హైదారాబాద్: తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహస్వామినే పూజించాలి, వారికి ఆంధ్రా దేవుళ్లు ఎందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ పై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీసులను సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఆదేశించింది. చింతలకుంటకు చెందిన న్యాయవాది భార్గవ్, పులిగారి గోవర్ధన్‌రెడ్డి గురువారం రాంగోపాల్‌వర్మ పై కోర్టులో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహస్వామి కంటే ఆంధ్రా దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని పూజించడం సరైనదేనా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచాడంటూ మేజిస్ట్రేట్‌కు తెలిపారు.
వారి ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేట్ యూసుఫ్ 153ఏ, 153బీ, 505 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా, వర్మ వ్యాఖ్యలపై హిందూ ధర్మరక్షా సమితి నేతలు గురువారం హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రాంగోపాల్‌వర్మపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
Published Fri, Nov 21 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement
Advertisement