పాఠశాలల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల బ్యాన్
‘సాక్షి’ కథనానికి స్పందించిన విద్యాశాఖ
ఎంఈఓ, డిప్యూటీ ఈఓలకు సర్క్యూలర్
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
జోగిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని జిల్లా విద్యా శాఖ నిషేధించింది. ఈ మేరకు డీఈఓ సర్క్యూలర్ జారీ చేశారు. ‘బాటిల్‌లో విషం’ అనే శీర్షికన నవంబర్ 11న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు నీటి వసతిని కల్పించాలని, ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో తెచ్చుకోకుండా వారికి అవగాహన కల్పించాలని డీఈఓ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నట్టు ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన విషయాన్ని సర్య్కూలర్‌లో పొందుపరిచారు. నవంబర్ 30న జిల్లాలోని 2,899 పాఠశాలల హెచ్‌ఎంలకు, ఎంఈఓలకు, ఉప విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వు కాపీని మెయిల్ చేశారు. పాఠశాలలో స్వచ్ఛమైన నీటిని విద్యార్థులకు అందించాలని డీఈఓ ఆదేశించారు. ఈ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిషేధం
Published Wed, Dec 2 2015 11:53 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement