అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో కొలువయ్యే బాలరామునికి ఆఫ్గనిస్థాన్‌తో సహా ప్రపంచం నలుమూలల నుండి కానుకలు అందుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తాజాగా కశ్మీర్, తమిళనాడు, ఆఫ్గనిస్థాన్ నుండి వచ్చిన కానుకలను రామాలయ ట్రస్ట్‌కు అందజేశారు.
అయోధ్య రామాలయ నిర్మాణంపై ముస్లిం సమాజం కూడా సంతోషంగా ఉందని అలోక్ కుమార్ పేర్కొన్నారు. కాశ్మీర్‌కు చెందిన ముస్లిం సోదరులు, సోదరీమణులు తనను కలవడానికి వచ్చి, రామమందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వారు సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమపువ్వును అందజేశారన్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు ఆఫ్గనిస్థాన్ నుండి కూడా ప్రత్యేక బహుమతి వచ్చిందని అలోక్ కుమార్ చెప్పారు. ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో గల ‘కుబా’నదిలోని నీటిని కానుకగా స్వీకరించామని అన్నారు. తమిళనాడుకు చెందిన పట్టు వస్త్రాల తయారీదారులు శ్రీరాముని ఆలయ చిత్రంతో నేసిన సిల్క్ దుస్తులను పంపారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment