
పట్టుబడిన గుట్కా ప్యాకెట్ బస్తాలు
రామాయంపేట(మెదక్): పట్టణంలోని ఒక కిరాణ దుకాణంపై దాడిచేసిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రూ. లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకున్నారు. తను సిబ్బందితో కలిసి ఎనిశెట్టి రాములు కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించామని విజిలెన్స్ సీఐ బాల్‌రెడ్డి చెప్పారు. సదరు వ్యాపారి దుకాణం వెనుకభాగంలో ఉన్న గోదాంలో దాచి ఉంచిన నిషేధిత గుట్కా, జర్ధా, సాగర్, షైనీ గుట్కా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకుని గోదాంకు సీల్‌వేసి వెళ్లిపోయామన్నారు. శుక్రవారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి రవీందర్‌రావు, మరో అధికారి విద్యాకర్‌రెడ్డి, తాను గోదాంను తెరిచి తనిఖీ చేసి 30 బ్యాగుల్లో దాచి ఉంచిన ప్యాకెట్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. ఈమేరకు పంచనామా నిర్వహించి దుకాణం యజమాని సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment