Surender
-
ప్రియుడితో కలిసి అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి..
హైదరాబాద్: గతంలో వచ్చన ‘మనీ’ సినిమాను తలదన్నేలా.. గుర్రం సురేందర్ కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. డబ్బు కోసం ఆ చిత్రంలో భార్యను భర్త కిడ్నాప్ చేయగా.. వాస్తవ జీవన చిత్రంలో మాత్రం ప్రేమికుడితో కలిసి ఓ చెల్లెలు తన సోదరుడిని అపహరించిన కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. డబ్బుల కోసం చిన్నాన్న కూతురే తన ప్రియుడితో కలిసి అపహరణకు తెర లేపడం దిగజారిపోతున్న మానవతా విలువలకు అద్దం పట్టింది. ఎంతో ప్రేమగా.. సొంత సోదరిలా చూసుకునే అన్ననే అపహరించి.. ఆపై పోలీసులకు చిక్కిన వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. ఆదివారం గచ్చి»ౌలిలోని మాదాపూర్ డీసీసీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్చార్జి డీసీపీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన గుర్రం సురేందర్, భార్య నాగమణితో కలిసి గోకుల్ ప్లాట్స్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ సపోర్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయన చిన్నాన్న కూతురు గుర్రం నిఖిత (22) నగరంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న సాయంత్రం తన సోదరుడు సురేందర్‌కు ఫోన్ చేసిన నిఖిత.. ఆఫీస్‌లో కొందరు తనను వేధిస్తున్నారని, ఖాజాగూడ చెరువు వద్దకు వచ్చి మాట్లాడాలని కోరగా వచ్చాడు. నిఖితతో అతడు మాట్లాడుతుండగా.. అక్కడికి వచి్చన ఐదుగురు ఆగంతకులు సురేందర్‌ను కారులోకి లాక్కువెళ్లి కిడ్నాప్ చేశారు. ఈ సమయంలో సమీపంలోనే ఇద్దరు వ్యక్తులు అనుమానంతో డయల్ 100కు కాల్ చేశారు. రాయదుర్గం పెట్రోల్ మొబైల్ పోలీసులు అక్కడికి చేరుకొని నిఖితను పీఎస్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. తన సోదరుడిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సురేందర్‌ను తీసుకువెళ్తున్న కిడ్నాపర్ల కారు కడ్తాల్ వరకు వెళ్లగానే బ్రేక్ డౌన్ అయింది. దీంతో కిడ్నాపర్లు నిఖితకు ఫోన్ చేయడంతో సురేందర్‌కు చెందిన కారులో ఆమె ప్రియుడు కృష్ణా జిల్లా పెనమలూరు పెద్దపులిపాకకు చెందిన బల్లిపర వెంకట కృష్ణ (28)తో కలిసి వచ్చి సదరు కారును వారికి ఇచి్చంది. పోలీసులు సెల్‌ఫోన్ మెసేజ్‌ల ఆధారంగా వెంబడించడంతో కిడ్నాపర్లు కడ్తాల్ నుంచి కర్నూలు వైపు వెళ్లారు. సురేందర్ భార్య నాగమణికి వాట్సాప్ కాల్స్ చేస్తూ రూ.2 కోట్ల డబ్బు సమకూర్చాలని, కిడ్నాప్ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఖమ్మంలో తల్లిగారింట్లో ఆమె హుటాహుటిన నగరంలోని గోకుల్ ప్లాట్స్‌కు వచి్చంది. ప్రత్యేక బృందాలతో గాలించి.. పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. సీఐ మహేష్ బృందం కిడ్నాపర్లను వెంబడించారు. కర్నూలు దగ్గర్లోకి వెళ్లగానే ఆత్మకూరు వైపు కారు వెళుతున్నట్లుగా గుర్తించి అక్కడి పోలీసులు, చెక్‌పోస్ట్‌ను అప్రమత్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆత్మకూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లగానే అక్కడి సిబ్బంది కారును ఆపారు. గమనించిన దుండగులు కారును రివర్స్ తీసుకొని పారిపోయేందుకు ప్రయతి్నంచి వెనక వాహనాలను ఢీకొట్టారు. అంతలోనే సిబ్బంది రావడంతో ముగ్గురు నిందితులు పారిపోగా భోజగుట్ట చెందిన షిండే రోహిత్ (19)ను పట్టుకున్నారు. తనను కిడ్నాప్ చేశారని, రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైందని సురేందర్ వారికి చెప్పారు. కొద్ది సేపటికే రాయదుర్గం సీఐ మహేష్ బృందం అక్కడికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ముగ్గురు ఫారెస్ట్‌లోకి పారిపోయారు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలో అత్తాపూర్‌కు చెందిన గుంజపోగు సురేష్ అలియాస్ సూర్య (31), మెహిదీపటా్ననికి చెందిన రామగల్ల రాజు అలియాస్ లడ్డూ (20)లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కడ్తాల్‌కు చెందిని చందు పరారీలో ఉన్నాడు. కారు బ్రేక్ డౌన్ అయిన సమయంలో కిడ్నాపర్లలో ఒకరైన అత్తాపూర్‌కు చెందిన వెంకట్ పరారయ్యాడు. సురేపై 22 కేసులు కిడ్నాప్‌లు, ఇంటి తాళాలు పగులగొట్టిన పలు కేసుల్లో గుంజపోగు సురేష్ నిందితుడు. హబీబ్‌నగర్, గాంధీనగర్, ఆసిఫ్‌నగర్, హయత్‌నగర్, సదాశివపేట్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, జీడిమెట్ల, అంగర్హౌస్, పటాన్చెరు, మియాపూర్, తెనాలీ రూరల్ పీఎస్‌లలో 22 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. నిఖిత ప్రియుడు బల్లిపర వెంకటకృష్ణపై జీడిమెట్ల పీఎస్‌లో ఎన్డీపీఎస్, కూకట్పల్లి పీఎస్‌లో కిడ్నాప్ కేసులు నమోదై ఉన్నాయి. గతంలోనే వెంకటకృష్ణకు జైలులో సురేష్ పరిచయమయ్యాడు. గత అక్టోబర్‌లోనే ఓ కిడ్నాప్.. ప్రధాన నిందితుడైన సురేష్ ముఠా గత అక్టోబర్ 10న కన్సల్టెన్సీ నిర్వాహకుడు శివశంకర్‌ను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసింది. శివశంకర్ భార్య నుంచి రూ.2 లక్షలు తీసుకొని విప్రో సర్కిల్లో వదిలిపెట్టారు. గచి్చ»ౌలి పీఎస్‌లో నమోదైన ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు, రెండు హోండా యాక్టివాలు, ఏడు సెల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. 48 గంటల్లో కేసును ఛేదించిన సీఐ మహే‹Ùను, సిబ్బందిని, ఏడీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌ను డీసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు. కిడ్నాప్‌నకు స్కెచ్ ఇలా.. సాఫ్ట్వేర్ ఇంజినీరైన గుర్రం నిఖితకు నేర ప్రవృత్తి కలిగిన తోటి ఉద్యోగి బల్లిపర వెంకటకృష్ణను ఇష్టపడింది. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సురేందర్‌ను కిడ్నాప్ చేయాలని పథకం పన్నారు. అప్పటికే తమకు పరిచయం ఉన్న సురేష్‌ను సంప్రదించారు. సురేందర్‌ను కిడ్నాప్ చేస్తే వచ్చే డబ్బుల్లో వాటా ఇస్తామని ప్లాన్ వేశారు. డయల్ 100కు కాల్ వెళ్లకపోతే పోలీసులకు నిఖిత ఫిర్యాదు ఇచ్చేది కాదని పోలీసులు తెలిపారు. సురేందర్ భార్యతో ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు కిడ్నాపర్లకు సమాచారం అందించి దొరికిపోయింది. ఏ1 గుంజపోగు సురే‹Ù, ఏ2 బల్లిపర వెంకట కృష్ణ, ఏ3 గుర్రం నిఖిత, ఏ4 రామగల్ల రాజు, ఏ5 షిండే రోహిత్‌లను అరెస్ట్ రిమాండ్‌కు తరలించారు. -
సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితుల అదుపులో తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జి డీసీపి శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగ గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ కు గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. ఈనెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ చేదించామని డీసీపీ వెల్లడించారు. డయల్ 100 కు ఇద్దరు సమాచార అందించారని, నిఖిత కిడ్నాప్ కు గురైన సమయంలో అక్కడే ఉందన్నారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని వెంటనే విచారించామని అన్నారు. ప్రత్యేకంగా ఆరు టీమ్‌లను ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ ను ఛేదించినట్లు తెలిపారు. నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తారు. సురేందర్ కు నిఖిత కజిన్ సిస్టర్ గా గుర్తించామన్నారు. నిఖితతో వెంకటకృష్ణకు పరిచయం ఉందని, వీళ్ళిద్దరూ కలిసి సురేష్ తో కలిసి కిడ్నాప్ కు ప్లాన్ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత సురేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. పోలీసులకు సమాచారం తెలియడంతో సురేందర్ తో కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు ఫోన్ చేయించారు. వారికి సహకరించాలని చెప్పారని ముందే ప్లాన్ వేశారు. అయితే.. నిఖిత, వెంకటకృష్ణ లు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.. సురేష్ తో కలిసి నిఖిత , వెంకట కృష్ణలు కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు తెలిపారు. గతంలోనూ వీళ్ళు కిడ్నాప్ లు చేసిన కేసులు వున్నాయని తెలిపారు. ప్రధాన నిందితుల పై పీడీ యాక్ట్ పెడతామన్నారు. సురేష్, వెంకటకృష్ణ లపై పలు కేసులు ఉన్నాయని, సురేష్ పై 21 కేసులు ఉండగా, వెంకటకృష్ణ పై రెండు కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్!
సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు, ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో, ఇద్దరు నేతలకు నిరసన సెగ తగిలింది. వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలంలో ఏఆర్పీ క్యాంపులో షకీల్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఎందుకు గ్రామంలోకి వచ్చారని షకీల్‌ను నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక, షకీల్‌కు నిరసన సెగపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడిని కవిత తీవ్రంగా ఖండించారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. 60 లక్షల మంది గులాబీ సైన్యం ముందు మీరెంత?. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజాక్షేత్రంలో దాడులను ధీటుగా ఎదుర్కొంటారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. ఎల్లారెడిలో బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్‌కు సైతం నిరసన సెగ తగింది. లక్ష్మాపూర్‌లో సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా గడిచిన ఐదేళ్లలో సమస్యలు పట్టించుకోలేదని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఊరి మీదుగా వెళ్తూ కనీసం ఒక్కసారి కూడా ఆగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
TS Election 2023: పసుపు.. చక్కెర
తుమాటి భద్రారెడ్డి: రైతు ఉద్యమాల వేదికగా పేరున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శాసనసభ ఎన్నికలకు సకల అస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 శాసనసభ స్థానాలు ఉండగా 2014లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన 8 సీట్లు గెలిచింది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పసుపు బోర్డు హామీతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రైతుల ఆసరాతో అనూహ్యంగా కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు. ఇక ఇప్పుడు నిజాం షుగర్స్ అంశం ప్రధాన ఎజెండాగా రైతుల ఓట్లు మరోసారి కొల్లగొట్టే లక్ష్యంతో బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. కాంగ్రెస్ సైతం నిజాం షుగర్స్, మంచిప్ప రిజర్వాయర్ ముంపు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, ఆరు హామీలతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అలాగే దళితబంధులో కమీషన్ల వసూళ్లు, డబుల్ ఇళ్ల నిర్మాణంలో విఫలం, కామారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తదితరాలపైనా ప్రచారం చేస్తోంది. ఇక సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, పైగా ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతుండడంతో ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత సమీకరణాలు మారనున్నాయి. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ బాల్కొండ బరిలో ముక్కోణపు పోటీ వరుసగా రెండుసార్లు గెలుపొందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డికి టికెట్ వచ్చింది. ఈయనకు గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున 42వేల ఓట్లు దక్కడం గమనార్హం. ఇక బీజేపీ తరపున ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను బరిలోకి దించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో త్రిముఖ పోటీ తప్పని పరిస్థితి. బోధన్ బాస్ ఎవరో?.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి ఎవరి ప్రచారం వారు చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సుదర్శన్రెడ్డికే టికెట్ ఇచ్చారు. షకీల్‌ను ఓడించాలనే లక్ష్యంతో శరత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. ఆర్మూర్ ఆషామాషీ కాదు ఇప్పటికే రెండుసార్లు గెలవడంతో ఈసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే జీవన్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో గడ్డు పరిస్థితి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పొద్దు టూరి వినయ్‌రెడ్డికి టికెట్ ఖరారు అయ్యింది. బీజేపీ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ పార్టీ ఆదేశిస్తే చివరి నిమిషంలో ఎంపీ అర్వింద్ బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అర్వింద్ బరిలో ఉంటే గెలుపు సులువని పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్‌లో నిలిచేది ఎవరు? ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బిగాల గణేశ్‌గుప్తా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో కింగ్‌కి పోటీ ఇచ్చేనా? బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి షబ్బీర్‌అలీ, బీజేపీ నుంచి∙వెంకటరమణారెడ్డి పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. షబ్బీర్‌అలీ గతంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్, అక్రమ వెంచర్లు, ధరణి అక్రమాలు, పావలా వడ్డీ బకాయిల ఉద్యమాల్లో పాల్గొన్న వెంకటరమణారెడ్డి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. నిజామాబాద్ రూరల్‌లో సీన్ మారుతుందా? వరుసగా మూడోసారి, మొత్తంగా ఐదోసారి గెలిచి కేబినెట్లో స్థానం సంపాదించేందుకు బాజిరెడ్డి గోవర్దన్ లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ నుంచి కులాచారి దినేష్‌కు టికెట్ దక్కనుందనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగేష్‌రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిప్ప జలాశయం ముంపు అంశం, ధరణి, పోడు భూముల అంశాలు కాంగ్రెస్ ప్రధాన ప్రచార అ్రస్తాలుగా వాడుతోంది. బాన్సువాడ బరిలో గెలుపెవరిది? రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే నమ్మకంతో బరిలో మరోమారు దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్ నిలబడితే గెలుపు అవకాశాలుంటాయనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మాల్యాద్రిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. ఎల్లారెడ్డి.. ఏలేదెవరో? గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి వెళ్లారు. కేసీఆర్ పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్, సుభాష్ రెడ్డి మధ్య టికెట్ పోటీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నడుస్తోంది. జుక్కల్ ఎవరిపరం? సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మూడోసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార, బుచ్చన్న టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, గడుగు గంగాధర్ మధ్య పోటీ నెలకొనగా మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
రిటైర్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం
-
IRS అధికారి ఇంట చోరీ కేసులో కొత్త కోణం.. ఎస్ఐ కృష్ణ స్కెచే ఇది..
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతం కేసులో ఎస్ఐ కృష్ణనే సూత్రదారిగా పోలీసు అధికారులు గుర్తించారు. సురేందర్ అనే వ్యక్తితో కలిసి రూ.100 కోట్ల ఆస్తి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకుని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇక, ఈ కేసులో సురేందర్‌ను విచారించడంతో వెలుగులోకి ఎస్ఐ కృష్ణ వ్యవహారం బయటకు వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 30న శామ్యూల్‌కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. ఇక, ఈ డాక్యుమెంట్లను కృష్ణకు అందించాడు సురేందర్. కాగా, సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను పోలీసులు సేకరించారు. మరోవైపు.. సురేందర్ చోరీ చేసన సొమ్ముతో గోవా వెళ్లి క్యాసినో ఆడినట్టు తెలిపాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు చెప్పాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎస్ఐ కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. ఎస్ఐ కృష్ణా, సురేందర్‌ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్, బీజేపీకి షాక్!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
సొంత సంస్థల్లోకి మళ్లిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ తన ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును సొంత సంస్థల్లోకి మళ్లిస్తోందని, అవి నష్టాల్లోకి వెళ్తే వేలాది కుటుంబాలు వీధిన పడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి మరో అగ్రిగోల్డ్, సహారా మాదిరిగా కాకముందే జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నందున పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థకు చెందిన పలు బ్రాంచ్‌లపై నమోదైన కేసులను కొట్టివేయాలని / దర్యాప్తుపై స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణను ఏపీలో కాకుండా మరో రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని, అప్పటివరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ వాదనలు విన్నారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా, ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవిందరెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. విచారణ ‘పరిధి’, కేసు మెరిట్ అంశాలపై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. పునర్విభజన చట్టానికి విరుద్ధం ‘మార్గదర్శి అక్రమాలపై 409, 477(ఏ), 420 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ పదేళ్లకు పైగా శిక్ష పడే కేసులే. ఏపీలో నమోదైన కేసులపై ఇక్కడ రిలీఫ్ కోరలేరు. ఒకట్రెండు అంశాల్లో మినహా ఏపీ హైకోర్టు పరిధిలోని అంశాలపై తెలంగాణ హైకోర్టు కలుగజేసుకునే అవకాశం లేదు. కేసులు నమోదైన నేరాలన్నీ ఏపీలోనే జరిగాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులూ అక్కడి వారే. అలాంటప్పుడు ఇక్కడ అరెస్టులు చేయవద్దని కోరడం చట్ట విరుద్ధం. ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని ఇదే హైకోర్టు కూడా పలు తీర్పులను ఇచ్చింది’ అని ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవిందరెడ్డి నివేదించారు. ‘పరిధి’ అంశం తేలకుండానే మళ్లీ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందన్నారు. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోకి అక్రమంగా మళ్లిస్తున్నారని చెప్పారు. చిట్స్ పేర డబ్బులు సేకరించి ఉషాకిరణ్ లాంటి సంస్థల్లోకి మళ్లిస్తున్నారని తెలిపారు. మరో రాష్ట్రానికి మార్చండి.. ‘మార్గదర్శి కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడి నుంచే బ్రాంచ్‌ల పర్యవేక్షణ జరుగుతుంది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడే ఉంటారు. అందుకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాం. దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి. ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా తనిఖీలు చేస్తున్నారు’ అని సిద్దార్థ లూత్రా పేర్కొన్నారు. -
అంగన్వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు
సాక్షి, కామారెడ్డి: తాను రూ. 3వేల జీతంతో అంగన్వాడీ ఆయాగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయితే రూ. 30వేలు ఇచ్చారని, ఇప్పుడు ఆయా పని లేక, వృద్ధాప్య పింఛన్ రాక ఎలా బతకాలని రామారెడ్డికి చెందిన 75ఏళ్ల వృద్ధురాలు దుడుక సత్తవ్వ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ను ప్రశ్నిచింది. ఆదివారం రామారెడ్డి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన సత్తవ్వ తనకు పింఛన్ ఇవ్వాలని కోరింది. తనతో పాటు మరో 8 మంది వృద్ధులు ఆయాలుగా పనిచేసి రిటైర్ అయినా పింఛన్ల రావడం లేదని చెప్పింది. తమకు అంగన్వాడీ నుంచి ఎలాంటి పింఛన్లు ఇవ్వనప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మారిన తర‘గతి’
సాక్షి, కామారెడ్డి: చెట్ల కింద నడుస్తున్న పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం నిర్మాణానికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రకటించారు. చెట్లకింద కొనసాగుతున్న కామారెడ్డి జిల్లా పల్లెగడ్డతండా ప్రాథమిక పాఠశాల దుస్థితిపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ఇదీ తర‘గతి’... కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పల్లెగడ్డతండా పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తన నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేసి, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆయన హైదరాబద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సురేందర్ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకూ సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ తెలింది. కాగా, ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ బారి నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. (తెలంగాణ కరోనా రికవరీ రేటు 77.31శాతం) -
మానవత్వం పదిలం!
ఈ పదిమంది కలిస్తే మానవత్వం పరిమళిస్తుంది. కరోనా వేళ కారుణ్యమూర్తులై బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఏ తల్లి బిడ్డలో తెలియదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోతారు. అన్నీ తామై ఆదుకుంటారు. ‘కోవిడ్ వారియర్సై’ కదిలి వస్తున్నారు. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లడం.. దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అంత్యక్రియలు నిర్వహించడం వంటివి చేపడుతున్నారు. ‘అంతిమసంస్కారం’ చాటుకుంటున్నారు. ‘ఫీడ్‌దనీడ్’గొడుగు కింద సామాజికసేవకు పూనుకున్నారు. కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే చుట్టుపక్కల వాళ్లు భయపడిపోతున్నారు. సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కరోనా కారణంగా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకురాని స్థితిలో ఆ 10 మంది అన్నీ తామే అయి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సాయితేజ, శ్రీనివాస్ బెల్లం, ప్రశాంత్ మామిండ్ల, వినయ్ వంగాల, రమణ్‌జిత్ సింగ్, సురేంద్ర, ప్రదీప్, అనుమోత్, విద్యాసాగర్, అంకిత్‌రాజ్ స్నేహితులు. అందరూ సాఫ్ట్వేర్ నిపుణులే. ‘‘వారం క్రితం మా స్నేహితుడు మాన్సింగ్ తల్లి కోవిడ్‌తో చనిపోయారు. కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నారు. మేమే బాధ్యత తీసుకున్నాం. ఆసుపత్రి నుంచి ఈఎస్ఐ శ్మశానం వరకు అంబులెన్స్‌కు రూ.25,000, అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లేందుకు మరో రూ.20,000 ఖర్చయ్యాయి. మేమందరం కలిసి ఖర్చులు పంచుకున్నాం. కానీ పేద, మధ్యతరగతి ప్రజలు అంత ఖర్చును భరించగలరా... పైగా వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చేదెవరు.. అందుకే అలాంటివారికి ఉచితంగా అన్నీ దగ్గ రుండి చేయాలని నిర్ణయించుకున్నాం’’అని చెప్పారు సాయితేజ. అంత్యక్రియల కోసం ఎవరైనా సహాయం కోరితే ఫీడ్ ద నీడ్ సంస్థ నుంచి లాస్ట్ రైడ్ వాహనం వస్తుంది. స్వచ్ఛందసేవకులు సైతం బాడీ బ్యాగు, పీపీఈ కిట్లు, సోడియం హైపోక్లోరైడ్, శానిటైజర్ తీసుకొని వస్తారు. వాళ్లే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. వారి అస్థికలను సైతం మేమే నదీజలాల్లో కలిపి వస్తున్నాం’ అని చెప్పారు. లాక్డౌన్ సమయంలోనూ వీరు 50 వేల మంది అన్నా ర్తుల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు. అన్నీ తామై.... ► బీహెచ్ఈఎల్కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్‌తో చనిపోతే అంత్యక్రియలు జరిపేందు కు కన్నకొడుకు భయపడ్డాడు. ఇరుగు పొరుగు సైతం వెనుకడుగు వేశారు. ఆ కుటుంబానికి ఫీడ్ ద నీడ్ వారియర్స్ అన్నీ తామై నిలిచారు. ► కొండాపూర్‌కు చెందిన ఓ వృద్ధుడు శుక్రవారం సోమాజిగూడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కోవిడ్‌తో కన్నుమూశాడు. కొడుకు, కూతురు అమెరికాలోనే ఉన్నారు. ఆయన భార్య 65 ఏళ్ల వయోధికురాలు. నిస్సహాయ స్థితిలో ఫీడ్ ద నీడ్‌ను సంప్రదించింది. ఒక్క ఫోన్ చాలు 8499843545 ఈ నెంబర్‌తో ఫీడ్ ద నీడ్ కాల్‌సెంటర్ పని చేస్తుంది. 24 గంటలపాటు సహాయం అందజేస్తారు. -
ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారు(సరెండర్ చేశారు) అంటూ ప్రధాని మోదీపై శనివారం నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మరో అడుగు ముందుకేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు పేరు సరెండర్ మోదీ అని ఎద్దేవా చేశారు. అయితే, ఇంగ్లిష్ పదం సరెండర్ స్పెల్లింగ్‌ను surrenderకు బదులు surender అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆయన ‘చైనాతో భారత్ బుజ్జగింపు విధానం బట్టబయలు’అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రికలోని కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని ప్రధాని చెబుతున్నప్పటికీ పాంగాంగ్ త్సో సమీపంలోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడవుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించిన టీవీ వార్తా కథనం క్లిప్పింగ్‌ను కూడా జత చేశారు. -
ఇక గులాబీ ప్రతినిధి!
టీఆర్ఎస్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విలీన ప్రక్రియ పూర్తయ్యింది. ఈ విషయాన్ని గురువారం రాత్రి శాసనసభ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన 12 మంది అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులయ్యారు. అందులో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు ఒకరు.. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో కామా రెడ్డి జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఎల్లారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ వరుస విజయా లు సొంతం చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకతకు తోడు సురేందర్ మీద ఉన్న సానుభూతిలో టీఆర్ఎస్ హవాకు అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జాజాల(నల్లమడుగు) సురేందర్ 35,148 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. అయితే టీఆర్ఎస్ గాలిని తట్టుకుని విజయం సాధించిన సురేందర్ కొంత కాలానికే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకోవడం కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రతిపక్ష హోదాను కోల్పోయేలా చేయడానికి టీఆర్ఎస్ పార్టీ వేసిన ఎత్తుల్లో భాగంగా తమ పార్టీలోకి చేరనున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో సీఎల్పీ విలీనం అనేది లాంఛనమేనని తేలిపోయింది. ఇలా వినతిపత్రం ఇచ్చారో లేదో.. అలా విలీన ప్రక్రియ పూర్తి చేశారు. గురువారం రాత్రే సీఎల్పీ టీఆర్ఎస్లో విలీనం అయినట్లు శాసనసభ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. దీంతో నల్లమడుగు సురేందర్ అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటికే సురేందర్ అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. సీఎల్పీ విలీనంతో జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. ఎంపీతో పాటు జెడ్పీ చైర్మన్ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. -
ఇద్దరు గెరిల్లా స్క్వాడ్ సభ్యుల లొంగుబాటు
చర్ల : ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ సభ్యులు వెంకటాపురం సీఐ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు సీఐ సాయిరమణ స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చర్ల మండలం పెదమిడిసిలేరు గ్రామ పంచాయతీలో గల ఎర్రంపాడుకు చెందిన వేకో జోగయ్య అలియాస్ జంగు.. 2008లో అప్పటి మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు సుఖదేవ్ నేతృత్వంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. చురుకుగా పనిచేస్తున్న అతడికి 2009లో మిలీషియా సభ్యుడిగా పదోన్నతి కల్పించగా.. 2010 వరకు మిలీషియా కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఆయన 2010లో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. మావోయిస్టు నేత లచ్చన్న నేతృత్వంలో 2016 వరకు పనిచేసిన జంగు పలు విధ్వంసాల్లో పాల్గొన్నట్లు సీఐ తెలిపారు. 2013లో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు జోగయ్య అలియాస్ జంగు.. మావోయిస్టు పార్టీలో దళ సభ్యురాలిగా పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ రాంపురానికి చెందిన నూపా పాయికెను వివాహం చేసుకున్నాడు. ఇతడు కుర్నపల్లి, మినప, సింగం ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొనడంతోపాటు ఆంజనేయపురం సమీపంలోని ప్రధాన రహదారిపై మందుపాతరల ఏర్పాటు, చర్లలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల ఆటోపై కాల్పులు జరపడం, పెదమిడిసిలేరులోని జీసీసీ రేష¯ŒS షాపు, సత్యనారాయణపురంలోని స్టేట్ బ్యాంక్ లూటీ, బూరుగుపాడుకు చెందిన రవ్వా సింగయ్య హత్య, చలమలకు చెందిన కొర్సా చౌతు అలియాస్ మడకం సంతు హత్య, చలమలలో జేసీబీ దగ్ధం వంటి విధ్వంసకర సంఘటల్లో పాల్గొనగా.. అతడిపై మొత్తం 19 కేసులు నమోదైనట్లు సీఐ వివరించారు. 2012లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని రాంపురానికి చెందిన నూపా పాయికె అప్పటి మావోయిస్టు పార్టీ జననాట్య మండలి కళారూపాలకు ఆకర్షితురాలై మావోయిస్టు పార్టీలో చేరింది. ఆ తరువాత ఖమ్మం జిల్లా మావోయిస్టు పార్టీ స్పెషల్ గెరిల్లా స్క్వాడ్‌లో ఈమెకు అవకాశం రాగా.. అందులో పనిచేస్తున్న సందర్భంలో 2013లో వేకో జోగయ్య అలియాస్ జగ్గుతో వివాహం జరిగింది. వివాహం తరువాత సత్యనారాయణపురంలో 2014లో బీఎస్ఎ¯ŒSఎల్సెల్ టవర్ దగ్ధం చేసేందుకు వచ్చినప్పుడు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో భర్తతో కలిసి ఈమె కూడా పాల్గొనగా.. సెల్‌టవర్ వద్ద జరిగిన ఎదురు కాల్పులకు సంబంధించి కేసు ఈమెపై ఉంది. భార్యాభర్తల ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో సీఐ ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించి, వీరిని ఆదుకుంటామని సీఐ తెలిపారు. -
అంత్యక్రియలకు హాజరైన సీఎం
మోర్తాడ్, వేల్పూర్: అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి అంతక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామం వేల్పూర్‌లో నిర్వహించగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరయ్యారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తండ్రి అయిన సురేందర్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వేల్పూర్‌కు చేరుకుని సురేందర్‌రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సురేందర్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని సీం గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, రాజ్యసభ సభ్యులు కేశవరావ్, డి శ్రీనివాస్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్‌షిండే, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
ఘట్కేసర్లో కారు ఢీకొని వ్యక్తి మృతి
ఘట్కేసర్ మండలం ఎన్‌ఎఫ్‌సీనగర్ వద్ద కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌కు చెందిన సురేందర్(35)గా గుర్తించారు. రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చల్లటి నీరు కోసం ఘర్షణ.. వ్యక్తి హత్య
చౌటుప్పల్: చల్లటి నీరు కోసం సెక్యూరిటీ గార్డులు ఘర్షణ పడి సహచరుడిని హత్య చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం సంగడపల్లి శివారులోని డిస్కవరీ కంపెనీ వద్ద శనివారం రాత్రి ఈ హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్లితే....బిహార్ రాష్ట్రానికి చెందిన భువన్‌కుమార్(22), విజయ్‌కుమార్(20)తోపాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురేందర్ (40) డిస్కవరీ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. భువన్, విజయ్‌ల దగ్గరకు వచ్చిన మేనల్లుడు సుజల్ శనివారం రాత్రి తనకు తాగేందుకు చల్లటి నీరు కావాలని సురేందర్‌ను కోరాడు. నీరు ఇవ్వకపోవడంతో విషయాన్ని మేనమామలకు తెలిపాడు. వారు కోపంతో వచ్చి సురేందర్‌తో ఘర్షణ పడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో బండరాయితో సురేందర్ తలపై గట్టిగా మోదడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఎస్ఐ నవీన్‌కుమార్ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాయంత్రంలోపు లొంగిపో...
ఢిల్లీ: గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సాయంత్రం ఆరు గంటల్లోగా లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. 'ముందు లొంగిపోండి, తరువాత మధ్యవర్తిత్వం గురించి ఆలోచించొచ్చు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఈ సమాచారాన్ని సోమనాథ్ భారతి తనకు అందుబాటులోకి రాగానే తెలియజేస్తానని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. గృహహింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ్ భారతి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూ, వివిధ ఫోన్ నంబర్లను మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. గృహహింస కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షించాలని కోరుతూ సోమనాథ్ భారతి అంతకుముందు పెట్టుకున్న ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కాగా సోమనాథ్ భారతి పోలీసులకు లొంగిపోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇదివరకే సూచించారు. అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆయన పార్టీకి అప్రతిష్ట తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా పార్టీతోపాటు, ఆయన కుటుంబానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. -
అవినీతి తిమింగలం
ఏకకాలంలో వరంగల్, హైదరాబాద్‌లో ఏడు గంటలు సోదాలు ఇళ్లు, స్థలాల గుర్తింపు 14 మద్యం బాటిళ్లు, రూ.67 వేల నగదు స్వాధీనం రూ.3 కోట్లకుపైగా అక్రమ ఆస్తులున్నట్లు గుర్తింపు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వెల్లడి ఏసీబీకి చిక్కిన జనగామ డీఎస్పీ కూర సురేందర్ వివాదాలకు, అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన జనగామ డీఎస్పీ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ కూర సురేందర్‌ను అక్రమాలకు కేంద్రంగా చేస్తూ దాడులు కొనసాగాయి. వరంగల్, హైదరాబాద్‌లలో ఏకకాలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకదాటిగా ఏడు గంటలపాటు దాడులు జరిగాయి. - సాక్షి, హన్మకొండ హన్మకొండ : అప్పుడే తెల్లవారుతోంది.. బుధవారం ఉదయం 5.30 గంటలు అవుతోంది. రెండు వాహనాల్లో ఏసీబీ అధికారులు రయ్‌మని వచ్చి జనగామలో ఉన్న డీఎస్పీ కూర సురేందర్ కార్యాలయూనికి అనుబంధంగా ఉన్న డీఎస్పీ నివాస గృహానికి చేరుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 5.30 గంటల నుంచి మ ద్యాహ్నం 1.00 గంట వరకు సోదాలు నిర్వహిం చారు. జనగామ డీఎస్పీ కార్యాలయంతోపాటు వరంగల్, హైదరాబాద్‌లలోని డీఎస్పీ కూర సురేం దర్‌కు చెందిన ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగా యి. మూడేళ్ల క్రితం జనగామకు డీఎస్పీగా వచ్చిన కూర సురేందర్, రేపోమాపో బదిలీ కావచ్చనే ప్రచా రం జరుగుతోంది. ఇంతలోనే ఆయన ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. అక్రమలతో ఆస్తులు వరంగల్, హైదరాబాద్‌లతోపాటు ఇతర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఆదాయానికి మించి రూ.3 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, ప్రభాకర్ జనగామలో మీడియాకు తెలిపారు. జిల్లాలోని బాలసముద్రంలో ఒక ఇళ్లు, హైదరాబాద్ అంబర్‌పేట, తిలక్‌నగర్ (గోల్నాక)లలో రెండు ఇళ్లు, వరంగల్ నక్షత్ర రెసిడెన్సియల్లో ఒక అపార్టుమెంట్, హైదరాబాద్‌లోని ఉప్పల్ వెంకటేశ్వర అపార్టుమెంట్లో రెండు ప్లాట్లు, హైదరాబాద్ జనచైతన్య అపార్టు మెంట్లో ఒకటి మొత్తం మూడు ఇళ్లు, నాలుగు ప్లాట్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు హెదరాబాద్, వరంగల్‌లలో వేర్వేరు చోట్ల మరో ఐదు స్థలాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని వెల్లడించారు. ఇప్పటివరకు తాము గుర్తించిన ప్రదేశాల్లో అక్రమంగా రూ.3 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ దాడిలో దొరికిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత అక్రమాస్తుల వివరాలు వెల్లడిస్తామన్నారు. విదేశీ మద్యం జనగామలోని డీఎస్పీ కార్యాలయంలో 13 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటిలో మూడు డబుల్ బ్లాక్ జానీవాకర్, 12 ఇయర్స్ శివాజీ లేబుల్, 8 ఇయర్స్ శివాజీ లేబుల్, రెడ్‌లేబుల్, దాల్విన్, 4.5 లీటర్ల రెడ్ లేబుల్, ఒక లీటరు రెడ్ లేబుల్లు ఉన్నాయి. వీటితోపాటు స్థానికంగా లభించే వ్యాట్ 69 మద్యం సీసాలతోపాటు రూ.67 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడుల్లో లభ్యమైన మద్యం బాటిళ్లను జనగామ ఎక్సైజ్ సీఐ జగన్నాథరావు సీజ్ చేశారు. ఆ కేసుతో మొదలు ఇటీవల లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారులో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న యువకుడిని ఈ కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు యువకుడి తండ్రి పలుకుబడి కలిగిన కాంట్రాక్టరు కావడంతో పోలీసులు సదరు యువకుడిని కాపాడారని, ఇందులో డీఎస్పీ కీలక పాత్ర పోషించారంటూ దళిత మహిళా సంఘాలతోపాటు అన్ని వర్గాల వారు బహిరంగ ఆరోపణలు చేశారు. కేసు నుంచి తప్పించిన నాలుగో వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా పోలీసుల నుంచి స్పందన రాలేదు. దీనితో కాంట్రాక్టరు కుమారుడిని తప్పించేందుకు డీఎస్పీ కార్యాలయం వేదికగా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు చేతులు మారాయంటూ, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బుధవారం ఏసీబీ దాడులు జరగాయనే ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దాడుల నేపథ్యంలో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పోలీసు అధికారుల్లో ఆందోళన మొదలైయింది. ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారిపై ఏసీబీ దాడులు జరగడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి వరకు డీఎస్పీ ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతూనే ఉంది. -
కొడుకును కొట్టిన తండ్రి అరెస్ట్
హైదరాబాద్: కుమారుడిని కొట్టిన ఓ తండ్రిని హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఎస్ఐ నాగాచారి వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్ బస్తీకి చెందిన సురేందర్(32), సుజాత దంపతులకు భార్గవ్(11) అనే కుమారుడు ఉన్నాడు. సురేందర్ ఈ నెల 2న భార్గవ్‌ను తీవ్రంగా కొట్టడంతో పన్ను విరిగింది. బాలుడు తన తల్లి సాయంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సురేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. -
‘బెనిఫిట్స్’ అవకతవకలపై విచారణ
24న చెల్లించినట్లు రికార్డులు సమర్పించిన డీసీసీబీ జీఎం రూ.లక్షకుపైగా తేడా వచ్చిందంటున్న సహకార శాఖ ఉద్యోగులు రెండు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించాలి జెడ్పీ అధికారులను ఆదేశించిన విచారణాధికారి వెంకటేశ్వర్లు జిల్లాపరిషత్ : సహకార శాఖలో ఉద్యోగ విరమణ పొందిన వారి బెనిఫిట్స్ చెల్లింపుల్లో అవకతవకలపై జిల్లాపరిషత్ ఇన్చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు గురువారం రెండో దఫా విచారణ చేపట్టారు. జెడ్పీలో జరిగిన విచారణకు డీసీసీబీ జీఎం సురేందర్ హాజరై 30 మంది ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్‌ను 24వ తేదీనే బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిపి... ఇందుకు సంబంధించిన రికార్డులను సీఈఓకు అందజేశారు. అనంతరం ఆయన వెళ్లిపోగా... ఉద్యోగ విరమణ పొందిన వారితో వెంకటేశ్వర్లు సమావేశమయ్యూరు. డీసీసీబీ జీఎం ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్కొక్కరికి సుమారు రూ.లక్షకు పైగా తేడా వచ్చినట్లు విరమణ పొందిన 30 మంది ఉద్యోగులు సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. 30 శాతం మినహాయింపుతో డబ్బులు తీసుకున్న 38 మంది కూడా ఇదే విషయాన్ని ఆయనకు చెప్పారు. దీంతో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఎంత బెనిఫిట్స్ (డ బ్బులు) వచ్చాయి... వారి బాకీ ఉన్న డబ్బులు ఎన్ని మినహాయించారు... ఇప్పుడు ఎంత ఇవ్వాల్సి ఉంటుందనే వివరాలతో కూడిన ఫార్మాట్‌ను తయారు చేసి డీసీసీబీ అధికారులకు పంపించనున్నట్లు సీఈఓ వెల్లడించారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించాలని జెడ్పీ ఉద్యోగులు నర్సింహరావు, రాంబాబును ఆదేశించారు. త్వరలో విచారణ తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కాగా, మళ్లీ విచారణ జరిగే రోజున తమతోపాటు ఒకే సమయంలో జీఎం సురేందర్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ వాసం వెంకటేశ్వర్లును ఉద్యోగ విరమణ పొందినవారు కోరారు. -
వీడని ఉత్కంఠ!
హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్.. విడుదల ఉదంతంలో ఉత్కంఠ వీడడం లేదు. సోమవారం కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం వరకు హుజూరాబాద్ పోలీసులే ఈ కేసును విచారణ జరుపుతుండగా ప్రస్తుతం వరంగల్ జిల్లా పోలీసులు కూడా విచారణలో పాలుపంచుకున్నట్లు సమాచారం. డాక్టర్ సురేందర్‌రెడ్డి 15 రోజుల క్రితం హన్మకొండ వెళ్తుండగా దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు బందీగా ఉంచుకుని హింసించి, రూ.32 లక్షలు డిమాండ్ చేసి రూ.16 లక్షలు తీసుకుని వదిలేశారు. కిడ్నాప్ వెనక కుట్రను ఛేదించేందుకు రెండు జిల్లాల పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. తొలుత అక్రమంగా సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఒకరిని సోమవారం రాత్రి హుజూరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కిడ్నాపర్లు ఉపయోగించినట్లు భావిస్తున్న ఫోన్‌నంబర్ సిమ్‌కార్డులను నెట్వర్క్ కంపెనీ ద్వారా వాటిని విక్రయించిన వారి చిరునామాను కనుగొన్నారు. హుజూరాబాద్‌లో ఈ సిమ్‌కార్డు తీసుకున్నట్లు తెలిసింది. గుర్తింపు కార్డులు లేకుండానే సిమ్‌కార్డు విక్రయించినట్లు తెలియడంతో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో కీలక వ్యక్తి? హుజూరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు భావిస్తున్న ఆరుగురిలో ఒకరిని మాత్రమే కస్టడీలో ఉంచుకొని మిగతావారిని వదిలేసినట్లు తెలిసింది. ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌కు చెందిన ఇద్దరిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కిడ్నాప్ సంఘటనకు సూత్రధారి అయిన కీలకమైన వ్యక్తిని వరంగల్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరో అనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కిడ్నాప్‌లో పాల్గొన్న నలుగురు వ్యక్తులు, ఇన్నోవా డ్రైవర్, దీనంతటికీ కారణమై ఎప్పటికప్పుడు ఫోన్లో కిడ్నాప్ వ్యూహానికి సలహాలిచ్చిన అసలు నిందితుడు ఎవరనే విషయంలో పోలీసులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.