సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు బీజేపీ కూడా శ్రీరామ కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుని అనుమతివ్వడం గమనార్హం. కాగా, భద్రాచల శ్రీరాముని కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం సీఈవో వికాస్‌రాజ్‌కు లక్ష్మణ్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment