విషాదం మిగిల్చిన విహారయాత్ర | small kid dead in road accident | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన విహారయాత్ర

Published Sat, Sep 23 2017 1:15 PM | Last Updated on Sat, Sep 23 2017 1:15 PM

small kid dead in road accident

మృతి చెందిన చిన్నారి తేజస్వి , ప్రమాదానికి గురైన కారు

ములుగు : సంతోషంగా విహార యాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకుంది. యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో  అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కూతురును కోల్పోయారు. ఈ ఘటన గోవిందరావుపేట మండలం మచ్చాపురం పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. ములుగు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో శుక్రవారం లక్నవరానికి వెళ్లారు.

కుక్కను తప్పించబోయి...
విహారయాత్రను ముగించుకుని తిరిగివస్తున్న క్రమంలో గోవిదంరావుపేట మండలం మచ్చాపురం సమీపంలో ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనాన్ని ఒక్కసారిగా పక్కకు మళ్లించాడు. దీంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీ కొట్టింది. ప్రమాదసమయంలో కారు అద్దాల పక్కనే నిలబడిన చిన్నారి తేజస్వి(06) ఒక్కసారిగా కిందపడడంతో తలభాగంలో బలంగా గాయమైంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. వాహనంలో ఉన్న కుటుంబసభ్యులకు గాయాలు కావడంతో 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తల్లి కమలమ్మను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని ఎస్సైలు దగ్గు మల్లేశ్‌యాదవ్, ఓదెల మల్లేశ్, సూర్యనారాయణలు పరి«శీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement