ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ఆత్మకూరు మండలం దామెర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసు కుమారస్వామి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ, డెరైక్టర్ ఆఫ్ స్కూల్‌ఎడ్యుకేషన్ డెరైక్టర్ నుంచి ఆయనకు లేఖ అందింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా కుమారస్వామి అవార్డు అందుకోనున్నారు. ములుగు మండల కేంద్రానికి చెందిన దాసు కుమారస్వామి మొదటిసారిగా అక్టోబర్1, 1986లో ములుగు పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చే రారు. నవంబర్26, 2005లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ము లుగు, మరిపెడ, వెంకటాపూర్ మండలాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆత్మకూరు మండలం దామెర పాఠశాలలో పని చేస్తున్నారు.
కుమారస్వామి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం వినూత్నరీతిలో కరపత్రాలు, డోర్‌పోస్టర్లతో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన పనిచేస్తున్న పాఠశాలలో 1నుండి 5తరగతుల్లో 300మంది విద్యార్థులు ఉన్నారు. దాతల సహకారంతో ఇక్కడి విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్టులు, బ్యాడ్జ్‌లు, పలకలు, నోటుపుస్తకాలు, డైరీలు పంపిణీ చేశారు. అదేవిధంగా *50వేలతో పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించారు.
అందుకున్న అవార్డులెన్నో...
కుమారస్వామి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల నుంచి ఎ న్నో అవార్డులు అందుకున్నారు. 2007, 2010లో జిల్లా ఉ త్తమ ఉపాధ్యాయ అవార్డులు, 2011లో రాష్ట్ర ఉత్తమ ఉ పాధ్యాయ అవార్డు అందుకున్నారు. తాజాగా ఇప్పుడు జా తీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. అ లాగే ఎల్‌ఐసీ, లయన్స్‌క్లబ్, మదర్‌థెరిస్సా ఫౌండేషన్, అ చీవర్స్ ఆర్గనైజేషన్, సర్వేపల్లి రాధాకృష్ణ ఫౌండేషన్ల నుంచి కూడా అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
అవార్డు పాఠశాలకే అంకితం : కుమారస్వామి
నాకు వచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పా ఠశాలకే అంకితం ఇస్తున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయుల కృషితోనే ఈ అవార్డు నాకు దక్కిం ది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. ప్రభు త్వ ఉపాధ్యాయుల మీద ఉన్న అపనమ్మకాన్ని తొలగిస్తాను