అమెరికాలో వారి కలలు కల్లలేనా!? | Children of legal immigrants in the US at risk of deportation | Sakshi
Sakshi News home page

అమెరికాలో వారి కలలు కల్లలేనా!?

Published Sun, Jul 28 2024 5:43 AM | Last Updated on Sun, Jul 28 2024 7:19 AM

Children of legal immigrants in the US at risk of deportation

అమెరికాలో 2.50 లక్షల మంది డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌ ఆందోళన   

వీరిలో సింహభాగం భారతీయులే..  

వీసా హోదా మార్చుకోకపోతే స్వదేశాలకే..  

ప్రణీత, జెఫ్రీన్, రోషన్‌ లాంటి పరిస్థితిని అమెరికాలో 2.50 లక్షల మంది ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది భారతీయు లే. వీరంతా చిన్నవయసులో తమ కుటుంబ సభ్యులతో కలిసి చట్టబద్ధంగానే అమెరికాకు చేరుకున్నారు. కానీ, అమెరికాలోనే శాశ్వతంగా ఉండే అవకాశం మాత్రం లేదు. వీసాలను మార్చుకోకపోతే 21 ఏళ్లు దాటగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి. వీరిని డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌ అని పిలుస్తున్నారు. ఇలాంటి వారికి అమెరికాలో ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచాలని అధికార డెమొక్రటిక్‌ పార్టీ భా విస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ మాత్రం అంగీకరించడం లేదు. బయటకు పంపించాల్సిందేనని పట్టుబడుతోంది. సెనేట్‌లో రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేసింది.   

ఎందుకీ సమస్య? 
లాంగ్‌ టర్మ్‌ వీసా కలిగి ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి డిపెండెంట్‌గా అమెరికాకు వచ్చినవారు 21 ఏళ్ల వయసు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుంది. ఆ తర్వాత వీసా మార్చుకోకపోతే బయటకు వెళ్లిపోవాల్సిందే. తల్లిదండ్రులకు/ కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస హోదా) లభిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. డిపెండెంట్లు కూడా అమెరికాలో నివసించేందుకు అవకాశం ఉంది. కానీ, గ్రీన్‌కార్డు లభించడానికి ఇప్పుడు 15 ఏళ్లకుపైగా సమయం పడుతోంది. ఈలోగా డిపెండెంట్లకు 21 ఏళ్ల వయసు దాటేస్తోంది. దాంతో వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోంది.  

ప్రతిభావంతులను వదులుకుంటారా?   
డిపెండెంట్లను బయటకు పంపించడాన్ని డెమొక్రటిక్‌ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమెరికాలో జని్మంచకపోయినా ఇక్కడే పెరిగి, పెద్ద చదువులు చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తున్న ప్రతిభావంతులను వదులుకోవడం తెలివైన పని కాదని అంటున్నారు. దేశ అభివృద్ధికి వారి సేవలు అవసరమని చెబుతున్నారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను మరో దేశం కోసం ధారపోయడం ఏమిటని వాదిస్తున్నారు. డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌కు అమెరికాలో నివసించే, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచే బైపారి్టషన్‌ అమెరికాస్‌ చి్రల్డన్స్‌ యాక్ట్‌ పెండింగ్‌లో ఉంది. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలోగా తమకు చట్టబద్ధమైన నివాస హోదా కలి్పంచాలని డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌ కోరుతున్నారు.        

→ ఇండియాలో జని్మంచిన ప్రణీత 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచి్చంది. క్లౌడ్‌ ఇంజనీరింగ్‌ 
చదివింది. శాశ్వత నివాస హోదా లేకపోవడంతో 15 ఏళ్లకుపైగా డిపెండెంట్‌గా నివసిస్తోంది. అమెరికాలో ఉండాలంటే తరచుగా వీసాలు 
మార్చుకోవాల్సి వస్తోంది.
→ జెఫ్రీనా 2005లో ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి హెచ్‌4(డిపెండెంట్‌) వీసాపై అమెరికా వెళ్లింది. 2010లో ఆమె కుటుంబం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. అదెప్పుడొస్తుందో తెలియదు. జెఫ్రీనాకు 21 ఏళ్లు దాటడంతో ఇండియాకు వెళ్లిపోవాలి.
→ రోషన్‌ పదేళ్ల వయసులో తల్లి, సోదరుడితో కలిసి హెచ్‌4 వీసాపై అమెరికా వచ్చాడు. 16 ఏళ్లు అక్కడే చదువుకున్నాడు. సెమీకండక్టర్ల తయారీ కంపెనీలో చేరాడు. అమెరికాను తన సొంత దేశంగానే ఇన్నాళ్లూ భావించాడు. కానీ, అక్కడి ప్రభుత్వం అతన్ని గత నెలల్లో ఇండియాకు బలవంతంగా తిరిగి పంపించివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement