
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్‌లో చాలా తక్కువమంది మాత్రమే టచ్‌లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్‌కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది.
‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేసింది.
నేహా ఆన్‌లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్‌కేజీ ఫ్రెండ్స్‌ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్‌గా మారింది.
‘నా ఎల్‌కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment