మరికొద్ది సేపట్లో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా రాములోరికి హారతులు పట్టే సమయాన ఆలయంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి.
బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 30 మంది కళాకారులు తమ సంగీత ప్రతిభను చాటనున్నారు. హారతి సమయంలో అతిథులంతా గంటలు మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామాలయంలోనికి ప్రధాని నరేంద్ర మోదీ అడుగిడనున్నారు.
ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగించనున్నారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
ఇది కూడా చదవండి: ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
Comments
Please login to add a commentAdd a comment