Primary school
-
వసతులు కను‘మరుగు’
రామారెడ్డి: హైస్కూల్లో 105 మంది, ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులు, అదే పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉన్నారు. ఈ మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది మొత్తం 20 మంది వరకు ఉంటారు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి.. ఇక ఇంతమందికి ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవలసిందే. విద్యార్థినులు ఒక సమయంలో, విద్యార్థులు మరో సమయంలో మరుగు దొడ్డికి వరుస కట్టి వెళ్తున్నారు. జిల్లాలో హై స్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఒకే చోట ఉన్న ఏకైక గిరిజన పాఠశాల కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఉంది. ఈ గిరిజన పాఠశాలలో మరుగుదొడ్డి సమస్యతో పాటు తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. తాత్కాలికంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులోనే బోధన సాగుతోంది. కొన్ని తరగతులు చెట్టు కిందే నడుస్తున్నాయి. -
ఊరు కాదిది... నా కుటుంబం!
రాయ్‌రంగ్‌పూర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్వేగభరితమయ్యారు. తను పుట్టిన ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించి, అక్కడి గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపర్బేడ గ్రామాన్ని కేవలం ఒక ప్రదేశంగా తానెన్నడూ భావించలేదని, అదొక కుటుంబమని తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అన్నారు. బమన్ఘటి సబ్ డివిజన్లోని ఉపర్బేడలోని సంతాలి కుటుంబంలో ముర్ము 1958 జూన్ 20న జన్మించారు. 2022 జూలై భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తను చదువుకున్న ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ఆ పాఠశాలతోపాటు యావత్తు గ్రామాన్ని అందంగా మార్చారు. గ్రామస్తులు, స్కూలు టీచర్లు, విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తను పుట్టిన ఇంటికి వెళ్లే దారిలో సంతాలి మహిళలు ఆమెకు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముర్ము కూడా వారితో కాలు కదిపారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. నేనిప్పటికీ ఇక్కడి విద్యార్థినే...స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు. ‘‘నాకిప్పుడు 66 ఏళ్లు. అయినా మా స్కూల్లో చిన్న విద్యార్థిననే అనుకుంటున్నా. అప్పట్లో మట్టిగోడలుండేవి. మా ఏడో తరగతిలో ఉండగా స్కాలర్షిప్ పరీక్ష కోసం మదన్ మోహన్ సార్ వాళ్లింటికి తీసుకెళ్లారు. తన సొంత పిల్లలతోపాటు నన్ను కూడా పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ గ్రామం, ఈ స్కూలు నాకు అందించిన అభిమానం మరువలేనిది’’ అంటూ ఉప్పొంగిపోయారు. తోటి వాళ్లు, ఉపాధ్యాయులు కూడా బయటి వ్యక్తిగా కాక, తనను సొంత కుటుంబసభ్యురాలిగా చూసుకునేవారన్నారు. ‘ఆ రోజుల్లో లాంతరు వెలుగులో చదువుకునేదాన్ని. ఆ లాంతరు గ్లాస్ పగిలిపోయి ఉండేది. చదువుకోవడానికి ఇబ్బందయ్యేది. సిరా పెన్నుతో రాయడం కష్టంగా ఉండేది. ఇంకుతో బట్టలు పాడయ్యేవి’’ అని గుర్తు చేసుకున్నారు. గురువులకు వందనం తనకు విద్య నేర్పిన గురువులను రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. స్కూల్ హెడ్మాస్టర్ బిశేశ్వర్ మహంత, క్లాస్ టీచర్ బాసుదేశ్ బెహెరె, 4, 5 తరగతుల్లో ఉండగా క్లాస్‌టీచర్ బసంత కుమార్ గిరిలను సన్మానించారు. ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని సుమారు 200 మందికి స్కూల్ బ్యాగులు, చాకెట్లు, టిఫిన్ బాక్సులు అందజేశారు. కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు ఎదగాలని వారిని కోరారు. -
బడిలో మంటలు.. చిన్నారుల సజీవదహనం
తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్లో మంటలు చెలరేగి చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరణించవాళ్లంతా 5 నుంచి 12 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ప్రమాద తీవ్రతను మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలల్లో గత కొంతకాలంగా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాజధాని నైరోబీకి 170కిలోమీటర్ల దూరంలో.. మధ్య కెన్యా నైయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది.హిల్‌సైడ్ ఎండారషా ప్రైమరీ పాఠశాల వసతి గృహంలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు.తీవ్రంగా గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకి రాలేదు. #BREAKINGTragic news from Kenya as at least 17 children have lost their lives in a devastating fire at Hillside Endarasha Academy in Kieni, Nyeri.Bodies were burned beyond recognition.#Kenya #SchoolFire #HillsideEndarasha #Tragedy #BreakingNewspic.twitter.com/sDskxUYBxQ— Mr. Shaz (@Wh_So_Serious) September 6, 2024 మృతదేహాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోయాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఘటనపై అధ్యక్షుడు విలియమ్ రుటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ స్కూల్లో సుమారు 800 చిన్నారులు వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 17 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల తొలగింపు తర్వాత మరిన్ని మృతుల సంఖ్యపై స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. గతంలో.. 2016లో నైరోబీలోని ఓ బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. 1994లో టాంజానియాలోని కిలిమంజారో రీజియన్‌లో ఓ స్కూల్లో మంటలు చెలరేగి 40 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. -
Srikakulam: ఆ బడిలో ఒకే విద్యార్థి.. ఒక్కరే టీచర్..
శ్రీకాకుళం: ప్రైవేటు స్కూళ్ల ధాటికి రొట్టవలస పంచాయతీ అవతరాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి మిగిలాడు. ఈ ఒక్క విద్యార్థి కోసం టీచర్ పనిచేస్తుండడం గమనార్హం. వీరికి తోడుగా ఒక మరుగుదొడ్డి నిర్వాహక కార్మికురాలు కూడా ఉన్నారు. -
సీఎం సారూ... ఇక్కడ ఐదు తరగతులకు ఒక్కరే సారు!
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు 146 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నారు. అక్కడ పనిచేసేందుకు చాలా మంది స్కూల్ అసిస్టెంట్లు సుముఖంగా ఉన్నప్పటికీ పాఠశాలకు అధికారిక పోస్టులు మంజూరు కాకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. అప్‌గ్రేడ్ చేసి.. వదిలేశారు! రేగడిమైలారం ప్రాథమిక పాఠశాలను 2005–06లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. అప్పట్లో స్కూల్‌కు ఫిజికల్ సైన్స్ టీచర్‌ను మాత్రమే నియమించారు. 2007లో ఎనిమిదో తరగతిని సైతం అందుబాటులోకి తెచి్చనా కొత్త పోస్టులు ఇవ్వలేదు. 2016 వరకు ప్రైమరీ సిబ్బందితోనే 8వ తరగతి వరకూ నెట్టుకొచ్చారు. 2017–18లో పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసినా కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో 2006లో వచి్చన ఒకే ఒక్క ఫిజికల్ సైన్స్ టీచర్‌తోనే 18 ఏళ్లుగా హైస్కూల్‌ను నడిపిస్తున్నారు.గతేడాది ఆరు నుంచి పదో తరగతి వరకు 154 మంది విద్యార్థులు చదివారు. వారిలో 28 మంది టెన్త్ విద్యార్థులు ఉండగా 9 మందే ఉత్తీర్ణులయ్యా రు. ఈసారి పాఠశాలలో మొత్తం 146 మంది ఉండగా వారిలో 19 మంది టెన్త్ చదువుతున్నారు. ఒకే ఆవరణలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా ప్రైమరీ స్కూల్లో ఏడుగురు ఎస్జీటీలు, హైసూ్కల్లో ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో హైసూ్కల్ విద్యార్థులకూ ప్రైమరీ టీచర్లే పాఠాలు బోధిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఈ స్కూల్ హైదరాబాద్– బీజాపూర్ హైవేను ఆనుకొని ఉండటంతోపాటు సీఎం సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. కలుపు తీసేందుకు వెళ్తున్నా.. బడికి వెళ్లి చదువుకోవాలని ఉన్నా పాఠాలు చెప్పేవారు లేరు. ఎలాగూ క్లాసులు జరగడం లేదు. కనీసం అమ్మానాన్నలకు ఆసరాగా ఉందామని సమయం దొరికినప్పుడల్లా పత్తిలో కలుపు తీసేందుకు వెళ్తున్నా. – భూమిక, ఎనిమిదో తరగతి, రేగడిమైలారంఎవరికీ న్యాయం చేయలేకున్నాం పీఎస్, జెడ్పీహెచ్‌ఎస్‌లు ఒకే ఆవరణలో ఉన్నందునహైసూ్కల్ విద్యార్థులకు డిçప్యుటేషన్‌పై మేమే పాఠాలు చెబుతున్నాం. దీంతో అటు ప్రైమరీ, ఇటు హైసూ్కల్ విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికారులు, సీఎం స్పందించి పోస్టులు ఇవ్వాలి. – మల్లేశ్, పీఎస్ హెచ్ఎం, రేగడిమైలారం -
చదువులకు రాజకీయ చెద
సాక్షి, అమరావతి: మూడు రోజుల క్రితం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోరమా నుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశు లుపై టీడీపీకి చెందిన రేషన్ డీలర్ దుర్భాషలాడాడు. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా రేషన్ బియ్యాన్ని బడిలో భద్రపరచడం కుదరదన్నందుకు నోటికొచ్చినట్టు దూషించాడు. ‘మాకు 160కిపైగా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి.. మేం చెప్పినట్టు చేయకుంటే అంతు చూస్తా..!’ అని బెదిరించాడు. గత నెల 14న తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం ధారవరం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రహరీని టీడీపీ నేతలు రాత్రికి రాత్రే కూల్చేశారు. గత ప్రభుత్వ హయాంలో ‘మన బడి నాడు – నేడు’ కింద నిర్మించిన ఈ ప్రహరీని కూలగొట్టి స్థలాన్ని ఆక్రమించారు. కూటమి సర్కారు కొలువుదీరిన కొద్ది రోజులకే విశాఖలోని కప్పరాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను బురదలో కూర్చోబెట్టి భోజనాలు చేసే దుస్థితికి తీసుకొచ్చారు. బురదగా ఉందని.. గదుల్లో కాకపోయినా కనీసం వరండాలో అయినా తింటామని విద్యార్థులు వేడుకున్నా సిబ్బంది కనికరించలేదు. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో భోజనం సరిగా లేదని, పుచ్చిపోయిన కూరగాయలు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇటీవల అనంతపురం జిల్లా ధర్మవరంలో బడిలో ఏ పని చేయాలన్నా తమకు చెప్పకుండా జరిగితే సహించేది లేదని ఉపాధ్యాయులను స్థానిక టీడీపీ నాయకులు బెదిరించారు. ఇలా ఒకటీ రెండూ కాదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నెల రోజుల్లోనే ప్రాథమిక పాఠశాలల నుంచి యూనివర్సిటీల దాకా విద్యారంగంపై అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వంట వారి నుంచి వీసీల దాకా బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. అధికారం మాది.. పెత్తనమూ మాదే..గత ఐదేళ్ల పాటు రాజకీయాలకు తావులేకుండా ఉన్నతంగా ఉన్న విద్యావ్యవస్థ తిరోగమనం బాట పట్టింది. ‘రాష్ట్రంలో మేం చెప్పిందే జరగాలి. అది బడైనా, యూనివర్సిటీ అయినా సరే.. !’ అని టీడీపీ, జనసేన నేతలు పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు పాఠశాల భవనంలో ఫ్యాన్ల కింద ఆత్మ విశ్వాసంతో మధ్యాహ్న భోజనాలు చేసిన విద్యార్థులు ఇప్పుడు బురదలో కూర్చొని తినాల్సిన పరిస్థితులు కల్పించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బండి వెలిగండ్ల పాఠశాలలో గత 15 ఏళ్లుగా వంట చేస్తున్న మహిళను వైఎస్సార్సీపీ అభిమాని అనే నెపంతో స్థానిక టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి తొలగించారు. దీంతో ఈనెల ఒకటో తేదీన విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది. టాయిలెట్లు శుభ్రం చేసే కార్మికులను సైతం తొలగించి తమ వారినే నియమించాలని పట్టుబట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఉన్నవారు వెళ్లిపోగా కొత్తవారు ముందుకు రాకపోవడంతో నాడు–నేడు ద్వారా తీర్చి దిద్దిన మరుగుదొడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి. చట్ట వ్యతిరేకంగా వీసీలు, రిజిస్ట్రార్ల తొలగింపుగ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక కూటమి నాయకులు తమ పరిధిలో విద్యా వ్యవస్థ, ఉపాధ్యాయులపై దాడులు చేస్తుంటే రాష్ట్ర స్థాయిలో టీడీపీ పెద్దలు వీసీలు, రిజిస్ట్రార్లు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లపై పడ్డారు. రాజ్యాంగ బద్ధమైన వర్సిటీలను రాజకీయ విష క్రీడకు బలి చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్లకు ఫోన్లు చేసి బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారు. మానవ వనరుల శాఖ మంత్రి కార్యాలయం నుంచే ఈ ఫోన్లు వెళ్లడం గమనార్హం. దీంతో విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో వైదొలిగారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్‌ను సైతం ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు.వైఎస్సార్ జిల్లాలోని యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి.సురేంద్రనాథ్రెడ్డితోనూ బలవంతంగా రాజీనామాలు చేయించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించారు. జేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజుకు మరో నాలుగు నెలలు పదవీకాలం ఉన్నా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్, రెక్టార్ ప్రొఫెసర్ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, కో–ఆర్డినేటర్లు, డైరెక్టర్లను సైతం ఒత్తిడి చేసి పదవులకు రాజీనామా చేయించారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డితో పాటు రిజిస్ట్రార్ల చాంబర్లను కూటమి నాయకులు ముట్టడించి మరీ భయపెట్టి రాజీనామా చేయించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీకి విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి బెదిరింపులు రావడంతో శనివారం రాజీనామా సమర్పించారు. మరో రెండున్నరేళ్ల పదవీ కాలం ఉన్నా తప్పుకునే పరిస్థితి కల్పించారు. -
ప్రీస్కూల్స్‌గా అంగన్వాడీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను క్రమంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్)గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడత కింద ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న వాటిని ప్రీస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసే దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల సమాచారాన్ని క్రోడీకరించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కేంద్రాల ఆధునీకరణకు అవసరమైన మౌలిక వస తులు,నిధులు...తదితర అంశాలతో ప్రతిపాదనలను ప్రాథమికంగా ఖరారు చేశారు. వీటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో.. జూన్ 6 తర్వాత ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.వసతులకు రూ.30 కోట్లుప్రస్తుతం తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు న్నాయి. వీటిలో 15,640 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటిల్లోనే సూత్రప్రాయంగా ప్రీ స్కూల్ విద్యను అమలు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. వీటి పరిధిలోని 3 లక్షల మంది 3 – 6 సంవత్సరాల మధ్యనున్న చిన్నారులకు ప్రీస్కూల్ విద్యను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా కార్పెట్ల కొనుగోలు కోసం రూ.3.57 కోట్లు బడ్జెట్ అవసరమని ప్రతిపాదించింది. పుస్తకాలు, పఠన సామాగ్రి, బుక్ ర్యాక్స్ కోసం రూ.7.53 కోట్లు ప్రతిపాదించింది. ఆయా కేంద్రాలకు కొత్తగా రంగులు వేసేందుకు సమగ్ర శిక్షా విభాగంతో అవగాహన చేసుకుంది. పిల్లలకు ప్రత్యేక యూనిఫాం కోసం రూ.6.90 కోట్లు, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రెండు టేబుల్స్ ఇతర సామాగ్రి ఏర్పాటు కోసం రూ.12.96 కోట్లు ప్రతిపాదించింది. మొత్తంగా రూ.30 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.కొత్త టీచర్లా? ప్రస్తుత సిబ్బందేనా?ప్రీస్కూల్స్‌లో విద్యాబోధనకు శిక్షణ పొందిన టీచర్ల ఆవశ్య కత ఉంది. ప్రస్తుతం అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు పదో తరగతి అర్హతతో విధుల్లో చేరినవారే. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు కొత్తగా టీచర్లను నియ మిస్తారా? లేక ఇప్పుడున్న వారితో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం దక్కిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
విద్యా వ్యవస్థలో మరో విప్లవం
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ విభిన్న ప్రాజెక్టులతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పునాది స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందిస్తే.. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే యువతగా విద్యార్థులు తలెత్తుకొని జీవించగలరనే నమ్మకంతో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్ ఇండియాతో జతకడుతూ ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ప్రోగ్రాం’ కింద వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ పాఠాలు పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి బోధించేందుకు అడుగులు పడనున్నాయి. వెనక బాటు జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంత భవిష్యత్తు సార థులైన విద్యార్థులకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 10 వేల మంది ఏపీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ ఇండియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 2026–27 నాటికి సంపూర్ణంగా ఈ ప్రయోజనాలను లక్ష మందికి అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా విజయవాడలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఒప్పంద సంతకాలు జరిగాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి అనేక సంస్థలు మందుకువచ్చాయి. అమెజాన్ ఇండియా ఫండ్స్, సమగ్ర శిక్షతో పాటు ప్రపంచబ్యాంక్ టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్ అనే ఎన్జీవో ఇందులో ఉన్నాయి. వీరందరి భాగస్వామ్యంతో ఉత్తరాంధ్ర విద్యార్థుల భవితను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ‘కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ 21 సెంచరీ స్కిల్స్’పై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా బోధన, సాంకేతిక, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. 10 వేల మంది నుంచి లక్ష వరకూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కంప్యూ టర్ సైన్స్ పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో 10 వేల మంది విద్యార్థులకు ఈ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో లక్ష మందికి ఈ విద్యను చేరువ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎస్సీఈఆర్టీతో కలిసి పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు కంప్యూటర్ సై న్స్ పాఠాల బోధన, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇలా విభిన్న అంశాల్లో తరగతులు నిర్వహించి పిల్లల్ని నిష్ణాతుల్ని చేయనుంది. ఎక్సలెన్స్ కోర్సుల అనుసంధానం కంప్యూటర్ సైన్స్ టీచింగ్ ఎక్సలెన్స్ కోర్సులను అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ ప్రోగ్రాం ఒక పునాదిలా మారుతుంది. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ప్రతి విద్యార్థికి అవకాశం అమేజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులందరినీ సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే అమేజాన్ ఇండియా లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు వారి కెరీర్లకు అవ సరమైన నైపుణ్యాల్ని అందిస్తాం. బెస్ట్ కెరీర్‌కు కంప్యూటర్ సైన్స్ విద్య ఎంతో దోహద పడు తుంది. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 1.5 మిలి యన్ మంది విద్యార్థులకు, 8 వేల మంది టీచర్లకు కంప్యూటర్ సైన్స్ విద్య అందించాం. – అక్షయ్ కశ్యప్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ఇండియా లీడర్ -
ఢిల్లీ స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 12వ తేదీ వరకు సెలవులను పొడిగించింది. ఢిల్లీలో పాఠశాలలకు సోమవారంతో శీతాకాల సెలవులు ముగియాల్సి ఉంది. ‘ఢిల్లీలో చలి వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను మరో అయిదు రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయించాం’అని విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలుపుతూ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలు–సాయంత్రం 5 గంటల మధ్యలోనే తరగతులు నడపాలని కోరింది. -
ఏడుపదుల వయసులో స్కూల్‌కి..అది కూడా 3 కిలోమీటర్లు..
చదువుకోవాలన్న తప్పన, జిజ్ఞాస ఉండేలా కాని చదువుకోవడానికి ఏ వయసు అయితే ఏంటి?. చదువుకోవాల్సిన టైంలో ఏవో కారణాల రీత్యా చదువుకోలేకపోవచ్చు. అవకాశం దొరికితే వదులుకోకుండా ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు అని నిరూపించాడు ఓ వృద్ధుడు. వివరాల్లోకెళ్తే..మిజోరాంకు చెందిన లాల్రింగ్థరా అనే 78 ఏళ్ల వృద్ధుడు హైస్కూల్లో చేరి ఔరా అనిపించాడు. ఆ వయసులో కాలినడకన స్కూల్‌కి వెళ్లి మరీ చదువుకుంటున్నాడు. చదువుకి వయసు అడ్డంకి కాదు అని చేసి చూపించి ఆశ్చర్యపరిచాడు. ఆ వృద్ధుడు 1945లో ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించాడు. రెండొవ తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రి మరణంతో చదువుకు దూరమయ్యాడు. తన తల్లికి అతడు ఒక్కడే సంతానం కావడంతో తల్లికి చేదోడుగా పొలం పనులకు వెళ్తుండేవాడు. బతుకు పోరాటం కోసం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ..అలా న్యూహ్రుయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. బాల్యం అంతా కటిక పేదరికంలోనే మగ్గిపోయింది. దీంతో లాల్రింగ్థరా చదువు అనేది అందని ద్రాక్షలా అయిపోయంది. ఇప్పుడు అతను ఓ చర్చిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనిలో చదువుకోవాలనే కోరిక మాత్రం చావలేదు. అందువల్లే ఇక ఇప్పుడైన తన కోరిక తీర్చుకోవాలనే కృత నిశ్చయానికి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఈ మేరకు లాల్రింగ్థరా మాట్లాడుతూ..తనకు చదవడం, రాయడంలో ఇబ్బంది లేదని, ఆంగ్లభాషలోని సాహిత్య పదాలు మాత్రం అర్థమయ్యేవి కావంటున్నాడు. ఎలాగైనా తన ఆంగ్ల భాషను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోనే స్కూల్లో జాయిన్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు లాల్రింగ్థరా. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అతను మా టీచర్ల బృందానికి, విద్యార్థులకు ఆదర్శమైన వ్యక్తి అని, అదే సమయంలో అతనికి నేర్పడం అనేది మాకు ఒక సవాలు కూడా అని అన్నారు. అతనికి తాము అన్ని విధాల మద్దతు ఇవ్వడమేగాక చదువుకోవడంలో తగిన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. (చదవండి: ఇదేం విచిత్రం! ఆవు పాము రెండు అలా..) -
పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్..
భోపాల్: బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి బడి ఆవరణను శుభ్రం చేయమని పిల్లలకు చెప్పి తాను మాత్రం స్కూలు బ్యాగ్ ను తలదిండుగా చేసుకుని కునుకు తీశాడో ప్రధానోపాధ్యాయుడు. మధ్యప్రదేశ్ చత్తార్ పూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదమరచి నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లవకుశ నగర్ ప్రాధమిక పాఠశాలలో రాజేష్ కుమార్ అడ్జారియా హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో బయట ఆవరణ శుభ్రం చేయమని చెప్పి వారి చేతికి చీపుర్లు ఇచ్చాడు. ఈ విరామంలో ప్రధానోపాధ్యాయుడు పిల్లల స్కూలు బ్యాగులను తలకింద దిండుగా పెట్టుకుని ఎంచక్కా సేదదీరాడు. ఆడపిల్లలు స్కూలు మొత్తాన్ని శుభ్రం చేస్తుండగా మగపిల్లలు మాత్రం ఆడుకంటూ ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి చోద్యం మొత్తాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో ఒక చరవాణి నుండి మరోదానికి చేతులు మారుతూ పాఠశాలలో చదువుతున్న పిల్లల బంధువుల చేతికి చేరింది. ఇంకేముంది వారు పిల్లల తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేశారు. బాగుపడుతుందనుకున్న తమ బిడ్డల జీవితం ఇలాంటి అధ్యాపకుల చేతిలో పడితే అంతే సంగతులని భావించి తలిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు. Caught on camera: #MadhyaPradesh school headmaster takes a nap in classroom while students clean the floor. #viral Watch: https://t.co/dAOjb2JoMT pic.twitter.com/b1Ka8JWnMX — editorji (@editorji) July 15, 2023 ఇది కూడా చదవండి: మంత్రి ఆకస్మిక తనిఖీ.. ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి -
వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు..
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా.. -
లక్షితా... ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్‌లో చాలా తక్కువమంది మాత్రమే టచ్‌లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది. ‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేసింది. నేహా ఆన్లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్కేజీ ఫ్రెండ్స్‌ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్‌గా మారింది. ‘నా ఎల్కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది. -
ఉచితంగా వర్క్‌బుక్స్, నోట్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి వర్క్‌బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూడా అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. వర్క్ బుక్స్‌ను, నోటు పుస్తకాలను పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ ద్విభాషా పాఠ్యపుస్తకాలను పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి అందించాలని అదేశించారు. గత సంవత్సరం పాఠ్యపుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా, రానున్న విద్యా సంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నా మని మంత్రి తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్‌ను పాఠశాలల పునః ప్రారంభం నాటికి అందించాలని సూచించారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సబిత అధికారులకు చెప్పారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాల్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతి నిధులు పాఠశాలకు హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సబిత అధికారులకు సూచించారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడని సస్పెండ్ చేశారు..!
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్‌చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ బార్వానీ జిల్లాలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్రకు హాజరైనందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేష్ కన్నోజే సస్పన్షన్‌కి గురయ్యాడు. ఆయన కనాస్యలోని రాష్ట్ర గిరిజన వ్యవహార విభాగంలో ఒక ప్రాథమిక పాఠశాల్లోని ఉపాధ్యాయుడు. అతను యాత్రలో పాల్గొన్న ఒకరోజు తర్వాత ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారంటూ అధికారులు సస్పెండ్ చేశారు. అతని సస్పెన్షన్ ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గిరిజన వ్యవహారాల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రఘవన్షి మాట్లాడుతూ...కన్నోజే ముఖ్యమైన పని కోసం సెలవు కోరారు. కానీ అతను రాజకీయ కార్యక్రమానికి హాజరై సోషల్‌మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడు. ఆయన నవంబర్ 24న ఒక రాజకీయ పార్టీ భారత్ జోడో యాత్రకు హాజరై ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారు. అదువల్లేఈ వేటు విధించినట్లు తెలిపారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మీడియా డిపార్ట్మెంట్ చైర్పర్సన్ కెకె మిశ్రా ట్విట్టర్ వేదికగా....శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రభుత్వం ఉద్యోగులను రాష్ట్ర స్వయం సేవక్ సంఘం(ఆర్ఎస్ఎస్) శాఖలలో మాత్రమే పాల్గొనడానికి అనుమతించిందని ఎద్దేవా చేశారు. రాజేష్ కన్నోజ్ అనే గిరిజనుడు ఆ యాత్రలో పాల్గొని రాహుల్‌కి విల్లు, బాణం బహుమతిగా ఇచ్చినందుకే ఆయనపై వేటు వేశారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాహుల్ జోడో యాత్ర ఈ ఆదివారం రాజస్తాన్‌లోకి ప్రవేశించనుంది. (చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ!) -
Deepmala Pandey: స్పెషల్ టీచర్
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్‌మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా ఉన్న దీప్‌మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం. బరేలీ మధ్యప్రదేశ్‌లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తోంది దీప్‌మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె. చదువులో ముందంజ దీప్‌మాలా సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్‌మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్‌మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్‌గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు. సృజనాత్మక ఆలోచనలు ‘ఒకసారి గురుకుల పిఎల్సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్‌లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్‌ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్‌సిఇఆర్‌టి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు. కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె. ఓ అబ్బాయితో మొదలు... మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్‌కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను. ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్లో చేర్చాలని మా పిఎల్సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్‌లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తరణ ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్‌మీడియాను ఎంచుకున్నారు దీప్‌మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్‌మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్‌కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీల అక్షరాస్యత స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్‌మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు. మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్‌మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది. ప్రధాని ప్రశంసలు ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్‌మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె. స్కూల్లో విద్యార్థులతో దీప్‌మాలా పాండే -
ప్రిన్స్ మీ వయసెంత...చార్లెస్‌ని ప్రశ్నించిన చిన్నారి: వీడియో వైరల్
సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన జీరో వాల్తామ్స్టోవ్ను సందర్శించడానికి చార్లెస్ 3 తూర్పు లండన్‌కి వెళ్లారు. అక్కడ ఆయన బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను కలిశారు. వారితో రాజు కాసేపు ఆనందంగా ముచ్చటించాడు. చార్లెస్ ఆ విద్యార్థులతో సెలవులు గురించి, లంచ్ సమయం గురించి కొన్ని కుశల ప్రశ్నలు వేశారు. ఆ చిన్నారుల్లో ఒకరు ప్రిన్స్ అంటూ జెండా ఊపుతూ చార్లెస్‌ని ఉత్సహాపరిచాడు. మరో చిన్నారి చార్లెస్‌ని మీ వయసు అంతా అని ముద్దుగా అడిగింది. ఆ చిన్నారి చిలిపి ప్రశ్నతో అక్కడ ఉన్న టీచర్లు, చార్లెస్ ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. దీనికి చార్లెస్ తనదైనా శైలిలో గెస్ చేయండి అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇలాంటి చమత్కర ప్రశ్నలకు తనదైన హాస్యాని చార్లెస్ పండించడం మొదటిసారి కాదు. ఇంతకుముందు కామెన్వెల్త్ గేమ్ 2022 ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి మనం బీర్ వద్దకు వెళ్లగలమా అని ప్రశ్నిస్తే ఇలానే హాస్యాన్ని పండించాడు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. First joint engagement for the King and Queen Consort in London with a visit to youth organisation @ProjectZeroWF1 King Charles keen to have a quick chat with primary school children about school lunches and school holidays on the way in pic.twitter.com/6fWx0iXV7P — Rhiannon Mills (@SkyRhiannon) October 18, 2022 (చదవండి: చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు) -
ఊయలే..ఉరితాడై..!
కోడూరు: స్నేహితులతో కలిసి ఊగుతున్న ఊయలే ఆ బాలుడికి ఉరితాడైంది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో శనివారం జరిగింది. కోడూరులోని అంబటి బ్రహ్మణయ్య కాలనీకి చెందిన గొర్ల రామాంజనేయులు, అంజలిదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గొర్ల చైతన్య (10), చిన్న కుమారుడు బాలవర్థన్ వడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. క్రిస్మస్కు పాఠశాలకు సెలవు ఇవ్వడంతో శనివారం చైతన్య, బాలవర్థన్, కాలనీలోని తోటి స్నేహితులతో కలిసివారి ఇంటి వెనుక భాగంలోని చెట్టుకు చీరతో వేసి ఉన్న ఊయల ఊగేందుకు వచ్చారు. చైతన్య ఉయ్యాల ఎక్కి ఊగుతూ చీరను మెలికలు వేస్తూ గుండ్రంగా తిరిగాడు. దీంతో చీర చైతన్య మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య విగత జీవిలా చీర మధ్యలో మాట్లాడకుండా ఉండిపోయాడు. చిన్నారులు వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా, అప్పటికే చైతన్య ప్రాణాలు విడిచాడు. -
పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం...
విజయానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు. సాధారణంగా 16, 17 యేళ్ల నుంచి అంతకంటే పెద్ద వయసున్నవారు బిజినెస్ లేదా జాబ్ చేయడం చూస్తుంటాం! కానీ 10 యేళ్ల వయసున్న పిల్లలెవరైనా నెలకు ఏకంగా కొట్ల రూపాయలను సంపాదించడం కనీవినీ ఎరుగునా? మీరు విన్నది అక్షరాల నిజం.. ఐతే ఇదంతా ఎలా సాధ్యపడిందబ్బా! అని ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నారని తెలుస్తుందిలే.. వివరాల్లోకెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన పిక్సిస్ కర్టిస్ అనే 10 యేళ్ల బాలిక తల్లి సహాయంతో బొమ్మల వ్యాపారం (టాయ్ బిజినెస్) చేస్తోంది. తద్వారా నెలకు రూ.1 కోటి 4 లక్షలకు పైనే సంపాదిస్తోంది. కలర్‌ఫుల్ బొమ్మలతోపాటు, ఆకర్షనీయమైన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ వంటి (హెయర్ యాక్ససరీస్) వాటిని నెముషాల్లో అమ్మి పెద్ద మొత్తంలో ఆర్జిస్తుంది. బాలిక తల్లి రాక్సి మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా చిన్న వయసులోనే నా కూతురు బిజినెస్‌లో విజయం సాధించి నా కలను నెరవేర్చింది. నాచిన్నతనంలో 14 యేళ్ల వయసులో మెక్‌డోనాల్డ్స్‌లో పనిచేశాను. కానీ నా కూతురు అంతకంటే ఎక్కువే సంపాదిస్తోంది. పిక్సిస్ సిడ్నీలో ప్రైమరీ స్కూల్లో చదువుతూ బిజినెస్ చేస్తోంది. తానుకోరుకుంటే 15 యేళ్లకే రిటైర్ అయ్యేలా కూడా ప్లాన్ చేశాం. అంతేకాదు కోటి 41 లక్షల రూపాయల విలువైన మెర్సిడెస్ కారు కూడా నా కూతురికి ఉంద’ని పేర్కొంది. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
మారిన తర‘గతి’
సాక్షి, కామారెడ్డి: చెట్ల కింద నడుస్తున్న పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం నిర్మాణానికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రకటించారు. చెట్లకింద కొనసాగుతున్న కామారెడ్డి జిల్లా పల్లెగడ్డతండా ప్రాథమిక పాఠశాల దుస్థితిపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ఇదీ తర‘గతి’... కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పల్లెగడ్డతండా పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తన నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేసి, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. -
ఆ పాఠశాలకు అందరూ స్కర్టుతోనే రావాలి.. ఎందుకో తెలుసా?
లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో స్కాట్లాండ్లోని ఓ పాఠశాల వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలలోని బాలురు, బాలికలతోపాటు టీచర్లు కూడా స్కర్ట్స్ ధరించి క్లాస్‌లోకి రావాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఎడిన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదటిసారిగా ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కర్ట్ ధరించి పాఠశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ టీచర్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. చదవండి: సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్లు స్కూల్ పిల్లలందరికి సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చామని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు రాసిన లేఖలో తెలిపారు. స్కర్ట్ లోపల లెగ్గిన్, ప్యాంట్ లాంటివి ధరించవచ్చని పేర్కొన్నారు. అంతేగాక ఒకవేళ స్కర్ట్ కొనలేని వారికి స్కూల్ యాజమాన్యమే పిల్లలకు వాటిని ఆఫర్ చేసిందన్నారు. బట్టలకు లింగ బేధం లేదనే సందేశాన్ని తెలియజేయడానికే తాము ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మనం ఎంచుకున్న విధంగా మన భావాలను వ్యక్తీకరించడానికి మనందరికీ స్వేచ్ఛ ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఇలా చేశామని పేర్కొన్నారు. చదవండి: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఆమె చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా కాగా ఇలా ధరించడం ఇష్టం లేని వారిని మేం ఏం బలవంతం చేయలేదని అంటున్నారు. ఇష్టం ఉన్న వారే ధరించాలని కోరినట్లు తెలిపారు. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్వేచ్చగా చెప్పేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సదరు పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పబడుతున్నారు.లింగ సమానత్వం అంటే ఒకే విధమైన దుస్తులు ధరించడం లేదా పంచుకోవడం కాదని, అందరికి సమాన అవకాశాలు, బాధ్యతలు, హక్కులు కల్పించడమని చెబుతున్నారు. P6 have been learning about the importance of breaking down gender stereotypes. We have organised a ‘Wear a Skirt to School Day’ to raise awareness of #LaRopaNoTieneGénero campaign. This will be on Thursday 4th November and we’d love everyone to get involved! 👗 @Castleview_PS pic.twitter.com/Bby6JKzUJz — Miss White (@MissWhiteCV) October 27, 2021 -
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు ఇచ్చేదెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులకు మోక్షం లభించడం లేదు. 10 వేల ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్‌హెచ్‌ఎంలను నియమిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మూడు నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఆయా స్కూళ్లలో ఇప్పటికే ఉన్న హెడ్ మాస్టర్ పోస్టులు, తాజాగా ఇంకా ఎన్ని పోస్టులు మంజూరు చేయాలన్న అంశాలపై వివరాలను సేకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 18,217 ప్రాథమిక పాఠశాలల్లో 4,429 లో–ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నట్లు తేల్చింది. సీఎం కేసీఆర్ 10 వేల స్కూళ్లలో హెడ్ మాస్టర్ పోస్టులను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరో 5,571 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం లేకుండాపోయింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 4,429 ప్రధానోపాధ్యాయ పోస్టులు పోగా, మిగతా పోస్టులను మంజూరు చేస్తారా? లేదంటే వాటికి అదనంగా కొత్తగా 10 వేల పోస్టులను మంజూరు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. జిల్లాల వారీగా పోస్టులు జిల్లా పాత కొత్త మొత్తం పోస్టులు పోస్టులు ఆదిలాబాద్ 484 613 1,097 హైదరాబాద్ 168 205 373 కరీంనగర్ 562 709 1,271 ఖమ్మం 460 581 1,041 మహబూబ్‌నగర్ 580 731 1,311 మెదక్ 426 535 961 నల్లగొండ 500 629 1,129 నిజామాబాద్ 389 485 874 రంగారెడ్డి 369 466 835 వరంగల్ 491 617 1,108 మొత్తం 4,429 5,571 10,000 -
చైనాలో దారుణ సంఘటన
బీజింగ్: చైనాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులతో సహా, 40 మంది విద్యార్థులపై ఓ వ్యక్తి కత్తిపోట్లతో దాడికి దిగాడు. ఈ ఘటన గురువారం చైనాలోని గాంగ్జీ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. చైనా మీడియా కథనం ప్రకారం.. ఉదయం 8.30 ప్రాంతంలో వూజోలోని ప్రైమరీ పాఠశాలలో ఓ సెక్యూరిటీ గార్డు చొరబడ్డాడు. విద్యార్థులతోపాటు అడ్డొచ్చిన టీచర్ల మీదా కత్తితో దాడికి దిగబడ్డాడు. ఈ దాడిలో 40 మంది గాయాలపాలయ్యారు. వీరిలో స్కూలు ప్రిన్సిపల్, సెక్యూరిటీ గార్డు, ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని యాభై ఏళ్ల సెక్యూరిటీ గార్డుగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (4 నెలలుగా కరోనాతో పోరాటం.. వైద్యుడి మృతి) ఈ దాడి గురించి స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. "ఉదయం దగ్గరలోని స్కూలు నుంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించాయి. వెంటనే స్కూలుకు చేరుకోగా పిల్లలు భయంతో పరుగెత్తుతున్నారు. ఏమైందని వారిని ఆరా తీస్తే ఓ వ్యక్తి కత్తితో దాడి చేస్తూ తిరుగుతున్నాడని ఓ స్టూడెంట్ చెప్పాడు. వెంటనే భయంతో నా కొడుకును తీసుకొచ్చేందుకు స్కూలు లోపలికి పరిగెత్తాను. అదృష్టవశాత్తూ వాడికి ఏం కాలేదు. కానీ ఈ ఘటనతో అతడు బాగా హడలిపోయాడు" అని చెప్పుకొచ్చాడు. కాగా చైనాలో ఇంతకు ముందు సైతం ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. గతేడాది సెప్టెంబర్‌లో మధ్య చైనాలో ఓ వ్యక్తి ప్రైమరీ స్కూలుకు వెళ్లి విద్యార్థులపై దాడికి దిగాడు. ఈ దారుణ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు మరణించగా ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ దాడికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు ఈ మధ్యే జైలు నుంచి విడుదల చేశారు. (చేతిని నరికి ప్రేయసి ఇంటి ముందు..) -
వయసు ఒకటే..తరగతులే వేరు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లు నిండిన వారినే ఒకటో తరగతిలో చేర్పించాలి.. ఇదీ విద్యా హక్కు చట్టం చెబుతున్న నిబంధన. అందుకు భిన్నంగా ఉంది రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. ఐదేళ్లు నిండని పిల్లలు కొందరు ప్రీప్రైమరీలో ఉంటే, మరి కొందరు ఒకటో తరగతి చదువుతు న్నారు. ఇక ఆరేళ్లు వచ్చినా కొందరు ఇంకా ప్రీప్రైమరీ స్కూళ్లోనే/అంగన్ వాడీ కేంద్రాల్లోనే ఉండగా, కొందరు ఒకటో తరగతిలో ఉన్నారు. ఆయా విద్యార్థుల వయసు ఒక్కటే ఐనా, చదివే తరగతులు వేర్వేరు. తల్లిదం డ్రుల ఆకాంక్షలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ అంతరాలకు కారణం. పిల్లలను త్వరగా చదివించాలన్న తప నతో కొందరు తల్లిదండ్రులు రెండేళ్లకే పిల్లలను ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపి స్తుంటే.. ఐదేళ్లు నిండకుండానే ఒకటో తరగతికి వచ్చేస్తున్నారు. పల్లెల్లో ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు తమ పిల్ల లను ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపించకుండా ఆరేళ్లు వచ్చినా అంగన్వాడీ కేంద్రాలకే పంపుతుం డగా, మరికొంత మంది తల్లిదండ్రులు మాత్రం ఐదేళ్లు నిండాకే తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చుతున్నారు. రాష్ట్రంలో ప్రీప్రైమరీ, ప్రైమరీస్కూళ్లలో ప్రవేశాల తీరుపై ‘ప్రథమ్’ సంస్థ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) పేరుతో సర్వే చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వే.. దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన 26 జిల్లాల్లోని 1,514 గ్రామాల్లో అసర్ ప్రతినిధులు ఈ సర్వేను నిర్వహించారు.ఆయా గ్రామాల్లోని 30,425 ఇళ్లు తిరిగి 4 నుంచి 8 ఏళ్ల వయసున్న 36,930మంది పిల్లలతో మాట్లాడి వివరాలను సేకరించారు. అందులో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని 60గ్రామాలకు చెందిన 1,201 ఇళ్లను తిరిగి 1,426 మంది విద్యార్థులను కలిసి, 4 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల స్థితిగతులపై నివేదికను రూపొందించారు. తాజాగా ఢిల్లీలో విడుదల చేసిన నివేదికలోని ప్రధానాంశాలు ►రాష్ట్రంలో ఐదేళ్ల వయసున్న విద్యార్థుల్లో 21.6 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, మిగతా వారు అంగన్వాడీ/ప్రీప్రైమరీ తరగతులు చదువుతున్నారు. ►ఇక ఆరేళ్ల వయసు వారిలో 32.8 శాతం మంది అంగన్వాడీ కేంద్రాలు/ప్రీప్రైమరీ స్కూళ్లలో ఉన్నారు. ఇక 46.4 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, 18.7 శాతం మంది రెండో తరగతి, మిగతా వారు ఆపై తరగతుల్లో ఉన్నారు. ►4 నుంచి 8 ఏళ్ల వయసు వారిలో బాలికలు ఎక్కువ మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరగా, బాలురు ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నారు. ►నాలుగైదేళ్ల వయసు పిల్లల్లో 56.8% మంది బాలికలు ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూల్స్/అంగన్వాడీ కేంద్రాల్లో ఉండగా, బాలురు మాత్రం 50.4% మందే ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు. ►అదే వయసు పిల్లలు ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లలో 43.2% బాలికలుండగా, బాలురు 49.6% ఉన్నారు. ►6 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల్లో 61.1% బాలికలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తుండగా, బాలురు 52.1% మందే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నట్లు తేలింది. 10 మందిలో ప్రతి నలుగురు తక్కువ వయసు వారే.. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో చేరాలంటే ఐదేళ్లు నిండి ఉండాలి. కానీ రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరిన ప్రతి 10 మందిలో సగటున నలుగురు ఐదేళ్లు నిండని వారే ఉన్నట్లు సర్వేల్లో వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్లకు వచ్చి ఒకటో తరగతిలో చేరిన వారు 41.7 శాతమే ఉన్నట్లుగా తేలింది. అలాగే ఒకటో తరగతిలో చేరిన వారిలో ఏడెనిమిదేళ్ల వయసు వారు 36.4 శాతం ఉండగా, నాలుగైదేళ్ల వయసు వారు 21.9 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది. -
నర్సరీ, ఎల్కేజీ టాపర్లంటూ ఫ్లెక్సీ..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏ టెన్త్‌క్లాస్‌కో, ఇంటర్‌కో.. స్టేట్ ఫస్ట్ అంటూ బ్యానర్లు వేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఊదరగొడుతుంటాయి. పబ్లిసిటీ కోసం భారీ కటౌట్లు, బ్యానర్లతో హంగామ చేస్తుంటాయి. కానీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మాత్రం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో టాపర్లు అంటూ భారీ ఫ్లెక్సీ వేయించి విమర్శలపాలైంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ప్రియా భారతి హైస్కూల్.. తమ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల ర్యాంకులు, గ్రేడింగ్‌లతో ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేయించింది. తమ టాపర్లు వీరే అంటూ ఘనంగా చెప్పుకుంది. ఆ స్కూల్‌కు తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కూడా ఉన్నట్లులో ఫ్లెక్సీలో పేర్కొంది. నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు 44 మంది ప్రతిభ గల విద్యార్థుల ఫొటోలు ఫ్లెక్సీలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ కటౌట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా నర్సరీ పిల్లలకు కూడా ర్యాంకులు కేటాయించడం పట్ల విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నర్సరీ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తారని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. చిన్న పిల్లలను పోటీ ప్రపంచంలోకి నెట్టడం విచారకరమని పలువురు నెటిజన్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘పిల్లలు పాలు తాగడంలో ఫస్టా..’ అంటూ క్రిష్ యాదు అనే నెటిజన్ విద్యాసంస్థలపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆడుతూ పాడుతూ సరదాగా గడపాల్సిన వయస్సులో విద్యార్థులకు ఇలాంటి కష్టాలు రావడం విచారకరమని, విద్యాసంస్థలను నియంత్రించే వ్యవస్థ అవసరమని సునీష అనే మహిళ ట్విటర్లో పోస్ట్ చేసింది. మన ప్రాథమిక విద్యావ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టమని ఫ్రాన్స్‌లోని భారత మాజీ రాయబారి డాక్టర్ మోహన్ కుమార్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ రకమైన స్కూళ్లను నిషేదించాలని, పిల్లల్లో ఒత్తిడి పెంచడం తీవ్ర ఆక్షేపణీయమని దీరజ్ సింగ్లా అనే నెటిజన్ ఘాటుగా ట్వీట్ చేశారు. -
బడికి ఒంటరిగా పంపితే..!
దిస్పూర్ (అస్సాం) : చిరునవ్వులు చిందిస్తూ బడికి వెళ్లాల్సిన బాల్యం.. బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తోంది. చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రోడ్డుని దాటుతూ ప్రమాదపుటంచులలో పయనం సాగిస్తోంది. దరంగ్ జిల్లాలో గల దాల్‌గావ్‌లో కల్వర్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురవడంతో.. కొద్దిపాటి వర్షానికే రెండు గ్రామాల మధ్యనున్న లింకు రోడ్డు నీట మునిగిపోయింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో అయిదడుగుల లోతు నీటి కాలువను దాటుకుని ప్రైమరీ స్కూల్ విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. తాటి బొదల సాయంతో 5 అడుగుల నీటిలో ప్రయాణం చేస్తున్న చిన్నారుల ‘సాహస యాత్ర’అక్కడి అధికార యంత్రాగాన్ని వేలెత్తి చూపుతోంది. ఈ-పాఠాలు చెప్పించండి రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబాలు పిల్లలను పాఠశాలలో దింపడానికి, తిరిగి తీసుకురావడానికి రోజంతా పని వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నాయి. పనికోసం చూసుకొని పిల్లలని ఒంటరిగా బడికి పంపితే ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశాన్ని డిజిటల్ మయం చేస్తానని చెప్తున్న ప్రధాని మోదీ ఈ పిల్లలకు ఈ-పాఠాలు చెప్పిస్తే సరిపోతుంది కదా అని ట్విటర్లో కొందరు కాంమెంట్లు చేస్తున్నారు. -
నీటిలో ఈదితేనే బడి..!
-
‘ప్రైమరీ స్కూల్ పిల్లలకు బ్యాగ్ అవసరం లేదు’
చండీగఢ్: ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హర్యానా ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఒకటి, రెండో తరగతి చదువుతున్న పిల్లలు పాఠశాలకు బ్యాగ్‌లు తీసుకురావల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశాలు జరిచేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్‌బిలాస్ శర్మ శుక్రవారం ప్రకటన చేశారు. గతకొంత కాలంగా ప్రైమరీ స్కూల్ పిల్లల బ్యాగుల బరువు తగ్గించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్వర్వులను అమలు చేయలని హర్యానా ప్రభుత్వం భావించింది. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బరువైన బ్యాగులు, అధిక హోం వర్కుల నుంచి ఉపశమనం కల్పించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించాలని మే 30న మద్రాస్ హైకోర్టు సిఫారస్సు చేసిన విషయం తెలిసిందే. పిల్లల బరువులో పదిశాతానికి మించి బ్యాగ్ బరువు ఉండకూదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ఆదేశాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఆదేశించారు. -
ఎంగిలి చేతులతో ఎందాక...
సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు లేవనడానికి ఈ చిత్రంలో వరుసగా నడిచి వెళ్తూ కనిపిస్తున్న విద్యార్థులే నిదర్శనం. పోలాకి మండలం చీడివలస ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో వీరంతా చదువుతున్నారు. ఇక్కడ ఉన్న బోరు సుమారు ఆరు నెలల క్రితం పాడవ్వడంతో విద్యార్థులకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కంచాలు, చేతులు కడుక్కోవడానికి నీరు అందుబాటులో లేదు. దీంతో చేసేది లేక పాఠశాలకు సమీపంలో రోడ్డు ఆవలవైపు ఉన్న సాగునీటికాలువ వద్దకు వెళ్లి కంచాలు కడ్డుక్కోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. సుమారు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. పిల్లల వెంట ఓ ఉపాధ్యాయుడు తోడుగా వెళ్లి..వస్తుండడం దినచర్యగా మారింది. బోరు పాడైన విషయాన్ని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి సర్పంచ్ ముద్దాడ రాము తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు. విద్యార్థులకు కష్టాలు తీరలేదు. అధికారులు స్పందించి నీటి సమస్య నుంచి తమ పిల్లలను గట్టెక్కించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పాఠశాల భవనం పెచు్చలూడి విద్యార్థులకు గాయాలు
మంత్రాలయం రూరల్ : ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. మండలం పరిధిలోని చౌళహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తరగతి గదిలో పిల్లలు చదువుకుంటుండగా ఉన్నట్టుండి పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఈ సంఘటనలో మూడోతరగతి చదవుతున్న శివరాజుకు తీవ్ర గాయాలు కాగా, నాలుగోతరగతి చదువుతున్న నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం వారిని ఎమ్మిగనూరులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాధికారి కె. ఈరన్న ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. టీచర్లను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
ఊరి బడి.. సర్కారు ఉరి
ప్రాథమికోన్నత స్కూళ్లకు మంగళం.. హేతుబద్ధీకరణ పేరుతో 4 వేల స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం త్వరలో ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు వేసవి బదిలీలకు ముందే చేపట్టాలని అధికారుల నిర్ణయం ప్రైమరీ, హైస్కూల్.. రెండంచెల విధానం అమలుకు సిద్ధం ఊళ్లోకి అడుగు పెడుతూనే అందరికీ దర్పంగా కనిపించేది సర్కారు పాఠశాల. ఒక్కో పాఠశాలకు ఒక్కో చరిత్ర. వీటిల్లో చదువుకుని ఎంతో మంది పేద విద్యార్థులు కలెక్టర్లు, ఎస్పీలయ్యారు. ఓ పద్ధతి ప్రకారం సామాజిక అవగాహన కల్పిస్తూ పిల్లలను తీర్చిదిద్దడంలో వీటికి తిరుగులేదు. ‘ఓ స్కూలు కట్టండి.. ఆ ఊరంతా అదే బాగుపడుతుంద’ని పెద్దలు చెప్పిన మాట అక్షరాలా నిజమని వేలాది గ్రామాలు నిరూపించాయి. ఇలాంటి స్కూళ్లలో చిన్న పాటి లోపాలు చూపి.. కాలి వేలికి పుండు అయిందని ఏకంగా కాలినే తీసేయండన్నట్లు ప్రభుత్వం వరుసగా మూతేస్తోంది. ఇదే అదనుగా కాచుకు కూర్చున్న ‘కార్పొరేట్’ విద్యా సంస్థలు తమ విద్యా వ్యాపారాన్ని మూడు వీధులు.. ఆరు పాఠశాలల రీతిలో విస్తరించుకుంటున్నాయి. వెరసి సగటు.. బడుగు విద్యార్థి చదువు ‘కొన’లేక సతమతమవుతున్నాడు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత విద్యాసంవత్సరం హేతుబద్ధీకరణ పేరిట 1,486 స్కూళ్లను మూసేయించిన ప్రభుత్వం ఈసారి అంతకన్నా రెట్టింపు సంఖ్యలో స్కూళ్లకు మంగళం పాడాలన్న యోచనతో ముందుకెళ్తోంది. ఇందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే ప్రభుత్వానికి పంపనుంది. వేసవి సెలవుల్లో టీచర్ల సాధారణ బదిలీలు చేపట్టడానికి ముందే స్కూళ్ల హేతుబద్ధీకరణను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత బదిలీల ద్వారా మిగిలిన స్కూళ్లలో టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రాథమికోన్నత స్కూళ్లకు పెనుముప్పు పాఠశాల విద్యాశాఖ రూపొందించిన హేతుబద్ధీకరణ ప్రతిపాదనల్లో ఈసారి ప్రాథమికోన్నత పాఠశాలలను మూయించాలన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అనే మూడంచెల విధానంలో ప్రభుత్వ స్కూళ్లు నడుస్తున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను ముడిపెట్టి వాటిని క్రమేణా మూయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండంచెల విధానమే కొనసాగించి ప్రాథమికోన్నత విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రంలోని 4,427 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 4 వేల వరకు మూతపడే ప్రమాదముంది. దీనివల్ల టీచర్లు వేరే పాఠశాలలకు బదిలీ అవ్వడంతో పాటు 1.50 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడనున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 75 మందిపైనా, 6, 7 తరగతుల్లో 60 మందిపైన విద్యార్థులున్న పాఠశాలల్ని అప్‌గ్రేడ్ చేసి హైస్కూళ్లుగా మార్పు చేసి 8, 9 తరగతులు ప్రారంభించాలని, అంతకన్నా తక్కువగా విద్యార్థుల సంఖ్య ఉంటే వాటిని పూర్తిగా రద్దుచేసి ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలన్న నిబంధన పెడుతున్నారు. ఈ ప్రాథమికోన్నత పాఠశాలలను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలపైనా కన్ను ప్రాథమికోన్నత స్కూళ్ల వరకే కాకుండా ప్రాథమిక పాఠశాలలనూ హేతుబద్ధీకరించాలని విద్యాశాఖ చూస్తోంది. రాష్ట్రంలో 39,186 ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 32 వేల స్కూళ్లున్నాయి. వీటిలో 5,690 స్కూళ్లలో 19 మంది లోపు విద్యార్థులున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చూపిస్తోంది. వీటన్నిటినీ గిట్టుబాటు కాని (నాన్ వయోబుల్) పాఠశాలల కింద జమకట్టి వేరే పాఠశాలల్లో విలీనం చేస్తోంది. గతేడాది విలీనం చేసిన పాఠశాలల్లో 3,876 స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్పు చేస్తామని అధికారులు ప్రకటించారు. తగినంత మంది టీచర్లు, సదుపాయాలు, రవాణా సదుపాయం అంటూ ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. సున్నాలు, ఇతర మరమ్మతుల పేరిట రూ.121 కోట్లకు పైగా ఖర్చు చేయించారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఇందులో 1,486 స్కూళ్లలో తగినంత మంది విద్యార్థులు లేరని సాకుచూపుతూ మూత దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలకూ తప్పని ముప్పు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలనూ హేతుబద్ధీకరణ పరిధిలోకి తెస్తున్నారు. రాష్ట్రంలో 4,998 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 3,851 స్కూళ్లలో సమాంతరంగా సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియం తరగతులు నడుస్తున్నాయి. ఈ హైస్కూళ్లలో 75 లోపు విద్యార్థులున్న వాటిని, 5 కిలోమీటర్లలోపు ఉన్న హైస్కూళ్లలో విలీనం పేరిట మూసి వేయించాలని నిర్ణయించారు. నిర్ణీత సంఖ్యకన్నా తక్కువ విద్యార్థులున్న స్కూళ్లు 144 ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలోని సక్సెస్ స్కూళ్లలో 50 మంది కన్నా తక్కువ ఉన్నవి 539 ఉన్నాయి. వీటన్నిటిపైనా హేతుబద్ధీకరణ వేటు పడనుంది. -
ప్రతి ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం
జూన్‌లోగా చర్యలు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఈ మేరకు జూన్‌లోగా చర్యలు పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. మంగళవారం న్యాక్ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి తుమ్మల సమీక్షించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం ఉండాలని, ఇందుకు 2 గదులు కేటాయించాలన్నారు. ఇప్పటికే మంజూరై, నిర్మాణాలు పూర్తికాని అంగన్వాడీ కేంద్రాలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో నిర్మించా లన్నారు. అవసరం లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించాలని, ఇందుకు స్థానిక తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ శాఖ సంచాలకుడు విజయేందిరను ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖలోని ఖాళీలపై నివేదిక ఇవ్వాలని, వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులను తీసుకురావాలని, ఇందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. -
కీచక గురువుకు దేహశుద్ధి
చిట్టమూరు: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు విద్యార్థినుల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తుండడంతో గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేసి పాఠశాలకు తాళం వేసిన సంఘటన నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఆరూరులో శుక్రవారం జరిగింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి విధులకు హాజరవుతూ.. ఐదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పక్కనే ఉన్న మరో గదిని శుభ్రం చేయాలన్న నెపంతో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు కన్నీటి పర్యంతమయ్యారు. కొద్ది రోజులుగా ఈ తంతు జరుగుతుండగా భయపడిన విద్యార్థినులు శుక్రవారం పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు మూకుమ్మడిగా పాఠశాలకు వెళ్లేసరికి ఉపాధ్యాయుడు పూటుగా మద్యం సేవించి ఉన్నాడు. అక్కడి పరిస్థితిని గమనించిన వారు ఆగ్రహావేశాలతో ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం ఎంపీపీ జనార్దన్, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, ఎస్సై గోపాల్‌లకు సమాచారమందించారు. పోలీసులు శ్రీనివాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసులుపై తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అతడిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎంపీపీ సూచించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ చెప్పారు. ఈ ఉపాధ్యాయుడు తమకొద్దు అంటూ తల్లిదండ్రులు నినదించారు. -
పాఠశాలలో అగ్నిప్రమాదం
మర్కుక్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి ప్రాథమిక పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ అయింది. స్కూల్ వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చుట్టుపక్కల మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆదర్శ ప్రాథమిక పాఠశాలు 541
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ప్రస్తుతం ఏదైనా ప్రాథమిక పాఠశాలకు వెళితే ఒకరో, ఇద్దరో టీచర్లు కనిపిస్తారు. పొరపాటున ఇద్దరు టీచర్లకు అర్జెంటుగా పనిపడితే ఆ రోజు పాఠశాలకు అనధికారికంగా సెలవు ప్రకటించే దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు వీలుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు మొదలయింది. రెండు, మూడు నెలల్లో జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 541 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో కనిష్టంగా 5గురు టీచర్లు ఉండనున్నారు. అంతేకాకుండా ఒక్కో టీచర్ ఒక్కో సబ్జెక్టును బోధించేందుకు ప్రత్యేకంగా నియమితులుకానున్నారు. జిల్లాలో 100 మంది విద్యార్థుల కంటే అధికంగా చదువుతున్న 541 ప్రాథమిక పాఠశాలలను గుర్తించి.. వీటిని ఆదర్శ పాఠశాలలుగా మార్చనున్నారు. ఇందుకోసం అదనంగా 800 మంది టీచర్లు అవసరమవుతారని ప్రభుత్వానికి జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) రవీంధ్రనాథ్ రెడ్డి నివేదిక సమర్పించారు. అంతేకాకుండా ఈ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలకు కూడా నిధులు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీఈఓల సమావేశంలో ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చిన వెంటనే రెండు, మూడు నెలల్లో జిల్లాలో 541 ప్రాథమిక పాఠశాలలు కాస్తా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మారనున్నాయి. వీటిలో 82వేల మంది విద్యార్థులు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు. ల్యాబ్‌తో పాటు... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రై వేటు పాఠశాలలకు పంపించలేని ఆర్థిక పరిస్థితే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒక్కో పాఠశాలలో ఏకంగా 500 మంది వరకూ విద్యార్థులు ఉంటున్నారు. అయితే, వీరికి సరిపడిన సంఖ్యలో ఉపాధ్యాయులు కానీ.. మౌలిక సదుపాయాలు కానీ లేవు. ఈ నేపథ్యంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఈ పాఠశాలల్లో సగటున కచ్చితంగా 5గురు టీచర్లు ఉండనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు కానుంది. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా నిధులు కావాలని కోరారు. అదేవిధంగా ఇంగ్లిష్‌లో బోధించేందుకు ప్రత్యేకంగా ఒక అధ్యాపకుడిని కూడా నియమించనున్నారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసిన వాటిలో సగటున 3.5 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా సగటున ఒక్కో పాఠశాలలో 157 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సగటు ఉపాధ్యాయుల సంఖ్యను ఐదుకు పెంచేందుకు వీలుగా అదనంగా 800 మంది టీచర్లు కావాల్సి ఉంటుంది. ఈ పోస్టులను వాలంటీర్లతో కానీ అదనంగా ఇతర చోట్ల పనిచేస్తున్న ఉపాధ్యాయులను కానీ బదిలీ చేయనున్నట్లు సమాచారం. -
రోజూ 24 కి.మీ. సైకిల్ తొక్కి..
మెట్రిక్ పాసైన జార్ఖండ్ దళిత బాలిక రాంచీ: జార్ఖండ్ లతేహర్ జిల్లాలోని మారుమూల గ్రామం కర్మటండ్. రోడ్లు, విద్యుత్తు, ఉన్నత పాఠశాలలు వంటి సౌకర్యాలు లేవు. కానీ నేడు.. జార్ఖండ్‌లో అందరూ ఆ పల్లె గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం.. నీలూ కుమారి అనే దళిత బాలిక. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణురాలవ్వడమే ఆమె ఘనత. మెట్రిక్యులేషన్ పాస్ అవ్వడం గొప్పా? అని తీసిపారేయకండి. ఆమె పాఠశాలకు చేరుకోడానికి రోజూ 24 కి.మీలు సైకిల్ తొక్కింది. అదీ అడవులు, కొండలు, వాగులు నిండిన దారులగుండా. అందుకు ప్రభుత్వం ఇచ్చిన సైకిల్‌నే వాడింది. పొద్దున్నే పాఠశాల సమయం కన్నా రెండు గ ంటల ముందే ఇంటి నుంచి బయలుదేరేది. సాయంత్రం తరగతులు పూర్తయ్యాక హోం వర్క్ ముగించుకుని సూర్యాస్తమయం కన్నా ముందే ఇంటికి బయలుదేరేది. ఎండ, వాన, చలిలాంటి ఏ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు. ప్రతిరోజూ స్కూలుకెళ్లేది. 500కి 241 మార్కులు సాధించి, అదే గ్రామంలోని మరో 17 మంది బాలికలు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడానికి స్ఫూర్తి నింపింది. ప్రభుత్వం కుమారి చదివిన ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చింది. -
నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు!
ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా నిరాశ పడలేదు హజబ్బా. వెనక్కి తగ్గలేదు. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విదేశీ పర్యాటకులు ఒకటికి రెండు సార్లు అడిగినా హజబ్బా దగ్గర జవాబు లేదు. అతనికి అవమానంగా, బాధగా అనిపించింది. ‘‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా?’’ అనుకున్నాడు మనసులో. మంగుళూరు(కర్నాటక)కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప్డు గ్రామంలో కమలాఫలాలు అమ్ముతాడు హజబ్బా. ఒకరోజు ఆ ఊరికి వచ్చిన విదేశీ పర్యాటకులు కమలా ఫలాల ధర గురించి హజబ్బాను అడిగారు. వారు దేని గురించి అడుగుతున్నారో హజబ్బాకు అర్థం కాలేదు. కాస్త అవమానంగా కూడా అనిపించింది. ఈలోపు ఎవరో వచ్చి- ‘‘ఈ పండ్ల ధరల గురించి అడుగు తున్నారు’’ అని చెప్పారు. ఈ సంఘటన హజబ్బాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ‘పేదరికం కారణంగా నేను చదువుకోలేకపోయాను. కాస్తో కూస్తో చదువుకొని ఉంటే వాళ్లు మాట్లాడింది అర్థం చేసుకునేవాడిని కదా. నాలాంటి పరిస్థితి పేద పిల్లలెవరికీ రాకూడదు. వారి కోసం ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు. దానికోసం... ‘ఎలాగైనా సరే... నా ఊళ్లోని పేద పిల్లల కోసం ఒక బడి కట్టిస్తాను’ అనుకున్నాడు బలంగా. ఏ మంచి పనీ అవరోధాలు లేకుండా పూర్తి అవ్వదు అంటారు. హజబ్బాకి కూడా అలాంటి అవరోధాలే ఎదురయ్యాయి. పేద పిల్లల కోసం స్కూలు కట్టాలన్న అతని ఆలోచన విని కొందరు వెటకారంగా నవ్వారు. కొందరు ‘స్కూలు కట్టడం అంటే అంత తేలికను కున్నావా?’ అని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. హజబ్బా భార్య మైమూన కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘ముందు మన ముగ్గురు పిల్లల భవిష్యత్ గురించి ఆలో చించండి’’ అంది. అయితే భర్తలోని పట్టు దల, నిజాయితీ చూసి మనసు మార్చు కుంది. భర్తకు అండగా నిలబడింది. అయితే ఎవరి అండనూ కోరుకోలేదు హజబ్బా. అతని లక్ష్యం పట్ల అతనికి స్పష్టత ఉంది. అందుకే సాధన మొదలు పెట్టాడు. మొదట స్కూలు కోసం కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే స్కూలు కట్టించడానికి తాను పొదుపు చేసిన డబ్బు సరిపోదని అర్థమైంది. దాంతో గడపా గడపా తిరుగుతూ తోచిన సహాయం చేయమని కోరేవాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఓసారి సహాయం కోసం ఒక సంపన్నుడి ఇంటికి వెళ్తే... ఒక్క పైసా సహాయం చేయకపోగా తన ఇంట్లో ఉన్న కుక్కను హజబ్బా మీదికి వదిలాడు. ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా, అదిలించినా, కోపగించుకున్నా నిరాశ పడలేదు హజబ్బా. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విషయం పదిమంది దృష్టిలో పడింది. స్థానిక దినపత్రికలో హజబ్బా మీద స్ఫూర్తిదాయక కథనం వచ్చింది. ఒక జాతీయ చానల్ వాళ్లు ‘రియల్ హీరోస్’ అవార్డును ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన అయిదు లక్షల్ని కూడా స్కూలు కోసమే వెచ్చించాడు హజబ్బా. దీంతో మొదట నవ్విన వాళ్లందరికీ అతడి నిజాయితీ అందరికీ అర్థమైంది. హజబ్బా నిర్మించిన స్కూలు ఇప్పుడు సెకెండరీ స్కూల్‌గా మారింది. ‘‘స్కూలు కట్టించడం వరకే నా పని’’ అంటూ ఆ స్కూలును ప్రభుత్వపరం చేశాడు హజబ్బా. స్కూలుకు తన పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా తిరస్క రించాడు. దాంతో అతడి ఔన్నత్యం మరింత వెలుగులోనికి వచ్చింది. అతడికి అభిమానులు ఏర్పడ్డారు. అరకొర సౌకర్యా లున్న ఇంట్లో నివసిస్తూ అనారోగ్యానికి గురవుతున్న హజబ్బాకు వాళ్లంతా మంచి ఇల్లు కట్టించారు. తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జిల్లా, రాష్ర్ట స్థాయిలోనే కాదు జాతీయంగా కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకు పోతాడు. ప్రస్తుతం గ్రామంలో ప్రి-యూనివర్శిటీ నిర్మాణ పనుల్లో తలమునకలవుతున్నాడు. -
ఖోఖో ఆడుతూ విద్యార్థి మృతి
బత్తులపల్లి (వరంగల్) : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గుమ్మడి విజయ్ కుమార్(13) శనివారం మధ్యాహ్నం ఖోఖో ఆడుతూ ఆయాసంతో కింద పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వైద్యుడిని తీసుకొచ్చేలోపే విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థి ఆకస్మిక మృతితో పాఠశాలలోని టీచర్లు, సహ విద్యార్థులంతా విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
బంతి అనుకుని బాంబు వేశాడు.. ముగ్గురికి గాయాలు
కోల్ కతా : స్కూలు ఆవరణలో ఓ బాంబు పేలడంతో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బుర్ధ్వాన్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారు ఐదేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... బుర్ధ్వాన్ జిల్లా ఖందఘోష్ లోని దహుకా గిరిష్ ప్రాథమిక పాఠశాల పైకప్పు మీదికి శుక్రవారం కొందరు విద్యార్థులు ఎక్కారు. ఇంటి పని నిమిత్తం పక్కనే ఉండే పాఠశాలపైకి విద్యార్థులు ఎక్కినట్లు తెలుస్తోంది. అందులో ఓ విద్యార్థి స్కూలు పైభాగంలో ఓ బ్యాగులో బాంబులను చూశాడు. అయితే అవి గుండ్రంగా బంతిలా ఉండటంతో ఆడుకునే బంతి అని ఆ విద్యార్థి భావించాడు. పైనుంచి ఓ బాంబును కిందకి విసిరాడు. స్కూలు ఆవరణలో భారీ శబ్దం చేస్తూ బాంబు పేలింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే బుర్ధ్వాన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం స్కూలు పైభాగంలో మరో రెండు బాంబులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఆటబొమ్మలతో అక్షర వెలుగులు
సంకల్పం ఉండాలేగానీ... ఎలాంటి చోటైనా ఫలితాలు సాధించొచ్చు. చిత్తశుద్ధితో బోధించాలే గానీ... చిన్నారులను సైతం చాకుల్లా తయారు చేయొచ్చు. ఇది ఓ మారుమూల ఒడిశా సరిహద్దులోని పాఠశాలలో ఉపాధ్యాయుడు నిరూపించారు. ఆటబొమ్మల్నే బోధనాంశాలు చేశారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేలా ప్రోత్సహించారు. కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారు. ఇదీ బసవపుట్టుగ సర్కారు బడి విశేషం. - చిన్నపాటి పరికరాలు... ఆటవస్తువులే బోధనాంశాలు - చిన్నారులను ఆకట్టుకునేలా శిక్షణ - బసవపుట్టుగలో ఫలిస్తున్న ప్రయోగాలు మండలంలోని జాడుపూడి పంచాయతీ పరిధి బసవపుట్టుగ గ్రామంలో గల ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు బూరాడ బాలమోహన్‌రావు వినూత్న రీతిలో విద్యాబోధన సాగిస్తున్నారు. సింగిల్ టీచర్‌గా వ్యవహరిస్తూనే చిత్తశుద్ధితో శ్రమపడి అక్కడి విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు. అంతేకాదు మంచి ఫలితాలు సైతం సాధించారు. పిల్లలను ఆకట్టుకునేలా... ఎంతో సులభతరంగా బోధన ఉండటంతో మిగతా పాఠశాలల నుంచి పలువురు ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన బాలమోహన్ 32 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు ఏకోపాధ్యాయునిగా నియమితులయ్యారు. గ్రామస్తుల సహకారంతో అన్ని సౌకర్యాలను సమకూర్చుకున్నారు. వివిధ ఆటవస్తువులు ఉపయోగించి చిన్న తరగతులవారికి బోధిస్తూ వారి మెదడులో నిక్షిప్తమయ్యేలా చేస్తున్నారు. ఆటవస్తువులే బోధనాంశాలు ఆటవస్తువులను ఉపయోగించి నంబర్లు, వాటిని కూడిక, తీసివేత, భాగహారం, గుణించటం వంటివి నేర్పుతున్నారు. ఎక్కాలు సులభపద్ధతిలో నేర్చుకొనేందుకు గోళీ పిక్కలను ఉపయోగిస్తున్నారు. గణితంలో వివిధ రకాల ఆకృతులను ఒక బల్లకు మేకులు కొట్టి ఎలస్టిక్ సహాయంతో ఆ ఆకారాలను చూపించి బోధిస్తున్నారు. గోడలపై ఇంగ్లిష్ అక్షరాలను ఆల్ఫాబేట్ ప్రకారం పెయింట్చేసి, వాటిద్వారా ఒక్కో అక్షరానికి ఐదు నుంచి పది పదాలు వచ్చేలా రూపొందించారు. ఈ విధానం సరికొత్తగా ఉంది. ఆ ఐదు పదాలతో చిన్న కథను రూపొందించి విద్యార్థులకు బోధించటం వల్ల వారికి ఎప్పటికీ అది గుర్తుండిపోతుందన్నది ఆయన అభిప్రాయం. ప్రత్యేక రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక రోజుల్లో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతని పనితనానికి మెచ్చి గ్రామానికి చెందిన తాడి హరిబంధు పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులందరికీ రూ. 5వేలు విలువ చేసే కుర్చీలు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈయన శ్రద్ధ వల్ల పాఠశాల అభివృద్ధి కోసం గ్రామస్తులు సహాయపడుతున్నారు. ఈయనకు సహాయంగా గ్రామానికి చెందిన బసవ ఢిల్లీరావు అనే విద్యావలంటీరును గ్రామస్తులు నియమించారు. రెండు కాళ్ళు లేని ఢిల్లీరావు ఒకవైపు దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుతూ ఇక్కడ కేవలం వెయ్యి రూపాయలు తీసుకొని బోధిస్తున్నారు. విద్యావిధానంలో మార్పు రావాలి ప్రస్తుత విద్యావిధానంలో మరిన్ని మార్పులు తెస్తే విద్యార్థులకు సులభతరంగా బోధించవచ్చు. ప్రైవేటు పాఠశాలల నుంచి వస్తున్న పోటీని తిప్పికొట్టాలంటే ఇటువంటి చిన్నచిన్న ప్రయోగాలు ఎంతో ఉపకరిస్తాయి. దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు. ఇంగ్లిష్‌లో బోధనకోసం ఒక ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించి అందరికీ సరఫరా చేయాలనుకుంటున్నాను. -బూరాడ బాలమోహనరావు, హెచ్ఎం, బసవపుట్టుగ ప్రాధమిక పాఠశాల ఆ ఉపాధ్యాయుని కృషి అమోఘం.. బసవపుట్టుగ లాంటి మారుమూల గ్రామంలో ఇంతటి శ్రద్ధతో విద్యాబోధన సాగించటం మాకు గర్వకారణం. ఇటువంటి ఉపాధ్యాయుల సేవలు గ్రామస్తుల్లో, పిల్లల్లో చిరకాలంగా గుర్తుండిపోతాయి. దీన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు స్పూర్తిగా తీసుకుంటే ప్రైవేటు పాఠశాలలకు చోటే ఉండదు. - పిలక చిన్నబాబు, మాజీ సర్పంచ్, జాడుపూడి సేవాదృక్పథంతో బోధిస్తున్నా.. ఈ గ్రామానికి చెందిన నేను కేవలం సేవాదృక్పథంతోనే ఇక్కడ బోధిస్తున్నా. రెండు కాళ్ళకు పోలియో వ చ్చిన నేను. గ్రామ పాఠశాలలో విద్యాబోధన చేస్తుంటే ఎంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడి ఉపాధ్యాయుడు బాలమోహన్సేవలు కొత్తకొత్త పద్ధతుల్లో విద్యాబోధన చేయటం మా గ్రామానికి గర్వకారణం. -బసవ ఢిల్లీరావు, గ్రామస్తులు నియమించిన వలంటీరు -
బదిలీ టీచర్లలో వెబ్..డబ్..
- 7 వేల మందికి తప్పని స్థానచలనం - పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు - వెబ్ కౌన్సెలింగ్‌లో ఆరు స్టేజ్‌లు - కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ విజయనగరం అర్బన్: గంటకో ప్రకటన, రోజుకొక జీవో రావడంతో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ గందరగోళంగా తయారయింది. విద్యాసంత్సరం ప్రారంభం నాటికి టీచర్ల బదిలీ పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికీ బదిలీల స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో రెండేళ్లుగా బదిలీలు చేపట్టలేదు. మూడేళ్లుగా హేతుబద్ధీకరణ లేదు. రెండింటినీ కలిపి ప్రస్తుతం నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు కొందరైతే.. నిబంధనలకు లోబడి తప్పనిసరిగా మారాల్సిన వారు మరికొందరు ఉన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో జరపడం వల్ల ఎక్కడికి వెళ్లాల్సిన ఉంటుందోనని దాదాపుగా అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏడువేల మందికి స్థాన చలనం ! జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 13 వేలమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం సుమారు ఏడు వేల మందికి బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియలో స్థానచలనం ఖాయమని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలను ఈ నెల రెండవ వారంలోనే నిర్వహించాలని భావించి, షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆ తరువాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలంటూ మంత్రి గంటా ప్రకటించారు. వెనువెంటనే మరో ప్రకటనలో ఉపాధ్యాయుల వృత్తిప్రతిభ ప్రాధిపతికన పాటించాలంటూ సీఎం పేర్కొన్నారు. దీంతో త్వరలోనే బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. తక్కువ మంది విద్యార్థులున్న కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఆదర్శపాఠశాల పేరుతో విలీనం చేసేందుకు ప్రభుత్వం జీఓ నంబర్ 45ని విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 లోపు విద్యార్థులున్న 194 పాఠశాలలను 262 పాఠశాలల్లో విలీనం చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వీటిల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినున్నారు. కేవలం హేతుబద్ధీకరణ పేరుతోనే సూమారు 800 మందికిపైగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ఈ నేపధ్యంలో అధిక సంఖ్యల్లో ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పదని స్పష్టమవుతోంది. పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు సీఎం ప్రకటన నేపధ్యంలో ముందుగా ఉపాధ్యాయుల పనితీరును వివరాలను సిద్ధం చేసుకొని బదిలీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ పనితీరును గుర్తించే ప్రక్రియలో విద్యార్థి ఉత్తీర్ణత శాతంతోపాటు, స్థానిక నివాసం, టీచర్ పిల్లలను వాళ్లు పనిచేసిన స్కూళ్లలో చదివించడం వంటి టీచర్ వ్యక్తగత వృత్తిప్రమాణాలకు మార్కులు వేసి వారికి ప్రాధాన్యం ఇస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పద్ధతిని పాటించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఆరు స్థాయిల్లో ... బదిలీల ప్రక్రియను మొత్తం ఆరు స్థాయిల్లో నిర్వహించనున్నారు. ముందుగా .. ఇప్పటికే ఉన్న ఖాళీలు, ఎనిదేళ్లు ఒకేచోట సర్వీసు కలిగిన వారి ఖాళీలు, హేతుబద్ధీకరణ ఖాళీలను ప్రదర్శిస్తారు. అనంతరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులు సమయం ఇస్తారు. ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసిన ప్రింట్‌ను తీసుకొని సంబంధిత ధ్రువీకరణవపత్రాలతో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులకు సమర్పించి నిర్ణరించుకోవాలి. వారు వాటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారు. అనంతరం తాత్కాలిక సీనియార్టీ జాబితాను ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో వెబ్సైట్లో ఉంచుతారు. దీనిపై దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌కు పాస్వర్డ్ వస్తుంది. అనంతరం ఆన్లైన్లోనే తాము పనిచేదలుచుకున్న, కోరుకున్న పాఠశాలల వివరాలను నమోదు చేయాలి. అవసరమైతే రెండుసార్లు వాటిని మార్చుకొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీలో తమ కిందనున్న వారు ఖాళీ చేసిన స్థానాలను సైతం ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు. గతంలో ఈ తరహా సదుపాయం ఉండేదికాదు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను కోరుకున్న వారు ఇకపై ఆ పాఠశాలలోనే పనిచేయాల్సి ఉంటుంది. వెబ్‌కౌన్సెలింగ్ ముగిసిన ఐదు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు పంపుతారు. ఉపాధ్యాయుల సెల్‌నంబర్లకు కూడా సంక్షిప్త సమాచారం పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ హేతుబద్ధీకరణ, వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. తొలిసారి వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తుండటంతో కొందరికి అవగాహనలేదని ముందుగానే టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కౌన్సెలింగ్‌పై స్పష్టమైన సెడ్యూల్ రానందున ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించమన్నా సిద్ధం ఉన్నామని డీఈఓ స్పష్టం చేశారు. -
అడ్మిషన్‌కు లకారం
- ప్రైమరీలో ప్రవేశానికి వేలకు వేలు - లక్ష పలుకుతున్న పలు స్కూళ్లు - రకరకాల పేర్లతో ఫీజుల వసూలు - విద్యా శాఖ అదుపు శూన్యం రూ.లక్షా ఇరవై వేలు... ప్రైమరీ క్లాసుల్లో ప్రవేశానికి కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజు ఇది. చాలామంది దిగువ మధ్యతరగతి ఉద్యోగుల ఏడాది జీతంతో సమానం. తల తాకట్టు పెట్టయినా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలన్న తల్లిదండ్రుల ఆశలే వారి ప్రైవేటు పాఠశాలల ధనదాహానికి ఆలంబన. పేరున్న స్కూల్లో చేర్పిస్తే బాగా చదువుకుంటారని కొందరు, ఫౌండేషన్ బాగుంటే భవిష్యత్ బాగుంటుందని మరికొందరు తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. విశాఖపట్నం: మూడో ఏట అడుగుపెడుతున్న బుజ్జాయిలను స్కూల్లో చేర్పించాలంటే అక్షరాలా రూ. లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠాశాలలు రకారకాల పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు అండ్ సెకండరీ ఎడ్యుకేషన్), ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యావిధానం అనుసరిస్తున్న పాఠశాలలకు డిమాండ్ ఎక్కువ. కొన్ని పాఠశాలలు ఐజీసీఎస్ఈ, ఐబీ, స్టేట్ బోర్డు సిలబస్‌లు అందిస్తున్నాయి. ప్రయివేట్ పాఠశాలల్లో మూడు కేటగిరీలున్నాయి. పిల్లలకు ప్రైమరీ స్కూల్లో చేర్పించడానికి చిన్న స్కూల్స్ రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు, ఓ మాదిరీ స్థాయి పాఠశాలలు రూ.5 వేలు నుంచి రూ. 30 వేలు, కార్పొరేట్ పాఠశాలలు రూ.30 వేల నుంచి రూ. లక్షా 20 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజులు కేవలం మూ డేళ్ల పిల్లలను స్కూల్లో చేర్పించడానికి మాత్రమే. మళ్లీ నెలసరి ఫీజులు చెల్లించుకోవాలి. ఎల్కేజీ నుంచి 1వ తరగతి వరకు నెలసరి ఫీజు రూ.500 నుంచి రూ. 20 వేల వరకు ఉంటోంది. టెన్త్ క్లాస్ వరకు ఏడాదికి ఏడాది ఫీజులు పెంచుతున్నారు. ప్రయివేట్ పాఠశాలపై మోజు... తల్లిదండ్రులకు ప్రయివేట్ పాఠశాలలపై ఉన్న మోజు తెలి సిందే. ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు ఇటీవల కాలం లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా ఆ ముద్ర అలా ఉండిపోయింది. ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ వైపే అడుగులు వేస్తున్నారు. అందులో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ అందిస్తు న్న పాఠశాలల గురించి వాకబు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు సీబీఎస్ఈ కోర్సుకు ప్రైమరీ అడ్మిషన్‌కు రూ. 50 వేలు నుంచి రూ.లక్షా 20 వేలు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజుల నియంత్రణకు ఎలాంటి చట్టాలు లేకపోవడంతో ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలో 769 ప్రయివేట్ పాఠశాలలున్నాయి. వాటిలో 120 వరకు కార్పొరేట్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చదవాలనుకునే వారికి రూ.లక్షల్లో ఫీజులుంటున్నాయి. అడ్మిషన్స్ ఫీజులు కాకుండా ట్యూషన్ ఫీజు, రిఫండ్బుల్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, కల్చరల్ ఫీజు, ప్రత్యేక రోజుల్లో వేడుకలు నిర్వహించడానికి, యూనిఫాం, పుస్తకాల కోసం అదనంగా వసూలు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లు... ప్రయివేట్ పాఠశాలలు నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. ప్రతి పాఠశాల తమ ఫీజులు తెలియజేసే విధంగా బోర్డులో రాయాలి. ప్రతి ఏడాది ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా కమిటీ వేయాలి. కమిటీలో పేరెంట్స్ యూనియన్ నుంచి ఒక ప్రతినిధిని కలుపుకుని ఏటా ఫీజులు పెంచే విషయమై చర్చించి ఆమోదమయ్యాక పెంచాలి. ఇవేమీ అమలు కావడం లేదు. ఇలాంటి స్కూల్స్‌పై జిల్లా విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
ప్రైమరీ స్కూలుకు ముగ్గురు టీచర్లు
ఏకోపాధ్యాయ పాఠశాలల విలీనం సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రాథమిక పాఠశాలలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. తెలుగు/ఉర్దూ బోధనకు ఒక టీచర్, ఇంగ్లిష్ సబ్జెక్టుకు మరో టీచర్, గణితం ఇతర అంశాలను బోధించే ందుకు ఇంకో టీచర్ అవసరమని తేల్చింది. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర స్కూళ్లలో విలీనం చేయనుంది. ఇందుకు ఎన్రోల్మెంట్ నిబంధనలు పాటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా రూపొందించిన విద్యా వార్షిక కేలండర్లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని అవసరమైన మార్పులతో ఈ నెల 20న ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలలే ఉంటాయని కేలండర్లో పేర్కొంది. ప్రస్తుతమున్న ప్రాథమికోన్నత పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఫిబ్రవరి నెలాఖరుకు పరీక్షలు పూర్తి: రాష్ట్రంలోని పాఠశాలల్లో పదో తరగతి మినహా ఇతర తరగతుల పరీక్షలను ఎప్పటిలా ఏప్రిల్ నెలలో కాకుండా ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేయాలి. వచ్చే ఏడాది నుంచి వేసవి సెలవులకు ముందుగానే విద్యార్థులకు పైతరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల బోధనను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సర తరగతులను 2016 మార్చి 16 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనుంది. వేసవి సెలవుల తర్వాత జూన్ 12 నుంచి తరగతులను కొనసాగించనుంది. విద్యా కేలండర్లోని మరిన్ని అంశాలు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. వచ్చే జూన్ నుంచి పాఠ్యాంశాల బోధనను చేపట్టి ఫిబ్రవరి నాటికే సిలబస్ పూర్తి చేస్తారు. జూలై 30 నాటికి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి నివేదికలు రూపొందించాలి. వాటి ప్రకారం బోధనను కొనసాగించాలి. త్రైమాసిక (సమ్మేటివ్-1) పరీక్షలను సెప్టెంబరు 21 నుంచి 28 వరకు నిర్వహించాలి. ఆ తేదీల్లో వీలుకాకపోతే అక్టోబరు 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలి. అర్ధ వార్షిక పరీక్షలను(సమ్మేటివ్-2) డిసెంబర్ 17 నుంచి 23 వరకు నిర్వహించాలి. వీలుకాకపోతే 2016 జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాలి. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి 26 వరకు దసరా సెలవులు. డిసెంబర్ 24 నుంచి 30 వరకు క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు. 2016 జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. -
భయపెడుతున్న చిరుత సంచారం
సంగారెడ్డి రూరల్: మండల పరిధిలోని ఇంద్ర కరణ్ పొలిమేరల్లో సంచరిస్తున్న చిరుతతో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రక్షణ కరువైంది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాటు ఆ సమీపంలోనే చిరుత సంచరిస్తున్న అనవాళ్లు కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురౌతున్నారు. గత వారం రోజులుగా గ్రామ పొలిమేరల్లోనే చిరుత సంచరిస్తూ ఏడెనిమిది గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు సార్లు గ్రామ రైతులకు కనిపించడంతో ప్రజలు మరింత భయానికి లోనౌతున్నారు. ఈ నేపథ్యంలో చిరుత ఆనవాళ్ల కోసం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో సైతం చిరుత దృశ్యాలు కనిపించాయి. దీంతో చెరకు తోట సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు రక్షణ కరువైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాలకు ఆవరణ పెద్దగా ఉన్నప్పటికీ ప్రహరీ లేకపోవడంతో చిన్నారులు మూత్ర విసర్జన కోసం, ఆడుకునేందుకు ఆవరణ అంతా తిరుగుతుంటారు. ఆవరణ చుట్టుతా చిట్టడవిలా ముళ్ల చెట్లు, పొదలు నిండి ఉన్నాయి. దీంతో పాటు చిరుత తరుచూ కనిపిస్తున్న చెరకు తోట పాఠశాలకు దగ్గరగా ఉండడంతో విద్యార్థులకు రక్షణ కరువై ప్రమాదం పొంచి ఉంది. ఏ ప్రమాదం జరగక ముందే చిరుతను త్వరగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
హోటల్ నుంచి ‘మధ్యాహ్న భోజనం’
రాజాంరూరల్ : ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల కు ఉచి తంగా పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సదాశయానికి గండిపడుతోం ది. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మండ ల పరిధిలోని వీఆర్ అగ్రహారం ఎస్సీ కాల నీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని హోట ల్ నుంచి తెప్పిస్తున్నారు. మూడేళ్లుగా వం ట ఏజెన్సీల మధ్య వివాదం చెలరేగుతోం ది. రాజ కీయ కక్షల నడుమ పథకాన్ని భ్రష్టుపట్టించారు. విద్యార్థుల తల్లిదండ్రుల వర్గం ఒకటైతే, అధికార పార్టీ వర్గం మరొక గ్రూపుగా తయారయ్యాయి. ఎన్నో ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోన్న సంఘాన్ని వంటలు బాగోలేదంటూ మూ డేళ్ల క్రితం వివాదం రేపి విద్యార్థులు భోజ నం చేయకుండా నిలిపివేశారు. దీంతో చేసేదేమీ లేక హెచ్ఎం కె.జయ ఇరువర్గాలను శాంతపరిచి ఆరు నెలలు పాటు ఒక్కో వర్గం మధ్యాహ్న పథకంలో వంట చేయాల ని సూచించారు. ఆ ఏడాది రెండు వర్గాలు ఒప్పుకుని వంట చేశాయి. గత ఏడాది మరోమారు ఈ వివాదం చెలరేగడంతో మండల స్థాయి అధికారులంతా గుమిగూ డి మూడేసి నెలల చొప్పున ఒక్కో వర్గం వంట చేయాలని తీర్పు చెప్పడంతో వివా దం సద్దు మణిగింది. ఈ ఏడాది మళ్లీ వివా దం చెలరేగింది. అధికార పార్టీ వర్గం వంట చేస్తే విద్యార్థులు భోజనాలు చేయరని, అవసరమైతే స్కూల్‌కి పిల్లలను పం పించమని ప్రత్యర్థి వర్గం తెగేసి చెప్పింది. దీంతో వం ట ఆగి పోయింది. అయితే ఎంఈవో జి. మంజుల ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి పాఠశాల హెచ్ఎం తన సొంత నిధులతో రోజుకి రూ.240 చొ ప్పున వెచ్చించి రాజాంలోని హోటల్ నుంచి భోజనాళ్ల పార్శిల్ తెప్పించి విధ్యార్థులకు పెడుతున్నా రు. ఇంకెన్నాళ్లు ఇలా పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.4.35 మంజూరు చేస్తోందని, పాఠశాలలో 19 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరందరికీ కలిపి భోజనం వడ్డిస్తే ప్రభుత్వం రూ 82.65 మంజూరు చేస్తుందని, ఖర్చు మాత్రం రూ.240 అవుతోందని హెచ్ఎం అన్నారు. విద్యార్థులకు కూడా అరకొరగా భోజనం అందుతోంది. దీంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి పాఠశాలలో సక్రమంగా మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. హోటల్ నుంచి తెప్పించడం భారమే రోజూ హోటళ్ల నుంచి సొంత నిధులతో భోజనాలు తెప్పించలేక ఇబ్బంది పడుతున్నాం. వంట ఏజెన్సీలు మా మాట వినటం లేదు. ఉన్నతాధికారులే పరిష్కరించాలి. కె.జయ, హెచ్ఎం. ఆకలి తీరడం లేదు హోటళ్ల నుంచి తెస్తున్న పార్శిల్ భోజనం అందరికీ సరిపోవడం లేదు. సాయంత్రం వరకూ అర్ధాకలితోనే అలమటిస్తున్నాం. -షేక్ ఆయుష, 5వ తరగతి, -
500 సర్కారు బడులకు మంగళం!
ఆదిలాబాద్ టౌన్ : జిల్లాలో 500లకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడనున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం భావిస్తుండటం తో ఈ పరిస్థితి ఏర్పడనుంది. ఈ నిర్ణయంతో సర్కారు పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువగా ఉంటే.. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది కం టే తక్కువగా ఉంటే వాటిని మూసివేయనున్న ట్లు తెలుస్తోంది. ఇందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలనే ఉద్దేశంతో 2010 సంవత్సరంలో ప్రారంభించిన సక్సెస్ పాఠశాలలు(ఇంగ్లిష్ మీడియం) కూడ మూత పడనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు. విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నచోట ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఆ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ పాఠశాలలు మూత పడే స్థితికి చేరుకున్నాయి. జిల్లాలో పరిస్థితి జిల్లాలో 4 వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 0 నుంచి 9 వరకు మాత్రమే విద్యార్థులు ఉన్న పాఠశాలలు 100 ఉండగా, 11 నుంచి 19 మంది విద్యార్థులున్న పాఠశాలలు 386 ఉన్నాయి. అలాగే 75 మంది కంటే తక్కువ ఉన్న ఉన్నత పాఠశాలలు 50 వరకు ఉన్నాయి. ఇవీ కూడా మూత పడనున్నాయి. జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్, భుక్తాపూర్, బాలాజీనగర్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు పది కంటే తక్కువగా ఉన్నారు. అలాగే ఇంద్రవెల్లిలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు 41 మంది ఉన్నారు. ఇలాంటి ఎన్నో పాఠశాలలు జిల్లాలో మూతపడే అవకాశం ఉంది. దీంతో 800 మంది ఉపాధ్యాయులకు ఇతర ప్రాంతాలకు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ఆయా గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య ఉండడంతో పాఠశాలలు మూత పడడంతో కనీసం 3 కి.మీ.లు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో చాలా మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది. సమీప పాఠశాలలోల విలీనం మూతపడనున్న పాఠశాలలు సమీప పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలోల 280 మంది విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడితోపాటు సబ్జెక్టు టీచర్లను ఆ పాఠశాలకు నియమించారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 230కి కుదించారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ఇది వరకు 19 మంది లోపు విద్యార్థులుంటే ఒక టీచర్‌ను కేటాయించేవారు ఇక నుంచి 20 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయున్ని నియమిస్తారు. అయితే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయుడు ఖాళీగా ఉన్న చోటికి ఆయన నిర్ణయం మేరకు బదిలీ చేస్తారు. లేదంటే అందరిలో తక్కువ సీనియర్టీ ఉన్న ఉపాధ్యాయుడు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. -
229 పాఠశాలలు మూత!
జిల్లాలో 75 కంటే తక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 67 ప్రాథమికోన్నత స్కూలల్లో 6,7 తరగతుల్లో 20 కన్నా తక్కువ పిల్లలున్న స్కూళ్లు 57 ఇరవై మందికన్నా తక్కువ పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలు 105 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం త్వరలో అమలుచేయబోయే పాఠశాలల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియతో జిల్లాలో దాదాపు 229 పాఠశాలలు మూతపడనున్నాయి. దసరా సెలవుల్లో రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను తేల్చడంలో నిమగ్నమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నప్పటికీ.. ఆ వివరాలపై జిల్లా విద్యాశాఖకు సూచనప్రాయంగా ఆదేశాలందాయి. దీంతో చర్యలు చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రాథమిక వివరాలతో నివేదిక తయారు చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియతో జిల్లాలో దాదాపు 229 పాఠశాలలు మూతపడనున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఇంత వెనక‘బడి’పోయామా? జిల్లాలో 2,321 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 1,651 ప్రాథమిక, 244 ప్రాథమికోన్నత, 426 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 3.51లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మౌలిక వసతుల సమస్య, ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పలు పాఠశాలల్లో ఇద్దరేసి టీచర్లున్నా విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. దీంతో పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియపై విద్యాశాఖ సైతం మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టింది. ఒకట్రెండు రోజుల్లో వీటికి ఆమెదం పడనుంది. జిల్లా విద్యాశాఖ తయారుచేసిన ప్రాథమిక వివరాల ప్రకారం జిల్లాలో 75 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 67 ఉన్నాయి. కనీసం 75 మంది విద్యార్థులుంటే గానీ ఉన్నత పాఠశాలలను నడపొద్దని సర్కారు నిర్ణయించింది. దీంతో ఈ పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో కనీసం 20 మంది విద్యార్థులుండాలనే నిబంధన పెట్టింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లోనూ కనీసం 20 మంది పిల్లలుండాలి. కానీ జిల్లాలోని 57 యూపీఎస్లలోని 6,7 తరగతుల్లో 20 మంది పిల్లులు కూడా లేరు. 105 ప్రాథమిక పాఠశాలల్లోనూ పిల్లల సంఖ్య 20కి మించలేదు. తాజా రేషనలైజేషన్‌తో ఇవన్నీ మూతపడనున్నాయి. టీచర్లు తారుమారు.. త్వరలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయితే జిల్లాలో దాదాపు వెయ్యిమంది టీచర్లకు స్థాన చలనం కలగనుంది. పిల్లలులేని కారణంగా బడులు మూసివేయడంతో.. అక్కడ పనిచేసే టీచర్లను సమీప పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా టీచర్ల నిష్పత్తి, విద్యార్థుల నిష్పత్తిలో తేడా ఉన్న పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల సంఖ్య మారనుంది. మొత్తంగా మార్గదర్శకాలు విడుదలైన అనంతరం ఈ మార్పుల అంశంపై స్పష్టత రానుంది. -
యూపీ స్కూళ్లకు మూడింది!
అనంతపురం ఎడ్యుకేషన్ :జిల్లాలో ఇప్పటి దాకా విద్యార్థులు లేని, పది మందిలోపు విద్యార్థులున్న 177 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. ఇప్పుడు ప్రాథమికోన్నత పాఠశాలల వంతు వచ్చింది. జీఓ-5 అమలులో భాగంగా 6, 7 తరగతుల్లో 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయాలి. అక్కడ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు) మాత్రమే నిర్వహించాలి. ఆయా పాఠశాల్లోని 6,8 తరగతుల విద్యార్థులను సమీప హైస్కూళ్లకు సర్దుబాటు చేయాలి. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనరు ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 20లోపు విద్యార్థులున్న యూపీ స్కూళ్లు 225 ఉన్నట్లు గుర్తించారు. ఈ జాబితా కూడా రాష్ట్ర అధికారులే జిల్లాకు పంపారు. వీటన్నింటినీ రద్దు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. యూడైస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,869 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 2,441 పాఠశాలలు 6, 7 తరగతుల్లో 20 మందికి పైగా విద్యార్థులతో నడుస్తున్నాయి. 1,428 స్కూళ్లలో మాత్రం 20లోపు విద్యార్థులున్నట్లు గుర్తించారు. వీటిలోని 6, 7 తరగతుల విద్యార్థులను, పాఠశాల సహాయకులను సమీప పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రద్దవుతున్న స్కూళ్లు.. విడపనకల్లు మండలం తిమ్మాపురం, ఉరవకొండ మండలం లత్తవరం, ఆత్మకూరు మండలం పి. సిద్దరాంపురం, రొళ్ల మండలం ఆవినకుంట, సోమందేపల్లి మండలం నాగినాయినిచెరువు, బుక్కరాయసముద్రం మండలం వడియంపేట, హిందూపురం మండలం ఎస్.సోదలపల్లి, పుట్టపర్తి మండలం రెడ్డిచెరువుపల్లి యూపీ పాఠశాలలు రద్దుకానున్నాయి. వజ్రకరూరుమండలంలో 5, గుంతకల్లు 4, గుత్తి 4, పెద్దవడగూరు 4, యాడికి 4, తాడిపత్రి 5, పెద్దపప్పూరు 6, శింగనమల 5, పామిడి 3, గార్లదిన్నె 3, బ్రహ్మసముద్రం 5, కుందుర్పి 4, కళ్యాణదుర్గం 4, అనంతపురం 3, నార్పల 4, పుట్లూరు 5, యల్లనూరు 5, తాడిమర్రి 5, బత్తలపల్లి 2, రాప్తాడు 2, కనగానపల్లి 7, కంబదూరు 4, రామగిరి 7, చెన్నేకొత్తపల్లి 7, ధర్మవరం 7, ముదిగుబ్బ 11, తలుపుల 6, నంబులపూలకుంట 9, తనకల్లు 8, నల్లచెరువు 4, గాండ్లపెంట 2, కదిరి 6, అమడగూరు 9, ఓబులదేవరచెరువు 6, నల్లమాడ 2, గోరంట్ల 6, బుక్కపట్నం 3, కొత్తచెరువు 4, రొద్దం 5, చిలమత్తూరు 8, లేపాక్షి 2, మడకశిర 3, అమరాపురం 4, ఆగళి మండలంలో 6 యూపీ స్కూళ్లు రద్దు కానున్నాయి. -
ఐదు తరగతులకు ఐదుగురే
పత్తికొండ టౌన్: మండలంలోని రామచంద్రాపురంకొట్టాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురే విద్యార్థులున్నారు. పాఠశాలలో 13మంది విద్యార్థులు చదువుతున్నట్లు రికార్డుల్లో ఉన్నా వాస్తవంగా బడికివస్తోంది ఐదుమందే. ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35మందికి కనీసం ఒక ఉపాధ్యాయుడు పని చేయాలనే ప్రభుత్వ విధానం అమలుకు విద్యాశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ప్రకారం పాఠశాల మూతపడే అవకాశం ఉంది. పాఠశాలలో ఏకోపాధ్యాయుడు ఉమ్లానాయక్ పాఠాలు బోధిస్తున్నారు. అలాగే మండలంలో రామచంద్రాపురం పాఠశాలలో 13మంది, కురువలదొడ్డి పాఠశాలలో 16మంది, జె. అగ్రహారం పాఠశాలలో 26మంది, కనకదిన్నె పాఠశాలలో 27మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని టీచర్ల పోస్టులు రద్దుచేస్తే పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. రేషలైజేషన్ అమలైతే మూతపడుతుంది- ఆర్. కబీర్, మండల విద్యాధికారి ప్రతి పాఠశాలలో కనీసం 15మంది విద్యార్థులైనా ఉంటే ఒక ఉపాధ్యాయుడిని కొనసాగించవచ్చు. రేషలైజేషన్ నిబంధన అమలైతే మండలంలోని రామచంద్రాపురంకొట్టాల ప్రాథమిక పాఠశాల మూతపడే అవకాశం ఉంది. -
ఎవరికీ పట్టని ‘సర్కార్ ఇస్కూల్’
సమస్య తెలిపినా స్పందించని పాలకులు కూలేందుకు సిద్ధంగా ఉన్నా.. గుడిసెలోనేకొనసాగుతున్న పాఠశాల బిక్కుబిక్కుమంటూ అక్షరాలు దిద్దుకుంటున్న చిన్నారులు కౌడిపల్లి:గాలొస్తే ఊగిపోతుంది...వర్షమొస్తే ఉరుస్తుంది..ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి...ఇది మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధిలోని కొర్రసీత్యతండాలోని ప్రాథమిక పాఠశాల దుస్థితి. ఇలాంటి పాఠశాలకు ఎవరైనా తమ పిల్లలను పంపుతారా...కానీ తప్పక, మనసొప్పక పోయినా నాలుగు అక్షరాలు నేర్చుకుంటారన్న ఆశతో ఆ తండా వాసులు తమ పిల్లలను కూలేందుకు సిద్ధంగా ఉన్న బడికే పంపుతున్నారు. సమస్య చెబితే విచారించి చర్యలు చేపడతామనే అధికారులు పూర్తి వివరాలతో విద్యార్థులు పడుతున్న కష్టాన్ని వివరించినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గిరిజనం గోడు పట్టదా... మండలంలోని మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధిలోని కొర్రసీత్యతండాలోని ప్రాథమిక పాఠశాల కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గుడిసెలో కొనసాగుతున్న విషయాన్ని ఈ నెల 14 ‘సాక్షి’ ‘సర్కార్ ఇస్కూల్’ పేరిట కథనాన్ని ప్రచురించిన సంగతి విధితమే. ఈ కథనాన్ని చదివిన జిల్లా ప్రజానీకం చలించిపోయినా, పాలకుల మనసుమాత్రం కరగలేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న గుడిసెలో కొనసాగుతున్న పాఠశాల గురించి అరిచి గీపెట్టినా ఎవరూ పట్టించుకోలే దు. అటు విద్యాశాఖ అధికారులు గాని, పాలకులు కనీసం ఆ తండా వైపు తొంగి చూడ లే దు. ఓవైపు తండాలను పంచాయతీలు గా మారుస్తాం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద దళిత, గిరిజనులను ఉద్ధరిస్తామం టూ రోజూ తమ ప్రసంగాలతో ఊదరగొడుతున్న నాయకులు సైతం కొర్రసీత్యతండా వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు పాఠశాల నిర్వహణకు కనీసం గుడిసె కూడా ఏర్పాటు చేయని విద్యాశాఖ తీరును కొర్రసీత్య తండా వాసులు తప్పుపడుతున్నారు. ఇది ముమ్మాటికీ తండాలపై నిర్లక్ష్యమేనంటున్నారు. శుక్రవారం పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కొర్ర రాజునాయక్, వార్డుసభ్యుడు కొర్ర బద్రునాయక్, పీర్యనాయక్, హీర్యా నాయక్ తదితరులు తండాలో విలేకరులతో మాట్లాడుతూ, తండాలో పదిహేనేళ్ల క్రితం పాఠశాలను ఏర్పాటు చేయగా, ఇంతవరకూ పక్కా భవనాన్ని నిర్మించకపోవడం పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. గత సంవత్సరం సైతం తామే పాఠశాలకు మరమ్మత్తులు చేయించుకున్నామన్నారు. గిరిజనులపై ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్షానికి ఇదే నిదర్శనమన్నారు. కొర్రసీత్యతండా పాఠశాలకు పక్కభవనం నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఇక్కడి విద్యార్థులతోపాటు, సమీపంలోని ఎర్రసీత్యతండా, కుర్మవాడ విద్యార్థులు సైతం ఇక్కడి పాఠశాలకు వస్తారని తెలిపారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి తమ తండాలోని పాఠశాలకు పక్కా భవనం మంజూరు చేయడంతో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయున్ని నియమించాలని వారు కోరారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ రాజారెడ్డిని వివరణ కోరగా త్వరలో మరమ్మత్తులు చేయిస్తామన్నారు. -
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో 2013-14 విద్యా సంవత్సరంలో పని చేసేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కె.రామశేషు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తెలుగు మీడియంలో 526 మంది, ఉర్దూ పాఠశాలల్లో ఆరుగురు మొత్తం 532 మంది ఇన్స్ట్రక్టర్లను నియమిస్తున్నారు. అసలు టీచర్లు లేని పాఠశాలలు, ఒక ఉపాధ్యాయుడు పని చేస్తున్న పాఠశాలల్లో, బడిబయట పిల్లలు అధిక సంఖ్యలో ఉన్న ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో వీరిని నియమిస్తున్నట్లు రామశేషు తెలిపారు. ఈ పోస్టులకు టీటీసీ/ డీఈడీ/ బీఈడీ పూర్తిచేసినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు మండల విద్యాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండలాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు, రోస్టర్ పాయింట్, ఇతర వివరాలకు అభ్యర్థులు ఠీఠీ.ఞట్చజ్చుట్చఝ.ఠ్ఛీఛౌఛ్ఛీ.ఛిౌఝ వెబ్సైట్ చూడవచ్చు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. ఏ మండలానికి ఎన్ని పోస్టులు.. పాఠశాలల్లో ఖాళీల అవసరాన్ని బట్టి ఏ మండలానికి ఎన్ని అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు కేటాయించిందీ రామశేషు ప్రకటించారు. పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు కేటాయించారు. అద్దంకి మండలానికి 12, అర్థవీడు 1, బేస్తవారిపేట 6, బల్లికురవ 1, సీఎస్‌పురం 29, చీమకుర్తి 4, చినగంజాం 3, చీరాల 2, కంభం 4, దర్శి 7, దొనకొండ 36, పెదదోర్నాల 12, గిద్దలూరు 10, గుడ్లూరు 5, హనుమంతునిపాడు 26, ఇంకొల్లు 2, జె.పంగులూరు 2, కందుకూరు 15, కనిగిరి 8, కారంచేడు 1, కొమరోలు 19, కొనకనమిట్ల 27, కొండపి 3, కొరిశపాడు 4, కొత్తపట్నం 4, కురిచేడు 15, లింగసముద్రం 1, మద్దిపాడు 2, మార్కాపురం 7, మర్రిపూడి 5, మార్టూరు 3, ముండ్లమూరు 10, నాగులుప్పలపాడు 5, ఒంగోలు 6, పెదచెర్లోపల్లి 28, పుల్లలచెరువు 49, పామూరు 11, పర్చూరు 9, పెద్దారవీడు 6, పొదిలి 9, పొన్నలూరు 10, రాచర్ల 6, సింగరాయకొండ 1, సంతనూతలపాడు 1, సంతమాగులూరు 2, తాళ్లూరు 3, టంగుటూరు 6, తర్లుపాడు 5, త్రిపురాంతకం 26, ఉలవపాడు 8, వెలిగండ్ల 10, వేటపాలెం 2, వలేటివారిపాలెం 4, యర్రగొండపాలెం 24, యద్దనపూడి 5, జరుగుమల్లి 4 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను కేటాయించారు. అద్దంకి, అర్థవీడు, దోర్నాల, కురిచేడు, పొదిలి, వెలిగండ్ల మండలాలకు ఒక్కొక్కటి చొప్పున ఉర్దూ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామశేషు కోరారు. -
ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు
వేములపల్లి, న్యూస్‌లైన్: ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాల యాలను ఏర్పాటుచేయాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. గ్రంథాల య సంస్థ, ప్రాథమిక విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాట్లకు సిద్ధపడింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో మేధాశక్తి, పుస్తక పఠనం, దేశభక్తి పెంపొందించేందు కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలల ది నోత్సవం సందర్భంగా గురువారం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలను ప్రారంభించనున్నా రు. ప్రాథమిక విద్యాశాఖ ఆదేశాల ప్రకారం 200 మంది విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలను గ్రం థాలయం ఏర్పాటుకు ఎంపిక చేయాల్సి ఉంది. అలా విద్యార్థులు లేకుంటే జిల్లాకు 50 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయా ల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో మొదటి విడతగా 23 పాఠశాలలను ఎంపిక చేశా రు. మిగిలిన పాఠశాలలను దశల వారీగా ఎంపిక చేయనున్నారు. గ్రంథాలయాల్లో పిల్లలకు ఉపయోగపడే దేశభక్తి, మహానీ యుల చరిత్ర, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర, బాలల సాహిత్యం, నీతి కథలు, సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలతోపాటు ప్రముఖ దినపత్రికలను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక పిరియడ్ విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాల్లో పుస్తక పఠనానికి ప్రత్యేక పిరియడ్‌ను కేటాయిస్తారు. ఈ పిరియడ్‌కు ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమిస్తారు. గ్రంథాలయ ఉపాధ్యాయుడు సమీప గ్రంథాలయం నుంచి 15 రోజులకొకసారి 100 నుంచి 200 రకాల పుస్తకాలను తీసుకొచ్చి విద్యార్థులతో చదివించాల్సి ఉంటుంది. జిల్లాలో ఎంపికైన పాఠశాలలు జిల్లాలో మొదటి విడతగా 23 ప్రాథమిక పాఠశాలలను గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. అనుముల మండలం అనుముల, చందంపేట మండలం పెద్దమునిగల్, కంబాలపల్లి, చండూరు మండలం బోడంగిపర్తి, చివ్వెంల మండలం కుడకుడ, చందుపట్ల, దేవరకొండ మండలం తాటికోలు, డిండి మండలం తవక్లాపూర్, అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, కట్టంగూర్ మండలం చెర్వుఅన్నా రం, మర్రిగూడ మండలం శివన్నగూడెం, మఠంపల్లి మండలం వరదాపురం, పెదవీడు, మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి, ఆలగడప, పీఏపల్లి మండలం వడ్డిపట్ల, పెద్దవూర మండలం పులిచర్ల, రామన్నపేట మండలం వెల్లంకి, సూర్యాపేట మండలం బాలెంల, టేకుమట్ల, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి, తుంగతుర్తి మండలం గొట్టిపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. -
కాన్వెంట్లో ఊడిపడ్డ శ్లాబ్
ముక్తేశ్వరం కోనసీమ విద్యాశ్రమ్ కాన్వెంట్కు చెందిన భవనంలో శ్లాబ్ శనివారం ఊడిపడింది. ఈ ప్రమాదంలో పరీక్ష రాస్తున్న విద్యార్థికి, ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలవ్వగా, కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆ గదిలో సుమారు 20 మంది విద్యార్థులున్నారు. ఎంఈఓ బీర హనుమంతరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాల పాలైన ఉపాధ్యాయుడు ఎస్పీఎస్ఎస్ మూర్తి, విద్యార్థి బిళ్ల నర్సింహలను పరామర్శించారు. పురాతన భవనంలో స్కూలు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాతన భవనంలో స్కూలు నిర్వహణకు ఎలా అనుమతించారంటూ విద్యాశాఖ అధికారులను నిలదీశారు. దీనిపై ఎంఈఓ బీర హనుమంతరావును వివరణ కోరగా, స్కూలు నిర్వహిస్తున్నది పురాతన భవనం కావడం వల్ల శ్లాబు పెచ్చులుగా ఊడి పడిందన్నారు. ఈ క్రమంలో అక్కడున్న విద్యార్థులకు , ఉపాధ్యాయులకు గాయాలయ్యాయన్నారు. స్కూలు భవనం అనుమతులను పరిశీలిస్తున్నామన్నారు. ఈ భవనంలో స్కూలు నిర్వహణను నిలిపి వేస్తున్నామని తెలిపారు. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కుమారస్వామి
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ఆత్మకూరు మండలం దామెర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసు కుమారస్వామి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ఎడ్యుకేషన్ డెరైక్టర్ నుంచి ఆయనకు లేఖ అందింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా కుమారస్వామి అవార్డు అందుకోనున్నారు. ములుగు మండల కేంద్రానికి చెందిన దాసు కుమారస్వామి మొదటిసారిగా అక్టోబర్1, 1986లో ములుగు పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చే రారు. నవంబర్26, 2005లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ము లుగు, మరిపెడ, వెంకటాపూర్ మండలాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆత్మకూరు మండలం దామెర పాఠశాలలో పని చేస్తున్నారు. కుమారస్వామి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం వినూత్నరీతిలో కరపత్రాలు, డోర్పోస్టర్లతో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన పనిచేస్తున్న పాఠశాలలో 1నుండి 5తరగతుల్లో 300మంది విద్యార్థులు ఉన్నారు. దాతల సహకారంతో ఇక్కడి విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్టులు, బ్యాడ్జ్‌లు, పలకలు, నోటుపుస్తకాలు, డైరీలు పంపిణీ చేశారు. అదేవిధంగా *50వేలతో పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించారు. అందుకున్న అవార్డులెన్నో... కుమారస్వామి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల నుంచి ఎ న్నో అవార్డులు అందుకున్నారు. 2007, 2010లో జిల్లా ఉ త్తమ ఉపాధ్యాయ అవార్డులు, 2011లో రాష్ట్ర ఉత్తమ ఉ పాధ్యాయ అవార్డు అందుకున్నారు. తాజాగా ఇప్పుడు జా తీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. అ లాగే ఎల్ఐసీ, లయన్స్‌క్లబ్, మదర్‌థెరిస్సా ఫౌండేషన్, అ చీవర్స్ ఆర్గనైజేషన్, సర్వేపల్లి రాధాకృష్ణ ఫౌండేషన్ల నుంచి కూడా అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అవార్డు పాఠశాలకే అంకితం : కుమారస్వామి నాకు వచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పా ఠశాలకే అంకితం ఇస్తున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయుల కృషితోనే ఈ అవార్డు నాకు దక్కిం ది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. ప్రభు త్వ ఉపాధ్యాయుల మీద ఉన్న అపనమ్మకాన్ని తొలగిస్తాను