ఆదిలాబాద్ టౌన్ : జిల్లాలో 500లకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడనున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం భావిస్తుండటం తో ఈ పరిస్థితి ఏర్పడనుంది. ఈ నిర్ణయంతో సర్కారు పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువగా ఉంటే.. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది కం టే తక్కువగా ఉంటే వాటిని మూసివేయనున్న ట్లు తెలుస్తోంది. ఇందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలనే ఉద్దేశంతో 2010 సంవత్సరంలో ప్రారంభించిన సక్సెస్ పాఠశాలలు(ఇంగ్లిష్ మీడియం) కూడ మూత పడనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు. విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నచోట ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఆ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ పాఠశాలలు మూత పడే స్థితికి చేరుకున్నాయి.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో 4 వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 0 నుంచి 9 వరకు మాత్రమే విద్యార్థులు ఉన్న పాఠశాలలు 100 ఉండగా, 11 నుంచి 19 మంది విద్యార్థులున్న పాఠశాలలు 386 ఉన్నాయి. అలాగే 75 మంది కంటే తక్కువ ఉన్న ఉన్నత పాఠశాలలు 50 వరకు ఉన్నాయి. ఇవీ కూడా మూత పడనున్నాయి. జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్, భుక్తాపూర్, బాలాజీనగర్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు పది కంటే తక్కువగా ఉన్నారు. అలాగే ఇంద్రవెల్లిలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు 41 మంది ఉన్నారు. ఇలాంటి ఎన్నో పాఠశాలలు జిల్లాలో మూతపడే అవకాశం ఉంది.
దీంతో 800 మంది ఉపాధ్యాయులకు ఇతర ప్రాంతాలకు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ఆయా గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య ఉండడంతో పాఠశాలలు మూత పడడంతో కనీసం 3 కి.మీ.లు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో చాలా మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది.
సమీప పాఠశాలలోల విలీనం
మూతపడనున్న పాఠశాలలు సమీప పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలోల 280 మంది విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడితోపాటు సబ్జెక్టు టీచర్లను ఆ పాఠశాలకు నియమించారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 230కి కుదించారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ఇది వరకు 19 మంది లోపు విద్యార్థులుంటే ఒక టీచర్‌ను కేటాయించేవారు ఇక నుంచి 20 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయున్ని నియమిస్తారు. అయితే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయుడు ఖాళీగా ఉన్న చోటికి ఆయన నిర్ణయం మేరకు బదిలీ చేస్తారు. లేదంటే అందరిలో తక్కువ సీనియర్టీ ఉన్న ఉపాధ్యాయుడు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే.
500 సర్కారు బడులకు మంగళం!
Published Mon, Sep 15 2014 1:59 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement