baned
-
స్టార్ రెజ్లర్ బజరంగ్‌పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్‌కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్‌తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో.. -
చైనాకు షాకిచ్చిన భారత్
-
నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాను బహిష్కరించిన ‘ఫిఫా’
లండన్: తమ ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ద్వేషపూరిత కామెంట్లపై ఆగ్రహించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)లు నాలుగు రోజుల పాటు తమ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. ఈ విధంగానైనా ఆటగాళ్లపై ఆకతాయిలు చేసే అసభ్యకర కామెంట్లు ఆగుతాయని యూఈఎఫ్ఏ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఎఫెరిన్ ఆకాంక్షించాడు. ఇకపై ఆటగాళ్లపై చేసే ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు, ప్రీమియర్‌షిప్ రగ్బీ, లాన్ టెన్నిస్ సంఘం నాలుగు రోజుల బహిష్కరణకు మద్దతు తెలిపాయి. -
టిక్‌టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషే«ధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. టిక్ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. -
డీఏసీఏపై మరో ఆలోచన లేదు: ట్రంప్
పామ్ బీచ్: అమెరికాలో స్వాప్నికుల (డ్రీమర్ల)కు సంబంధించిన డీఏసీఏపై మరో ఆలోచన లేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్పష్టం చేశారు. డీఏసీఏ కార్యక్రమాన్ని ట్రంప్ ఇప్పటికే రద్దు చేయడం తెలిసిందే. చిన్నతనంలో తల్లిదండ్రులతోపాటు అక్రమంగా అమెరికా వచ్చి స్థిరపడిపోయిన అనేక మంది స్వాప్నికులకు అమెరికాలో నివసించేందుకు మాజీ అధ్యక్షుడు ఒబామా అనుమతులిస్తూ గతంలో డీఏసీఏ పథకాన్ని తీసుకొచ్చారు. ‘డీఏసీఏ కింద స్వాప్నికులకు ఇస్తున్న ప్రయోజనాల కోసం వారు వస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ వారెవరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. డీఏసీఏను ట్రంప్ రద్దు చేసినా, ఆ పథకాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌కు ఆరు నెలల సమయమిచ్చారు. అయితే డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం లేక అది ఇంకా సాధ్యపడలేదు. -
నిజాయతీగా ఆడాలని నేను నమ్ముతాను..
అంతా ఊహించిందే జరిగింది. బాల్ ట్యాంపరింగ్ దుశ్చర్య స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ల కెరీర్‌కు చుట్టుకుంది. ఈ ఘటనలో వీరిని దోషులుగా తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)... బుధవారం చర్యలను ప్రకటించింది. స్మిత్,వార్నర్‌లపై 12 నెలలు, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. ఆ తర్వాత స్మిత్ మరో ఏడాది పాటు కెప్టెన్సీ చేపట్టేందుకూ వీల్లేకుండా,వార్నర్‌ను శాశ్వతంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులకు అనర్హుడిగా పేర్కొంటూ ఆదేశాలిచ్చింది. స్మిత్ ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ సారథ్యం వదులుకోగా...సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి వార్నర్ తప్పుకొన్నాడు. నిషేధంపై వీరు ముగ్గురు అప్పీల్ చేసుకునేందుకు వారం గడువు ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో చివరిదైన నాలుగో టెస్టులో వీరి స్థానాలను ఓపెనర్లు జో బర్న్స్, మ్యాట్ రెన్షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ భర్తీ చేయనున్నారు. వికెట్ కీపర్ టిమ్ పైన్ సారథ్యం వహించనున్నాడు. సిడ్నీ: తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. దీనిప్రకారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్ 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. అయితే... క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్ క్రికెట్ ఆడుకునేందుకు అనుమతించింది. నిషేధం ముగిసిన 12 నెలల అనంతరం కూడా స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని సీఏ పేర్కొంది. ఆ తర్వాత బాధ్యతలు అప్పగించే విషయం ఇతర ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయాల మేరకు ఉంటుందని వివరించింది. వార్నర్‌కు భవిష్యత్‌లో ఎప్పటికీ సారథ్యం దక్కదని స్పష్టం చేసింది. అసలేం జరుగుతోంది? బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతుండటాన్ని తెరపై చూసిన కోచ్ డారెన్ లీమన్... వాకీటాకీలో హ్యాండ్స్కోంబ్తో ఏమని మాట్లాడాడో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ వెల్లడించారు. ఆ సందర్భంగా లీమన్... ‘ఏం జరుగుతోంది అక్కడ?’ అంటూ హ్యాండ్స్‌కోంబ్‌ను ప్రశ్నించాడని సదర్లాండ్ తెలిపారు. టీ విరామంలో డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన ఆటగాళ్లనూ అతడు ఇదే ప్రశ్న అడిగాడని వివరించారు. విచారణ నివేదికలోనూ ఇదే విషయం ఉండటంతో ట్యాంపరింగ్‌లో లీమన్ పాత్ర ఏమీ లేదని స్పష్టమైంది. ఈ కారణంగానే అతడిపై చర్యలకు అవకాశం లేకుండా పోయింది. క్రికెట్‌కు జెంటిల్మన్ గేమ్‌గా గుర్తింపు ఉంది. నిజాయతీగా ఆడాలని నేను నమ్ముతాను. జరిగిన ఘటన దురదృష్టకరం. అయితే క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు సరైన నిర్ణయమే తీసుకున్నారు. గెలవడం ముఖ్యమే కానీ ఎలా గెలిచారనేది కూడా అంతకంటే ముఖ్యం. –సచిన్ టెండూల్కర్ అన్ని కోణాల్లో విచారించాం. తప్పు చేసిన ఆటగాళ్లకు ఈ శిక్షలు సరైనవే. క్రికెట్ కీర్తి, స్ఫూర్తి నిలిపేందుకు తీసుకున్న ఈ చర్యలతో నేను సంతృప్తి చెందాను. దీని నుంచి అందరూ పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మా పురుషుల జట్టులోని సంస్కృతి, ఆటగాళ్ల ప్రవర్తన స్వీయ సమీక్ష చేసుకుంటాం. – సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ భావోద్వేగాలను కాస్త పక్కనపెట్టి ఆలోచిద్దాం. అవసరం లేకపోయినా ఒకరిని నష్టపరచడం సరైంది కాదు. వారు చేసిన చర్యను సమర్థించుకోలేరు. కానీ ఏడాది నిషేధం అనేది సరైంది కాదు. నా దృష్టిలో ఒక టెస్టు నిషేధం, కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులనుంచి ఉద్వాసన, భారీ జరిమానాలే సరైన శిక్ష. ఆ తర్వాత వారు ఆడేందుకు అనుమతించాల్సింది. – షేన్‌వార్న్ ఐపీఎల్ నుంచీ తప్పించారు... న్యూఢిల్లీ: తమ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ కూడా స్పందించింది. వారిని ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం పెడుతూ నిర్ణయం తీసుకుంది. లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ఈ మేరకు మీడియాకు తెలిపారు. ‘మొదట ఐసీసీ నిర్ణయం కోసం వేచి చూశాం. తర్వాత సీఏ ఏం చర్యలు తీసుకుంటుందో గమనించాం. ఇప్పుడు మా వంతుగా ఆలోచించి దీనిని ప్రకటించాం. వీరి స్థానాలను భర్తీ చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది’ అని ఆయన వివరించారు. మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌధరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలతో సంప్రదించిన తర్వాత స్మిత్, వార్నర్‌లను లీగ్ నుంచి పక్కనపెట్టినట్లు సీఓఏ పేర్కొంది. -
భారీగా గుట్కాల స్వాధీనం
రామాయంపేట(మెదక్): పట్టణంలోని ఒక కిరాణ దుకాణంపై దాడిచేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రూ. లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకున్నారు. తను సిబ్బందితో కలిసి ఎనిశెట్టి రాములు కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించామని విజిలెన్స్ సీఐ బాల్‌రెడ్డి చెప్పారు. సదరు వ్యాపారి దుకాణం వెనుకభాగంలో ఉన్న గోదాంలో దాచి ఉంచిన నిషేధిత గుట్కా, జర్ధా, సాగర్, షైనీ గుట్కా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకుని గోదాంకు సీల్‌వేసి వెళ్లిపోయామన్నారు. శుక్రవారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి రవీందర్రావు, మరో అధికారి విద్యాకర్‌రెడ్డి, తాను గోదాంను తెరిచి తనిఖీ చేసి 30 బ్యాగుల్లో దాచి ఉంచిన ప్యాకెట్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. ఈమేరకు పంచనామా నిర్వహించి దుకాణం యజమాని సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
పందెం కో‘ఢీ’
సన్నాహాలతో ‘సై’ అంటున్న పందెగాళ్లు హైకోర్టు ఆదేశాలతో ఆచీతూచీ అడుగులు ఎప్పుడూ ఉన్నదేనంటూ సమాయతమ్తవుతున్న వైనం గతమంతా రూ.30 కోట్లతో హవా ఆ వైభవాన్ని కొనసాగిస్తామంటూ ధీమా సంక్రాంతి వచ్చిందంటే భోగిమంట ... కొత్త దుస్తులు... ఇంటి ముందు ముగ్గులు... తోరణాలు... హరిదాసుల గానాలాపనలు... కొత్త అల్లుళ్లతో కోలాహలం... పిల్లల పరుగులు...గోమాతలకు పూజలు ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా పండగే. కానీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు, ఆ ముసుగులో మరిన్ని జూదాలు, కత్తుల కోలాటాలు... ఘర్షణ వాతావరణం... ఇవుంటేనే సం... క్రాంతి. ఈ తీరుపై సోమవారం హైకోర్టు కన్నెర్ర చేసింది. కోడి పందేలు నిర్వహించకుండా చూడాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీలకు అప్పగించింది. గట్టి చర్యలు తీసుకోవాలని హుంకరించడంతో పందెగాళ్లు తర్జనభర్జన పడుతున్నారు. ఇంకొంతమంది ఇదంతా మామూలే అన్నట్టుగా కోళ్లను దువ్వుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు అన్నిటికంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు. ఈ పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇవి లేకుండా సంక్రాంతి సంబరాలు జరగవంటే అతిశయోక్తికాదు. ఓ తిరునాళ్లను తలపించే విధంగా నిర్వహిస్తూ ఓ సంప్రదాయ క్రీడగా వీటిని పరిగణిస్తారు. కోడి పుంజుకు కత్తి కట్టకుండా పందెం కడితేనే అది సంప్రదాయ క్రీడ అవుతుంది. అదే కత్తికట్టి బరిలోకి దింపి పందేలు కాస్తే కచ్చితంగా అది చట్ట ప్రకారం నేరమే అవుతుంది. కానీ గోదావరి పొడవునా ఉన్న పల్లెల్లో ఈ నిబంధనలేమీ వర్తించవంటారు స్థానికులు. వారిని స్థానికులనేకంటే ఆయా ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు అనడమే సబబు. ప్రతి సంక్రాంతికి ముందూ పందేలు జరగనివ్వమని...లాఠీ ఝుళిపిస్తామని పోలీసులు హుంకరిస్తుంటారు. కానీ సంక్రాంతి ప్రారంభానికి పది రోజులు ముందు నుంచి ప్రారంభమై సంక్రాంతి మూడు రోజులు కోట్ల పందేలు జరిగిపోతూనే ఉంటాయి. ఈ సమయాల్లో పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం ప్రతి సంక్రాంతికి షరా’మామూలుగానే తయారవుతోంది. కోర్టు ఆదేశాలున్నా.. వినోదం పేరుతో మూగజీవాలను హింసించడం తగదని సోమవారం హైకోర్టు హెచ్చరించింది. అటువంటి కోడి పందేలు అసలు నిర్వహించ వద్దని, నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పీపుల్ ఫర్ ఏనిమల్ ఆర్గనైజేషన్, ఏనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్లపై కోర్టు ప్రభుత్వానికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో సంక్రాంతికి కోడి పందేలపై చర్చ మొదలైంది. ఈసారి పందేలు జరుగుతాయా లేవా అనే దానిపై పందేల నిర్వాహకులు, రాజకీయ నాయకుల మధ్య తీవ్రంగా చర్చ సాగుతోంది. ప్రతి ఏటా ఇటువంటి ఉత్తర్వులు రావడం మామూలేనని, ఆరు నూరైనా పందేలు నిర్వహించడం ఖాయమనే పందేల రాయుళ్ల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. జిల్లాలో అల్లవరం మండలం గోడి, గోడిలంక, ఐ.పోలవరం మండలం మురమళ్ల, పెదమడి మొక్కతోట, కేశనకుర్రు, ఎదుర్లంక, రావులపాలెం మండలం దేవరపల్లి, మల్కిపురం మండలం ఉయ్యూరువారిమెరక, పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, జగ్గంపేట శివారు మల్లిశాల, తుని, రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో కో అంటే కోడిపందేలు కోట్లలోనే నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలోనే... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు దగ్గరుండి మరీ కోడిపందేలు ఆడించిన సందర్భాలు అనేకం. గత ఏడాది సంక్రాంతి మూడు రోజులు జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఎల్ఈడీ స్క్రీ¯ŒSలు ఏర్పాటు చేసి మరీ కోడిపందేలు నిర్వహించారు. మురమళ్లలో జరిగిన ఈ పందేలు రూ.కోట్లు దాటేశాయి. పేరుకు సంప్రదాయబద్ధమని పైకి చెబుతూ బరిలో మాత్రం పక్కా ప్లా¯ŒSతో జూదంగా మార్చేస్తుంటారు. వీరికి రాజకీయ అండదండలు దండిగానే ఉంటాయి. పోలీసులు బరి దగ్గరకు రాకుండానే వాటాలు వెళ్లిపోతాయి. కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో గుండాట, గాంబ్లింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డూ అదుపే ఉండదు. ఆ ముసుగులో అన్నీ... కోడి పందేలతోపాటు మిగిలిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు వారం రోజులు ముందుగానే వేలం పాటలు నిర్వహించి లక్షల్లో రేట్లు నిర్ణయిస్తారు. పందెం కాపు కాసే నగదు నుంచి మామూళ్ల పంపకానికి వాటాలు కూడా తీస్తారు. అందుకోసం సొమ్మునంతటినీ ఒక పూల్‌గా ఏర్పాటు చేస్తారు. ఇదంతా చక్కబెట్టినందుకు నాయకులకు కూడా తగినంత ముడుతుంది. గత ఏడాది సంక్రాంతి మూడు రోజులు జిల్లా అంతటా కలిపి రూ.20 నుంచి రూ.30 కోట్లు కోడి పందేలు జరిగాయని అంచనా. గతేడాది కూడా న్యాయస్థానం ఇదేరకమైన ఉత్తర్వులు ఇచ్చినా చివరకు పందెం కోడే గెలిచింది. పందేలు నియంత్రించాల్సిన ఖాకీ ఓడిపోయింది.ఈ సారి ఏం జరుగుతుందో తేలాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. -
నిషేధం
పాఠశాలల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల బ్యాన్ ‘సాక్షి’ కథనానికి స్పందించిన విద్యాశాఖ ఎంఈఓ, డిప్యూటీ ఈఓలకు సర్క్యూలర్ నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక జోగిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని జిల్లా విద్యా శాఖ నిషేధించింది. ఈ మేరకు డీఈఓ సర్క్యూలర్ జారీ చేశారు. ‘బాటిల్లో విషం’ అనే శీర్షికన నవంబర్ 11న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు నీటి వసతిని కల్పించాలని, ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో తెచ్చుకోకుండా వారికి అవగాహన కల్పించాలని డీఈఓ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నట్టు ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన విషయాన్ని సర్య్కూలర్‌లో పొందుపరిచారు. నవంబర్ 30న జిల్లాలోని 2,899 పాఠశాలల హెచ్ఎంలకు, ఎంఈఓలకు, ఉప విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వు కాపీని మెయిల్ చేశారు. పాఠశాలలో స్వచ్ఛమైన నీటిని విద్యార్థులకు అందించాలని డీఈఓ ఆదేశించారు. ఈ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.