seetharamula kalyanam
-
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ కూడా శ్రీరామ కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకుని అనుమతివ్వడం గమనార్హం. కాగా, భద్రాచల శ్రీరాముని కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం సీఈవో వికాస్‌రాజ్‌కు లక్ష్మణ్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు. -
ఈసారైనా.. నవమికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేనా..?
భద్రాచలం: ముఖ్యమంత్రి హోదాలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించక ఏడేళ్లు గడుస్తున్నాయి. తానీషా ప్రభువు కాలం నాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుండగా, ప్రభుత్వం తరఫున భద్రాచలం రామయ్యకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సీఎం కేసీఆర్ ఈసారైనా సమర్పిస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాగా కల్యాణం మరుసటి రోజు నిర్వహించే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పర్యటన ఇప్పటికే ఖరారైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం వేడుకలకు వస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పర్యటనపై సస్పెన్స్.. సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఇప్పటికే జిల్లాకు రెండుసార్లు వచ్చారు. గోదావరి వరద ముంపు బాధితుల పరామర్శకు ఒకసారి, కొద్ది రోజుల క్రితం నవభారత్ ఏరియాలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభానికి మరోసారి వచ్చి వెళ్లారు. నవమి వేడుకలకు కూడా వస్తే జిల్లాకు ముచ్చటగా మూడుమార్లు వచ్చినట్లుగా ఉంటుంది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం వస్తారని, కల్యాణ వేడుకలకు హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ నేతల భారీగా ఆశలు పెట్టుకున్నారు. భద్రాచలం అభివృద్ధి, నవమికి సీఎం గైర్హాజరుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ రాకనే గట్టి సమాధానమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ పర్యటనపై తీవ్ర సస్పెన్స్ నెలకొన్నది. ఏడేళ్లుగాశ్రీరామనవమికి రాని సీఎం తహసీల్దార్‌గా ఉన్న కంచర్ల గోపన్న భక్త రామదాసుగా మారి గుడిని నిర్మించటం, ఆ తర్వాత ప్రభుత్వ నిధులను వ్యయం చేసినందుకు తానీషా ప్రభువు ఆయన్ను జైల్లో పెట్టించటం, మళ్లీ విడుదల చేయటం, అనంతరం మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి శ్రీరామనవమికి ప్రభుత్వం తరఫున తానీషా ప్రభువు పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించటం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో కేసీఆర్ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లను అందచేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు కేసీఆర్ గైర్హాజరవుతానే ఉన్నారు. 2017లో సీఎం మనుమడు పట్టువస్త్రాలను అందచేయగా, అనంతరం దేవాదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలను అందచేస్తూ వస్తున్నారు. గవర్నర్ రాక.. భద్రాచలంలో 31న జరిగే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై రాక ఇప్పటికే ఖరారైంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటనకు రాగా, వారితోపాటు గవర్నర్ కూడా వచ్చారు. గోదావరి వరదల సమయంలో వరద బాధితుల పరామర్శకు అశ్వాపురం మండలానికి వచ్చారు. మళ్లీ ఈ ఏడాది మూడోసారి పుష్కర పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు. హర్యాన రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు రానున్న దేవాదాయశాఖ మంత్రి.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఉదయం భద్రాచలం చేరుకోనున్నారు. రంగనాయకుల గుట్టపై దాతల సహాయంతో నిర్మించిన సీతానిలయాన్ని ప్రారంభించనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మంగళవారం భద్రాచలం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేడుకలకు చినజీయర్ స్వామి రానున్నట్లు జీయర్ మఠం నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. కాగా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో సీఎం, గవర్నర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. -
గోటితో వొలిచే తలంబ్రాలు..స్వామి, అమ్మవార్ల కోసం సిద్ధం
-
సీతా రాముల కల్యాణానికి ముహూర్తం
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహణకు ముహూర్తం నిశ్చయించారు. కాగా, 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం మార్చి 31న జరగనుండగా, బ్రహ్మోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవం షెడ్యూల్‌ను వైదిక కమిటీ, ఆలయ ఈవో శివాజీ సోమవారం ప్రకటించారు. ఉగాది పర్వదినాన... మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, మార్చి 22 నుంచి మార్చి 31 వరకు పుష్కర పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద సహిత శ్రీరామాయణ మహాక్రతువు ఉత్సవాలను జరపనున్నారు. మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కర పట్టాభిషేకం క్రతువుకు అంకురార్పణ జరగనుంది. 26న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 28న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను జరుపుతారు. 30న శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహనసేవ, 31న పుష్కర పట్టాభిషేక మహోత్సవం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, రథోత్సవం ఉంటాయి. ఏప్రిల్ 5న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల సమయాన రోజువారీ ప్రత్యేక పూజలు నిలిపివేయనున్నారు. ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం భద్రా చలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంతోపాటు మరుసటి రోజే జరిగే రామయ్య పట్టాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడికి భద్రాచలంలో ప్రతీ 60 ఏళ్లకు ఒక్కసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో 1927, 1987ల్లో జరగగా, మళ్లీ 2047లో మాత్రమే కళ్లారా చూసేందుకు అవకాశముంది. ఇది కాకుండా ప్రతీ 12 ఏళ్లకోసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపుతారు. 1999, 2011లో ఈ పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 31న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ బాధ్యులు స్వామివారి వాహన సేవలకుగాను నూతన వాహనాలను తయారు చేయిస్తున్నారు. -
కల్యాణం నేపథ్యంలో.. 15న ట్రాఫిక్ మళ్లింపు
కడప అర్బన్: ఒంటిమిట్టలో ఈనెల 15న సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలను అనుమతించరని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాహనాల మళ్లింపు వివరాలు ఇలా.. ► కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్‌పల్లి, ఇర్కాన్ సర్కిల్ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి. ► పులివెందుల నుంచి కడప నగరానికి, కడప మీదుగా వెళ్లే వాహనాలను సాక్షి సర్కిల్ నుంచి ఊటుకూరు సర్కిల్ వైపు దారి మళ్లిస్తారు. ► తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. ► రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా మళ్లిస్తారు. ► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా దారి మళ్లిస్తారు. ► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను సాలాబాద్ సమీపంలో 15 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి. ► కల్యాణ వేదిక నుంచి కడప మార్గంలో 10 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. -
ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు.. భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది. బుక్ చేసుకున్నవారు రూ.80 చెల్లించా లి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉం టుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్ చేసుకున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు. -
ఇవి భద్రాద్రిలో మాత్రమే ప్రత్యేకం.. 170 క్వింటాళ్లు సిద్ధం..
భద్రాచలం: ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా.. ఇరముల మెరిసిన సీతారాముల కల్యాణము చూతము రారండి’ అంటూ సీతా రాముల కల్యాణంలో తలంబ్రాల విశిష్టతను వివరించారో సినీ రచయిత. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులు పునీతులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామి వారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. స్వామి, అమ్మవారి నుదుటిపై జాలు వారే తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని వారి విశ్వాసం. అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ప్రతి ఏడాది పెరుగుతోంది. దీంతో ఈ సంవత్సరం అత్యధికంగా 170 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేస్తున్నారు. భద్రాద్రిలో మాత్రమే ప్రత్యేకం.. అక్షతలు అంటే శాశ్వతమైనవని, నశించిపోని సుఖాలను కలుగజేసేవని పండితులు చెబుతున్నారు. వధూవరులు జీవితాంతం ఒకరికొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని, అయితే ఆది దంపతులైన సీతా రాముల శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనసుకు అధిపతి. మనసుకు ప్రశాంతత కలిగించేవాడు చంద్రుడు గనుక అతడికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారు. ఆలుమగల దాంపత్యం మనసుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకోవడం ద్వారా వారి మధ్య మరింత అనురాగం పెంపొందుతుందని, అన్యోన్యంగా జీవించడానికి ప్రతీకగా భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తామని పండితులు వివరిస్తున్నారు. తానీషా కాలం నుంచి ఆచారం.. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తులతో పాటు రాజ్యమంతా (ప్రభుత్వం) రామ య్య సేవలో పాలుపంచుకోవాలనే తలంపుతో నిజాం నవాబు తానీషా ప్రభువు ముత్యాలను సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించేలా శాసనాన్ని తీసుకొచ్చారు. ఆ ఆనవాయితీ ప్రకారం నేటికీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు. గోటి తలంబ్రాలతో భక్తుల రాక.. తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు నియమ నిష్టలతో పండించి ఒడ్లను గోటితో ఒలిచి రామయ్య కల్యాణానికి సమర్పించటం విశేషం. ఏపీలోని జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, కోరుకొండ, చీరాల, తెలంగాణలోని ఇల్లెందు, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇలా తలంబ్రాలు అందజేస్తున్నారు. ప్రతి ఏడాది గోటితో ఒలిచిన తలంబ్రాలు సుమారు 6 క్వింటాళ్ల వరకు వస్తుండగా, ఇతర భక్త సమాజాలు, సారపాక ఐటీసీ వంటి స్వచ్ఛంద సంస్థలు 100 క్వింటాళ్ల బియ్యం అందిస్తున్నాయి. కాగా తలంబ్రాలకు పెరుగుతున్న భక్తుల ఆదరణ దృష్ట్యా ఈ ఏడాది అత్యధికంగా 170 క్వింటాళ్లు సిద్ధం చేస్తున్నారు. -
శేషవాహనంపై శ్రీరాముడు
ఒంటిమిట్ట/నెల్లిమర్ల రూరల్/సింహాచలం(పెందుర్తి): ఆంధ్ర రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీసమేతంగా స్వామి వారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ఉత్సవ నిర్వాహకులు రాజేష్ సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితులు గరుడ పతాక ప్రదర్శన చేపట్టారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహా్వనించారు. విష్వక్సేన పూజ, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన జరిపారు. బుధవారం రాత్రి జగదభిరాముడు శేషవాహనంపై విహరించారు. రామతీర్థంలో వైభవంగా కల్యాణ వేడుక విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ సీతారామస్వామి సన్నిధిలో బుధవారం స్వామివారి కల్యాణం కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగానే జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను ఆరేళ్లుగా అందజేస్తున్న నేపథ్యంలో వాటిని ఏఈవో రాఘవకుమార్, ఇన్చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు రామతీర్థం ఆలయానికి సమర్పించారు. వాటిని ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రాములవారికి అందజేశారు. కల్యాణ క్రమంలో ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆశీర్వచన మండపం వద్దకు అర్చకులు తీసుకువచ్చారు. అక్కడ వెండి మండపం మధ్యభాగంలోని అమ్మవారిని, స్వామివారిని వేంచేపు చేశారు. వేదమంత్రోచ్ఛారణ నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారామస్వామి వార్ల శిరస్సుపై ఉంచారు. శా్రస్తోక్తంగా మాంగల్యధారణ గావించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ పాల్గొన్నారు. -
భద్రాద్రిలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం
-
కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం
-
భద్రాద్రిలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం
సాక్షి, భద్రాచలం: భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వేదపండితులు సీతారాముల కల్యాణ ఘట్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ కమనీయ కల్యాణ వేడుక శ్రీరాముని భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కల్యాణ వేడుకకు హాజరయ్యారు. కరోనా కారణంగా రెండో ఏడాది ఆంతరంగికంగా రాములోరి కల్యాణం జరుగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వరుసగా రెండో ఏడాదీ భక్తుల లేకుండా స్వామివారి కల్యాణం ఘట్టం పూర్తయింది. రేపు (గురువారం) శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది. చదవండి: శ్రీరామనవమి ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా? -
ఏప్రీల్ 1నుంచి 11వరుకు సీతారాముల కళ్యాణం
సాక్షి, వైఎస్సార్ కడప: రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరంలో కోదండరాముని బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వారు నిర్వహించనున్నారు. ఏప్రీల్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అంగరంగ వైభవంగ నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం 11వ తేదీన పుష్పయాగం, ఏకాంత సేవతో ముగియనున్నాయి. 1వ తేదీనాడు సీతారామలక్షణులకు వ్యాసాభిషేకం చేస్తారు. 2వ తేదీన ఉదయం ద్వాజారోహనం, రాత్రి శేష వాహనం 3న ఉదయం వేణుగాన అలంకారం రాత్రి హంస వాహనం 4న ఉదయం వటపత్రా సాయి అలంకారం రాత్రి సింహవాహనం 5న ఉదయం వవనీత కృష్ణ అలంకారం రాత్రి హనుమంత సేవ 6న ఉదయం మోహిని అలంకారం రాత్రి గరుడసేవ 7న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కళ్యాణం మహోత్సవం 8న రథోత్సవము 9న ఉదయం కాళీయమర్దన అలంకారం రాత్రి అశ్వవాహనం 10న ఉదయం చక్రస్నానం సాయంత్రం ధ్వజావరోహణం 11న సాయంత్రం పుష్పయాగం రాత్రి ఏకాంత సేవతో -
ఆవుడెక్కల కింద నలిగిన బాలుడు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ ఆవరణలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయ సమీపంలోని గుడిచెరువులో తల్లి దండ్రులతో కలసి నిద్రిస్తున్న బాలుడు ఆవుడెక్కల కింద నలిగి మృతిచెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూర్‌కు చెందిన తిరుపతి, స్వప్న దంపతులు కుమారుడు అనూష్(3), కూతురితో కలసి ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. రాత్రివేళ గుడిచెరువు ఖాళీ ప్రదేశంలో నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ ఆవుల మంద అటుగా పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ గుంపులోని ఆవులు వారు నిద్రిస్తున్న ప్రాంతంలోంచి వెళ్లగా వాటి డెక్కల కింద నలిగి అనూష్ గాయపడ్డాడు. తల్లి దండ్రులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చిన తమకు పుత్రశోకమే మిగిలిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
పులకించిన భద్రగిరి
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కల్యాణం సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా ప్రాంగణంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. వేడుకలో భాగంగా మొదట గర్భగుడిలో అభిషేకం జరిపించారు. అక్కడ ధ్రువమూర్తులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆలయ ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్త రామదాసు చేయించిన బంగారు నగలను ధరించిన శ్రీసీతారాముల వారు చూడముచ్చటగా కనిపించారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తలంబ్రాలు పోసే వేడుకను జరిపించారు. భద్రాద్రి క్షేత్ర మహత్మ్యం, శ్రీసీతారాముల కల్యాణ విశిష్టతను వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. మార్మోగిన రామనామస్మరణం శ్రీసీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. సుమారు 1.50 లక్షల మంది కల్యాణాన్ని తిలకించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కల్యాణ వేడుక తంతు జరుగుతున్నంత సేపూ మిథిలా ప్రాంగణం రామనామస్మరణంతో మార్మోగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు తీసుకొస్తారని ప్రకటించినప్పటికీ.. చివరి క్షణాల్లో ఆయన పర్యటన రద్దయింది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున జేఈవో శ్రీనివాసరాజు శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలను అందజేశారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కల్యాణోత్సవాన్ని వీక్షించారు. స్వామివారికి కల్యాణం జరిగిన వేదికపైనే మంగళవారం పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
* భద్రాద్రిలో వేడుకగా సీతారాముల కల్యాణం * ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ వేడుకగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి భక్తజనం పులకించిపోయారు. రామయ తండ్రి సీతమ్మ వారిని పరిణయమాడిన వేళ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబసమేతంగా కల్యాణానికి విచ్చేశారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా శనివారం వేకువజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులను పూల పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాలతో, వేదనాద పురస్సరంగా సకల విధ రాజలాంఛనాలతో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. భక్తుల రామనామస్మరణ మధ్య శిల్ప కళాశోభితంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించిన కల్యాణ మండపంపై సీతమ్మ వారిని, స్వామివారిని ఆసీనులను చేశారు. కల్యాణ వేడుకలో భాగంగా స్వామివారికి తిరువారాధన, విష్వక్సేనపూజ నిర్వహించారు. అందరి గోత్రనామాలు జపించి, చేయబోయే కల్యాణ తంతుకు ఎలాంటి విఘ్నాలూ జరగకుండా కర్మణ్యే పుణ్యాహవచనం అనే మంత్రంతో మండపశుద్ధి చేశారు. కల్యాణానికి సంబంధించిన వస్తువులకు ఎటువంటి దోషాలు లేకుండా మంత్రజలంతో ప్రోక్షణ గావించారు. దీని ద్వారా కల్యాణ సామగ్రి అంతా సీతారాములకు వినియోగించేందుకు యోగ్యతమవుతాయి. శ్రీ యముద్వాహ్యస్యే అన్న సంకల్పంతో స్వామికి ఎదురుగా సీతమ్మను కూర్చుండబెట్టారు. కన్యావరణను జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణం గావించారు. వధూవరుల వంశ గోత్రాల ప్రవరలు ప్రవచించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేశారు. గతేడాది కంటే కాస్త తగ్గిన భక్తులు శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గతేడాదికంటే స్వల్పంగా తగ్గినప్పటికీ.. సుమారు 60 వేలు పైగా భక్తులు హాజరయ్యూరు. విద్యార్థుల పరీక్ష లు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలోనూ సీతారాముల కల్యాణం జరగటంతో కొంతమంది భక్తులు తగ్గినట్లు భావిస్తున్నారు. కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఇంకా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పొంగులే టి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, జడ్జిలు చల్లా కోదండరామ్, సునీల్ చౌదరి, శివశంకర్‌రావు, ఎస్. జగన్నాథం, ఐ.రమేశ్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కోరం కనకయ్య, మదన్‌లాల్, జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, పూల రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జాయింట్ కలెక్టర్ దివ్య, భద్రాచలం ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రామదాసు ఆభరణాలతో కల్యాణం భక్త రామదాసు చేయించిన బంగా రు ఆభరణాలను స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. మధుపర్కప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామికి నివేదించారు. సీతారాములకు నూతన వస్త్రాలంకరణ చేశారు. లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని మహాసంకల్పం పఠించారు. కన్యాదానంతో పాటు గోదానం, భూదానం చేయించారు. స్వామికి ఎనిమిది శ్లోకాలు, అమ్మవారికి మరో ఎనిమిది శ్లోకాలతో మంగళాష్టకం చదివారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాలకు మాంగల్యపూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగల్యధారణ గావించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. సీతారాముల శిరస్సు పైనుంచి జాలువారిన తలంబ్రాల కోసం భక్తులు ఎంతో ఆసక్తి చూపారు. తాత్కాలిక నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశారు. మహదాశీర్వచనం నిర్వహించి హారతి పట్టడంతో స్వామివారి కల్యాణ తంతు పూర్తయింది. ఆ తరువాత స్వామి వారిని తిరువీధి సేవకు తీసుకెళ్లారు. నేడు శ్రీరామ పట్టాభిషేకం స్వామివారి పట్టాభిషేక మహోత్సవం ఆదివారం మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపంపై ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీరామపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. -
కనులారా రాములోరి కల్యాణం
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని పద్మనగర్ ప్రాంతంలోని శ్రీ రామ మందిర ప్రాంగణంలో రాములోరి కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. గత 25 సంవత్సరాలుగా నవమి వేడుకలు నిర్వహిస్తున్న శ్రీ రామ మందిర్ ట్రస్ట్ సభ్యులు ఈసారి కూడా మందిరాన్ని రంగు రంగు పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నెల మూడో తేదీ నుంచి నిత్య పూజా కార్యక్రమాలతో పాటు రామాయణ పారాయణం, హోమం, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రభాత భే రి, సంపూర్ణ గీతా పారాయణం, యజ్ఞం నిర్వహించిన అనంతరం అభిజిత్ లగ్నమందు స్వామివారికి కల్యాణ తంతు ప్రారంభించి ఉదయం 11.45 గంటలకు మాంగల్యధారణ చేశారు. ఈ కమనీయ కల్యాణాన్ని తిలకించడం కోసం పద్మనగర్ ప్రాంతవాసులతో పాటు కామత్‌ఘర్, అంజూర్‌పాట, నాయిబస్తీ, బాలాజీనగర్, నార్‌పోళి దేవ్జీనగర్, బండారి కాంపౌండ్, కోమల్పాడ, సంఘం పాడ నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వివాహనంతరం స్వామివారికి మహిళా భక్తులు వడి బియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో సుమారు 10 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని నిర్వాహకులు డాక్టర్ అంకం నర్సయ్య, కట్ల మల్లేశ్, చేర్యాల వెంకటి తెలిపారు. దాదర్‌లో... సాక్షి, ముంబై: దాదర్‌లోని ఆంధ్రమహాసభ ఆవరణలో మంగళవారం ఉదయం శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉదయం నుంచి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాసభ అధ్యక్షుడు సంకు సుధాకర్, శ్రీ వేంకటేశ్వర పూజ మందిర ట్రస్టీ ఏఎస్ఆర్కే ప్రసాద్ దంపతులు పాల్గొని వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా రాములోరి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత అష్టోత్తర అర్చన, మహిళా శాఖవారు భక్తి గీతాలు ఆలపించారు. దీంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. అనంతరం మహాసభ మాజీ అధ్యక్షుడు డాక్టర్.జి.హరికిషన్ సీతారాములకు మంగళహారతులు ఇచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఆ తర్వాత భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర పూజా మందిర ట్రస్టీ చైర్మన్ కె.ఎస్.కృష్ణమూర్తి, కార్యదర్శి కె.ఎస్.ఆర్.మూర్తి, సభ్యులు ఓ.సుబ్రహ్మణ్యం, ఆంధ్ర మహాసభ ధర్మకర్తలు, కె. రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కస్తూరి హరిప్రసాద్‌లతోపాటు మహిళాశాఖ అధ్యక్షురాలు పి.భారతలక్ష్మి, కార్యదర్శి సోమల్ లత, ఉపాధ్యక్షురాలు టి.కరుణశ్రీ, సంయుక్త కార్యదర్శి టి.అపరాజిత, సభ్యులు భోగ జ్యోతిలక్ష్మి, పి.పద్మ, పి.దేవి రావు, సంగెవేని విజయ, వై.లత తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉల్లాస్‌నగర్‌లో...: ఉల్లాస్‌నగర్‌లోని బాలాజీ ముంబై తెలుగు సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఫార్వర్డ్‌లైన్ వాల్మీకినగర్‌లోని ఓ శివాలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలను తీసుకొచ్చి స్థానిక పూజా పంచాయతీ హాలులో కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానికంగా ఉంటున్న తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూకా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభాదేవిలో...: ప్రభాదేవిలోని భగవాన్ శ్రీసత్యానందమహర్షి భక్త మండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంతో భక్తిశ్రద్ధ్రలతో ఉగాది పర్వదినం నుంచి కొనసాగిన ‘అఖండ హరినామ సంకీర్తన సప్తాహ’ మంగళవారం ముగించారు. శ్రీ రామ నవమి ఉత్సవాలు పుర స్కరించుకుని మంగళవారం ఉదయం హోమం, పూజ, ఇతర అర్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం లాలిపాటలతో శ్రీరామ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం కూడా చేసినట్లు మండలి కార్యదర్శి పురుషోత్తం చెప్పారు. షిర్డీలో...: సాక్షి, ముంబై: షిర్డీలో సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవమి ఉత్సవాలు మంగళవారం అంగరంగా వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రంతా ఆలయాన్ని తెరిచే ఉంచడంతో లక్షలాది మంది భక్తులు బాబా సమాధిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కాకడ్ ఆరతి, అనంతరం ద్వారకామయిలో సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన అఖండ పరాయణ పఠనం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు నాలుగు వేల మంది భక్తులు కావడితో తీసుకొచ్చిన శుద్ధమైన నీటితో బాబాకు జలాభిషేకం చేశారు. అనంతరం బాబా చిత్రపటం, పవిత్ర గ్రంథాన్ని ఊరేగించారు. ఆలయం పక్కనే ఏర్పాటుచేసిన వేదికపై ఉదయం 10 గంటలకు విక్రం నాందేడ్కర్ అనే భక్తుడు రాముని జీవిత చరిత్రను హరికథ రూపంలో వివరించారు. అనంతరం బాబా రథాన్ని షిర్డీ పురవీధుల్లో ఊరేగించారు. ఇందులో సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు. దీంతో షిర్డీ పుణ్యక్షేత్రం మంగళవారం పూర్తిగా రామనామ స్మరణతో మారుమోగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. భక్తులకు ఎలాంటి లోటులేకుండా బాబా సంస్థాన్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు బస చేసేందుకు టెంట్లు, మండపాలు, షామియాలు, తాగునీరు, సంచార మరుగుదొడ్లు, స్నానాలకు ట్యాంకర్లు, లడ్డు ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల సందర్భంగా మంగళవారం కూడా భక్తులకి ఉచిత భోజన వసతి కల్పించారు. ముంబైకి చెందిన సునీల్ అగ్రవాల్, గోండియా జిల్లాకు చెందిన సుశీలాదేవి మాసాని, అహ్మదాబాద్‌కు చెందిన దిలీప్ మెహత, బెంగళూర్‌కు చెందిన శ్రీనివాస్ శిర్గూకర్, భువనేశ్వర్‌కు చెందిన దుశ్యంతకుమార్, డెహరాడూన్‌కు చె ందిన సచిన్‌కుమార్, అమెరికాకు చెందిన సీతా హరిహరణ్ తదితర దాతలు అందించిన విరాళాలతో ఉచిత భోజనం కల్పించినట్లు బాబా సంస్థాన్ అధ్యక్షుడు బాలచంద్ర దేబాడ్వార్ చెప్పారు. -
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
-
సీతారాముల కళ్యాణానికి మండ పేట కొబ్బరి బోండాలు
-
భద్రాద్రికి పెళ్లికళ
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రగిరిలో ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం మిథిలా స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే రామయ్య పెళ్లి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ కమనీయ దృశ్యాన్ని వీక్షించి తరించేందుకు ఇప్పటికే వేలాది మంది భద్రాచలం చేరుకున్నారు. సోమవారం సాయంత్రానికి రామాలయం పరిసరప్రాంతాలు, గోదావరి ఘాట్, కరకట్ట.. ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామివారి కల్యాణానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు.. తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కల్యాణ మండ పంలో ప్రత్యేకంగా విభజించిన సెక్టార్లలో 20,020 మంది కూర్చొని చూసేలా టికెట్లను విక్రయించారు. స్టేడియం గ్యాలరీపై మరో 15,800 మంది భక్తులు కూర్చునేలా తగు ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట ఉండే భక్తుల కోసం రామాలయ పరిసర ప్రాంతాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రామాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోదావరి స్నానఘట్టాల రేవు, విస్తాకాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టెంట్లు వేశారు. ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లును నిర్మించారు. విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను అందజేసేందుకు వీలుగా రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు ఉపశమనం పొందేలా మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా 40 కూలర్లను ఏర్పాటు చేశారు. గవర్నర్, వీవీఐపీలు కూర్చునే సెక్టార్లో 180 టన్నుల కెపాసిటీ గల ఏసీని అమర్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సెక్టార్లలో తాగునీటి సౌకర్యం కల్పించారు. స్వామివారి కల్యాణ తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో అందరికీ అందజేసేందుకు 120 క్వింటాళ్ల తలంబ్రాలు, 1.50 క్వింటాళ్ల ముత్యాలు సిద్ధం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి అందరికీ ముత్యాలతో కూడిన తలంబ్రాల ప్యాకెట్లు అందజేసేలా రూ.5కు ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామివారి పెళ్లి వేడుక పూర్తయిన తరువాత భక్తులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ చేసేందుకు పట్టణంలోని పలు చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ముత్యాల తలంబ్రాలతో రానున్న గవర్నర్... శ్రీ సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీసుకొస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుంటారు. గవర్నర్ రాకతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చే సింది. దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రేపు మహా పట్టాభిషేకం... మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలోనే బుధవారం స్వామివారికి మహా పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ వేడుకను కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాపట్టాభిషేకానికి కూడా దేవస్థానం అధికారులు టికెట్ల ధరలను నిర్ణయించారు. వీవీఐపీ సెక్టార్లో అయితే రూ.250, వీఐపీ సెక్టార్‌కు రూ.100 చొప్పున స్టేడియం ప్రాంగణంలోనే విక్రయానికి పెట్టారు. మిగతా సెక్టార్లలో ఉచితంగానే భక్తులను అనుమతిస్తారు.