
డొనాల్డ్ ట్రంప్
పామ్ బీచ్: అమెరికాలో స్వాప్నికుల (డ్రీమర్ల)కు సంబంధించిన డీఏసీఏపై మరో ఆలోచన లేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్పష్టం చేశారు. డీఏసీఏ కార్యక్రమాన్ని ట్రంప్ ఇప్పటికే రద్దు చేయడం తెలిసిందే.
చిన్నతనంలో తల్లిదండ్రులతోపాటు అక్రమంగా అమెరికా వచ్చి స్థిరపడిపోయిన అనేక మంది స్వాప్నికులకు అమెరికాలో నివసించేందుకు మాజీ అధ్యక్షుడు ఒబామా అనుమతులిస్తూ గతంలో డీఏసీఏ పథకాన్ని తీసుకొచ్చారు. ‘డీఏసీఏ కింద స్వాప్నికులకు ఇస్తున్న ప్రయోజనాల కోసం వారు వస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ వారెవరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. డీఏసీఏను ట్రంప్ రద్దు చేసినా, ఆ పథకాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌కు ఆరు నెలల సమయమిచ్చారు. అయితే డెమొక్రాట్లు, రిపబ్లికన్‌ల మధ్య ఏకాభిప్రాయం లేక అది ఇంకా సాధ్యపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment