ వర్క్ పర్మిట్లను పొడిగించకునే అవకాశం కల్పించారు. రెన్యూవల్ సౌకర్యం తొలగించి, వారు జన్మించిన దేశాలకు పంపించడానికి వీలుగా డాకాను రద్దుచేయాలనే డిమాండ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. అమెరికన్లకు కష్టాలు వలసొచ్చినవారి వల్లేననే వాదనకు ట్రంప్ హయాంలో బలం చేకూరింది. అయితే, ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారెరగని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీలకు చెందిన చాలా మంది నేతలు గుర్తించారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల వంటి మెగా టెక్ కంపెనీల ఉన్నతాధికారులు డాకా ప్రోగ్రాం రద్దును వ్యతిరేకిస్తున్నారు. పాలకపక్షమైన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్ కూడా డ్రీమర్లకు డాకా ద్వారా లభిస్తున్న సౌకర్యాలు రద్దుచేయకూడదనే కోరుతున్నారు. అందుకే మంగళవారం ట్రంప్ వెంటనే డాకా రద్దుచేయకుండా ఆరు నెలలు యధాతథ స్థితి కొనసాగడానికి అవకాశమిస్తారని భావిస్తున్నారు. వర్క్ పర్మిట్లు ఇక ముందు పొడిగించుకునే వీలులేకుండా దాని స్థానంలో కొత్త చట్టం చేయాలనిఅమెరికా కాంగ్రెస్‌ను ట్రంప్ కోరవచ్చని అమెరికా మీడియా సంస్థలు అంచనావేస్తున్నాయి. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్)