బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ | Sadhvi Pragya Accused Congress of Torturing Her | Sakshi
Sakshi News home page

బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ

Published Thu, Nov 7 2024 12:34 PM | Last Updated on Thu, Nov 7 2024 12:34 PM

Sadhvi Pragya Accused Congress of Torturing Her

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి  ప్రజ్ఞా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు గుప్పించారు. సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆమె కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్‌ తనను చిత్రహింసకు గురిచేసిందని, ఏటీఎస్‌ కస్టడీకి పంపిందని ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నదని ఆమె తెలిపారు. తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు స్పష్టంగా కనిపిస్తోంది.

2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞ నిందితురాలు. వైద్య కారణాలతో ఆమె గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో   ఎన్‌ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయని, ఆమె కోర్టుకు హాజరు  కావాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.

 

 

ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై వారి పేర్లను రాయాలని కోరారు. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల దుకాణదారులు వారిపేర్లను వెల్లడించాలని ఆమె కోరారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన దరిమిలా సాధ్వి ప్రజ్ఞా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఇది కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement