కొడుకును కొట్టిన తండ్రి అరెస్ట్ | father arrest for beaten his son | Sakshi
Sakshi News home page

కొడుకును కొట్టిన తండ్రి అరెస్ట్

Published Fri, Feb 6 2015 9:49 AM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM

కొడుకును కొట్టిన తండ్రి అరెస్ట్ - Sakshi

కొడుకును కొట్టిన తండ్రి అరెస్ట్

హైదరాబాద్: కుమారుడిని కొట్టిన ఓ తండ్రిని హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఎస్‌ఐ నాగాచారి వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్ బస్తీకి చెందిన సురేందర్(32), సుజాత దంపతులకు భార్గవ్(11) అనే కుమారుడు ఉన్నాడు. సురేందర్ ఈ నెల 2న భార్గవ్‌ను తీవ్రంగా కొట్టడంతో పన్ను విరిగింది. బాలుడు తన తల్లి సాయంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సురేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement