Bhargav
-
High Court: భార్గవ్ రెడ్డిపై చర్యలోద్దు..
-
సజ్జల భార్గవ్ కేసు వివరాలేవీ?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ పోలీసులను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.మొసాద్ ఏజెంట్లలా మోహరించి ఉన్నారు..ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని భార్గవ్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్‌ను కోరారు. అంత అత్యవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. భార్గవ్ కోసం పోలీసులు మొసాద్ ఏజెంట్ల మాదిరిగా మోహరించారని తెలిపారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణ జరిపారు.ఎప్పుడో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని పొన్నవోలు తెలిపారు. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌ని నిందితుడిగా చేర్చారని తెలిపారు. జూలై 1కి ముందు పెట్టిన పోస్టులపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ కింద కేసులు పెట్టారని, వాస్తవానికి అప్పటికి ఈ చట్టాలేవీ అమల్లోకి రాలేదని తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ కింద మాత్రమే కేసులు పెట్టాలన్నారు. భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇదే వ్యవహారంలో మరో నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా న్యాయమూర్తి 14కి వాయిదా వేశారు.అర్జున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. -
అదరగొట్టిన ఆంధ్ర ప్లేయర్లు: భార్గవ్‌కు రెండు టైటిల్స్
పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు అరిగెల భార్గవ్ రామ్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన భార్గవ్ అండర్–19 పురుషుల డబుల్స్, అండర్–19 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు.డబుల్స్లోనూపురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన గొబ్బూరు విశ్వతేజ్‌తో కలిసి ఆడిన భార్గవ్ రామ్ 21–13, 21–18తో అర్ష్ మొహమ్మద్–భవ్య్ ఛాబ్రా (భారత్) జోడీని ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో భార్గవ్‌రామ్–కలగొట్ల వెన్నెల (భారత్) ద్వయం 21–9, 21–12తో మొహమ్మద్ వితో అనాఫ్సా–కేలా అనీసా పుత్రి (ఇండోనేసియా) జంటను ఓడించి టైటిల్ దక్కించుకుంది.చాంపియన్ సూర్య చరిష్మాఇక అండర్–19 మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సూర్య చరిష్మా తామిరి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సూర్య చరిష్మా 18–21, 21–11, 21–15తో థాలిత రమధాని విర్యావాన్ (ఇండోనేసియా)పై గెలుపొందింది. అండర్–19 మహిళల డబుల్స్ ఫైనల్లో తారిణి సూరి–శ్రావణి వలేకర్ (భారత్) జంట 21–17, 23–21తో చైచానా–పొలియం (థాయ్‌లాండ్) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. -
గొల్లపల్లి యువకుడు భార్గవ్‌కు లక్కీ ఛాన్స్.. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం
సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): మండలంలోని గొల్లపల్లికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి లక్కీఛాన్స్ కొట్టాడు. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతంతో క్వాల్‌కాం మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ (ఎంటెక్) చదువుతున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి ఇంకా పట్టా తీసుకోకముందే రూ.కోట్ల కొలువు దక్కించుకున్నాడు. ఆయన చదువు డిసెంబర్లో పూర్తి కానుండగా, అతని నైపుణ్యం గుర్తించిన క్వాల్‌కాం కంపెనీ అంతకుముందే ఏడాదికి రూ. 1.70 కోట్లు ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. చదువు పూర్తికాగానే క్వాల్‌కాంలో చేరనున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి అధునాతన చిప్‌ల తయారీపై పనిచేయాల్సి ఉంటుంది. భార్గవ్ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే అతనికి రూ. 20 లక్షలు స్కాలర్ షిప్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా భార్గవ్ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, అలివేలమ్మ మాట్లాడుతూ.. తమ కుమారుడు ఏడాదికి రూ.కోటి సంపాదించే ఉద్యోగంలో చేరతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివే తమ కుమారుడి ప్రతిభ గుర్తించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థలు ఫీజుల్లో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చాయన్నారు. చదవండి: (పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు) -
అచ్చు ఆయనలానే.. జూ.ఎన్టీఆర్ తనయుడి ఫొటోలు వైరల్!
చూస్తుంటే నందమూరి అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి మెదటి కారణం 'ఆర్ఆర్ఆర్' మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో కారణం ఏంటంటే.. తమ అభిమాన హీరో కుమారులు చాలా కాలం తర్వాత బయటి ప్రపంచానికి కనిపించడం. అంతేకాదు వారిలో ఒకరు అచ్చం సీనియర్ ఎన్టీఆర్లాగే ఉండడంతో.. నందమూరి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా తారక్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తారక్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో పాటు మరికొంతమంది బంధువులు కూడా వీరితో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దీంతో అక్కడి మీడియా కన్ను ఎన్టీఆర్ ఫ్యామిలీపై పడింది. తారక్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే భార్గవ్ రామ్ పై మాత్రం నెటిజనులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌ను చూస్తుంటే తమకు సీనియర్ ఎన్టీఆర్‌ను చూసినట్టే ఉందంటున్నారు నందమూరి అభిమానులు. భార్గవ్ రామ్ సాంప్రదాయ దుస్తులతో పాటు నుదుట విష్ణు నామంతో కనిపించాడు. భార్గవ్‌కి అన్నీ సీనియర్ ఎన్టీఆర్ పోలికలే అంటూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పెద్ద ఎన్టీఆర్ ముఖాకృతి తనలో కనిపిస్తోందని, అచ్చు గుద్దినట్టు ఎన్టీఆరే నంటూ అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం. -
టిక్‌టాక్ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: టిక్‌టాక్ (ఫన్ బకెట్) భార్గవ్‌కు మళ్లీ రిమాండ్ విధించారు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్‌టాక్ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్ విధించారు. అయితే ఆయన నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే మళ్లీ సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టుల పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. నింధితుడికి ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ వెల్లడించారు. చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు..) -
ఫన్ బకెట్ భార్గవ్ కేసు : అక్కాచెల్లెళ్ల వీడియో వైరల్
టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. భార్గవ్‌ని రిమాండ్‌కు తరలించిన తర్వాత అతని బాగోతాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతను కెమెరా ముందు ఒకలా.. తర్వాత మరోలా ఉంటాడని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు. గతంలో కూడా చాలా మంది అమ్మాయిలను అవకాశాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భార్గవ్ అత్యాచారానికి పాల్పడిన 14 ఏళ్ల బాలిక స్థానంలో ఎందరో పేర్లు బయటకు వస్తున్నాయి. గతంలో భార్గవ్‌తో కలిసి వీడియోలు చేసిన OMG నిత్య, ‘అమ్మాయి-అబ్బాయి’ఫేమ్ మౌనిక పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో చేసేదేమీలేక సదరు యువతులు ఓ వీడియో సందేశం ద్వారా ఆ బాధితురాలిని మేము కాదని చెప్పుకున్నారు. తాజాగా భార్గవ్ అత్యాచారం పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పేర్లను, ఫోటోలనే వాడేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి మేము కాదంటూ జస్విక, మేఘన అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తండ్రితో కలిసి ఓ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వుతుంది. ఆ వీడియోలో జస్విక మాట్లాడూ.. ‘బార్గవ్ అన్నయ్య కేసు గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అందులో ఫీమెల్‌గా ఫస్ట్ మా అక్కను, తర్వాత నన్ను అనుకుంటున్నారు. దాని వల్ల చాలా కామెంట్స్ వస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. భార్గవ్ కేసులో మైనర్ వయసు 14 ఏళ్లు. కానీ మా అక్క వయసు 20 ఏళ్లు, నాకు 16 ఏళ్లు. ఈ జూన్ వస్తే 17 ఏళ్లు వస్తాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు. మాకేమి ప్రాబ్లమ్ లేదు. మా వీడియోస్ అన్నీ మా డాడీయే చూసుకుంటారు’ అని జస్విక వెల్లడించింది. ఇక జస్విక తండ్రి మాట్లాడుతూ.. ‘మా పిల్లల వీడియోస్‌ని అన్ని నేనే చూసుకుంటా. రెండు నెలల నుంచి భార్గవ్ కోసం వర్క్ చేస్తున్నా.ఇన్ని రోజులు మా ఛానల్లో వీడియో పెట్టడం కుదరడం లేదు. మా పిల్లలిద్దరికీ నటనంటే ఇష్టం. నేను 20 ఏళ్లుగా సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. నా వీడియోపై బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి. నేను అన్నీ స్క్రీన్ షాట్ తీస్తున్నా. అవన్నీ సైబర్‌క్రైమ్‌కు వెళ్తాయి. బెదిరించడంలేదు. దయచేసి అర్థం చేసుకోండి’అని విజ్ఞప్తి చేశారు. చదవండి: భార్గవ్.. మమ్మల్ని రూమ్ నుంచి వెళ్లగొట్టాడు, ఎందుకంటే టిక్‌టాక్ భార్గవ్ నిజరూపం బయటపెట్టిన పోలీసులు -
అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి
ఎలాంటి విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడే డేరింగ్ పర్సనాలిటీ గాయని చిన్మయిది. లైంగిక వేధింపులపై ప్రజలను చైతన్య పరుస్తూరామె. తాజాగా టిక్‌టాక్ స్టార్ ఫన్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ టిక్‌టాక్ వీడియోల పేరుతో 14 ఏళ్ల మైనర్ బాలికను లోబర్చుకొని, భార్గవ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్లోఅతడిపై కేసు నమోదైంది. భార్గవ్ ఉదంతంపై చిన్మయి స్పందిస్తూ.. ఇలాంటివి జరిగినప్పుడు కూడా.. అమ్మాయిదే తప్పు అని లేవనెత్తే సొసైటీలో మనం ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్గవ్ కేసుకు సంబంధించి ఓ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్‌ను వివరిస్తూ.. 'తల్లి అతి గారాభం చేయడం,ఎక్కడికి వెళతుందో గమనించకపోడం, అమ్మాయికి పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో టిక్ టాక్ భార్గవ్‌తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఓ మైనర్ బాలిక కామాంధడి చేతిలో బలికావాల్సి వచ్చింది. దీనికి తోడు బాలిక తండ్రి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవారు ఎవరూ లేకుండా పోయారు' అంటూ రాసిన వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదని, దానికి అమ్మాయిని బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదని ఘాటుగా బదులిచ్చింది. టిక్‌టాక్, రీల్స్చేయడంతో తప్పు లేదు : చిన్మయి ఇక భార్గవ్ లాంటి మనుషులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారని, అయితే అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఈ ఉదంతం బయటకు వచ్చిందని తెలిపింది. భార్గవ్‌ను ఉద్దేశిస్తూ..భార్గవ్ స్త్రీ లోలుడు అని అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన క్లిప్పింగ్‌ను తాను కూడా చూశానని, ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాళ్లు చాలా స్మార్ట్‌గా, కన్నింగ్‌గా అమ్మాయిని లోబర్చుకుంటారని, ఇందుకు వాళ్ల పేరెంట్స్‌తోనూ మంచిగా మాటలు కలుపుతారని తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అమ్మాయిలకు అకౌంట్ ఉండటం, వేరే వాళ్లతో రీల్స్, టిక్‌టాక్ చేయడంలో తప్పు లేదని, అయితే మనం ఎవరితో ఫ్రెండిప్ చేస్తున్నాం అనే అంశంపై చాలా ఆచితూచి వ్యవహరించాలని, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్న వివరాలను తల్లిదండడ్రులకు చెప్పడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి : భార్గవ్ స్త్రీ లోలుడు, బ్లాక్మెయిల్ చేసేవాడు.. అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ -
భార్గవ్ కేసు: చేతులెత్తి దండం పెట్టిన సురేఖావాణి కూతురు
టిక్‌టాక్ స్టార్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ వీడియోలతో ఫేమస్ అయిన భార్గవ్ అవకాశాలిప్పిస్తానంటూ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో అతడిని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ ఘటనపై సురేఖావాణి కూతురు సుప్రిత స్పందించింది. అతడికి సంబంధించిన వార్తను షేర్ చేసింది. "భార్గవ్.. టిక్‌టాక్ వీడియోలో చూసిన 14 ఏళ్ల బాలికను ఇతర చానళ్లలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడు. ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. అమ్మాయి నో చెప్పినా కూడా వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ ఆమెను లోబర్చుకున్నాడు" అని పోలీస్ అధికారి చెప్పిన మాటలు విని ఆమె షాకైంది. దీని గురించి స్పందించేందుకు మాటలు రావడం లేదు అంది. అతడు చేసిన అకృత్యం గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేసింది సుప్రిత. కాగా భార్గవ్ మాజీ ప్రేయసి, స్నేహితులు సైతం అతడు మంచివాడు కాదంటూ ఆరోపణలు చేస్తున్నారు. అతడు పెద్ద స్త్రీ లోలుడు అని, అమ్మాయిలను వీడియోల కోసం వాడుకునేవాడని పేర్కొన్నారు. కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు ఒకలా, ఆఫ్‌లో ఉన్నప్పుడు మరోలా ఉంటాడని విమర్శలు గుప్పించారు. చదవండి: భార్గవ్ బాధితుల్లో ఒకరికి భర్త కూడా ఉన్నాడు ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు -
ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్ట్.. లైవ్‌లోకి మరో యువతి
టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మైనర్ బాలిక అత్యాచార కేసులో భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని రిమాండ్‌కు తరలించిన తర్వాత చాలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చాలా మంది యువతులను భార్గవ్ ఇలాగే అవకాశాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు మాత్రం ఒక్క యువతి కూడా భార్గవ్ తమను మోసం చేసినట్లు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... భార్గవ్ అరెస్ట్ కాగానే.. అత్యాచారం పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన యువతుల పేర్లు, ఫోటోలను వాడేస్తున్నారు. ఇప్పటికే భార్గవ్‌తో టిక్‌టాక్ వీడియోలు తీసిన OMG నిత్య అలియాస్ నిత్యశ్రీ లైవ్ లోకి వచ్చి తనకు భార్గవ్ కేసుకు సంబంధం లేదని క్లారిటీ ఇవ్వగా, తాజాగా మౌనిక అనే మరో యువతి కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పింది.ఈ మేరకు మౌనిక ఓ వీడియోని విడుదల చేసింది. తాము ఇద్దరం కలిసి రెండున్నరేళ్లు అవుతుంది అని తనకు ఈ కేసుకు సంబంధం లేదని తన ఫోటోలు వాడవద్దని కోరింది. ‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్ బకెట్ భార్గవ్ అరెస్టయిన విషయం మీఅందరికి ఎలా తెలుసో.. నాకు కూడా ఈ సోషల్ మీడియా ద్వారాలే తెలిసింది. ‘అమ్మాయి-అబ్బాయి’ వీడియోలు ఆపేసి రెండున్నరేళ్లు అయింది. ఆ తర్వాత మాకు ఎటువంటి కమ్యునికేషన్ లేదు. కానీ అప్పుడు చేసిన వీడియోలను, ఫోటోలను స్క్రీన్‌షాట్ తీసి ఈ కేసు విషయంలో వాడేస్తున్నారు. నాకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా ఈ వీడియో చూసి అవన్ని డిలీట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్‌తో బిజీగా ఉన్నాను’అని మౌనిక చెప్పుకొచ్చింది.గతంలో భార్గవ్ - మౌనికలు అమ్మాయి - అబ్బాయి పేరిట వీడియోలు రిలీజ్ చేసి టిక్ టాక్ వేదికగా విడుదల చేసేవారు. వాటికి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చేవి. చదవండి : భార్గవ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు : ఓమైగాడ్ నిత్య చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్ బాలికపై అత్యాచారం -
ఆ వీడియోలు డిలీట్ చేయండి: OMG నిత్య
-
భార్గవ్‌తో సంబంధం లేదు..ఆ వీడియోలు డిలీట్ చేయండి: OMG నిత్య
మైనర్ బాలిక అత్యాచార కేసులో టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక భార్గవ్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనగానే. చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’పేరును తెరపైకి తీసుకొచ్చారు. భార్గవ్ అత్యాచారానికి పాల్పడ్డది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు నిత్య ఫోటోలను వాడేస్తున్నారు. అయితే తాజాగా ఈ వార్తపై నిత్య స్పందించింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడటం జరిగింది. చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్ వాళ్లు నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. మీరంతా తెలియక చేస్తున్నారని నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు తెలుస్తాయి. అప్పుడైనా డిలీట్ చేయండి. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్లో ఉన్నా’ అంటూ తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది చదవండి: అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు -
ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను అరెస్ట్ చేసినట్టు విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. చెల్లి అంటూ దగ్గరై టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ మైనర్‌తో అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితు నిపై అత్యాచారం తోపాటు ఫోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. టిక్ టాక్ భార్గవ్ ను హైదరాబాదులో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితుడిపై ఇతర ఫిర్యాదులు ఉంటే బాధితులు పోలీసులను ఆశ్రయించారని ఏసీపీ కాజల్ సూచించారు. చదవండి: చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్ బాలికపై అత్యాచారం -
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
-
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. టిక్‌టాక్ వీడియోల పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఈ నెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు భార్గవ్ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ విషయాన్ని ప్రముఖ యాంకర్ శివ సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా 2 లక్షలు ఇస్తాం..కేసు వాపసు తీసుకోండి అని భార్గవ్ పోలీసులను ప్రాధేయపడినట్లు శివ తన స్టోరీలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భార్గవ్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్ చేశారని వివరించాడు. అయితే ఈ సందర్భంగా అసలు ఈ వార్త నిజమేనా? లేక యాంకర్ శివ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడా అన్న ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. దీంతో ఇది వ్యూస్ కోసం చేయడం లేదని, ఈ వార్తను బయటకు రానివ్వకుండా ఎక్కడ ఆపేస్తారో అని తాను పోస్ట్ చేస్తున్నట్లు యాంకర్ శివ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది ప్రాంక్ కాదని, నిజమైన వార్తేనని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్ శివ చేసిన వరుస పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా? -
టిక్‌టాక్ బ్యాన్ ఠాప్‌ఠాప్‌మని తాకింది..
టిక్‌టాక్ బ్యాన్ ఠాప్‌ఠాప్‌మని తాకింది. ఎటువాళ్లు అటు కుదేలయ్యారు. నెక్స్ట్ ఏంటి అనే రంధిలో పడ్డారు. వైజాగ్ టిక్‌టాక్ స్టార్ భార్గవ్‌కు 85 లక్షల మంది ఫాలోయెర్స్. ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. అతనేం అంటున్నాడు? అతని మాటల్లోనే.... ‘టిక్‌టాక్ బ్యాన్ చేస్తున్న సంగతి మాకు ఒక్క వారం రోజులు ముందుగా చెప్పినా మానసికంగా సిద్ధంగా ఉండేవాళ్లం. ఏదో ఒక ప్రత్యామ్నాయం వెతుక్కునేవాళ్లం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఒక కంపెనీ మూసేస్తుంటే నెల రోజులు ముందుగా ఉద్యోగులకు తెలియపరుస్తారు. మాకు అటువంటి అవకాశం ఇవ్వలేదు. నేను, నా కుటుంబం, నన్ను నమ్ముకున్న నా టీమ్... అంతా వీధిన పడ్డాం. టిక్‌టాక్ ద్వారానే అంతర్జాతీయంగా పేరు సంపా దించుకున్నాను. పెద్దగా చదువుకోని నేను రోడ్డు మీద అనాథలా ఉన్న స్థితి నుంచి కారు కొనుక్కునే స్థితికి ఎదిగాను. ఇప్పుడు మళ్లీ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉంది.’ డిప్రెషన్లోకి... ‘హఠాత్తుగా టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారనే వార్త వినేసరికి నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. మా ఫ్రెండ్స్ అకౌంట్లలో కూడా టిక్‌టాక్ కనిపించట్లేదు. యాప్ స్టోర్‌లో నుంచి ఇన్స్టాల్ చేయలేం అన్నారే కానీ, ఉన్న అకౌంట్లు కూడా పోతాయనుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేసి డబ్బు సంపాదించుకోవాలో అర్థం కావట్లేదు. సరదాగా మాట్లాడటం, సమాజంలోని సమస్యల మీద స్పందించటం నాకు దేవుడు ఇచ్చిన వరం. ఆ వరంతోనే ఈ స్థితికి ఎదిగాను. టిక్‌టాక్ ద్వారానే రెండు సంవత్సరాలుగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఒక టీమ్ కూడా ఏర్పాటుచేసుకున్నాను. చాలామంది టిక్‌టాక్ అంటే ఫన్నీగా చేసుకునే యాప్ అనుకుంటారు. కాని నేను చాలా సామాజిక సమస్యల మీద వీడియోలు చేశాను. అది నా బాధ్యతగా భావించాను. నాలాంటి క్రియేటివ్ ఆర్టిస్టులకి వేరే పని చేయటం కూడా చేత కాదు. ఒకప్పుడు నేను చాలామందికి ధైర్యం చెప్పి నా టీమ్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు వాళ్లే నన్ను డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకువస్తున్నారు. వాళ్ల నుంచి బలం తెచ్చుకుంటున్నాను.’ ఎగతాళి చేశారు.. ‘టిక్‌టాక్ పని అయిపోయింది, ఇంక హైదరాబాద్ వెళ్లి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకో అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇప్పటికే నేను కరోనా ప్రమోషన్ వీడియోల కోసం కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నా చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. ఆఖరి అయిదు వందలు ఖర్చయిపోయిన సమయంలోనే టిక్‌టాక్ బ్యాన్ గురించిన వార్త నా నెత్తి మీద పిడుగులా పడింది. అమ్మ ఫోన్ చేసి అద్దె కట్టాలని చెప్పింది. టిక్‌టాక్ వాళ్లు ఫోన్ చేసి, హలో అన్నా! జీవితాల మీద దెబ్బ కొట్టారు, ఇక మన పని అయిపోయింది అని బాధ పడ్డారు. నేనూ భారతీయుడినే. నాకు కూడా దేశభక్తి ఉంది. టిక్‌టాక్ అనేది ఒక ఆప్షన్‌గా మాత్రమే ఎంచుకోవాలని చేతిలో డబ్బు ఉన్నప్పుడు దాచుకోవాలే కాని ఖర్చు చేయకూడదని తెలుసుకున్నాను. నాలాంటి వారంతా ఉన్న పేరుని పోగొట్టుకోకుండా కొత్త ప్లాట్పారమ్ వెతుక్కుని మళ్లీ ప్రయత్నించి మరో నెలలో మళ్లీ అందరికీ చేరువవుతామనే ఆశతో ఉన్నాను.’ – సంభాషణ: వైజయంతి పురాణపండ మేమంతా టిక్ టాక్ ద్వారా సెలబ్రిటీ స్థాయికి ఎదిగాం. ఇప్పుడు ఇది మూత పడింది. ఎవ్వరూ దిగులుపడకుండా మన భారతీయ ఆప్ ద్వారా మళ్లీ అందరికీ చేరువ అవుతామని ఆశిస్తున్నాను. – ఓ మై గాడ్ నిత్య, టిక్ టాక్ ఆర్టిస్టు -
అఖిలప్రియ భర్తపై కేసు నమోదు
-
అఖిలప్రియ భర్తపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై మరో ఫిర్యాదు అందింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆళ్లగడ్డ ఎస్ఐ రమేశ్ కుమార్ తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చారు. సోమవారం సాయంత్రం తన కారు(నల్లరంగు ఫార్చునర్; ఏపీ 21 సీకే 0222)ను స్వయంగా నడుపుకుంటూ వెళుతున్నభార్గవను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఏపీ పోలీసులను గుర్తించిన భార్గవ కారు ఆపకుండా వేగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దారి గుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కారు ఆపినట్లే ఆపి తప్పించుకున్నారు. తమ విధులకు ఆటంకపరచడంతో పాటు కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని భార్గవపై ఎస్ఐ రమేశ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భార్గవరామ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అఖిలప్రియ భర్త భార్గవ్‌పై పోలీస్ కేసు
సాక్షి, కర్నూలు : మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆళ్లగడ్డలో ఉన్న క్రషర్ క్వారీ ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు భార్గవ్ రామ్‌తో సహా 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని అఖిలప్రియ భర్త బెదిరింపులకు పాల్పడటంతో శివరామిరెడ్డి పోలీసుల్ని ఆశ్రయించాడు. మరోవైపు అఖిలప్రియ, భార్గవ్ రామ్‌ల పీఏ మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు అయిన వారి వివరాలు.. 1.మద్దూరు భార్గవ్ రామ్ నాయుడు 2. మాదల శ్రీను 3.నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి 4.శ్రీను 5.అల్లా సుబ్బయ్య 6.నాగేంద్ర 7.డ్రెవర్ గణేష్ 8.మంగలి పవన్ 9. మహేష్ (పీఏ) 10.సంపత్ నాని 11.షరీఫ్ -
గేట్‌మ్యాన్ కొడుకు సినిమా చూపిస్తున్నాడు
టిక్‌టాక్... ఇటీవల వచ్చిన ఒక పెద్ద ప్రభంజనం. చాలామంది వారి వారి ప్రతిభను ఇందులో పొందుపరుస్తు్తన్నారు. ఐదు నెలల క్రితం టిక్‌టాక్‌లో జోకులు పెట్టడం ప్రారంభించిన భార్గవ్ చిప్పాడ ఇప్పుడు ‘సౌత్ ఇండియా టిక్ టాక్’ గా టాప్ ర్యాంకులో ఉన్నాడు. 43 లక్షల వ్యూయర్స్‌తో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ర్యాంకులో నిలిచాడు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్ చిప్పాడ సాధించిన ఈ విజయాల గురించి అతడి మాటల్లోనే... ‘‘మా నాన్న (ఆదినారాయణరావు) కొత్తవలస శ్రీలక్ష్మీనరసింహ థియేటర్లో గేట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. మా అమ్మ (లక్ష్మి) ‘జామీ హైస్కూల్’లో అటెండర్‌గా పనిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒకటి సాధించాలనే కోరిక. అప్పటికప్పుడు జోకులు వేయడం నాకు వచ్చిన విద్య. దీన్నే ఉపయోగించాలనుకున్నాను. చాన్స్ కోసం చూస్తుండగా వైజాగ్‌లో జూనియర్ ఆర్టిస్టుగా పని దొరికింది. లెజెండ్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, తమిళంలో ఒక సినిమాలో నటించా. ఆ తరవాత జూనియర్ ఆర్టిస్టుల సప్లయర్‌గా పనిచేశాను. అదంతగా నచ్చలేదు. సొంతంగా ఏదో చేయాలనే తపన బలపడింది. ‘మోడీ ఈజ్ మై డాడీ’ 2014లో హైదరాబాద్ చేరుకున్నాను. అదే సంవత్సరం ‘మోడీ ఈజ్ మై డాడీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. ఆ చిత్ర నిర్మాత దగ్గరే ఒక యేడాది ఆఫీసు బాయ్‌గా పనిచేశాను. కాని నా గోల్ వేరు కదా. ఒక్క చాన్స్ ఇవ్వమని ఎవరి దగ్గరకు వెళ్లినా ‘ఇంతకుముందు చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా’ అని అడగటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ‘సినిమాలోకి దారేది’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. అందులో అన్నిరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ సినిమా తీసుకుని అందరినీ కలిశాను. హర్ష అన్నవరపు అనే అతను నన్ను గుర్తించారు. 2016లో ‘ఫన్ బకెట్’ పేరుతో మొత్తం 180 ఎపిసోడ్స్ చేశాను. ‘దేశముదురు’ ప్రోగ్రామ్‌లో ధనరాజ్‌తో చేశాను. నాకు పేరు వచ్చింది. అక్కడ నుంచి జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది. అప్పుడు మొదలైంది.. అప్పుడే టిక్‌టాక్ ఒక ప్రభంజనంలా వచ్చింది. అందరూ ఆ యాప్‌ను వాడుకుంటూ, వారి వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. నా సొంత జోకులతో నేనూ ఇందులో అప్లోడ్ చేయొచ్చుగా అనుకున్నాను. స్టార్ట్ చేశాను కూడా. 2019, ఏప్రిల్ ఒకటో తేదీన ఒక ఏప్రిల్ ఫూల్ జోకు చేశాను. అది అంతర్జాతీయంగా బాగా వైరల్ అయ్యింది.49 లక్షల వ్యూస్ వచ్చాయి. దాంతో నాకు వచ్చిన పేరును నిలబెట్టుకోవాలనుకున్నాను. ‘అమ్మాయి – అబ్బాయి’ పేరుతో ఒక సిరీస్‌గా స్టార్ట్ చేశాను. ఇది తెలుగులో బాగా వైరల్ అయ్యింది. అందరికీ తెలిసిన పదాలతోనే పంచెస్ వేయడం వల్ల నా వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ‘విగో యాప్ వాళ్లు పిలిచారు ‘విగో’ ఆప్ వాళ్లు పిలిచారు. నెల జీతం ఇవ్వడం ప్రారంభించారు. ‘రేస్ గేమ్’ వాళ్లకి ప్రకటన చేశాను. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నిత్యశ్రీతో కలిసి ఇంగ్లీషులో చేసిన టిక్‌టాక్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి కూడా మెసేజెస్ రావడం మొదలైంది. నన్నిప్పుడు ‘సౌతిండియా టిక్‌టాక్ స్టార్’ అంటున్నారు. – వైజయంతి పురాణపండ నా సినిమాకు నాన్న టికెట్ చింపారు ‘నాయుడుతోట’లో ఆఫీస్ ఓపెన్ చేశాను. రేస్ గేమ్, స్విగ్గీ, మిస్టర్ రమ్మీలకి ప్రమోషన్ యాడ్ చేశాను. వీటి వల్ల డౌన్లోడ్స్ పెరిగి, సర్వర్ డౌన్ అయిపోవడంతో, సర్వర్ నుంచి వాళ్లు ఫోన్ చేసి, ‘రెక్టిఫై చేస్తున్నాం, కంగారు పడకండి’ అన్నారు. అంత బాగా చూశారు ఈ ప్రకటనలను. ఒంటరిగా బయలుదేరిన నేను టీమ్ భార్గవ్‌గా అయ్యాను. ‘కిర్రాక్ పార్టీ’ సినిమా నాన్నగారు పనిచేస్తున్న థియేటర్లో రిలీజ్ అయ్యింది. నా సినిమాకు నాన్న టికెట్ చింపారు. అదొక అనుభూతి. అలాగే సుబ్రహ్మణ్యపురం, మిస్టర్ మజ్ను, హిప్పి సినిమాలు కూడా నాన్న పనిచేస్తున్న థియేటర్లోనే విడుదలయ్యాయి. ‘ఫన్ బకెట్’ భార్గవ్ చిప్పాడ టిక్‌టాక్ స్టార్ -
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి నారాయణతో పాటు, మాజీ డీజీపీ సాంబశివరావు బంధువు అయిన భార్గవ్‌తో ఆమె నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పంబలిలో భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు
వాకాడు : సినీ నిర్మాత, దివంగత ఎస్.గోపాల్‌రెడ్డి తనయుడు ఎస్.భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలిలో నిర్వహించారు. భార్గవ్‌రెడ్డి సముద్రంలో మునిగి మంగళవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. పంబలిలోని తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, రాజేశ్వరమ్మ సమాధుల వద్దనే భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. భార్గవ్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరి పావని తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆమే అంత్యక్రియలు నిర్వహించారు. తన చేతులతో అన్నకు తల కొరివి పెట్టాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. హీరో విశాల్ తల్లిదండ్రులు జీకే రెడ్డి, జానకీ దేవి, సోదరి ఐశ్వర్యరెడ్డి, సినీ నటుడు చిన్నాతోపాటు పలువురు సినీ నటులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సినీ నిర్మాత గోపాల్‌రెడ్డి కుమారుడి మృతి
వాకాడు: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత దివంగత ఎస్ గోపాల్‌రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతుల కుమారుడు ఎస్.భార్గవ్‌రెడ్డి (42) సోమవారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మృతి చెందారు. పంబలి గ్రామంలో ఉన్న తన భార్గవ్ హేచరీ వద్దకు సోమవారం వచ్చిన భార్గవ్‌రెడ్డి తన పెంపుడు కుక్కను తీసుకుని పక్కనే ఉన్న సముద్రం వద్దకు వెళ్లారు. అక్కడ కుక్కకు స్నానం చేయించే సమయంలో వాతావరణంలో మార్పు కారణంగా అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో కుక్కతో సహా సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం మండలంలోని శ్రీనివాసపురం సముద్రం ఒడ్డుకు మృతదేహం కొట్టుకొచ్చింది. సమాచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, బంధువులు పంబలికి చేరుకున్నారు. -
ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడి అనుమానాస్పద మృతి
సాక్షి, నెల్లూరు: బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నెల్లూరి జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద సముద్రంలో భార్గవ్ మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. భార్గవ్ రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎలా చనిపోయాడనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. కొడుకు భార్గవ్ పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించిన గోపాల్ రెడ్డి.. బాలకృష్ణ, కోడి రామకృష్ణలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2008లో గోపాల్‌రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబసభ్యులెవరు ఇండస్ట్రీలో కొనసాగలేదు. -
తిరుపతిలో అర్థరాత్రి దారుణం
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో శనివారం అర్థరాత్రి దారుణం జరిగింది. పరసాల వీధికి చెందిన బీజేపీ కార్యకర్త భార్గవ్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. భూవివాదాలే భార్గవ్ హత్యకు దారి తీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.