kid death
-
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం: మేయర్
-
కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు గణాంకాలు వివరించారామె. నగరంలో ఐదున్నర లక్షలకుపైనే వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న ఆమె.. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారామె. కుక్కలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారామె. అంతకు ముందు మేయర్ విజయలక్ష్మి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారుల నుంచి వివరాలను సేకరించారు. -
ఊయలే..ఉరితాడై..!
కోడూరు: స్నేహితులతో కలిసి ఊగుతున్న ఊయలే ఆ బాలుడికి ఉరితాడైంది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో శనివారం జరిగింది. కోడూరులోని అంబటి బ్రహ్మణయ్య కాలనీకి చెందిన గొర్ల రామాంజనేయులు, అంజలిదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గొర్ల చైతన్య (10), చిన్న కుమారుడు బాలవర్థన్ వడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. క్రిస్మస్కు పాఠశాలకు సెలవు ఇవ్వడంతో శనివారం చైతన్య, బాలవర్థన్, కాలనీలోని తోటి స్నేహితులతో కలిసివారి ఇంటి వెనుక భాగంలోని చెట్టుకు చీరతో వేసి ఉన్న ఊయల ఊగేందుకు వచ్చారు. చైతన్య ఉయ్యాల ఎక్కి ఊగుతూ చీరను మెలికలు వేస్తూ గుండ్రంగా తిరిగాడు. దీంతో చీర చైతన్య మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య విగత జీవిలా చీర మధ్యలో మాట్లాడకుండా ఉండిపోయాడు. చిన్నారులు వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా, అప్పటికే చైతన్య ప్రాణాలు విడిచాడు. -
మూడు వాగులు.. మూడు గుట్టలు దాటినా..
వాజేడు: ఆ ఊరు మూడు వాగులు.. మూడు గుట్టల వెనుక ఉంది. దారి లేదు.. వాహన సౌకర్యం అసలే లేదు. అలాంటి ఊరి నుంచి జ్వరంతో బాధపడుతున్న కొడుకును ఆస్పత్రిలో చూపిద్దామని భుజాలపై మోసుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు. తీరా ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిద్దామనుకునేలోపే ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, కాంతమ్మలకు ముగ్గురు పిల్లలు. వారు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ గ్రామం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలో గుట్టల మీద ఉంటుంది. ఆదివారం రాకేశ్(4)కు జ్వరం ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు భుజాల మీద మోసుకుంటూ మూడు వాగులు దాటుకుని.. మూడు గుట్టలు దిగి వచ్చి పగళ్లపల్లిలో ఉన్న చుట్టాల ఇంటికి చేరుకున్నారు. అదే గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం చేయించారు. అయినా తగ్గలేదు. సోమవారం మళ్లీ వైద్యానికి వెళ్లగా పరిస్థితి బాగా లేదని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించాడు. దీంతో శేషయ్య దంపతులు రాకేశ్‌తోపాటు జ్వరంతో ఆస్పత్రికి వచ్చారు. వైద్యులకోసం వేచి ఉండగా.. అప్పటికే ఆలస్యం కావడంతో రాకేశ్ మృతి చెందాడు. బంధువుల ఇంటిలో.. రాకేశ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే 15 కిలోమీటర్లు వాగులు, గుట్టలు దాటుకుని నడకదారిన వెళ్లాలి. అప్పటికే సాయంత్రం అయ్యింది. దాంతో ఊరు వెళ్లే అవకాశం లేక పోవడంతో శేషయ్య దంపతులు కొడుకు మృత దేహంతో ప్రగళ్లపల్లిలోని బంధువుల ఇంట్లోనే తలదాచుకున్నారు. సకాలంలో వైద్యం అందితే కొడుకు బతికే వాడని తల్లి కాంతమ్మ వాపోయింది. ఈ విషయంపై వైద్యాధికారి యమునను ‘సాక్షి’వివరణ కోరగా వారు ఆర్ఎంపీ వద్ద ఆదివారం వైద్యం చేయించుకున్నారని, సోమవారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతిచెందినట్లు తెలిసిందని చెప్పారు. వారు తమ ఆస్పత్రికి రాలేదని తెలిపారు. -
పాపం.. పసివాడు
పదకొండు నెలల ఓ పసిబాలుడు సీసం గోలి మింగి శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదాన్ని నింపింది. స్థానిక పోచమ్మగల్లీకి చెందిన కోరుట్ల రవిరాజ్ మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో కార్యదర్శిగా పనిచేస్తూ జగిత్యాలలో నివసిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రవిరాజ్ ఆయన భార్య అపర్ణ, కూతురు శాన్వీ (3), బాబు అభియాత్ (11 నెలలు)లతో కలిసి కోరుట్లకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం శాన్వీ, అభియాత్‌తో కలసి సీసం గోలీలతో ఆడుకునే క్రమంలో అభియాత్ గోలిని మింగాడు. శ్వాస తీయడం ఇబ్బందిగా మారడంతో గమనించిన తల్లి, వెంటనే కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించిందని చెప్పి జగిత్యాలకు పంపారు. అక్కడికి తీసుకెళ్లేలోపే శ్వాస ఆడక తుదిశ్వాస విడిచాడు. – కోరుట్ల -
కారు చీకట్లో.. కనుమరుగైన కనుపాప
పెందుర్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు గుక్కెడు పాలు ఇవ్వలేని దుస్థితి ఆ తల్లిది. ఇంట్లో పెద్దోళ్లతో పంతానికి వెళ్లి పొత్తిళ్లలోని చిన్నారిని చంపుకున్న శాపం ఆమెది. ఎత్తుకుని లాలించి.. పాలిచ్చి పెంచిన చేతులతోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టిన కన్నీటి గాథ ఆ కన్నతల్లిది. అత్తమామలతో గొడవ పడి అర్ధరాత్రి ముక్కుపచ్చలారని చిన్నారితో గడప దాటి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన దురవస్థ ఆమెది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పులగాలిపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కరక అప్పారావు, కుసుమలత దంపతులకు సోనిక, జ్ఞానస(ఏడాదిన్నర) ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 6న అప్పారావు విధులకు వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు రాత్రి కుసుమలతకు అత్తమామలు అప్పలకొండ, నూకాలుకు ఇంట్లో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుసుమలత అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లో నుంచి చిన్న కుమార్తె జ్ఞానసను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని కుసుమలత చినముషిడివాడ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉన్న కొండ ఎక్కింది. అక్కడే నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు ఉండి ఈ నెల 10న కిందకి ఒంటరిగా వచ్చింది (అప్పటికే కుసుమలత పుట్టింటివారు ఆమె కనిపించలేదంటూ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు). కొండ సమీపంలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లి ఆకలేస్తోందని చెప్పడంతో వారు భోజనం పెట్టారు. కుసుమలత పరిస్థితి చూసినవారు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. ‘పాప ఆకలికి చనిపోయింది. నేనే కొండ మీద పూడ్చిపెట్టాను’ అని చెప్పడంతో కంగారు పడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో విలపిస్తున్న జ్ఞానస తండ్రి అప్పారావు అంతా అయోమయం.. అనుమానాస్పదం.. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కుసుమలత నేరుగా కొండ ప్రాంతానికి వెళ్లడం మిస్టరీగా మారింది. అంతేకాకుండా ఆమె ఫోన్లో ‘ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలం’ అని గూగూల్ సెర్చ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆమె కొండ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఎంత పంతం ఉన్నా.. చంటిపాప విషయంలో కన్నతల్లి అంత కఠినంగా ఉందా అన్నది మరో ప్రశ్న. అదే సమయంలో ఇంట్లో అత్తమామలతో గొడవ పడిన సందర్భం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వారు ఏదైనా అన్నారా? ఆ కోపంలో చిన్నారిని ఆమె ఏదైనా చేసిందా అన్నది సందేహంగా మారింది. అయితే ఇంత జరిగినా కుసుమలత నోరు విప్పడం లేదు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోవడంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. జ్ఞానస పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఇందులో పురోగతి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అత్తమామలతో పెద్ద స్థాయిలో గొడవలు లేవని తెలుస్తోంది. అసలు ఆమె అలా ఎందుకు చేసిందో ఏమాత్రం అర్థం కావడం లేదని భర్త వాపోతున్నారు. రైల్వే ఉద్యోగం కావడంతో రెండు మూడు రోజులు బయటకు వెళ్తుంటానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అతను చెబుతున్నారు. క్విక్ రియాక్షన్ బృందాల సహకారంతో.. జ్ఞానస చనిపోయిందని కుసుమలత చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను వెంటబెట్టుకుని కొండ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం క్విక్ రియాక్షన్ టీమ్ బృందాలు డాగ్ స్క్వాడ్ సహా రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు చిన్నారిని పూడ్చిన ప్రదేశాన్ని కనుగొన్నారు. జ్ఞానస మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఏసీపీ స్వరూపారాణి ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వికటించిన మాత్రలు
ధర్మపురి/జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం నులిపురుగుల మాత్రలు (ఆల్బెండజోల్) వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూ హరిజనవాడకు చెందిన మారుతి, రజిత దంపతుల కూతురు సహస్ర (8) స్థానిక కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన చిన్నారికి తల్లి భోజనం తినిపించి పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నులి పురుగుల మాత్ర వేయించేందుకు తీసుకెళ్లింది. ఆశ వర్కర్ ఇచ్చిన మాత్రను అక్కడే వేయకుండా చిన్నారి చదివే పాఠశాలకు తీసుకెళ్లింది. మాత్ర వేశాక తరగతి గదికి పంపించింది. మధ్యాహ్నం 1.12 గంటలకు సహస్రకు ఫిట్స్ రావడంతో వెంటనే ఉపాధ్యాయులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పాప అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మాత్ర వికటించే తన కూతురు మృతి చెందిందని తల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రోదిస్తున్న బాలిక తల్లి రజిత మరో 11 మందికి అస్వస్థత: ధర్మపురిలోని వివిధ పాఠశాలల్లో వేసిన నులి పురుగుల మాత్రలు వికటించి 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో శ్రీచైతన్య భారతి వి ద్యానికేతన్కు చెందిన ఏడుగురు, విద్యాభారతి పాఠశాలకు చెందిన నలుగురు ఉన్నారు. జైనా గ్రామంలోని ఓ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు భయంతో ఆస్పత్రికి చేరి పరీక్షలు చేయించుకున్నారు. నివేదిక వస్తేనే తెలుస్తుంది ఆల్బెండజోల్ మాత్ర ప్రమాదకరమైంది కాదు. విద్యార్థిని సహస్ర అంతకు పూర్వం భోజనం చేసింది. ఈ మాత్రం సైతం పూర్తిగా వేసుకోలేదు. వేసిన వెంటనే బయటకు ఉమ్మేసింది. నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయి. – శ్రీధర్, డీఎంహెచ్‌వో, జగిత్యాల -
సాంబారు పాత్రలో పడి విద్యార్థి మృతి
పాణ్యం: కర్నూలు జిల్లా పాణ్యంలోని విజయానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం సాంబారు పాత్రలో పడి పురుషోత్తంరెడ్డి (6) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి, కల్పన దంపతులకు కుమారుడు పురుషోత్తంరెడ్డితో పాటు కుమార్తె ఉంది. కల్పన రెండేళ్ల క్రితమే మృతి చెందడంతో పురుషోత్తంరెడ్డిని తండ్రి విజయానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్లో యూకేజీలో చేర్పించాడు. రోజూ లాగానే బుధవారం మధ్యాహ్నం భోజనానికి క్యూలైన్లో నుంచున్న విద్యార్థులు వెనుక నుంచి నెట్టేయడంతో.. ముందున్న పురుషోత్తంరెడ్డి పెద్ద సాంబారు పాత్రలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఆయా పీరమ్మ వెంటనే అతన్ని బయటకు తీయగా..పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే పురుషొత్తంరెడ్డి చర్మంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విద్యార్థి తండ్రికి సమాచారం అందించిన యాజమాన్యం పాఠశాలకు తాళాలు వేసి కర్నూలు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ పురుషోత్తంరెడ్డి చనిపోయాడు. పాణ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి సంఘం నిరసన.. పాఠశాలలో సరైన సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి మృతికి కారణమైన విజయానికేతన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు పలువురు బుధవారం రాత్రి పాఠశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతి చెందినా పట్టించుకోకుండా..కరస్పాండెంట్, డైరెక్టర్లు సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు ఆందోళన విరమించారు. -
ప్రాణం తీసిన దాగుడు మూతలు!
రాజవొమ్మంగి, (రంపచోడవరం): తప్పిపోయారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటారనుకున్న ఆ పిల్లలు ఓ చెక్కపెట్టెలో విగత జీవులుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లడిల్లిపోయిన వైనమిది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెంలో ఈ హృదయ విదారక ఘటన శనివారం వెలుగు చూసింది. గత నెల 25వ తేదీన చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన బేలెం ప్రశాంత కుమార్ (11)కు అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన చీడెం కార్తీక్ (9)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా కలసి తిరిగారు. బయటకు వెళ్లినవారు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామంలో కొంత మంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా బంతి తరగతి గదిలోకి వెళ్లడంతో అటుగా వెళ్లిన పిల్లలకు పెట్టెలోంచి దుర్వాసనతో కూడిన నీరు కారడం గమనించి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. వారు అక్కడికి వచ్చి పెట్టె తెరచి చూడటంతో విగత జీవులుగా మారిన పిల్లలు కనిపించారు. శరీరాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న కార్తీక్ తల్లిదండ్రులు భవాని, కన్నయ్య.. ప్రశాంత కుమార్ అమ్మమ్మ లక్ష్మి, తండ్రి నూకరాజు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డతీగల మండలం మట్లపాడు గ్రామానికి చెందిన బేలెం ప్రశాంత్ కుమార్‌కు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో చిన్నయ్యపాలెంలోని అమ్మమ్మ పెంచుకుంటోంది. జడ్డంగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు కార్తీక్ స్వగ్రామం రాజవొమ్మంగి మండలంలోని నెల్లిమెట్ల. చిన్నయ్యపాలెంలో గంగాలమ్మ పండుగకు బంధువుల ఇంటికి వచ్చాడు. మృతులిద్దరూ నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన వారే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు స్నేహితులైన వీరిద్దరూ దాగుడుమూతల ఆటలాడుకుంటూ చెక్కపెట్టెలో దాక్కోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని, ఆ చెక్కపెట్టె పైన ఉండే బరువైన మూత, గొళ్లెం కూడా దానికదే పడిపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక సీఐ బి.రాజారావు, తహసీల్దార్ కె. శ్రీనివాస్, రాజవొమ్మంగి ఎస్సై వినోద్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
విద్యార్థిని బలిగొన్న స్కూల్ బస్సు
మొయినాబాద్ (చేవెళ్ల): ఉదయం ఇంట్లోంచి పాఠశాలకు వెళ్లేటప్పుడు అమ్మా టాటా అంటూ నవ్వుతూ చెప్పి వెళ్లిన బాలుడు మధ్యాహ్నానికి ఇంటి ముందే విగతజీవిగా మారాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యాడు. బస్సు కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే గారాబంగా గోరుముద్దలు తినిపించాలనుకున్న ఆ తల్లికి తీరని శోకం మిగిల్చాడు. ఈ హృదయవిదారకమైన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన బసవాని సునీల్, భాగ్యలక్ష్మి దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామానికి వలస వచ్చారు. తమ ముగ్గురు కొడుకులతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సునీల్ గ్రామ సమీపంలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సునీల్ పెద్ద కుమారుడు వరుణ్ (9) చిలుకూరులోని ఓ పాఠశాలలో స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే శనివారం ఉదయం స్కూల్ బస్సులో వెళ్లాడు. శనివారం హాఫ్‌డే కావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్కూల్ బస్సులో ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు బస్సు ఆగడంతో బస్సులోంచి దిగి రోడ్డు దాటేందుకు బస్సు ముందుకు వెళ్లాడు. బాలుడిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో బాలుడు సిమెంటు రోడ్డుపై పడిపోయాడు. బస్సు ముందు చక్రం అతని తలపై నుంచి పోవడంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పెద్దగా అరవడంతో బస్సును అక్కడే నిలిపేశాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ఉదయం కొడుకు చెప్పిన మాటలను తలుచుకుంటూ తల్లి రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పాఠశాల యాజమాన్యం బాలుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు బాలుడి మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సును మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఆవుడెక్కల కింద నలిగిన బాలుడు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ ఆవరణలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయ సమీపంలోని గుడిచెరువులో తల్లి దండ్రులతో కలసి నిద్రిస్తున్న బాలుడు ఆవుడెక్కల కింద నలిగి మృతిచెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూర్‌కు చెందిన తిరుపతి, స్వప్న దంపతులు కుమారుడు అనూష్(3), కూతురితో కలసి ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. రాత్రివేళ గుడిచెరువు ఖాళీ ప్రదేశంలో నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ ఆవుల మంద అటుగా పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ గుంపులోని ఆవులు వారు నిద్రిస్తున్న ప్రాంతంలోంచి వెళ్లగా వాటి డెక్కల కింద నలిగి అనూష్ గాయపడ్డాడు. తల్లి దండ్రులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చిన తమకు పుత్రశోకమే మిగిలిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
దూసుకొచ్చిన మృత్యువు
దసరాకు సరదాగా గడిపేందుకు అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చిన ఆరేళ్ల చిన్నారిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలితీసుకుంది. తాతయ్యతో కలిసి తినుబండారాలు కొనుక్కునేందుకు దుకాణానికి వచ్చి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌లో సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది. ఆదిలాబాద్ , చిగురుమామిడి (హుస్నాబాద్): హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల నిర్మల, శంకర్ దంపతుల ఏకైక కూతురు శ్రీచందన(6) సోమవారం సాయంత్రం దసరా పండుగ నిమిత్తం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్‌లోని అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చింది. చిన్నారి తాతయ్య పందిపెల్లి కనుకయ్యతో కలిసి హుస్నాబాద్–కరీంనగర్ రహదారికి అవతలివైపున ఉన్న కిరాణం దుకాణానికి తినుబండరాలు కొనుక్కునేందుకు వెళ్లి...తిరిగి తాతయ్యతో కలిసి రహదారి దాటుతోంది. ఇంతలోనే కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో శ్రీచందన అక్కడికక్కడే మృతిచెందింది. తలపై నుంచి బస్‌టైర్ వెళ్లడంతో తలపగిలి మెదడు బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నిర్మల, శంకర్‌తోపాటు బంధువులు చేరుకుని రహదారిపై ఆందోళనకు దిగారు. మూడు గంటలపాటు ఆందోళన... శ్రీచందన మృతి విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు బంధువులతో కలిసి మూడు గంటలపాటు ఆందోళనకు దిగారు. హుస్నాబాద్–కరీంనగర్ ప్రధాన రహదారిపై చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని సర్దిచెప్పినా ససేమీరా అనకుండా రోడ్డుపై బైఠాయించారు. ఆర్టీసీ బస్‌లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రావాల్సిందేనని పట్టుబట్టారు. డీఎం ఆందుబాటులో లేడని చెప్పినా వినిపించుకోలేదు. బాధిత కుటుంబసభ్యులు ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు ఇవ్వలేదని ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉండగా ఆందోళన కొనసాగుతోంది. కాగా తిమ్మాపూర్, గన్నేరువరం ఎస్ఐలు కృష్ణారెడ్డి, బిల్లా కోటేశ్వర్‌రావులు వచ్చి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. -
విషాదం మిగిల్చిన విహారయాత్ర
ములుగు : సంతోషంగా విహార యాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకుంది. యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కూతురును కోల్పోయారు. ఈ ఘటన గోవిందరావుపేట మండలం మచ్చాపురం పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. ములుగు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి కారులో శుక్రవారం లక్నవరానికి వెళ్లారు. కుక్కను తప్పించబోయి... విహారయాత్రను ముగించుకుని తిరిగివస్తున్న క్రమంలో గోవిదంరావుపేట మండలం మచ్చాపురం సమీపంలో ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనాన్ని ఒక్కసారిగా పక్కకు మళ్లించాడు. దీంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీ కొట్టింది. ప్రమాదసమయంలో కారు అద్దాల పక్కనే నిలబడిన చిన్నారి తేజస్వి(06) ఒక్కసారిగా కిందపడడంతో తలభాగంలో బలంగా గాయమైంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. వాహనంలో ఉన్న కుటుంబసభ్యులకు గాయాలు కావడంతో 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ తల్లి కమలమ్మను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని ఎస్సైలు దగ్గు మల్లేశ్‌యాదవ్, ఓదెల మల్లేశ్, సూర్యనారాయణలు పరి«శీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. -
తండ్రి చేతిలో చిన్నారి హత్య
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల కేంద్రంలో భార్యపై అనుమానంతో రెండు నెలల కూతుర్ని, కన్న తండ్రే క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కట్టెల వీధికి చెందిన మణికంఠ, చంద్రకళలకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. భార్యపై అనుమానంతో మద్యం మత్తులో రెండు నెలల కూతుర్ని తండ్రి మణికంఠ నేలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.