వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు కేసుల్లో వరుసగా ఊరట లభిస్తోంది. ట్రంప్‌పై ఉన్న 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారుకు యత్నించిన కేసును కొట్టివేస్తునట్లు తాజాగా కోర్టు తీర్పిచ్చింది. తన క్లైంట్‌పై ఉన్న 2020 ఎన్నికల కేసును కొట్టివేయాలని ట్రంప్ తరఫు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును కోరారు.
ఈ విజ్ఞప్తిని జడ్జి అంగీకరించారు.కేసును తొలగించడం సముచితమేనని,ఈ తీర్పు అధ్యక్ష పదవిలో ఉన్నంతవరకు మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. తనపై కేసును కొట్టివేయడంపై ట్రంప్ స్పందించారు.
తనపై కేసులన్నీ చట్ట విరుద్ధమైనవని, వీటి కోసం డెమొక్రాట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని సోషల్‌మీడియాలో పోస్టుపెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగిన ట్రంప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment