ఊయలే..ఉరితాడై..!  | School Boy Deceased Wrap saree around neck | Sakshi
Sakshi News home page

ఊయలే..ఉరితాడై..! 

Published Sun, Dec 26 2021 5:03 AM | Last Updated on Sun, Dec 26 2021 5:03 AM

School Boy Deceased Wrap saree around neck - Sakshi

బాలుడి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

కోడూరు: స్నేహితులతో కలిసి ఊగుతున్న ఊయలే ఆ బాలుడికి ఉరితాడైంది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో శనివారం జరిగింది. కోడూరులోని అంబటి బ్రహ్మణయ్య కాలనీకి చెందిన గొర్ల రామాంజనేయులు, అంజలిదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గొర్ల చైతన్య (10), చిన్న కుమారుడు బాలవర్థన్‌ వడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.

క్రిస్మస్‌కు పాఠశాలకు సెలవు ఇవ్వడంతో శనివారం చైతన్య, బాలవర్థన్, కాలనీలోని తోటి స్నేహితులతో కలిసివారి ఇంటి వెనుక భాగంలోని చెట్టుకు చీరతో వేసి ఉన్న ఊయల ఊగేందుకు వచ్చారు. చైతన్య ఉయ్యాల ఎక్కి ఊగుతూ చీరను మెలికలు వేస్తూ గుండ్రంగా తిరిగాడు. దీంతో చీర చైతన్య మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య విగత జీవిలా చీర మధ్యలో మాట్లాడకుండా ఉండిపోయాడు. చిన్నారులు వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా, అప్పటికే చైతన్య ప్రాణాలు విడిచాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement