ఆవుడెక్కల కింద నలిగిన బాలుడు  | A kid death tragedy | Sakshi

ఆవుడెక్కల కింద నలిగిన బాలుడు 

Mar 27 2018 2:22 AM | Updated on Mar 27 2018 2:22 AM

A kid death tragedy - Sakshi

అనూష్‌ మృతదేహం

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ ఆవరణలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయ సమీపంలోని గుడిచెరువులో తల్లి దండ్రులతో కలసి నిద్రిస్తున్న బాలుడు ఆవుడెక్కల కింద నలిగి మృతిచెందాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ముల్కనూర్‌కు చెందిన తిరుపతి, స్వప్న దంపతులు కుమారుడు అనూష్‌(3), కూతురితో కలసి ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. రాత్రివేళ గుడిచెరువు ఖాళీ ప్రదేశంలో నిద్రపోయారు.

ఈ క్రమంలో ఓ ఆవుల మంద అటుగా పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ గుంపులోని ఆవులు వారు నిద్రిస్తున్న ప్రాంతంలోంచి వెళ్లగా వాటి డెక్కల కింద నలిగి అనూష్‌ గాయపడ్డాడు. తల్లి దండ్రులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చిన తమకు పుత్రశోకమే మిగిలిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement