సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ మహేందర్, వెనుక నిందితుడు కిరణ్
హుస్నాబాద్ : అక్రమంగా తరలిస్తున్న అంబర్ ప్యాకెట్ బస్తాలను పట్టుకున్నట్టు ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈమేరకు బుధవారం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచారం మేరకు మంగళవారం రాత్రి పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేపట్టగా..ఇన్నోవా కారులో అంబర్ ప్యాకెట్ల సంచులను గుర్తించారు. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ దుర్గం కిరణ్‌ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. బీదర్ నుంచి హుస్నాబాద్ మీదుగా ఏన్టీపీసీకి ఈ గుట్కాలను తరలిస్తున్నట్టు గుర్తించారు. వాహనంలో ఉన్న 18 బస్తాల్లో ఒక్కో బస్తాలో 100 ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్‌లో 25 అంబర్ ప్యాకెట్లు ఉన్నాయని ఏసీపీ తెలిపారు.
బీదర్‌లో రూ.2.60 లక్షలతో ఈ సరుకుని కొనుగొలు చేయగా, బయటి మార్కెట్ విలువ రూ.6.75 లక్షలు ఉంటుందని తెలిపారు. ఏన్టీపీసీకి మండలంలోని మల్కాపూర్‌కు చెందిన డ్రైవర్ దుర్గం కిరణ్‌తో పాటుగా వ్యాపారి ఉత్తూరు శ్రీకాంత్ చాలాకాలంగా అంబర్, గుట్కా ప్యాకెట్లను అక్రమ రవాణాతో పాటు జిల్లాలోనూ విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. ఇప్పటికే వీరిపై మూడు కేసులు నమో దు అయ్యాయని చెప్పారు.
మరోవైపు గుట్కాలు, వ్యసనాలకు బానిసలు కావొద్దని ఏసీపీ మహేం దర్.. ప్రజలుకు సూచించారు. ఎవరైన ఇలాంటి వ్యసనాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. చాకచక్యంగా అంబర్ బస్తాలను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ సంపత్‌ను ఏసీపీ సన్మానించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్సై సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment