
సాక్షి, కామారెడ్డి: చెట్ల కింద నడుస్తున్న పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం నిర్మాణానికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రకటించారు.
చెట్లకింద కొనసాగుతున్న కామారెడ్డి జిల్లా పల్లెగడ్డతండా ప్రాథమిక పాఠశాల దుస్థితిపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ఇదీ తర‘గతి’... కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పల్లెగడ్డతండా పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తన నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేసి, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment