పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు ఇచ్చేదెప్పుడో? | Telangana Delay On PSHM Posts Allocation | Sakshi
Sakshi News home page

పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు ఇచ్చేదెప్పుడో?

Published Tue, Jun 15 2021 9:15 AM | Last Updated on Tue, Jun 15 2021 9:15 AM

Telangana Delay On PSHM Posts Allocation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులకు మోక్షం లభించడం లేదు. 10 వేల ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్‌హెచ్‌ఎంలను నియమిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మూడు నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఆయా స్కూళ్లలో ఇప్పటికే ఉన్న హెడ్‌ మాస్టర్‌ పోస్టులు, తాజాగా ఇంకా ఎన్ని పోస్టులు మంజూరు చేయాలన్న అంశాలపై వివరాలను సేకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 18,217 ప్రాథమిక పాఠశాలల్లో 4,429 లో–ఫిమేల్‌ లిటరసీ (ఎల్‌ఎఫ్‌ఎల్‌) హెడ్‌ మాస్టర్‌ పోస్టులు ఉన్నట్లు తేల్చింది.

సీఎం కేసీఆర్‌ 10 వేల స్కూళ్లలో హెడ్‌ మాస్టర్‌ పోస్టులను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరో 5,571 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం లేకుండాపోయింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 4,429 ప్రధానోపాధ్యాయ పోస్టులు పోగా, మిగతా పోస్టులను మంజూరు చేస్తారా? లేదంటే వాటికి అదనంగా కొత్తగా 10 వేల పోస్టులను మంజూరు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.  

జిల్లాల వారీగా పోస్టులు
జిల్లా                       పాత           కొత్త       మొత్తం 
                          పోస్టులు      పోస్టులు

ఆదిలాబాద్‌            484            613    1,097 
హైదరాబాద్‌           168            205       373 
కరీంనగర్‌              562           709    1,271 
ఖమ్మం                460           581    1,041 
మహబూబ్‌నగర్‌    580            731    1,311 
మెదక్‌                 426            535        961 
నల్లగొండ             500            629     1,129 
నిజామాబాద్‌        389            485        874 
రంగారెడ్డి             369            466        835 
వరంగల్‌             491             617      1,108 
మొత్తం             4,429           5,571   10,000 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement