హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి ఒకటే మరుగుదొడ్డి
గిరిజన విద్యార్థుల కష్టాలు
రామారెడ్డి: హైస్కూల్లో 105 మంది, ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులు, అదే పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉన్నారు. ఈ మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది మొత్తం 20 మంది వరకు ఉంటారు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి.. ఇక ఇంతమందికి ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవలసిందే. విద్యార్థినులు ఒక సమయంలో, విద్యార్థులు మరో సమయంలో మరుగు దొడ్డికి వరుస కట్టి వెళ్తున్నారు.
జిల్లాలో హై స్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఒకే చోట ఉన్న ఏకైక గిరిజన పాఠశాల కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఉంది. ఈ గిరిజన పాఠశాలలో మరుగుదొడ్డి సమస్యతో పాటు తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. తాత్కాలికంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులోనే బోధన సాగుతోంది. కొన్ని తరగతులు చెట్టు కిందే నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment