బీజింగ్: చైనాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులతో సహా, 40 మంది విద్యార్థులపై ఓ వ్యక్తి కత్తిపోట్లతో దాడికి దిగాడు. ఈ ఘటన గురువారం చైనాలోని గాంగ్జీ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. చైనా మీడియా కథనం ప్రకారం.. ఉదయం 8.30 ప్రాంతంలో వూజోలోని ప్రైమరీ పాఠశాలలో ఓ సెక్యూరిటీ గార్డు చొరబడ్డాడు. విద్యార్థులతోపాటు అడ్డొచ్చిన టీచర్ల మీదా కత్తితో దాడికి దిగబడ్డాడు. ఈ దాడిలో 40 మంది గాయాలపాలయ్యారు. వీరిలో స్కూలు ప్రిన్సిపల్, సెక్యూరిటీ గార్డు, ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని యాభై ఏళ్ల సెక్యూరిటీ గార్డుగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (4 నెలలుగా కరోనాతో పోరాటం.. వైద్యుడి మృతి)
ఈ దాడి గురించి స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. "ఉదయం దగ్గరలోని స్కూలు నుంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించాయి. వెంటనే స్కూలుకు చేరుకోగా పిల్లలు భయంతో పరుగెత్తుతున్నారు. ఏమైందని వారిని ఆరా తీస్తే ఓ వ్యక్తి కత్తితో దాడి చేస్తూ తిరుగుతున్నాడని ఓ స్టూడెంట్ చెప్పాడు. వెంటనే భయంతో నా కొడుకును తీసుకొచ్చేందుకు స్కూలు లోపలికి పరిగెత్తాను. అదృష్టవశాత్తూ వాడికి ఏం కాలేదు. కానీ ఈ ఘటనతో అతడు బాగా హడలిపోయాడు" అని చెప్పుకొచ్చాడు. కాగా చైనాలో ఇంతకు ముందు సైతం ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. గతేడాది సెప్టెంబర్‌లో మధ్య చైనాలో ఓ వ్యక్తి ప్రైమరీ స్కూలుకు వెళ్లి విద్యార్థులపై దాడికి దిగాడు. ఈ దారుణ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు మరణించగా ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ దాడికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు ఈ మధ్యే జైలు నుంచి విడుదల చేశారు. (చేతిని నరికి ప్రేయసి ఇంటి ముందు..)
Comments
Please login to add a commentAdd a comment