చదువుకోవాలన్న తప్పన, జిజ్ఞాస ఉండేలా కాని చదువుకోవడానికి ఏ వయసు అయితే ఏంటి?. చదువుకోవాల్సిన టైంలో ఏవో కారణాల రీత్యా చదువుకోలేకపోవచ్చు. అవకాశం దొరికితే వదులుకోకుండా ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు అని నిరూపించాడు ఓ వృద్ధుడు.
వివరాల్లోకెళ్తే..మిజోరాంకు చెందిన లాల్రింగ్థరా అనే 78 ఏళ్ల వృద్ధుడు హైస్కూల్‌లో చేరి ఔరా అనిపించాడు. ఆ వయసులో కాలినడకన స్కూల్‌కి వెళ్లి మరీ చదువుకుంటున్నాడు. చదువుకి వయసు అడ్డంకి కాదు అని చేసి చూపించి ఆశ్చర్యపరిచాడు. ఆ వృద్ధుడు 1945లో ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలోని ఖువాంగ్‌లెంగ్ గ్రామంలో జన్మించాడు. రెండొవ తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రి మరణంతో చదువుకు దూరమయ్యాడు. తన తల్లికి అతడు ఒక్కడే సంతానం కావడంతో తల్లికి చేదోడుగా పొలం పనులకు వెళ్తుండేవాడు.
బతుకు పోరాటం కోసం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ..అలా న్యూహ్రుయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. బాల్యం అంతా కటిక పేదరికంలోనే మగ్గిపోయింది. దీంతో లాల్రింగ్థరా చదువు అనేది అందని ద్రాక్షలా అయిపోయంది. ఇప్పుడు అతను ఓ చర్చిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనిలో చదువుకోవాలనే కోరిక మాత్రం చావలేదు. అందువల్లే ఇక ఇప్పుడైన తన కోరిక తీర్చుకోవాలనే కృత నిశ్చయానికి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాడు.
ఈ మేరకు లాల్రింగ్థరా మాట్లాడుతూ..తనకు చదవడం, రాయడంలో ఇబ్బంది లేదని, ఆంగ్లభాషలోని సాహిత్య పదాలు మాత్రం అర్థమయ్యేవి కావంటున్నాడు. ఎలాగైనా తన ఆంగ్ల భాషను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోనే స్కూల్లో జాయిన్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు లాల్రింగ్థరా. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అతను మా టీచర్ల బృందానికి, విద్యార్థులకు ఆదర్శమైన వ్యక్తి అని, అదే సమయంలో అతనికి నేర్పడం అనేది మాకు ఒక సవాలు కూడా అని అన్నారు. అతనికి తాము అన్ని విధాల మద్దతు ఇవ్వడమేగాక చదువుకోవడంలో తగిన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు.
(చదవండి: ఇదేం విచిత్రం! ఆవు పాము రెండు అలా..)
Comments
Please login to add a commentAdd a comment