ఈనెల 22న యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనిని తిలకించేందుకు దేశంలోని రామభక్తులు తహతహలాడుతున్నారు. అయితే 22న అతిథులకు మాత్రమే రామాలయంలో ప్రవేశానికి ఆహ్వానం ఉంది. మిగిలినవారుకూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగే అవకాశం ఉంది.
మీడియా సెంటర్ ఏర్పాటు
ఇప్పటికే అయోధ్య ధామ్‌లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్ కథా సంగ్రహాలయ్ వద్ద మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ (డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వివిధ రైల్వేస్టేషన్లలో..
రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశవ్యాప్తంగా వివిధ రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఆయా రైల్వే స్టేషన్లలో తొమ్మది వేల స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, ఆ స్క్రీన్లపై ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
న్యూయార్క్ నగరంలో..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్ స్క్వేర్‌లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో కూడా ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానున్నది. 2020 ఆగస్ట్ 5న అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భూమి పూజ చేసినప్పుడు ఈ కార్యక్రమం టైమ్స్ స్క్వేర్‌లోని డిజిటల్ బిల్‌బోర్డ్‌పై డిస్‌ప్లేపై చేశారు.
23న కూడా ప్రత్యక్ష ప్రసారం
జనవరి 23న కూడా దూరదర్శన్‌లో రామ్‌లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా, సరయూ ఘాట్ సమీపంలోని రామ్‌కి పైడి, కుబేర్ తిల దగ్గరున్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది.
ఇది కూడా చదవండి: నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?
ప్రత్యేక యూట్యూబ్ లింక్
మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసేందుకు ప్రత్యేక యూట్యూబ్ లింక్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
4కె టెక్నాలజీతో..
దూరదర్శన్‌తో పాటు పలు ప్రైవేట్ ఛానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్‌ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుందని, ఫలితంగా ప్రేక్షకులు హైక్వాలిటీ పిక్చర్‌ను చూడగలుగుతారని అపూర్వ చంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment